ఏటా దేశంలో పెరుగుతున్న హృద్రోగ బాధితులు
దీంతో కరోనరి స్టెంట్ మార్కెట్ విస్తరణ
2024లో ఆసియా పసిఫిక్ మార్కెట్‌లో 32 శాతంగా భారత్ వాటా
2024–33 మధ్య నాలుగు శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా
దేశంలో హృద్రోగ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నాయి. 1990లో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధి (సీవీడీ) కేసులు 25.7 మిలియన్లు ఉండగా.. 2023 నాటికి అవి 64 మిలియన్‌లకు పెరిగినట్లు అంచనా. ఇలా గుండె జబ్బులు ఎక్కువవుతుండడంతో కరోనరీ స్టెంట్ చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది.
భారత్‌లో కరోనరీ డ్రగ్–ఎలుటింగ్ స్టెంట్ మార్కెట్ 2024 నుంచి 2033 వరకూ నాలుగు శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధిస్తుందని ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా అంచనా వేసింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2024లో ఆసియా పసిఫిక్ మార్కెట్‌లో భారత్ దాదాపు 32 శాతం వాటా కలిగి ఉందని వెల్లడించింది. గత ఏడాది స్టెంట్ మార్కెట్ పరిమాణం 1,303.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. - సాక్షి, అమరావతి
32.4 శాతం మరణాలు..
ఇక రాష్ట్రంలో 3.8 మిలియన్ల మంది గుండె సీవీడీ బాధితులున్నారు. అంటే మొత్తం వ్యాధులలో 17 శాతం. అంతేకాక.. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం మరణాలకు సీవీడీ కారణంగా ఉంటోందని వైద్యశాఖ చెబుతోంది. గుండెపోటుకు సంబంధించిన అత్యంత ప్రాణాంతకమైన ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ (స్టెమీ) నుంచి ప్రజలను రక్షించడం గత ప్రభుత్వంలో కీలక అడుగువేశారు.
హబ్ అండ్ స్పోక్ విధానంలో స్టెమీ కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో గుండెపోటు బారినపడిన వారికి గోల్డెన్ హవర్‌లోనే చికిత్సలు అందిస్తోంది.
గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో గుండె జబ్బులకు చికిత్సలు పెరుగుదల ఇలా..
» 2019- 20
23,797
» 2020- 21
24,24
» 2021- 22
36,724
» 2022- 23
66,333
» 2023- 24
71,474
Comments
Please login to add a commentAdd a comment