ఇటీవల కొంతకాలం కిందటే శరీరంలో కలిసిపోయేలా కొన్ని స్టెంట్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ మొదటి జనరేషన్ బయో అబ్జార్బబుల్ స్టెంట్‌లు ఆశించినంత బాగా పనిచేయలేదు. అయితే ఇటీవల మళ్లీ మెరుగైన రీతిలో కొత్తగా శరీరంలోకి కలిసిపోయే రెండో జనరేషన్ బయో అబ్జార్బబుల్ స్టెంట్లు మళ్లీ వచ్చాయి. గుండెజబ్బు వచ్చినవారిలో రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగించడం, మళ్లీ రక్తప్రసరణను యథావిధిగా ఉండేలా చేయడంతో పాటు, రక్తనాళాల్లోని కణజాలం పనితీరును నార్మల్‌గా ఉంచడం దీని ప్రత్యేకత. అయితే ఈ రకమైన స్టెంట్స్ దేశంలోని చాలా కొద్ది కేంద్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి. దాంతో ఇలాంటివాటిని ఉపయోగించి చేసే ‘బయో అబ్జార్బబుల్ వాస్కు్కలార్ స్కాఫోల్డ్ (బస్)’ చికిత్స చాలా కొద్దిప్రదేశాల్లోనే లభ్యమవుతోంది.
పైగా సాధారణ స్టెంట్లు దాదాపు రూ. 30,000 రేంజ్‌లో లభ్యమవుతూ ఉండగా... ఈ బయో అబ్జార్బబుల్ స్టెంట్లు దాదాపు నాలుగు రెట్లు అంటే... రూ.1,20,000 నుంచి రూ. 1,40,000 వరకు ఉంటున్నాయి. ఈ స్టెంట్లు దేహంలో కరిగిపోయేవి కావడం వల్ల చాలా చిన్న వయసులో గుండెజబ్బు బారిన పడ్డ రోగులు ఇది మంచి చికిత్సగా పరిగణిస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి స్టెంట్ వేయించినప్పటికీ, అవి వేయించుకున్నవారు మంచి ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ మళ్లీ వాటిల్లో కొవ్వు పేరుకుండా జాగ్రత్తపడుతూ, జబ్బు తిరగబెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు గుండెవ్యాధి నిపుణులు.
చదవండి:
పేను కొరుకుడు అంటే ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment