
సూరారం: షాపూర్‌నగర్ సాయి సిద్ధార్థ హాస్పటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గుండెకు వేసే మాదిరిగా ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ విధానంతో స్టెంట్‌ను విజయవంతంగా అమర్చారు. నగరంలోని మసాబ్‌ట్యాంక్‌కు చెందిన నజీమా మూడు సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యా«ధితో బాధపడుతోంది. ఆమె శ్వాస తీసుకోడానికి కూడా తీవ్ర అవస్థ పడుతోంది.
నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో షాపూర్‌నగర్ రైతు బజారు వెనుక ఉన్న సిద్ధార్థ ఆస్పత్రిలో 4న చేరింది. పల్మనాలజిస్ట్ కిరణ్ గ్రంథి నేతృత్వంలో నజీమాకు జర్మనీని నుంచి తెప్పించిన అధునాత పరికరంతో బ్రాంకోస్కోపీ నిర్వహించి ఊపిరితిత్తుల మధ్య స్టెంట్‌ను అమర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఇబ్బందులు తొలగాయని డాక్టర్ కిరణ్ తెలిపారు.