న్యూఢిల్లీ: హృద్రోగ చికిత్సకు ఉపయోగించే స్టెంట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్ పీపీఏ) చర్యలు ముమ్మరం చేసింది. ఈ పరికరాలపై ప్రజల నుంచి ఎంత మొత్తాలు వసూలు చేస్తున్నారో ఆ వివరాలను అన్ని ఆసుపత్రులు తమ వెబ్‌సైట్లలో ఉంచాలని ఆదేశించింది.
స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులు, అమ్మకందారులు వాటి గరిష్ట చిల్లర ధరల వివరాలను తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలంది. ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు అన్నీ తమ వెబ్‌సైట్ హోంపేజీలో స్టెంట్ల గరిష్ట ధరలు, బ్రాండ్ పేరు, తయారీదారుని పేరు, మార్కెటింగ్ కంపెనీ పేరు తదితర వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్టెంట్ల తయారీదారులు, అమ్మకందారులు, దిగుమతిదారులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి.