Stent
-
విస్తరిస్తున్న స్టెంట్ మార్కెట్
దేశంలో హృద్రోగ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నాయి. 1990లో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధి (సీవీడీ) కేసులు 25.7 మిలియన్లు ఉండగా.. 2023 నాటికి అవి 64 మిలియన్లకు పెరిగినట్లు అంచనా. ఇలా గుండె జబ్బులు ఎక్కువవుతుండడంతో కరోనరీ స్టెంట్ చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో కరోనరీ డ్రగ్–ఎలుటింగ్ స్టెంట్ మార్కెట్ 2024 నుంచి 2033 వరకూ నాలుగు శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధిస్తుందని ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా అంచనా వేసింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2024లో ఆసియా పసిఫిక్ మార్కెట్లో భారత్ దాదాపు 32 శాతం వాటా కలిగి ఉందని వెల్లడించింది. గత ఏడాది స్టెంట్ మార్కెట్ పరిమాణం 1,303.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. - సాక్షి, అమరావతి32.4 శాతం మరణాలు..ఇక రాష్ట్రంలో 3.8 మిలియన్ల మంది గుండె సీవీడీ బాధితులున్నారు. అంటే మొత్తం వ్యాధులలో 17 శాతం. అంతేకాక.. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం మరణాలకు సీవీడీ కారణంగా ఉంటోందని వైద్యశాఖ చెబుతోంది. గుండెపోటుకు సంబంధించిన అత్యంత ప్రాణాంతకమైన ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (స్టెమీ) నుంచి ప్రజలను రక్షించడం గత ప్రభుత్వంలో కీలక అడుగువేశారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో స్టెమీ కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో గుండెపోటు బారినపడిన వారికి గోల్డెన్ హవర్లోనే చికిత్సలు అందిస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో గుండె జబ్బులకు చికిత్సలు పెరుగుదల ఇలా..» 2019- 2023,797» 2020- 2124,24» 2021- 2236,724» 2022- 2366,333» 2023- 2471,474 -
శరీరంలోకి కలిసిపోయేలా ఉండే స్టెంట్లు తెలుసా?
ఇటీవల కొంతకాలం కిందటే శరీరంలో కలిసిపోయేలా కొన్ని స్టెంట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ మొదటి జనరేషన్ బయో అబ్జార్బబుల్ స్టెంట్లు ఆశించినంత బాగా పనిచేయలేదు. అయితే ఇటీవల మళ్లీ మెరుగైన రీతిలో కొత్తగా శరీరంలోకి కలిసిపోయే రెండో జనరేషన్ బయో అబ్జార్బబుల్ స్టెంట్లు మళ్లీ వచ్చాయి. గుండెజబ్బు వచ్చినవారిలో రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగించడం, మళ్లీ రక్తప్రసరణను యథావిధిగా ఉండేలా చేయడంతో పాటు, రక్తనాళాల్లోని కణజాలం పనితీరును నార్మల్‌గా ఉంచడం దీని ప్రత్యేకత. అయితే ఈ రకమైన స్టెంట్స్ దేశంలోని చాలా కొద్ది కేంద్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి. దాంతో ఇలాంటివాటిని ఉపయోగించి చేసే ‘బయో అబ్జార్బబుల్ వాస్కు్కలార్ స్కాఫోల్డ్ (బస్)’ చికిత్స చాలా కొద్దిప్రదేశాల్లోనే లభ్యమవుతోంది. పైగా సాధారణ స్టెంట్లు దాదాపు రూ. 30,000 రేంజ్లో లభ్యమవుతూ ఉండగా... ఈ బయో అబ్జార్బబుల్ స్టెంట్లు దాదాపు నాలుగు రెట్లు అంటే... రూ.1,20,000 నుంచి రూ. 1,40,000 వరకు ఉంటున్నాయి. ఈ స్టెంట్లు దేహంలో కరిగిపోయేవి కావడం వల్ల చాలా చిన్న వయసులో గుండెజబ్బు బారిన పడ్డ రోగులు ఇది మంచి చికిత్సగా పరిగణిస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి స్టెంట్ వేయించినప్పటికీ, అవి వేయించుకున్నవారు మంచి ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ మళ్లీ వాటిల్లో కొవ్వు పేరుకుండా జాగ్రత్తపడుతూ, జబ్బు తిరగబెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు గుండెవ్యాధి నిపుణులు. చదవండి: పేను కొరుకుడు అంటే ఏంటో తెలుసా? -
వైద్యఅంగడిలో బందిపోట్లు
