Drug Price Control Order
-
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలకు రెక్కలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్పీపీఏ వర్గాలు తెలిపాయి. బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్పీపీఏ డిసెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి 50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం తీవ్రంగా.. బీసీజీ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టెంట్ రేట్లు తగ్గించినా... గుండెకు వేసే స్టెంట్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్ రేటు తగ్గినా ప్రొసీజర్ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్ చేసింది. అలయెన్స్ బయోటిక్స్, డిజిటల్ విజన్, సెంచురీ డ్రగ్స్ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు. ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని.. -
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : మందుల విక్రయాలపై ప్రయివేటు ఆస్పత్రులు ప్రజలను లూటీ చేస్తున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సేకరించిన బిల్లులను విశ్లేషించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) విస్తుపోయింది. ఈ ఆస్పత్రులు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై ఏకంగా 1737 శాతం లాభాలు దండుకున్నట్టు ఈ పరిశీలనలో వెల్లడైంది. రోగుల బిల్లుల్లో ఇవి 46 శాతం వరకూ ఉంటాయి. ఆయా మందులు, వైద్య పరికరాల తయారీదారుల కన్నా గరిష్ట ఎంఆర్పీలతో ఈ ఆస్పత్రులే భారీగా లాభపడుతున్నాయని ఎన్పీపీఏ పేర్కొంది. ఈ మందులు, పరికరాలు, డిస్పోజబుల్స్‌ను ఆయా ఆస్పత్రులు తమ ఫార్మసీల్లోనే కొనుగోలు చేయాలని రోగులను కోరుతుండటంతో అధిక ధర వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. పెద్ద మొత్తంలో మందులను ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేస్తుండటంతో తక్కువ ధరకే అవి అందుబాటులోకి వస్తాయని, అయినప్పటికీ ఆయా ఆస్పత్రులు ఎంఆర్పీలను విపరీతంగా పెంచి విక్రయిస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయని ఎన్పీపీఏ నిగ్గుతేల్చింది. కంపెనీల నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లను ఇచ్చే క్రమంలో ఆయా ఆస్పత్రులు డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను మందుల లేబుల్స్‌పై అధిక ఎంఆర్పీ ముద్రించాలని కోరుతున్నాయని పేర్కొంది. దీంతో రోగులు భారీ మొత్తాలను మందుల కోసం వెచ్చించాల్సి వస్తోందని ఎన్పీపీఏ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్రభుత్వాలే వీటిపై చర్యలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని పేర్కొంది. -
స్టెంట్ల ధరలు ఆన్ లైన్ లో ఉంచండి
న్యూఢిల్లీ: హృద్రోగ చికిత్సకు ఉపయోగించే స్టెంట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్ పీపీఏ) చర్యలు ముమ్మరం చేసింది. ఈ పరికరాలపై ప్రజల నుంచి ఎంత మొత్తాలు వసూలు చేస్తున్నారో ఆ వివరాలను అన్ని ఆసుపత్రులు తమ వెబ్సైట్లలో ఉంచాలని ఆదేశించింది. స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులు, అమ్మకందారులు వాటి గరిష్ట చిల్లర ధరల వివరాలను తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలంది. ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు అన్నీ తమ వెబ్సైట్ హోంపేజీలో స్టెంట్ల గరిష్ట ధరలు, బ్రాండ్ పేరు, తయారీదారుని పేరు, మార్కెటింగ్ కంపెనీ పేరు తదితర వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్టెంట్ల తయారీదారులు, అమ్మకందారులు, దిగుమతిదారులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. -
స్టెంట్ల ఉత్పత్తి, సరఫరా తప్పనిసరి
