lung surgery
-
5 వేల కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స
బీజింగ్: అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర, ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5,000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సచేయడం విశేషం. టెక్నాలజీకి ఆధునిక వైద్యవిధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢీ అయింది. వాయవ్య చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రిలో నూతన 5జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఊపిరితిత్తుల్లో కణతితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూ క్వింగ్‌క్వాన్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చిన 5జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు.భారత్‌లోనూ సేవలు మొదలు: ఇలాంటి సేవలు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఈ సేవలను చేరువచేసింది. ఐదు రోబో చేతులున్న ఈ వ్యవస్థతో గుండె ఆపరేషన్లనూ చేయొచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3డీ విజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరానూ బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్‌ను ఆపేస్తుంది. శస్త్రచికిత్సలో ఒక్క సెకన్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త ఏర్పాటుచేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తాయి. -
ఏపీ ప్రభుత్వం సాయం.. డాక్టర్ భాస్కరరావు డిశ్చార్జి
కారంచేడు: కోవిడ్ నుండి అనేక మంది ప్రాణాలను కాపాడిన వైద్యాధికారి అదే వైరస్ కోరలకు చిక్కి ప్రాణాపాయ స్ధితికి చేరుకున్నారు. ఆయన వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందించడంతో మృత్యుంజయుడై ఇంటికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు 5,000కు పైగా కోవిడ్ పరీక్షలు చేశారు. కోవిడ్ రోగులకు వైద్య సేవలందించారు. ఏప్రిల్ 24న ఆయన ఆదే కోవిడ్ కోరలకు చిక్కారు. కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. పరిస్ధితి విషమించడంతో మే 1న విజయవాడకు, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయన ఊపిరితిత్తులు చెడిపోయాయని, వాటిని మార్పిడి చేయాల్సిందేనని, అందుకు రూ. 2 కోట్లు వరకు ఖర్చవుతుందని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి అభ్యర్ధన మేరకు గ్రామానికి చెందిన ప్రజలు, ఎన్ఆర్ఐలు సుమారు రూ. 40 లక్షల వరకు సమకూర్చారు. ఇంకా రూ 1.5 కోట్లు అవసరమయ్యాయి. ప్రభుత్వ వైద్యుల సంఘం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్ధితిని వివరించింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విషయం తెలిపారు. డాక్టర్ భాస్కరరావు వైద్యానికి అయ్యే ఖర్చు ఎంత అయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వెంటనే ఆపరేషన్‌కు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. దీంతో జూలై 14న భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. 100 రోజుల పాటు చికిత్స అనంతరం మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే అక్కడి వైద్యులకు అందుబాటులో ఉంటారని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. పూర్తిగా కోలుకొని స్వస్థలానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తన ఆరోగ్యం కోసం సహకరించిన ప్రతి ఒక్కరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతారని ఆమె తెలిపారు. -
‘సాయి సిద్ధార్థ’లో అరుదైన చికిత్స
సూరారం: షాపూర్‌నగర్ సాయి సిద్ధార్థ హాస్పటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గుండెకు వేసే మాదిరిగా ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ విధానంతో స్టెంట్‌ను విజయవంతంగా అమర్చారు. నగరంలోని మసాబ్‌ట్యాంక్‌కు చెందిన నజీమా మూడు సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యా«ధితో బాధపడుతోంది. ఆమె శ్వాస తీసుకోడానికి కూడా తీవ్ర అవస్థ పడుతోంది. నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో షాపూర్‌నగర్ రైతు బజారు వెనుక ఉన్న సిద్ధార్థ ఆస్పత్రిలో 4న చేరింది. పల్మనాలజిస్ట్ కిరణ్ గ్రంథి నేతృత్వంలో నజీమాకు జర్మనీని నుంచి తెప్పించిన అధునాత పరికరంతో బ్రాంకోస్కోపీ నిర్వహించి ఊపిరితిత్తుల మధ్య స్టెంట్‌ను అమర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఇబ్బందులు తొలగాయని డాక్టర్ కిరణ్ తెలిపారు. -
షిండే క్షేమం.. మూడు రోజుల్లో డిశ్చార్జి
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, మరికొంత కోలుకున్న తర్వాత ఆయనను మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని షిండే కుమార్తె ప్రీతి షిండే తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్మే అయిన ప్రీతి.. తన తండ్రి ఆరోగ్యం గురించి విలేకరులకు వివరించారు. 72 సంవత్సరాల వయసున్న సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో ఈనెల నాలుగో తేదీన ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స జరిగింది. ఊపిరితిత్తుల్లో చిన్న కణితి లాంటిది పెరగడంతో ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. శస్త్రచికిత్స చిన్నదే కాబట్టి, మంత్రి త్వరలోనే కోలుకుంటారని, కొన్ని రోజుల్లోనే మళ్లీ తన రోజువారీ కార్యకలాపాలకు హాజరవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.