బందిపోట్లు స్టెన్‌గన్‌లతో దోచుకుంటే స్టెతస్కోప్‌లతో వైద్యం చేసే డాక్టర్లు స్టెంట్ పోట్లతో రోగుల గుండెల్లో పొడిచారు. ఒక లాయర్ సాంగ్వాన్. ఫరీదాబాద్‌లో తన మిత్రుడికి కరొనరీ స్టెంట్ కావాలంటే వైద్యశాలకు వెళ్లాడు. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి వీలుగా తీగతో అల్లిన స్టెంట్ అనే వస్తువును మూసుకుపోయిన గుండెనాళాల్లో అమరుస్తారు. ఆ స్టెంట్ గరిష్ట ధర ఎంత అనడిగితే చెప్పేవాడే లేడు. మీరు కొన్న రశీదు ఇవ్వండి అంటే అదీ ఇవ్వడు. పోనీ నాకు ఈ ధరకు స్టెంట్ అమ్మినట్టు రశీదు ఇవ్వండి అంటే అదీ లేదు. ఆ నల్లకోటు లాయర్ ఈ తెల్లకోటు వ్యాపారుల దోపిడీమూలాలు కనుక్కోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. మనదేశంలో చికిత్స పేరుతో కొందరు డాక్టర్ల తెల్లకోటు చాటున ఆరులక్షల 70 వేల కోట్ల రూపాయల నల్ల దందా జరుగుతున్నదని తేల్చాడు సాంగ్వాన్. ఈ దేశంలో రూ. 3,300 కోట్ల దాకా కరొనరీ స్టెంట్ల పరిశ్రమ వర్థిల్లుతున్నది. అసలా రోగికి స్టెంట్ అవసరమా లేదా అనేది వేరే కుంభకోణం. స్టెంట్ ధర దానికదే ఒక భయంకరమైన కుంభకోణం. మనదేశంలో కార్డియోవాస్కులార్ సమస్యలతో, గుండెపోటు తదితర గుండె జబ్బులతో మృత్యుముఖంలోకి వెళుతున్న అయిదు కోట్ల మందికి బతకాలంటే స్టెంట్లు తప్పనిసరి అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ డాక్టర్ కార్పొరేట్ అనైతిక వ్యాపార సంబంధాల వల్ల నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి నిరంతర కృషి చేయడం వల్ల జనించిన కృత్రిమ స్టెంట్ మార్కెట్ విపరీత లాభాపేక్షా దుర్బుద్ధిని మరింత పెంచింది. వీరు స్టెంట్‌ను అసలు ధర కన్న 654 శాతం ఎక్కువకు అమ్ముతున్నారు. మన వైద్యవస్తువులు ఔషధాల ధరలను నిర్ధారించే జాతీయ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ సంస్థ ఇన్నాళ్లూ ఏంచేసిందో తెలియదు కాని ఫిబ్రవరి 13, 2017 నాడు కోటింగ్ లేని అసలు స్టెంట్ ధర 7,260 రూపాయలకన్న మించరాదని చెప్పింది. లక్షలాది మంది హృద్రోగులు హృదయంలేని హృదయ సజ్జనుల (సారీ.. సర్జనుల) దోపిడీకి బలైన తరువాత, సాంగ్వాన్ వంటి సామాన్యులు ఆర్టీఐ ద్వారా పిల్ ద్వారా ఈ కుంభకోణాన్ని బయటికి తీసిన తరువాత తీరిగ్గా ఈ ధరానిర్ధారణాధికార సంస్థ ఈ రహస్యాన్ని ప్రకటించింది. ఔషధాన్ని స్రవించే అత్యాధునిక స్టెంట్‌ను కూడా 29 వేల 600 రూపాయల కన్నా ఎక్కువ ధరకు అమ్మకండిరా తెల్ల వ్యాపారుల్లారా అని చెప్పిందా? స్టెంట్ కొనుక్కున్న గుండె వ్యాపారులు ఇప్పటివరకు ఎంత చెల్లించారో లెక్కవేసుకోండి. అప్పటిదాకా రూ. 7,260ల స్టెంట్‌ను ఈ దొంగలు రూ. 45 వేలకు, రూ. 29,600ల అత్యాధునిక స్టెంట్‌ను లక్షా 20 వేలకు సగటున కొన్నేళ్ల పాటు అమ్ముకున్నారు. సాంగ్వాన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మెట్రో హాస్పిటల్ వారు 3.2 లక్షల రూపాయల కన్న ఎక్కువ వసూలు చేశారని పేర్కొన్నారు. సాంగ్వాన్ వరసగా ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ మొత్తం 54 ఆస్పత్రుల వారు రకరకాల రేట్లు వేసి గుండెలో స్టెంట్ పేరుతో నెత్తురు తోడుకున్నారని వివరించారు. స్టెంట్లను కూడా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చి వాటి ధరలను ఇష్టం వచ్చినట్టు వైద్యశాలలు పెంచకుండా నిరోధించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు భారత రసాయనిక, ఎరువుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాని కొన్ని నెలలయినా ఏ చర్యా తీసుకోలేదు. అక్టోబర్ 2015 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ కోర్టుధిక్కార పిటిషన్ వేయకతప్పలేదు. ఏడాది తరువాత, జూలై 2016లో ప్రభుత్వానికి వేడి తగిలి స్టెంట్లను ఆ జాబితాలో చేర్చింది.ఒక ఆర్టీఐ సవాల్, ఒక పిల్, ఒక ఫిర్యాదు, ఒక కోర్టు ధిక్కార పిటిషన్, వెరసి సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం అనే మత్తగజానికి చీమ కుట్టినట్టు కాలేదు. పంపిణీదారులు, వైద్యశాలలు, డాక్టర్లు కూడా తోడుదొంగలుగా మారి రోగులను విపరీతంగా దోచుకున్నారని ఆవేదనతో ఆవేశంతో సాంగ్వాన్ అనే ఒక యువలాయర్ డాక్టర్లతో కలిసి సాగుతున్న ఈ దోపిడీని సవాల్ చేశాడు. ఒక్క డాక్టరు కూడా అడగలేకపోయాడా? తెలిసి నోరుమూసుకుంటే నేరంలో భాగస్వాములే. వారే చేతులుకలిపితే చెప్పేదేముంది? కార్పొరేట్ మేనేజర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారం స్టెంట్లు అమ్మక తప్పదనేవారిని ఏమనాలి? డాక్టర్లు అనా బ్రోకర్లు అనా? వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చిందెవరు? వైద్యులు కాదా? - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
‘సాయి సిద్ధార్థ’లో అరుదైన చికిత్స