అత్యవసర నిబంధనను అమల్లోకి తెచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: స్టెంట్ల ఉత్పత్తి, సరఫరాను తప్పనిసరి చేస్తూ.. ఆ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించాలంటూ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు ఔషధాల ధరల నియంత్రణ చట్టంలోని అత్యవసర నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో స్టెంట్ల కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ స్టెంట్ల లభ్యతపై ప్రస్తుత పరిస్థితిని చర్చించడంతో పాటు.. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాల్ని పరిశీలించాం. కరోనరీ స్టెంట్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ) 2013 చట్టంలోని సెక్షన్ 3 (జీ)ను అమలు చేసేందుకు నిర్ణయించాం’ అని కేంద్ర ఔషధ తయారీ విభాగం వెల్లడించింది. ఈ సెక్షన్ కింద స్టెంట్ల పంపిణీని నియంత్రించడంతో పాటు... ఉత్పత్తి పెంచమని తయారీదారుల్ని ప్రభుత్వం ఆదేశించవచ్చు. అలాగే వివిధ సంస్థలు, ఆస్పత్రులు, ఏజెన్సీలకు అత్యవసర సమయాల్లో స్టెంట్లను అమ్మేందుకు వీలు కలుగుతుంది. స్టెంట్ల ఉత్పత్తి, దిగుమతి, సరఫరాను తయారీదారులు యథాప్రకారం కొనసాగించడంతో పాటు ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి వారం వారం నివేదిక సమర్పించాలని ఔషధ తయారీ విభాగం సూచించింది. సవరించిన స్టెంట్ల ధరల్ని అందరికీ కనిపించేలా ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని నేషనల్ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) ఆదేశించింది. అలాగే స్టెంట్ల వాపసు లేదా కొరత ఉంటే తయారీ, దిగుమతిదారులు తనకు తెలియచేయాలని సూచించింది. -
ఆన్లైన్లో ఔషధాలు అమ్మొచ్చు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలు ప్రస్తుత చట్టం పరిధికి లోబడే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. అయితే, ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు సంబంధించి కెమిస్టులు, ఈ–ఫార్మసీలకు మధ్య వివాదం నేపథ్యంలో వైద్యశాఖ దీనిపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. దేశంలో దాదాపు 50 ఈ–ఫార్మసీలు ఉన్నాయని, ఔషధాలను ఆన్లైన్లో అమ్మకూడదు అని డ్రగ్, కాస్మొటిక్ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదని కేంద్ర పారిశ్రామిక విధాన, ప్రోత్సహక శాఖ(డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ సోమవారం ఢిల్లీలో అన్నారు. కాగా, ఆన్లైన్లో ఔషధాలు అమ్మడం చట్టవ్యతిరేకమని కెమిస్టులు వాదిస్తున్నారు. కెమిస్టులు, ఈ–ఫార్మసీల మధ్య వివాదాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. -
హెచ్ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు
న్యూఢిల్లీ: హెచ్ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు. తాజాగా నిర్దేశించిన పరిమితుల ప్రకారం హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే నెవిరాపైన్ కాంబినేషన్ ఔషధ ట్యాబ్లెట్‌పై సీలింగ్ ధర రూ. 14.47గా ఉంటుంది. క్యాన్సర్ సంబంధ కీమోథెరపీలో ఉపయోగించే సైటోసిన్ అరాబినోసైడ్ ఒక్కో ప్యాక్ ధర (500 మి.గ్రా) రూ. 455.72గా ఉండనుంది. -
పది ఔషధాల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా పది ఔషధాల ధరలను తగ్గించింది. అలాగే మరో ఎనిమిదికి పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చింది. ఔషధ ధరలపై నియంత్రణ ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్పీపీఏ తాజాగా పదికి పైగా మందుల ధరలను 4.8-23.3% మధ్యలో తగ్గించింది. అలాగే ఇది తొలిసారి పారాసిటమాల్ సహా పలు యాంటీ బయాటిక్స్‌ను ధరల నియంత్రణ పరిధిలోకి తెచ్చింది. వీలైనంత త్వరగా దాదాపు 800కు పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తామని ఎన్పీపీఏ చైర్మన్ భుపేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం 467 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలో ఉంచింది. తప్పనిసరి ఔషధాల జాబితాలో 900 మందులు ఉన్నాయి. -
ఒకే రెగ్యులేటరీతో ఔషధ ధరలు తగ్గుతాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఒకే రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఔషధ ధరలను నియంత్రించవచ్చని ఫార్మారంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ దేశాలకు ఒక్కొక్క రెగ్యులేటరీ విధానం ఉండటం వల్ల వ్యయాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. యునెటైడ్ స్టేట్స్ ఫార్మాకోపియల్ కన్వెన్షన్ (యూఎస్పీ) ఇండియా కార్యకలాపాలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ వేల్యూ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్లో ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ జనరల్ డెరైక్టర్ పి.వి.అప్పాజీ మాట్లాడుతూ ఈ రెగ్యులేటరీ నిబంధనల వల్ల చిన్న ఫార్మా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడానికి ప్రవేశపెట్టిన ‘జన ఔషధి’ ఒక చక్కటి కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్డీఏ ఇండియా డెరైక్టర్ మాథ్యూ థామస్, యూఎస్పీ సీఈవో డాక్టర్ రొనాల్డ్, ఆవ్రా ల్యాబరేటరీస్ సీఎండీ ఎ.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చర్చలు విఫలమైతే మళ్లీ బంద్
ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆన్లైన్లో మందుల విక్రయాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన మందుల షాపుల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ శ్రీరాములు విలేకరులతో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల విక్రయాల విధానంలో నిషేధిత మందుల విక్రయాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా మందుల వ్యాపారులు, వారిపై ఆధారపడిన వారు మరో 1.2 కోట్ల మంది ఉన్నారని, ఆన్లైన్లో విక్రయాల వల్ల వీరంతా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. జాతీయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నట్లు కాని పక్షంలో మళ్లీ బంద్ చేపడతామని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ బోధనాసుపత్రులు, జీవన్‌దాన్, అపోలో, మెడ్‌ప్లస్ మినహా అన్ని మందుల దుకాణాలూ మూతపడ్డాయి. రద్దీగా ఉండే కోఠిలోని ఇందర్‌బాగ్ హోల్‌సేల్ దుకాణాలు బోసిపోయాయి. ఈ ఒక్క రోజే రూ.80 కోట్లు నష్టపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
అన్ని ఔషధాల ధరలపై నియంత్రణ
పార్లమెంటరీ కమిటీ సూచన న్యూఢిల్లీ: దేశంలో లభ్యమవుతున్న అన్ని రకాల ఔషధాలను ధరల నియంత్రణ కిందకు తీసుకురావాలని కెమికల్స్, ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సోమవారం పార్లమెంట్లో పేర్కొంది. ప్రాణాధార ఔషధాలతో పాటు అన్ని రకాల ఔషధాలను అందుబాటు ధరల్లో మార్కెట్లోకి తీసుకురావాలని సూచించింది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా ఆధారంగా ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) 509 ఫార్ములేషన్ ప్యాక్స్‌కు ధరలను నిర్ణయించింది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో అన్ని ఔషధాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కమిటీ పేర్కొంది. ‘ప్రతి ఔషధం అవసరమైనదే. అవసరాన్ని బట్టి రోగులు వాటిని వినియోగిస్తారు. వాటిని అందుబాటు ధరల్లో అందించడం సమంజసంగా ఉంటుందని వివరించింది. -
మాయదారి మందులు!
పేరు, రంగు, రుచి, వాసన, ప్యాకింగ్... ఇవన్నీ చూడడానికి అచ్చం ఔషధాలుగానే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్యులు.. ఈ బాటిళ్లలో ద్రవపదార్థం తాగాలంటూ, ఈ గోలీలు మింగాలంటూ రోగులకు ప్రిస్కిప్షన్స్ రాస్తుంటారు. 200 రకాలుగా ఉన్న ఈ బాటిళ్లు, బిళ్లలు మెడికల్ షాపుల్లో తప్ప... ఎక్కడా దొరకవు. ప్రమాణాల ప్రకారం ఇవి ఔషధాలు కావు... కేవలం ఆహార పదార్థాలు. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా.. ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నాణ్యత లేని పదార్థాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఒక్కసారి రోగం వస్తే వైద్య సేవల కింద సామాన్యుల జీవితాలు అతలాకుతలం అవుతుండడంతో ఔషధాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టం కింద 384 మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు సాగించాలి. దీంతో ఈ చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు పలువురు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్-2006 చట్టం పరిధిలో లెసైన్సులు తెచ్చుకుంటున్నారు. ఈ ముసుగులో బలవర్థక ఆహారం పేరుతో కొన్ని ఔషధ కంపెనీలు మందులు తయారు చేస్తూ ఇష్టారీతిగా ధరలు నిర్ణయిస్తూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాయి. ఒంటికి బలాన్ని చేకూర్చే ఆహారం అనే పేరుతో సిరప్, టానిక్, ట్యాబెట్ల అమ్మకాలను యథేచ్చగా సాగిస్తున్నాయి. ఇలా తయారైన సిరప్లు, మల్టీ విటమిన్లు మార్కెట్లో మెడికల్ షాపుల్లో జోరుగా అమ్ముడవుతున్నాయి. కానీ.. ఔషధ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదు. మామూళ్లు అందుతుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఔషధాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒక్కరికీ అనుమతి లేదు... నిబంధనల ప్రకారం ఫుడ్ సెఫ్టీ చట్టం లెసైన్స్‌తో తయారైన మందులు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే తప్పని సరిగా ఫుడ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ మేరకు 2013లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో భాగంగారిజిస్ట్రేషన్కు రూ.100, లెసైన్స్‌కు రూ. 2 వేలుగా నిర్ధారించింది. మన జిల్లాలో 2,100 మెడికల్ షాపులు ఉన్నాయి. ఆస్పత్రులకు అనుబంధంగా మరో 500పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క షాప్‌కూ ఆహార పదార్థాలు అమ్మే అనుమతి లేదు. అయినప్పటికీ ఈ ఉత్పత్తుల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఫుడ్ సెఫ్టీ లెసైన్స్‌తో ఈ పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటి నాణ్యత, ప్రమణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఫుడ్ ఇన్స్పెక్టర్లది. జిల్లాలో ఒక్కసారి కూడా ఇలాంటి ఉత్పత్తులను వారు పట్టించుకున్న పరిస్థితి లేదు. అటాచ్డ్ షాపుల్లో అధికం... ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం అజామాయిషీ ఉండడంతో వీటి ధరలు నిర్ధారించిన మేరకు ఉంటున్నాయి. దీంతో డాక్టర్లు, మెడికల్ షాపు యజమానులకు కమీషన్లు తక్కువగా వస్తున్నాయి. ఆహార పదార్థాల పేరుతో అమ్ముడయ్యే ఔషధాల ధరల నియంత్రణ లేదు. ఇదే అదునుగా ఫుడ్ లెసైన్స్‌తో అమ్మకాలు సాగిస్తున్న ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. అధిక ధరలు నిర్ణయిస్తున్నారు. వచ్చే లాభా ల్లో డాక్టర్లకు ఎక్కువ శాతం వాటాలు ఇస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాపు లు కేంద్రంగా ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోం ది. ఇక్కడికి వచ్చే రోగులు అదే ఆస్పత్రిలో మందు లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో రోగులకు ఈ ఉత్పత్తులను ఎక్కువగా అంటగడుతున్నారు. -
ఏదీ అమలు...!
ఒంగోలు సెంట్రల్ : దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా తయారయింది మందుల విక్రయదారుల తీరు. ప్రభుత్వం మందుల ధరలు తగ్గించినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. దీన్ని పర్యవేక్షించే నాధుడే కానరాకపోవడంతో మందుల దుకాణ వ్యాపారులు అడింది ఆటగా తయారవుతోంది. జిల్లా యంత్రాంగం కూడా ప్రేక్షకపాత్ర వహించడంతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొనుగోలుదారుడు గుర్తించి ప్రశ్నిస్తేగానీ తగ్గింపు అమలు చేయడం లేదు. అయితే ఈ విషయం తెలిసిన రిైటె ల్ అమ్మకం ధారులు మాత్రం తక్కువ ధరలకే హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. రోగి అనే కనికరం కూడా లేకుండా అడ్డంగా దోచేస్తున్నారు. 20 శాతం సాధారణ రోగాలు వస్తుంటే, 18 శాతం మందికి మధుమేహం, రక్తపోటు, 15 శాతం మందికి మూత్ర పిండాల సమస్యలు, 7 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు అంచనా, దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా రోగాలకు సంబంధించి ప్రజలు నెలనెలా రూ.15 కోట్లు పైబడి ఔషధాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఔషధాల కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నాయి. ఔషధాల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను 45 రోజుల్లోగా మందుల కంపెనీలు అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా లేని మందుల రకాల నిల్వలను రిటైలర్లు, హోల్‌సేల్ వర్తకులు ఆయా పరిశ్రమలకు తిరిగి అందజేయాలి. అనంతరం కంపెనీలు నూతన ధరలు ముద్రించి విక్రయించాలి. జిల్లాలో సుమారు 2 వేల మందుల దుకాణాలున్నాయి. వీటితో పాటు మరో 300 వరకు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లున్నారు. నెలకు కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ధర తగ్గిన మందులివీ... ప్రస్తుత విధానంలో డిస్ట్రిబ్యూటరీ స్థాయిలో 2 శాతం, చిల్లర స్థాయిలో 6 శాతం లాభాలు తగ్గి రోగులకు ప్రయోజనం చేకూరనుంది. ధరలు తగ్గే మందుల్లో గ్లెక్లెజైడ్ మాత్రల్లో పలు పరిమాణాలు, గ్లిమిప్రైడ్, మిగ్లిటాల్, అమ్లెడిపిన్, మెట్ఫార్మిన్, ఎనాలాప్రిల్, అటెనోలాల్, లిసినోప్రిల్, మెటోప్రోలోలాల్, అటార్వోస్టాటిన్, సిమ్వాస్టాటిన్, ఫినోఫైబ్రేట్, క్లోపిడోగ్రిల్, ఐనోసార్బైట్, డిల్టియాజెమ్ వంటి రకాలు ఉన్నాయి. ఇవన్నీ మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలస్ట్రాల్, గుండెజబ్బు తదితర ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే 108 మందుల రకాలున్నాయి. దీంతో మందుల ధరలు రకాల వారీగా పది నుంచి ముప్పై శాతం వరకూ తగ్గనున్నాయి. -
ధరల నియంత్రణే ఫార్మాకు అడ్డంకి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో పరిమాణం పరంగా మూడవ స్థానం. మొత్తం ఉత్పత్తిలో 10 శాతం. 210పైగా దేశాలకు ఎగుమతులు. ఇదీ ఔషధ తయారీలో భారత ప్రస్థానం. ఇంత ప్రత్యేకత ఉన్నప్పటికీ పరిశ్రమ మాత్రం అసంతృప్తిగా ఉంది. ఔషధ ధరల నియంత్రణ పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా ఉందని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐడీఎంఏ) అంటోంది. ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తున్న ఔషధాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని... ఎక్కడో దగ్గర అడ్డుకట్ట పడకపోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని పేర్కొంది. జాబితాలోకి మరిన్ని.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇటీవలే ఆవశ్యక ఔషధాల జాబితాలోకి మధుమేహం, హృదయ సంబంధించి 50 ఔషధాలను చేర్చింది. ఇప్పటికే ఈ జాబితాలో పలు చికిత్సలకు సంబంధించిన 316 ఔషధాలు ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను జాబితాలోకి తీసుకురావడం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డరు(డీపీసీవో)-2013కు విరుద్ధమని ఐడీఎంఏ అంటోంది. ఆవశ్యక ఔషధాల చిట్టా పెరుగుతూ పోతుంటే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమని ఐడీఎంఏ ప్రెసిడెంట్, ఫోర్ట్స్ ఇండియా ల్యాబొరేటరీస్ సీఎండీ ఎస్వీ వీరమణి సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. ఆవశ్యక ఔషధాల జాబితాలో తాజాగా చేర్చిన ఔషధాల మూలంగా కంపెనీలు రూ.600 కోట్లు కోల్పోతాయని చెప్పారు. ఇప్పటికే 2013-14లో రూ.1,000 కోట్ల ఆదాయం పరిశ్రమ కోల్పోయిందని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో ఏ ఔషధం ధరనైనా నియంత్రించేందుకు డీపీసీవో 19వ ప్యారా ఎన్‌పీపీఏకు వీలు కల్పిస్తోంది. జాబితాలో ఉన్న ఔషధాలను తప్పకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే కంపెనీలు విక్రయించాలి. కావాల్సినవి ఇవే..: తక్కువ ధరకు స్థలం, విద్యుత్ సబ్సిడీ. వ్యర్థాల నిర్వహణకు కామన్ ప్లాంటు. సత్వర పర్యావరణ అనుమతులు. ఔషధ తయారీ అనుమతుల్లో పారదర్శకత. వడ్డీ రాయితీ. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణం అందించాలని అంటున్నారు వీరమణి. ‘దేశీయ కంపెనీలకు కావాల్సిన ముడి సరుకులో 60-70% చైనాపైన ఆధారపడుతున్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు’ అని అన్నారు. ప్లాంట్ల స్థాయి పెంపు, సిబ్బంది శిక్షణ, కొత్త మార్కెట్లకు విస్తరణకుగాను 9 వేల ఎంఎస్ఎంఈలు నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పారు. ఖాయిలాపడ్డ ప్రభుత్వ ఔషధ కంపెనీలను ప్రైవేటుకు అప్పగించాలన్నారు. ఏపీఐ పాలసీ త్వరలో..: యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాలసీ అయిదారు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని ఐడీఎంఏ ఆశాభావం వ్యక్తం చేసింది. పాలసీ ద్వారా పరిశ్రమ డిమాండ్లకు పరిష్కారం లభిస్తుందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టి.రవిచంద్రన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి వ్యయం తక్కువ. నిపుణులకు కొదవే లేదు. అందుకే జనరిక్ రంగంలోని విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడికి ఉవ్విల్లూరుతున్నాయని ఐడీఎంఏ పబ్లిక్ రిలేషన్ చైర్మన్ జె.జయశీలన్ తెలిపారు. రూ.5 వేల కోట్లు..: తెలంగాణలోనూ ట్యాక్స్ ఫ్రీ జోన్ చేస్తే రూ.5 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాలో వస్తాయని ఐడీఎంఏ తెలంగాణ ప్రెసిడెంట్ జె.రాజమౌళి తెలిపారు. ‘2005లో హైదరాబాద్‌లో 1,600 యూనిట్ల దాకా ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 300లోపే. ప్రోత్సాహకాలు అందుకోవడానికి ట్యాక్స్ ఫ్రీ జోన్లు అయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు యూనిట్లు తరలిపోయాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోని కంపెనీల వ్యాపారం రూ.60 వేల కోట్లపైమాటే’ అని తెలిపారు. -
ఫార్మాలో వెయ్యి స్టార్టప్‌లకు చాన్స్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విర్కో ల్యాబరేటరీస్..సల్ఫామెథాక్జలీన్ జనరిక్ ఔషధ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్ వన్. ఫైజర్, గ్లాక్సో, తెవా ఫార్మా లాంటి ఫార్మా దిగ్గజాలు ఈ సంస్థకు క్లయంట్లు. డాక్టర్ రెడ్డీస్ కన్నా రెండేళ్లు ముందే ఈ రంగంలో అడుగిడిన విర్కో ల్యాబరేటరీస్ తాజా టర్నోవర్ రూ. 2,000 కోట్లు దాటింది. ఇటీవల సన్ ఫార్మా జపాన్ కంపెనీ దైచీ నుండి రాన్‌బాక్సీ సంస్థను కొనుగోలు చేయడంతో బల్క్ డ్రగ్స్ జనరిక్స్ మార్కెట్లో ఈ రంగంపై ఫోకస్ పెరిగింది. గత 20 ఏళ్లుగా బల్క్‌డ్రగ్స్‌లో గట్టి పోటీ ఇచ్చిన చైనా కంటే ఇండియాలోనే ఉత్పత్తి వ్యయాలు తక్కువ కావడంతో ప్రపంచదృష్టి భారత్ ఫార్మాపై పడిందని ఫార్మా రంగ నిపుణులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాల్లోనూ ఫార్మా రంగంలో వందలాది స్టార్టప్ కంపెనీలు రానున్నాయని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. నారాయణరెడ్డితో సాక్షి ప్రతినిధి ఫార్మా రంగంలో రాబోయే పరిణామాలపై జరిపిన ఇంటర్వ్యూ వివరాలివీ... బల్క్‌డ్రగ్స్ పరిశ్రమపై ఫోకస్ పెరిగినట్లుంది? సన్‌ఫార్మా సంస్థ దైచీ నుండి రాన్‌బాక్సీని కొనుగోలు చేయడంతో రాన్‌బాక్సీ సంస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నాం. ఒక ఇండియన్ కంపెనీ ఇండియన్ చేతుల్లో ఉండటం శుభపరిణామం. బల్క్‌డ్రగ్ కేపిటల్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో కొనుగోళ్లు,విలీనాలకు అవకాశాలెక్కువ. మైలాన్, సనోఫీ అవెంటిస్ సంస్థలు అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఫైజర్, గ్లాక్సో లాంటి సంస్థలు ఎంతకాలంగానో సరైనజోడీ కోసం చూస్తున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. 40 పైచిలుకు యూఎస్ఎఫ్డీఏ అనుమతులున్న ఫ్యాక్టరీలు హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. బల్క్‌డ్రగ్స్‌లో కొత్త ట్రెండ్స్? ఆఫ్ పేటెంటెడ్ డ్రగ్స్. పేటెంట్ల గడువు తీరిపోయిన డ్రగ్స్ గత రెండు మూడేళ్లుగా బాగా వచ్చాయి. దీంతో పరిశ్రమకు మంచి రాబడి అవకాశం దొరికింది. జనరిక్స్ మార్కెట్లో వీటిని విక్రయించటం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం సంస్థలు వినియోగించుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాల్లో పరిశ్రమ ఎలా నిలదొక్కుకోవాలంటారు? కొత్త రాష్ట్రాల్లో ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి పునాదులు వేయాలి. కొత్త పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అశకాశాలు వస్తాయి. పన్నుల రూపేణా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కొత్త ప్రభుత్వాలు ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఫార్మా మినహాయిస్తే...మాన్యుఫ్యాక్చరింగ్ అంటూ మనకు పెద్దగా ఇతర రంగాలు లేవు. పరిశ్రమల స్థాపనకోసం కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లోనూ పోటీ వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షిం చడం కోసం పోటాపోటీ రాయితీలు ప్రకటిస్తారు. స్థల కేటాయిం పుల్లో రాయితీలు, విద్యుత్, పన్ను ప్రోత్సాహకాలు...ఇలాంటి తాయిలాలు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ధీటుగా ప్రకటించే అవకాశం ఉంది. ఫార్మాలో స్టార్టప్ కంపెనీలొస్తాయంటారా? తప్పకుండా..ఫార్మాలో చిన్నతరహా పరిశ్రమలు బాగా పుంజుకోవాలి. పరిశ్రమ అలానే అభివద్ధి చెందుతుంది. ఒక చక్కటి మార్కెట్ ఆలోచనతో కొన్ని ప్రత్యేకతలతో రూపుదిద్దుకొనే స్టార్టప్ కంపెనీలదే భవిష్యత్తు. నేటి స్టార్టప్ కంపెనీలే రేపటి పరిశ్రమ దిగ్గజాలు. డాక్టర్ రెడ్టీస్, అరబిందో, హెటిరో... ఇవన్నీ ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలే. పరిశ్రమ అభివృద్ధి కేవలం స్టార్టప్ కంపెనీలతోనే సాధ్యం. కొత్త రాష్ట్రాల్లో. అటు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్‌లో కానీ ఓ వెయ్యి స్టార్టప్ కంపెనీలు.. నంబర్ చెప్పటం కష్టం కానీ ఆ స్థాయిలో అయితే కొత్త యూనిట్లు రావచ్చు. రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే ప్రభుత్వాలుఎవరైనా సరే... అది టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు...ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని పారిశ్రామిక విధానాలను రూపొందించాలి. చిన్న కంపెనీ నుండి భారీ స్థాయి యూనిట్ వరకు రకరకాల పరిశ్రమలను పెట్టుకొనే అవకాశం కేవలం ఫార్మా రంగంలోనే ఉంది. సిమెంట్, చక్కెర,ఉక్కు పరిశ్రమలకైతే భారీ పెట్టుబడులు కావాలి. ఫార్మా విషయంలో అలా కాదు. ఇక్కడ మినిమం పది కోట్ల రూపాయల నుండి వెయ్యి కోట్ల రూపాయల మేర వారి వారి స్థాయి, సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి చేసుకోవచ్చు. ఎంతచెట్టుకు అంతగాలి అన్నట్లు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. వృద్థి అవకాశాలున్నాయి. నైపుణ్యంగల మానవవనరులు అందుబాటులో ఉన్నాయి. విస్తృతమైన మార్కెట్ కూడా ఉంది. కొత్త రాష్ట్రాల్లో పరిశ్రమ అభివృద్ధికి కలిసొచ్చే అంశాలు? తెలంగాణలో భూమి విలువ తక్కువ. సీమాంధ్రలో ఎక్కువ. సీమాంధ్రలో పారిశ్రామికీకరణ అంటే పంట పొలాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం. తెలంగాణలో అయితే చవుడు భూములు, బంజర్ భూములు వినియోగంలోకి తీసుకురావచ్చు. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధి చేయడం చాలా ఈజీ. సీమాంధ్రలో భూమి విలువ ఎక్కువ అయినప్పుటికీ పెట్టుబడి పెట్టగలిగిన పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఉన్నారు. నౌకాశ్రయాలుండటంతో ఎగుమతి దిగుమతులకు అనువైన రాష్ర్టంగా సీమాంధ్ర ఎదుగుతుంది. చైనా సవాలును ఎలా ఎదుర్కొంటారు? బల్క్ డ్రగ్ విషయంలో చైనాకు మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యం ఎక్కువ. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లో చైనా విసిరిన సవాలును తట్టుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా వేతనాలు పెరిగాయి. ఉత్పత్తి వ్యయం పెరిగింది. చైనాకు ఏ మాత్రం అడ్వాంటేజ్ లేదు. ఇండియాలో కనీస వేతనాలు పెరిగినప్పటికీ ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఇది రాబోయే రోజుల్లో మనకు కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెటింగ్ విషయంలో చైనా కన్నా మనమే బెటర్. ఫార్మా అంటే కాలుష్యం అంటారు కదా...దీన్నెలా పరిష్కరిస్తారు? ఫార్మా యూనిట్లతో కాలుష్యం పెరుగుతోందని 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించటంతో కొత్త యూనిట్లు రావడం ఆగింది. దాని మూలాన మన వృద్ధి ఆగిపోయింది. నంబర్ వన్ పొజిషన్లో ఉండాల్సిన వాళ్లం ఇప్పుడు నంబర్ త్రీ పొజిషన్‌కు వచ్చాం. ఇది మనం చేజేతులా చేసుకున్నదే. కాలుష్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా కొత్త యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం అడ్డుకోవడంతో ఒక దశలో పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమయింది. అయితే ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, విర్కో ల్యాబ్స్ లాంటి కొన్ని కంపెనీలు బాగా డెవలప్ అయ్యాయి. అభిలషణీయ ఉత్పత్తి విధానాలు పాటిస్తూ, కాలుష్యాన్ని తగ్గించే స్వీయ నియంత్రణ విధానాలు పాటించటం వల్ల ఇది కొంతమేర సాధ్యపడింది. కొత్త రాష్ట్రంలో కాలుష్య సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. -
ఔషధాల ధరలు భారీగా
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. వివిధ రోగాలకు సంబంధించి అత్యవసర ఔషధాల ధరలకు కళ్లెం వేశారు. రోగులకు అత్యవసర మందులను చౌకగా అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన మందుల ధరలను నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసెన్స్ (ఎన్ఎల్ఈఎం) ప్రకటించడం తో ఈ ఆదేశాలను వెంటనే అమల్లో పెట్టాలంటూ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు వేల్పుల విజయ శేఖర్ అన్ని ఔషధ దుకాణాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ధరతో ఉన్న పాత స్టాక్‌ను విక్రయించరాదని స్పష్టం చేశారు. కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని సూచించారు. మెడికల్ దుకాణాలు, పంపిణీ సంస్థల వద్ద ఉన్న పాత స్టాక్‌ను వెంటనే సంబంధిత సంస్థలకు పంపించేయాలని పాత స్టాక్‌ను విక్రయించడం చట్టరీత్యా నేరమని వెల్లడించారు. విశాఖ జిల్లాలో దాదాపు 348 రకాల మందుల ధరలు తగ్గే అవకాశముంది. నగరంలోని ఇప్పటికే కొన్ని ఔషధ దుకాణాలు కొత్త ధరలకే మందులను విక్రయించడం మొదలెట్టారు. నగర శివారు ప్రాంతాల్లోనూ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ, వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే మందుల దుకాణాల్లోనూ కొత్త ధరలు అమలు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. 60 శాతం తగ్గొచ్చు..! విశాఖ జిల్లాలో 1800 మందుల అమ్మకాల దుకాణాలున్నాయి. వీటికి మందులను సరఫరా చేసేందుకు 300 మంది డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. ప్రతి నెలా జిల్లా నుంచి రూ. 27 కోట్ల వ్యా పారం జరుగుతోంది. అందులో 68 శాతం విశాఖ మహా నగరం నుంచే జరుగుతుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారితో బాటు ఛత్తీస్‌గఢ్, ఒఢిశా రాష్ట్రాలకు చెందిన వారు కూడా వైద్యం కోసం విశాఖకే తరలి వస్తుండడంతో మందుల అమ్మకాలకు విశాఖ కేంద్రంగా మారింది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన అత్యవసర మందుల ధరలు 10 నుంచి 60 శాతం వరకూ బ్రాండెడ్ మందుల ధరలు తగ్గాయి. ఈ ప్రభావం వల్ల దుకాణాల ఆదాయం కూడా స్వల్పంగా తగ్గే ఛాన్స్‌లున్నాయని అంచనా వేస్తున్నారు.