సూరారం: షాపూర్‌నగర్ సాయి సిద్ధార్థ హాస్పటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గుండెకు వేసే మాదిరిగా ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ విధానంతో స్టెంట్‌ను విజయవంతంగా అమర్చారు. నగరంలోని మసాబ్‌ట్యాంక్‌కు చెందిన నజీమా మూడు సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యా«ధితో బాధపడుతోంది. ఆమె శ్వాస తీసుకోడానికి కూడా తీవ్ర అవస్థ పడుతోంది. నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో షాపూర్‌నగర్ రైతు బజారు వెనుక ఉన్న సిద్ధార్థ ఆస్పత్రిలో 4న చేరింది. పల్మనాలజిస్ట్ కిరణ్ గ్రంథి నేతృత్వంలో నజీమాకు జర్మనీని నుంచి తెప్పించిన అధునాత పరికరంతో బ్రాంకోస్కోపీ నిర్వహించి ఊపిరితిత్తుల మధ్య స్టెంట్‌ను అమర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఇబ్బందులు తొలగాయని డాక్టర్ కిరణ్ తెలిపారు. -
స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల నాకు మళ్లీ అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ‘ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా, గుండెపోటు రాదులే’ అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – రామ్మోహన్, కోదాడ ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ కొత్తగా, మరోచోట పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత... మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే... వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. – డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, యశోద హాస్పిల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
స్టెంట్ల ధరలు ఆన్ లైన్ లో ఉంచండి
న్యూఢిల్లీ: హృద్రోగ చికిత్సకు ఉపయోగించే స్టెంట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్ పీపీఏ) చర్యలు ముమ్మరం చేసింది. ఈ పరికరాలపై ప్రజల నుంచి ఎంత మొత్తాలు వసూలు చేస్తున్నారో ఆ వివరాలను అన్ని ఆసుపత్రులు తమ వెబ్సైట్లలో ఉంచాలని ఆదేశించింది. స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులు, అమ్మకందారులు వాటి గరిష్ట చిల్లర ధరల వివరాలను తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలంది. ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు అన్నీ తమ వెబ్సైట్ హోంపేజీలో స్టెంట్ల గరిష్ట ధరలు, బ్రాండ్ పేరు, తయారీదారుని పేరు, మార్కెటింగ్ కంపెనీ పేరు తదితర వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్టెంట్ల తయారీదారులు, అమ్మకందారులు, దిగుమతిదారులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. -
స్టెంట్ల కొరత సృష్టిస్తే లైసెన్సులు రద్దు
కేంద్రమంత్రి అనంతకుమార్ బనశంకరి (బెంగళూరు): గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టెంట్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఔషధ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హెచ్చరించారు. స్టెంట్ల ఉత్పత్తి గతంలో మాదిరిగానే కొనసాగాలని స్పష్టం చేశారు. స్టెంట్ ధర తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమా? కాదా? అనే అంశంపై శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తగ్గించిన ధరలు ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. సాధారణ స్టెంట్ (మెటల్స్టెంట్) మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు విక్రయించేవారని, ఇకపై రూ.7,260 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రత్యేక స్టెంట్లు రూ.లక్షా 70 వేలకు విక్రయించేవారని, ఇకపై వీటిని రూ.29,600 కంటే అధిక ధరకు విక్రయించరాదన్నారు. నియమాలు ఉల్లంఘించిన సంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
మెదడులో రక్తం గడ్డలను తొలగించే స్టెంటు
మెదడులో రక్తం గడ్డలను తొలగించే వినూత్న స్టెంటు ఇది. అమెరికాలోని మెన్నెపొలిస్కు చెందిన మెడ్‌ట్రానిక్ కంపెనీ పరిశోధకులు దీనిని ఉపయోగించి మెదడులో రక్తం గడ్డలను తొలగించారు. పక్షవాతానికి దారితీసేలా మెదడులో ఏర్పడే రక్తం గడ్డలను తొలగించేందుకు ఇలాంటి స్టెంటును వాడటం ఇదే తొలిసారి. ఈ చికిత్సా పద్ధతికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది.