Cardiologist
-
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా దీని భారిన పడుతున్నారు. అయితే.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా. గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన డా. గౌరవ్ గాంధీ అంటే ఆ ప్రాంతంలో తెలియనివారుండరు. ఆయన చేతితో ఎన్నో గుండె ఆపరేషన్లు చేశారు. ఎందరి ప్రాణాలనో రక్షించారు. గుండెకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూచనలు చేసేవారు. కేవలం నాలుగు పదుల వయస్సులోనే సుప్రసిద్ధ కార్డియాలజిస్టుగా పేరుగాంచారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే గుండెపోటుతో మరణించారు. సుమారు 16 వేల ఆపరేషన్లు ఆయన ఇప్పటివరకు చేశారు. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రి పనులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి చేరారు. రోజూలానే భోజనం పూర్తి చేసుకుని నిద్రకు వెళ్లారు. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని స్పష్టం చేశారు. రాత్రి నిద్రకు వెళ్లే సమయంలో ఎలాంటి అసౌకర్యంగా ఆయన కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలుపారు. ఆయన మంచి ఆహారాన్నే తీసుకున్నారని వెల్లడించారు. డా. గాంధీ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి:కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. వారి ఐదు డిమాండ్లు ఇవే..! -
చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి. ఫిఫా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. ♦ కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. ♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. ♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...? కోవిడ్ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్’, హార్ట్ఫెయిల్యూర్లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... కోవిడ్ తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. ♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. ♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే. ♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్‌తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్‌మార్టమ్ అవసరం. యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...? ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్‌లో చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్ అప్, కొలెస్ట్రాల్ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రాణాలను కాపాడే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్‌పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. ♦ ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి. గుండెపోటు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటంటే? మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు. ♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్‌టెన్షన్), మధుమేహం (డయాబెటిస్) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. ♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది. ♦ ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
చలి కాలంలో గుండెపోటు అవకాశాలు ఎక్కువ
గుంటూరు: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. నాగరాజు సూచించారు. గుంటూరువారి తోట గౌడీయ మఠం పక్కనున్న అమ్మాజీ– పావని మెమోరియల్ హాస్పిటల్లో సోమవారం ఉచిత గుండెజబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గుండెజబ్బులకు కారణమయ్యే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల పెరుగుతున్న గుండెజబ్బులపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాలను తొలగించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తెలిపారు. -
ఎంతో కీలకమైన ఆక్సిజన్ గురించి ఇవి తెలుసుకోండి
కోవిడ్–19 పేషెంట్స్‌లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది? ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఏ రకమైన పరికరాల్లో ఉపయోగించుకోవాలి? అనే అంశాలు ముఖ్యం. వీటి గురించి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఏం చెప్పారంటే... కరోనా బాధితుల్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవాలి. దీన్ని పల్స్ఆక్సీమీటర్ సహాయంతో తెలుసుకుంటాం. నార్మల్ గా 95 నుంచి 100 శాతం వరకు ఆక్సిజన్ శాచ్యురేషన్ ఉంటుంది. అయితే కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ క్రమంగా తగ్గుతుంది. చాలా మందిలో ఇది అస్సలు తగ్గకుండానే జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. 94 శాతం కన్నా ఆక్సిజన్ శాచ్యురేషన్ తక్కువుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉందని అర్థం. అదే విధంగా ఆక్సిజన్ 90 కన్నా తగ్గుతున్నప్పుడు ఐసీయూలో చికిత్స అవసరమని అర్థం. అయితే ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం? ఆక్సిజన్ శాచ్యురేషన్ 94 కన్నా తక్కువున్నప్పుడు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆస్పత్రుల్లో బెడ్ దొరకటం కష్టంగా మా రింది. ఈ సమయంలో ఆస్పత్రిలో అడ్మిషన్ దొరికేలోగా మనం కొంతమేరకు ఆక్సిజన్ ఇవ్వగలిగితే పేషెంట్‌కు ఆక్సిజన్ శాచ్యురేషన్ మరింత తగ్గిపో కుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఆస్పత్రిలో అడ్మిట్ అయి కోలుకున్న తర్వాత మరి కొంతకాలం వరకు ఇంట్లో ఆక్సిజన్ అవసరం పడే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకి కూడా ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడం తప్పనిసరి. ఇంట్లో ఏ విధంగా అమర్చుకోవాలి? ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడానికి ప్రధానంగా రెండు పద్ధతులు. ఒకటి ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకోవడం.. మరొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని పెట్టుకోవడం. సిలిండర్‌తో లాభనష్టాలేంటి? ఆక్సిజన్ సిలిండర్లు మరీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. వీటి నుంచి నాణ్యమైన ఆక్సిజన్ వస్తుంది. కరెంటు లేనప్పుడు కూడా ఈ సిలిండర్ పనిచేస్తుంది. అయితే సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోయినప్పుడు మళ్లీ నింపుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆక్సిజన్ దొరకకపోతే ఇబ్బంది. కాన్సన్‌ట్రేటర్‌తో లాభనష్టాలేంటి? ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 24 గంటలు పని చేస్తాయి. దీని ద్వారా ఆక్సిజన్ అయిపోవడం అనే సమస్య ఉండదు. ఒకసారి కొనుక్కున్న లేదా అద్దెకు తీసుకున్న తర్వాత ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా ఉండే అవకాశం ఉంటుంది. ► వీటితో కొన్ని సమస్యలు ఉంటాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. కరెంటు పోయినప్పుడు ఈ కాన్సన్ట్రేటర్లు పని చేయవు. అప్పుడు బ్యాకప్ జనరేటర్ వీటికి అవసరమవుతుంది. ► ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో నుంచి వచ్చే ఆక్సిజన్ క్వాలిటీ వివిధ రకాలుగా ఉంటుంది. మెడికల్‌గా కావాల్సిన ఆక్సిజన్ నాణ్యత 90 శాతం ఉంటుంది. 90 శాతం కన్నా తక్కువైతే పేషెంట్ ఆక్సిజన్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేటర్ ఎలా పనిచేస్తుంది? ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఒత్తిడితో కూడిన గాలిని ఫిల్టర్‌లో ప్రవేశపెడుతుంది. ఈ ఫిల్టర్‌కు గాలిలో ఉన్న నైట్రోజన్ని పీల్చేసే సామర్థ్యం ఉంటుంది. నైట్రోజన్‌ను పీల్చేసిన తర్వాత ఆక్సిజన్ శాతం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పని చేస్తుంది. కాన్సన్ట్రేటర్లు ఎన్ని రకాలు? ఇవ్వగలిగిన ఆక్సిజన్ని బట్టి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని ఐదు లీటర్లు ఆక్సిజన్ ఇవ్వగలిగితే, కొన్ని 10 లీటర్లు ఇవ్వగలుగుతాయి. అయితే కొన్నిరకాల కాన్సన్ట్రేటర్లలో తక్కువ పరిమాణం ఆక్సిజన్ వచ్చేటప్పుడు మాత్రం 90 శాతానికి పైగా ఆక్సిజన్ వస్తుంది కానీ ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో 30 నుంచి 90 వరకు ఆక్సిజన్ శాతం వస్తుంది అని ఉంటుంది. అంటే.. సుమారుగా ఒకటి లేదా రెండు లీటర్లు అవసరమైనప్పుడు ఈ కాన్సన్ట్రేటర్లు 90 శాతం ఆక్సిజన్ ఇస్తాయి. అయితే సుమారుగా 5 లీటర్ల పైన ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవి కేవలం 30 శాతం ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి. ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు కూడా 90 శాతం పైన ఆక్సిజన్ ఇవ్వగలిగిన కాన్సన్ట్రేటర్లను ఎంచుకోవడం ముఖ్యం. ఈ రకం కాన్సన్ట్రేటర్లు ఎక్కువ బరువు ఉంటాయి. ఇంట్లో అమర్చుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆక్సిజన్ కూడా ఒక మందు లాంటిదే. మందు ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు ఎలాంటి దుష్ఫలితాలువస్తాయో,ఆక్సిజన్ ఎక్కువైనా లేదా తక్కువైనా కూడా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవాలి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గోడకి ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో ఉంచాలి. ► దీన్ని ఉపయోగించేటప్పుడు గది తలుపులు తెరిచి ఉంచితే మంచిది. ఎందుకంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని అది శుద్ధి చేసినప్పుడు గాలిలో నైట్రోజన్ శాతం పెరుగుతూ ఉంటుంది. అందుకని తలుపులు తీసి ఉంచినట్లయితే నైట్రోజన్ శాతం పెరగకుండా ఉంటుంది. ► ఆక్సిజన్ శాచ్యురేషన్ని క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇది తగ్గుతూ ఉంటే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. ► ఆక్సిజన్ సిలిండర్స్‌ని వాడుతున్నప్పుడు అవి పేలి పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంటలు అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిప్పుకి వాటిని దూరంగా ఉంచాలి. ► బాగా తీవ్రంగా జబ్బు ఉన్న వాళ్ళకి ఇంటిదగ్గర ఆక్సిజన్ ఇవ్వటం మంచిది కాదు. అలాంటి వాళ్లు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేలోపు మాత్రమే వాడితే మంచిది. ► రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నపుడు కేవలం ఆక్సిజన్ ఇవ్వడం మాత్రమే కాకుండా డాక్టర్లు ఇంకా కొన్ని రకాలైన వైద్య చికిత్సలు చేస్తారు. కొన్ని రకాల ఇంజక్షన్స్ ఇవ్వడం, కొన్ని రక్తపరీక్షలు చేయడం, కొన్నిసార్లు ఎన్ఐవీ ఉపయోగించటం లాంటివి చేస్తారు. కాబట్టి ఆక్సిజన్ అవసరం పడుతున్నప్పుడు వైద్యులను సంప్రదించటం తప్పనిసరి. ► దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ మోతాదులో అవసరం పడొచ్చు. వాళ్లకి మరీ ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చినా కూడా ప్రమాదం. అందువల్ల పల్మనాలజిస్ట్ సలహాతో ఎంత ఆక్సిజన్ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. -
మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ మృతి
ఢిల్లీ : భారత మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ పద్మావతి (103) కన్నుమూశారు. కరోనా కారణంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. వైద్యరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న పద్మావతి గత 11 రోజుల క్రితం నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1981లో ఆమె స్థాపించిన ఆస్పత్రిలోనే కన్నుమూయడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. వయసుమీద పడటం, కరోనా వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మరణించినట్లు ఆసుపత్రి సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్ వెల్లడించారు. గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీగా పద్మావతి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967తో పద్మ భూషణ్, 1992లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. డాక్టర్ పద్మావతి మరణంపై ఆస్పత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్‌గా పద్మావతి సేవలు చిరస్మరణీయం అని గుర్తుచేసుకున్నారు. (ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్) -
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దాటేశామా..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి దేశంలో మూడో దశ దాటి నాలుగో దశలోకి అడుగుపెడుతోందా? ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌ను దాటి మరింత ముందుకు వెళ్లినట్లేనా? కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరగటంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా కొనసాగుతుండగా, మన రాష్ట్రం ప్రస్తుతం కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నా, వ్యాధి తీవ్రత, వ్యాప్తి నేపథ్యంలో మనకు ప్రస్తుత దశ ఎంతో కీలకమైందని చెబుతున్నారు. (ప్రైవేట్ ల్యాబ్‌లకు సర్కారు పరీక్ష) రాబోయే వారం, పది రోజుల్లో వైరస్ మరింతగా విజృంభించేందుకు అనుకూల పరిస్థితులున్నందున మాస్క్, వ్యక్తుల మధ్య దూరం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత శుభ్రత, ఇళ్లలోనూ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న స్థితిలో ప్రభుత్వపరంగా చేయగలిగింది చేస్తోందని, ప్రజలంతా స్వయం నియంత్రణ పాటించి, ఎవరికి వారే అప్రమత్తంగా వ్యవహరిస్తూ మెలగాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురుకానున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వివిధ రంగాల వైద్యనిపుణులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు.. వారి మాటల్లోనే.. (అతి పెద్ద కరోనా కేర్ సెంటర్ భారత్‌లో రెడీ!) స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష ‘ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్ల కొరత సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోజులుగా 800 పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున, అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దు. 60 ఏళ్ల పైబడిన వారు అస్సలు బయటకు రావొద్దు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవు. మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మందులు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే వీటితోనే పూర్తిగా నయమైపోతుందని భావించడం సరికాదు. వ్యాక్సిన్ రావడానికి కూడా కనీసం 6 నెలలు పడుతుంది. అందువల్ల ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కచ్చితమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం..’ – ప్రముఖ కార్డియాలజిస్ట్ డి.శేషగిరిరావు ఇళ్లలోనూ ఆరడుగుల దూరం ‘కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. బయటికి వెళ్లి వచ్చినవారు తమకేమి లక్షణాలు లేవనుకుని ఇంట్లోని పెద్దవారికి, చిన్న పిల్లలకు స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా బయటే కాదు ఇళ్లలోనూ వ్యక్తుల మధ్య దూరం (కనీసం ఆరడుగులు) కచ్చితంగా పాటించాలి. ఒకరికి వ్యాధి సోకితే సెకండరీ అటాక్‌లో భాగంగా ఇంట్లోని వారికి 40 శాతం ఇది వ్యాప్తి చెందుతుంది. పిల్లలకు పాలు పట్టే తల్లులు, పిల్లలను ఆడించే వారు మాస్క్‌లు పెట్టుకోవాలి. గవర్నమెంట్ లాక్డౌన్ ముగిసింది. ఇప్పుడు స్వయం విధిత లాక్‌డౌన్‌ను పాటించాలి. (డెక్సామెథాసోన్కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్) ప్రస్తుతం వేగంగా వైరస్ విస్తరిస్తున్నందున వివిధ రూపాల్లో స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు ఇప్పుడే ఎక్కువ అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. విటమిన్ సీ, డీతో జింక్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. 7, 8 గంటల పాటు నిద్రపోవాలి. పొగ తాగడం మానేయాలి. మాస్క్‌లు పూర్తిగా ముక్కు, నోరు కప్పేలా ధరించాలి. మాట్లాడేప్పుడు మాస్క్‌ను కిందకు జరిపితే ప్రయోజనముండదు. చీరకొంగు, చున్నీ, కర్చీప్ల వంటివి నోటికో, ముక్కుకో అడ్డుపెట్టుకుంటే సరిపోదు. వృద్ధులు, అనారోగ్యసమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..’ – పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ విశ్వనాథ్ గెల్లా కోవిడ్ స్టేజ్‌లు ఇలా.. స్టేజ్ 1: మహమ్మారి మొదటి దశలో వ్యాధి స్థానికంగా వ్యాప్తి చెందదు. అప్పటికే కోవిడ్ బారిన పడిన ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ట్రావెల్ హిస్టరీ ఉన్న వారు క్యారియర్లుగా పరిగణిస్తారు. వారి నుంచి నమోదైన కేసులనే ఫస్ట్ స్టేజ్‌గా పరిగణిస్తారు. మొదటిసారిగా ఈ వైరస్ బయటపడుతుంది. నియంత్రణకు అవకాశముంటుంది. స్టేజ్ 2: ఈ రెండో దశలో స్థానికంగానే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇది వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు వ్యాపిస్తుంది. ఈ స్టేజ్‌లో వైరస్ ఏ మేరకు ఎవరి నుంచి ఎవరికి అని గుర్తించి క్వారంటైన్‌కు పంపించే వీలుంటుంది. పాజిటివ్‌ల ఐసోలేషన్‌తో పాటు లక్షణాలున్న వారిని ట్రేస్ చేసే వీలుంటుంది. స్టేజ్ 3: మూడో దశను కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గానూ పరిగణిస్తారు. ఈ స్టేజ్‌లో ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఇది వ్యాప్తి చెందిందో కనుక్కోవడం కష్టం. ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారితో కాంటాక్ట్ కాకపోయినా ఇతరులకు సోకుతుంది. ఈ దశలో వ్యాప్తి వేగం పెరుగుతుంది. నియంత్రణ అనేది కూడా కష్టతరమవుతుంది. స్టేజ్ 4: వైరస్ వ్యాప్తి తీవ్రమై, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అవకాశముంటుంది. ఈ స్టేజ్‌లో నియంత్రణ అనేది దాదాపుగా అసాధ్యంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. అక్కడి జనాభాలోనే వ్యాప్తి చెంది మహమ్మారిగా రూపాంతరం చెందుతుంది. మరణాల సంఖ్య పెరుగుతుంది. -
‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’
సాక్షి, రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : కష్టపడి చదివాడు..కన్నవారి కలలు నిజం చేశాడు. మామూలు వైద్యుడి కంటే ఏకంగా ‘గుండె’ డాక్టరే(కార్డియాలజిస్ట్) అయ్యాడు. కాలక్రమంలో అతనిలో ‘ప్రేమ’ అనే మరో కల మొగ్గలు తొడిగింది. చివరికి పెళ్లి దాకా వెళ్లింది. ఏ ప్రేమ కోసమైతే అతడు ఆరాటపడ్డాడో అదే ‘ప్రేమకల’ చెదిరిపోయింది. ఆ వైద్యుడి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. రామకృష్ణాపూర్లో విషాదం నింపిన ఘటన వివరాలివి.. పట్టణంలోని ఠాగూర్ స్టేడియం ఏరియాకు చెందిన దాసారాపు సుభాష్(34) గురువారం రాత్రి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిటైర్ కార్మికుడు ఆగయ్య కుమారుడైన సుభాష్ మెడిసిన్‌కు ఎంపికయ్యాడు. అరుదైన గుండె విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశాడు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సుభాష్ హైదరాబాద్‌లో తానుంటున్న ఇంటిలోనే విషపు ఇంజక్షన్ వేసుకుని విగతజీవుడయ్యాడు. మనస్తాపంతోనే ఈ దారుణం మృతుడు సుభాష్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే చెన్నైకి చెందిన నిత్య అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్లింది. 2017లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సాఫీగా వీరి దాంపత్య జీవితం గడుస్తు న్నా నిత్య తల్లిదండ్రులకు మాత్రం వీరి ప్రేమ వివా హం మింగుడు పడలేదు. 15 రోజుల క్రితం నిత్య తల్లి దండ్రులు హైదరాబాద్ వచ్చి ఆమెను చెన్నైకి తీసుకువెళ్లారు. కాగా అక్కడే మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారన్న సమాచారం సుభాష్‌కు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లై రెండు సంవత్సరాలు దాటిపోయాక మరో సంబంధం చూడటం జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అమ్మా.. నిద్రపోతానమ్మా.. ‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నేను నిద్రపోతాను...’ అని చెప్పిన కొడుకు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం ఆ కన్నతల్లి పేగుల్ని పెకిలించివేసింది. గురువారం రాత్రి సుభాష్ నోట వచ్చిన పదాలే ఇక చివరి మాటలవుతాయని తల్లి మల్లమ్మ ఏ కోశాన ఆలోచించలేదు. ఉదయం పూట డ్యూటీకి టైం అవుతుందని లేపుదామని వెళ్లిన తల్లి కొడుకు విగతజీవుడయ్యాడని తెలిసి కుప్పకూలిపోయింది. ఎందరో పేషెంట్ల గుండెకు వైద్యం చేసిన తన కొడుకు నిజజీవితంలో ‘గుండె నిబ్బరాన్ని’ కోల్పోయాడని కన్నీరుమున్నీరైంది. ఆగయ్య–మల్లమ్మల సంతానంలో మూడోవాడైన సుభాష్ మృతి స్థానికంగా విషాదం నింపింది. శుక్రవారం ఉదయం ఈ వార్త తెలిసి ఠాగూర్‌స్టేడియం ఏరి యా వాసులు పెద్ద ఎత్తున వారింటికి తరలివచ్చారు. -
గుండెవైఫల్యం అంటే...?
నా వయసు 59 ఏళ్లు. గత నాలుగేళ్లుగా మూత్రం తగ్గడం, చర్మం పలచబడటం, కండరాల పటుత్వం కూడా తగ్గడం వంటి లక్షణాలతో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గుండెవైఫల్యం అంటే ఏమిటి? ఇందుకు కారణాలేమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – సుధాకర్‌రావు, కంకిపాడు గుండె వైఫల్యానికి అతి ప్రధాన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటు బారిన పవడ్డవారిలో నూటికి 60 మందిలో గుండెవైఫల్యం సంభవించవచ్చు. అయితే గుండెవైఫల్యానికి ఇదొక్కటే కారణం కాదు. దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండెకండరం దెబ్బతిని వైఫల్యానికి దారితీస్తుంది. అలాగే డయాబెటిస్ నియంత్రణలో లేనప్పడు కూడా సూక్ష్మరక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషపదార్థాల ప్రభావం పెరిగి, కరమంగా గుండె దెబ్బతింటుంది. అదురుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, కొందరిలో జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూ లేనంత తీవ్రమైన మానసిక ఒత్తిడి బారిన పడ్డవారికి కూడా హఠాత్తుగా గుండెవైఫల్యం సంభవించి ముప్పు ఉంటుంది. నిర్ధారణ గుండెవైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ‘ఈసీజీ’ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారైందా... వంటి వివరాలన్నీ బయటపడతాయి. ఎకో పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉందన్న విషయం తెలుస్తుంది. ఇవికాకుండా గుండెవైఫల్య లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు... ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్’ అవసరమవుతుంది. దాదాపు 99 శాతం మందికి ఈ పరీక్షలతో గుండెవైఫల్యం కచ్చితంగా నిర్ధాణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎమ్మారై, పెట్‌స్కాన్ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండెవైఫల్యమా లేక ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్పీ’ అనే పరీక్ష ఉపకరిస్తుంది. చికిత్స: గుండెవైఫల్యానికి చికిత్స దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. గుండెవైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం, కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. గుండె వ్యాధి ముదరకుండా చూడటానికి మందులు వాడాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటాబ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్హిబిటర్లు, స్పైరనోలాక్టోస్ వంటి మందులు ఇస్తారు. వీటికితోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలీసిలిన్ ఇన్హిబిటర్’ వంటి కొత్తమందులు రాబోతున్నాయి. ఇక ఒంట్లోకి అధికంగా చేరిన నీటిని బయటకు పంపేందుకు ‘డైయూరెటిక్స్’ మందులు, లక్షణాలను తగ్గించేందుకు ‘డిజిటాయిల్స్’ మందులు తోడ్పడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ జీవితికాలాన్ని పెంచడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్ సామర్థ్యం 30 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి ‘ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్స్’ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటాబ్లాకర్స్ను తట్టుకోలేరు వీరికి ‘ఇవాబ్రాడిన్’ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ‘ఐసారజైన్’ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారేలా చేస్తూ గుండెమీద భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా, గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలు తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారం వాడటం చాలా కీలకం. గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...? నా వయసు 54 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్) అన్నారు. నేను కూడా డాక్టర్లు చెప్పినట్టే క్రమం తప్పకుండా మందులు వాడాలనుకుంటున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయాలి? - ఆర్. జగన్నాథరావు, గుడివాడ మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్ అంత ఎక్కువగా లేవనీ అర్థం. లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్ అవసరం పడాల్సి రావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేయించుకుని పూర్తిగా సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. - డాక్టర్ జి. సూర్యప్రకాశ్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్, హైదరాబాద్ -
అమెజాన్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్
అమెజాన్ అంటే ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్లో ఓ సంచలనం. ఈ కంపెనీ కన్ను ఇప్పుడు 3 ట్రిలియన్ డాలర్ల హెల్త్ కేర్ రంగంపై పడింది. హెల్త్ కేర్ రంగంలోనూ తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ మౌలిక్ మజ్ముదార్ను నియమించుకుంది. అమెజాన్‌లో తనను నియమించుకున్నట్టు తెలుపుతూ.. మజ్ముదార్ తన ట్విటర్ అకౌంట్లో కొత్త రోల్ గురించి ప్రకటించారు. ఈ టెక్నాలజీ కంపెనీ మజ్ముదార్ను నియమించుకోకముందు, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో హెల్త్ కేర్ ట్రాన్సఫర్మేషన్ ల్యాబ్‌కు కార్డియాలజిస్ట్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించేవారు. ఎంఐటీలో లెక్చరర్ కూడా. ల్యాబ్‌లో ఆయన అధునాతన మెడికల్ టెక్నాలజీస్‌ను ఔషధాల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై పరిశోధనలు చేసేవారు. అయితే అమెజాన్‌లో ఆయన కొత్త ఏ బాధ్యతలను నిర్వర్తించనున్నారో మాత్రం వెల్లడించలేదు. కేవలం ఉత్తేజకరమైన, సవాల్‌తో కూడిన బాధ్యతలను తాను స్వీకరించనున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. ఇప్పటికే హెల్త్‌కేర్‌లో కూడా పలు టీమ్స్‌తో అమెజాన్ పనిచేస్తోంది. మెడిసిన్లను హాస్పిటల్స్‌కు, క్లినిక్స్‌కు అమ్మేలా ఓ బిజినెస్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్టు తెలిసింది. హెల్త్ కేర్ కంపెనీలకు ఏఐ ఆధారిత టెక్నాలజీస్, ఇతర అధునాతన టెక్నాలజీలను తన క్లౌడ్ టీమ్ విక్రయించబోతున్నట్టు సమాచారం. హెల్త్ కేర్‌లో వాయిస్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అలెక్సాలో ఓ మంచి బృందమే పనిచేస్తుంది. జూన్‌లో అమెజాన్ ఆన్లైన్ ఫార్మసీ పిల్ప్యాక్ను కూడా కొనుగోలు చేసింది. తన ఉద్యోగులకు వైద్య ఖర్చులు తగ్గించడానికి ఈ కంపెనీ, జేపీ మోర్గాన్, బెర్క్ షైర్ హాత్వేలతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హెల్త్ కేర్‌పై కన్నేసిన టెక్నాలజీ కంపెనీల్లో కార్డియాలజిస్ట్‌లకు భారీ డిమాండ్ ఉంది. దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, ఆపిల్ కంపెనీలు వీరి నియామకాలపై ఎక్కువగా దృష్టి సారించాయి. 1/ Very emotional day: After decade of medical training (@NorthwesternMed @HopkinsMedicine @BrighamWomens), five years on the faculty @MGHMedicine and @harvardmed, leading #digitalhealth @mgh_htl, I have decided to leave academia to take on an exciting & challenging role @amazon — Maulik Majmudar, MD (@mdmajmudar) August 20, 2018 -
చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో...
ఆడపిల్లకి ఎన్నో కష్టాలు. కన్నతల్లికి ఎన్నో శోకాలు. బంగారుతల్లికి ఎన్నో వ్యథలు. ఇది చాలక ఎన్ని శారీరక బాధలో!అన్ని బాధల్లో ఎన్ని వివక్షలో! ఇవి తెలుసుకుంటే చెల్లి జాగ్రత్త పడుతుందని.. గుండెకోతను తప్పించుకుంటుందని.. ఈ వివరాలను అందిస్తున్నాం.మహిళలలో గుండెవ్యాధులు... వాటికి కారణాలూ...తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే..ఆమె తన వ్యథలను జయిస్తుందని..శారీరక బాధలను ఎదుర్కొంటుందని మా నమ్మకం... మా విశ్వాసం. గుండెపోటు చికిత్సలో విదేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష... గుండెపోటు వచ్చినప్పుడు పురుషులకు ఇచ్చే చికిత్సే మహిళలకు అందడం లేదన్న ఆందోళనకరమైన విషయం ఈమధ్యే వెల్లడయ్యింది. ఒక స్వీడిష్ అధ్యయనంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో స్వీడన్‌లోని 1,80,368 మంది గుండెపోటుకు గురైన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి. మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న తర్వాత, మళ్లీ అదే రెండోసారి వచ్చినప్పుడు మృతిచెందే మహిళల సంఖ్య... పురుషులతో పోల్చి చూస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ విషయమై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వ్యాఖ్యానిస్తూ... ‘నిజానికి సామాజికంగా చూస్తే గుండెజబ్బులు అనగానే అదేదో పురుషులకే వచ్చేవనే అభిప్రాయం ఉంది. కానీ మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే గుండెపోటుతో మృతిచెందే మహిళలే ఎక్కువ’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేసింది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. పరిశోధకులు ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారం (డేటా)ను ‘యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్’తో పాటు ‘ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్’కు చెందిన ఆన్లైన్ కార్డియాక్ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. ఆ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన సత్యాలు చాలా దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గుండెపోటుకు గురైన పురుషులకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో... చాలా మంది మహిళలకు అదే చికిత్స లభ్యం కావడం లేదు. ఇదే అధ్యయనంలో కో–ఆథర్‌గా వ్యవహరించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్‌గేల్ ఇందుకు కారణాలు చెబుతున్నారు. ఆయన చెబుతున్న అంశాలివి... ‘‘బయటనుంచి చూస్తే సాధారణ ప్రజానీకంతో పాటు ఆరోగ్యరంగంలో సేవలందిస్తున్న చాలామంది ప్రొఫెషనల్స్‌లో చాలామంది... గుండెపోటు వచ్చిన రోగులందరినీ ఒకేలా పరిగణిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తి అనగానే మధ్యవయస్కుడైన ఒక పురుషుడు స్థూలకాయాన్ని కలిగి ఉండి, డయాబెటిస్తో బాధపడుతుంటాడనీ, అతడికి పొగతాగే అలవాటుంటుందని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రా అలాగే ఉండలనేమీ లేదు. జనాభాపరంగా చూస్తే గుండెపోటు విస్తృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో అది మరింత ఎక్కువ’’ అని ప్రొఫెసర్ క్రిస్‌గేల్ పేర్కొన్నారు. జెండర్ పరమైన తేడా ఎందుకంటే... గుండెపోటు వచ్చిన వారికి అందించే చికిత్సలో భాగంగా చేసే బైపాస్ సర్జరీ లేదా స్టెంట్స్ అమర్చడం వంటి వైద్యసేవలు పురుషులతో పోలిస్తే మహిళలకు 34 శాతం తక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు... పురుషులకు ప్రిస్క్రయిబ్ చేసే స్టాటిన్స్ (మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు రెండోసారి మళ్లీ రాకుండా నివారించేందుకు గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లోని పూడికను తొలగించే మందులు) కూడా మహిళలకు 24 శాతం తక్కువగా రాస్తున్నారు. గుండెపోటుకు చికిత్స అందించే మూడు ముఖ్యమైన చికిత్సలూ స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలంటూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మహిళలకు అవి అందకపోవడమే జరుగుతోంది. ఒకవేళ మహిళలకు కూడా పురుషులకు ఇచ్చే చికిత్సే దొరికితే గుండెపోటుతో మృతిచెందే స్త్రీ, పురుషుల సంఖ్యలో ఇప్పుడు గణనీయంగా ఉన్న తేడా చాలావరకు తగ్గుతుందని ఈ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. మరికొన్ని అంశాలు... ఈ అధ్యయనంలో భాగంగా చూసినప్పుడు ఏడాదిలో ఇంగ్లాండ్‌లో దాదాపుగా 1,24,000 మంది పురుషులు గుండెపోటుతో హాస్పిటల్లో చేరితే... మహిళల్లో ఆ సంఖ్య దాదాపు 70,000 గా ఉంది. ఈ గణాంకాలను మరీ నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసిన సత్యం మరింత విభ్రాంతికి గురిచేసింది. ప్రొఫెసర్ గేల్ చెబుతున్న వివరాల ప్రకారం ‘‘గుండెపోటుతో హాస్పిటల్లో చేరే దాదాపు 50 శాతం మహిళలకు పురుషుల్లాంటి వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు లేదా వారి విషయంలో తప్పుడు నిర్ధారణ (మిస్ డయాగ్నోజ్) జరుగుతోంది. ఇక అది వారికి అందించే మొత్తం చికిత్సను తప్పుదారి పట్టిస్తోంది. అంటే మొదట మనమో అంశాన్ని మిస్ చేశామంటే... అది ఆ మొత్తం చికిత్స ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా మహిళల్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది’’ అని ఆయన వివరించారు. అంతేకాదు... ఈ అధ్యయనంలో లభ్యమైన విషయాల్లో మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కేవలం ఒక్క గుండెపోటు మాత్రమే కాదు... డయాబెటిస్, హైబీపీ లాంటి ఇతర రుగ్మతల విషయంలోనూ మహిళలే ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ఇక బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్ జెరేమీ పియర్సన్ మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం వెంటనే ఆయా అంశాలపై దృష్టిసారించాలని చెబుతున్నాయి. మనం అత్యవసరంగా ఈ అంశంపై దృష్టిసారించి, అందరిలోనూ అవగాహన పెంపొందేలా పూనుకోవాలంటూ సూచిస్తున్నాయి. కేవలం ఒక చిన్న జాగ్రత్త అంటే... పురుషులకు అందించే చికిత్సే మహిళలకూ అందించడం అన్న చర్య ద్వారా పరిస్థితులను తేలిగ్గానే మార్చేందుకు అవకాశం ఉంది. అప్పుడు తమ ప్రియమైన వారిని కోల్పోయే పరిస్థితి రాకుండా చేసి, మనమెన్నో కుటుంబాలను ఆదుకోవచ్చు’’ అంటున్నారు జెరేమీ. భారతదేశంలో ఇలా... గుండెపోటు విషయంలో పురుషులకూ, మహిళలకు తేడా ఉందంటే మీరు నమ్ముతారా? మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల రుతుక్రమం కొనసాగినంతకాలం మహిళలకు ఒక సహజ రక్షణ ఉంటుంది. కానీ ఒకవేళ చికిత్స విషయానికి వస్తే... సామాజికంగా మహిళలకు అందాల్సిన చికిత్స విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. ఇదేదో వివక్ష ఎక్కువగా ఉండే మనలాంటి సంప్రదాయ దేశాల్లో మాత్రమే కాదు... బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకునే యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తేడా కొనసాగుతోంది. స్వీడన్, ఇంగ్లాండ్‌లో జరిగిన అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అధ్యయనం కొనసాగిన ఆ దేశాల్లోనూ, ఇక మనదేశంలోని మహిళా రోగుల స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పనిలో పనిగా కొన్ని నివారణ చర్యలూ, మరికొన్ని జాగ్రత్తలు కూడా. గుండెజబ్బు విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు... అవి ఎందుకు? భారతీయ స్త్రీ, పురుషుల్లో గుండెజబ్బుల విషయంలో కనిపించే తేడాలేమిటి? అవి ఎందుకు అనే అంశాన్ని పరిశీలిద్దాం. మహిళల్లో గుండెజబ్బుల అంశానికి వస్తే కనిపించే వ్యత్యాసాలు, అసమానతలకు కారణాలను ఐదు అంశాల్లో వివరించవచ్చు... అవి ... మొదటిగా స్త్రీల విషయంలో మెనొపాజ్ వరకు ఈస్టొజ్రెన్ వల్ల గుండె జబ్బుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో సుమారు యాభైయ్ యేళ్ళలో ఎక్కువ అయ్యే గుండె జబ్బు ఆడవాళ్ళలో అరవయ్ యేళ్ళకు ఎక్కువవుతుంది. ఒక వయసు వరకూ మహిళల్లో గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్ వచ్చినా లేదా పొగతాగే అలవాటు ఉన్నా మహిళలకు లభించే ఈ సహజ రక్షణ తొలగిపోతుంది. యాభై ఏళ్లలోపు వయసువారిలో మహిళలో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవ. కానీ యాభై–అరవైలలో ఈ అవకాశాలు ఇద్దరిలోనూ సమానం. అయితే అరవై ఏళ్లు దాటాక గుండెజబ్బులు మహిళల్లోనే ఎక్కువ. ఒకవేళ గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగిస్తే... వీళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఆ అంశాలనే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి... వయసు ∙ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ∙రక్తపోటు ∙మధుమేహం ∙రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ∙పొగతాగే అలవాటు ∙స్థూలకాయం ∙శారీరక శ్రమ/వ్యాయామం అంతగా లేకపోవడం ∙ఒత్తిడి. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే రుతుక్రమం ఆగిన తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు పదార్థాల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గడం వంటి అంశాలు కూడా గుండెజబ్బుల రిస్క్‌ను మరింత పెంచుతాయి. మహిళల్లో రుతుక్రమం ఆగాక రక్తపోటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే రుతుక్రమం ఆగిన మహిళలు తరచూ గుండెజబ్బుల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో సహజ రక్షణ కరవే... కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్ వల్ల సహజంగానే మహిళల దేహంలో ఉత్పత్తి కావడం వల్ల అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం ఒక విశేషం. నివారణ: ∙మహిళలు వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి ∙ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. ∙రక్తపోటు, డయాబెటిస్ కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ శ్రీదేవి, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ రెండవది, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా పురుషులతో పోలిస్తే... మహిళలలో అవి పది శాతం సన్నగా ఉంటాయి. ఈ అంశం కూడా రక్తనాళాల్లో పూడిక త్వరగా చేరేందుకు దోహదపడుతుంది. మూడవది, గుండె జబ్బు వచ్చినపుడు లక్షణాల బట్టి వైద్యులు తర్వాతి పరీక్షలూ, చికిత్సా చేబడుతారు. ఈ లక్షణాలు మహిళలలో విభిన్నంగా ఉండడమే కాకుండా, అందరు మహిళలలో ఒకే రకంగా ఉండవు. అందువలన మహిళలలో గుండె జబ్బు కనుక్కోవడం ఆలస్యం అవుతుంది. నాలుగవది, వైద్యులు కూడా స్త్రీల చికిత్స విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఐదవది, స్త్రీలలో చికిత్సకు సంబంధించిన కాంప్లికేషన్స్ అధికంగా ఉంటాయి. చివరిగా, పితృస్వామ్య సమాజంలో మహిళల యొక్క గుండె జబ్బులపై పెట్టే ఖర్చు మగవారి జబ్బుకి పెట్టే ఖర్చు కన్నా తక్కువగా ఉండటం ఒక సమస్య. దీనిని సమస్య అనడం కంటే సామాజిక వివక్ష అనడమే కరెక్ట్. స్త్రీ, పురుషుల మధ్య గుండె పోటు చికిత్సలో విభేదాలు భారతదేశంలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చేసిన అనేక పరిశోధనల బట్టి ఈ విషయం తేట తెల్లమవుతుంది. డీమాట్ రెజిస్ట్రీ...: డీమాట్ రెజిస్ట్రీ అనే పరిశొధనలో, ప్రఖ్యాత గుండె నిపుణులు శ్రీనాధ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని విపులీకరించడానికి ప్రయత్నించారు. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ చేసే సమయంలో పురుషులకన్నా స్త్రీలలో మందుల ప్రిస్కిప్ష్రన్ అసంపూర్తిగా ఉందని ఈ పరిశొధనలో తేలింది. అసలు పురుషులలో కూడా పాశ్చాత్య దేశలతో పొలిస్తే మందుల మోతాదు కరెక్ట్ గా లేదని అదే పరిశోధనలో బయటపడటం మరొక సంగతి. దక్షిణ భారత దేశంలోనూ ఈ లింగ భేదాలు ఖచ్చితంగా కనిపించాయి. అయితే కేరళలో మాత్రం ఈ వివక్ష కొంచెం తక్కువగా ఉందని అక్కడి పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ జాగ్రత్తలు : ∙మహిళల్లో రుతుక్రమం ఆగాక లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ గుండెజబ్బు లక్షణాలను పసిగడితే గుండెపోటును నివారించే అవకాశముంది ∙రిస్క్ ఫ్యాక్టర్లలో నివారించగలిగే అవకాశం ఉన్నవి అంటే... కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం వంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. -
స్టెంట్ల ధరలు ఆన్ లైన్ లో ఉంచండి
న్యూఢిల్లీ: హృద్రోగ చికిత్సకు ఉపయోగించే స్టెంట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్ పీపీఏ) చర్యలు ముమ్మరం చేసింది. ఈ పరికరాలపై ప్రజల నుంచి ఎంత మొత్తాలు వసూలు చేస్తున్నారో ఆ వివరాలను అన్ని ఆసుపత్రులు తమ వెబ్సైట్లలో ఉంచాలని ఆదేశించింది. స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులు, అమ్మకందారులు వాటి గరిష్ట చిల్లర ధరల వివరాలను తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలంది. ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు అన్నీ తమ వెబ్సైట్ హోంపేజీలో స్టెంట్ల గరిష్ట ధరలు, బ్రాండ్ పేరు, తయారీదారుని పేరు, మార్కెటింగ్ కంపెనీ పేరు తదితర వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్టెంట్ల తయారీదారులు, అమ్మకందారులు, దిగుమతిదారులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. -
ఆరోగ్యానికి సురక్షా కార్డు
ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ల కాలం అంతరించిపోయింది. చేయిలాగితే న్యూరాలజిస్టుకూ, ఛాతీ నొప్పెడితే కార్డియాలజిస్టుకూ చూపించుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్య చరిత్ర సమస్తమూ ఒక డాక్టర్ దగ్గర ఉండి... ఆ డాక్టర్ 24 గంటలూ మనకు అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో ఊహించండి. అలా ఫ్యామిలీ ఫిజీషియన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు ‘దేశీఎండీ’ అనే అంతర్జాతీయ సంస్థకు చెందిన ఔత్సాహికులైన ముగ్గురు డాక్టర్లు. కార్డియాలజిస్టు అయిన డాక్టర్ అజయ్ త్రిపురనేని సీఈవోగా, ఆంకాలజిస్టు డాక్టర్ రాకేశ్ సూరపనేని సీవోవోగా, జనరల్ ఫిజీషియన్ అయిన సతీశ్ పోట్లూరి సీఎమ్వోగా వ్యవహరిస్తూ నెలకొల్పిన ఈ సంస్థ ఆన్లైన్లో... ఆ మాటకొస్తే ఫోన్‌లైన్‌లోనే ఒక ఫ్యామిలీ ఫిజీషియన్ భూమికను పోషిస్తుంటుంది. డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారూ లేదా ఆరోగ్యవంతులైనా సరే ముందుగా ‘దేశీఎండీ’ సంస్థనుంచి ఒక ‘సురక్షా కార్డు’ తీసుకోవాలి. ఇందుకు రోగి చెల్లించాల్సిన మొత్తం ఏడాదికి రూ. 1250. ఇక ఆ తర్వాత ఈ కార్డు హోల్డరు ఏడాదిపాటు రోజులోని ఏ సమయంలోనైనా, ప్రయాణం చేస్తున్నా తన ఆరోగ్యం గురించి ఏ అనుమానం వచ్చినా సరే... ఫోన్లోనే డాక్టరును సంప్రదించవచ్చు. సమస్య చిన్నదైతే డాక్టర్ ఫోన్లోనే మందులు సూచిస్తారు. పెద్దదైతే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లమని సూచిస్తారు. ఒకవేళ ఏవైనా పరీక్షలు అవసరమైతే వాటిని చేయిస్తారు. ఆ పరీక్షలు రిపోర్టులను ‘దేశీఎండీ’ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఒకవేళ రోగికే ఫలానా డాక్టర్ మీద గురి, నమ్మకం ఉండి అక్కడికే వెళ్తానన్నా సరే... తమ వద్ద ఉన్న డేటాబేస్‌లోని రోగి వివరాలన్నింటినీ రోగి కోరిన డాక్టర్‌కు అందజేస్తారు. ఉదాహరణకు రోగి ప్రయాణంలో ఉండి... వేరే ఊళ్లో ఉన్నాడనుకుందాం. ఆ సమయంలో అతడికి ఏదో సమస్య వచ్చింది. సదరు రోగి వెంటనే ‘దేశీఎండీ’కి ఫోన్ చేసి, తన సమస్య వివరిస్తే... రోగి ఆ సమయానికి ఉన్న ఊళ్లో ఉన్న ఆసుపత్రుల వివరాల ఆధారంగా అతడికి సరైన చికిత్స దొరికే ఆసుపత్రిని సూచిస్తారు. ఇలా రోగి డాక్టర్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. చిన్న సమస్యకైతే ఉన్న చోటి నుంచి కదలాల్సిన అవసరం లేదు. ఏడాది పాటు రోగి ఎప్పుడు కోరితే అప్పుడు తన ఆరోగ్య వివరాలను ఫోన్ ఫిజీషియన్‌తో సంప్రదించవచ్చు. ఒక డాక్టర్‌ను సంప్రదించాక రోగి సెకండ్ ఓపీనియన్ కోసం ఎవరినైనా కలవాలనుకుంటే వారిని సూచిస్తారు. ఒకవేళ రోగే ప్రత్యేకంగా ఫలానా డాక్టర్‌ను కలవాలని కోరుకున్నా వారికే తమ వద్ద ఉన్న రోగి ‘ఆరోగ్య చరిత్ర’ను ఫోన్ ఫిజీషియన్ వివరిస్తారు. మరి డాక్టర్ల వైపు నుంచో... దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు ఈ సురక్షాకార్డు తీసుకుంటే... అక్కడి డాక్టర్లు నెలకొకసారి రోగి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. రోగులు తాము క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలనూ, ఫాలో అప్ను మరచిపోతుంటారు కదా... అలాంటి వారిని ఆసుపత్రికి వెళ్లమని హెచ్చరిస్తుంటారు. వెళ్లే ముందు చేయించాల్సిన పరీక్షలను సూచిస్తుంటారు. వెళ్లి వచ్చాక ఆ రిపోర్టులను దాచి ఉంచడం కోసం పంపమని కోరుతుంటాడు. ఇవీ సురక్షాకార్డుతో కలిగే కొన్ని ఉపయోగాలు. మరింతగా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040-42428282. అలాగే వెబ్సైట్ అడ్రస్ : www.desimd.com -
తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం
లండన్: ప్రసిద్ధ కార్డియాలజిస్టు, తెలుగు వ్యక్తి, పద్మ భూషణ్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డికి బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండవ కుమార్తె ప్రిన్సెస్ ఏన్ చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. ప్రజారోగ్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ‘డాక్టర్ ఆఫ్ సైన్స్(మెడిసిన్)’ గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. యూనివర్సిటీ చాన్స్‌లర్ అయిన ప్రిన్సెస్ ఏన్ బుధవారం ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనాథ్‌రెడ్డికి డిగ్రీని ప్రదానం చేసి సత్కరించారు. శ్రీనాథ్‌రెడ్డి 2006 నుంచి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
డాపౌట్ నుంచి.. ‘డాక్టర్’ దాకా
ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక అడ్డంకి * కార్డియాలజిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నిరుపేద విద్యార్థిని * చేయూతనందించాలని వేడుకోలు కూలి పనులకు వెళితే గానీ పూట గడవని నిరుపేద కుటుంబం ఆ విద్యార్థినిది. అందుకేనేమో తనకు తొమ్మిదేళ్లు వచ్చేంత వరకూ బడిబాట ఎరుగదు. అనంతరం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్) సహకారంతో ఓనమాలు నేర్చింది. ఇలా గురుకులంలో ప్రవేశం పొంది టెన్త్, ఇంటర్ పట్టుదలతో చదివి ప్రతిభ నిరూపించుకున్న మునగాల మండలం తాడువాయికి చెందిన మాతంగి రజిత ఈ ఏడాది ఎంసెట్ రాసి నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె ప్రస్తుతం తన చదువును కొనసాగించేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. పేదప్రజలకు సేవచేస్తా.. పేద కుటుంబంలో పుట్టిన తాను భవిష్యత్‌లో కార్డియాలజిస్ట్‌ను అయ్యి గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తా. నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను ఆదుకుని ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్నై సేవచేస్తా. - రజిత, ఎంబీబీఎస్ విద్యార్థిని తాడువాయి (మునగాల) : మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి పెద్దులు-అక్కమ్మ దంపతులది నిరుపేద దళిత కుటుంబం. రెక్కాడితే పూట గడవని పరిస్థితి. అయితే పదేళ్ల క్రితం పెద్దులు కాలికి గాయమై కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించుకునే ఆర్థికస్తోమత లేక ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఇంటివద్దనే ఉంటున్నాడు. వీరికి నలుగురు సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వీరిలో పెద్దకుమారుడు వెంకన్న, పెద్ద కుమార్తె నాగమణికి వివాహాలు అయ్యాయి. రెండో కుమారుడు రమేష్ ప్రస్తుతం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని డీవీఆర్ కళాశాలలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో కుమార్తె రజిత తొమ్మిదేళ్ల వయస్సు వచ్చే వరకు పాఠశాల అంటే ఎరుగదు. ఈ క్రమంలో 2005లో ఎంవీ ఫౌండేషన్ సభ్యులు గ్రామంలో డ్రాపౌట్ పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా రజితను గుర్తించారు. వెంటనే ఆమె తల్లిదండ్రులను ఒప్పించి సంవత్సరం పాటు తమ ఆధీనంలో ఉంచుకుని ఓనమాలు నేర్పించారు. గురుకులంలో ప్రవేశం పొంది.. ఎంవీఎఫ్ వలంటీర్లు 2006లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు రజితను సన్నద్ధం చేశారు. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణురాలైన రజిత తుంగతుర్తిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. అక్కడే పదో తరగతి వరకు చదివింది. 2011లో పదో తరగతిలో రజిత 554 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిల్చింది. ఆ విద్యార్థిని తెలివితేటలు, ప్రతిభను గుర్తించిన చిలుకూరు మండలంలోని కవిత జూనియర్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఉచితంగా ఇంటర్ విద్యనందించింది. ఈ క్రమంలో 2013లో ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 967మార్కులు సాధించి కోదాడ టౌన్ టాపర్‌గా నిల్చింది. సోదరుడు రమేష్ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఎంసెట్ రాసిన రజిత జనరల్ కేటగిరిలో 6,622, ఎస్సీ కోటాలో 106ర్యాంక్ సాధించింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఐదేళ్ల పాటు కొనసాగించాల్సిన వైద్యవిద్యలో ప్రతియేటా రూ.50నుంచి రూ.లక్ష వరకు వ్యయం కానున్నట్లు రజిత సోదరుడు రమేష్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. తన సోదరి డాక్టరు కావాలంటే దయా హృదయం గల దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీసీ పూర్తి చేయనుందని వేడుకుంటున్నాడు. తమ సోదరి చదువు కోసం ఆర్థికసాయం చేయదల్చుకున్న వారు సెల్ : 87902 53550, 9573962957 నంబర్లలో సంప్రదించాలని, అలాగే మునగాల ఎస్బీహెచ్ బ్రాంచి ఖాతా నంబర్లో 62364215604లో అమౌంట్‌ను జమచేయవచ్చని కోరుతున్నాడు. -
హార్ట్ ఎగ్జామినేషన్స్ గుండెపోటును గుర్తించే పరీక్షలు
హార్ట్ ఎటాక్ అంటే ప్రతివారికీ భయమే. ఎందుకంటే అది వచ్చిందని తెలిసేలోపే కొందరిలో మరణం సంభవించవచ్చు. ఇటీవల వైద్య పరీక్షలు చాలా ఖరీదైన నేపథ్యంలో డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే చాలామందిలో భయం. కానీ మీకో విషయం తెలుసా? చాలా చవగ్గా చేయించే ఈసీజీ పరీక్ష ద్వారా గతంలో మీకు హార్ట్ ఎటాక్ వచ్చిందా అన్న విషయం కూడా దాదాపు 80 శాతం నుంచి 90 శాతం తెలిసిపోతుంది. అందుకే తమకు హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అని అనుమానించే వారు... చాలా చవగ్గా లభ్యమయ్యే ఈసీజీ తీయించుకుంటే చాలా తమకు వచ్చిన ఛాతీనొప్పి గుండెపోటా, కాదా అన్న నిర్ధారణ క్షణాల్లో జరిగిపోతుంది. ఈసీజీతో పాటు... గుండెకు సంబంధించిన మరికొన్ని పరీక్షల వివరాలూ, ఏ రకమైన గుండెపరీక్ష ఎందుకు అన్న అవగాహన కోసం ఈ కథనం. గుండెజబ్బుకు ప్రధాన లక్షణం గుండెనొప్పి లేదా ఛాతీలో నొప్పి. కానీ... ఈరోజుల్లో చాలా మందిలో షుగర్ సమస్య ఉండనే ఉంది. షుగర్ వచ్చిన వారిలో నొప్పి తెలిసే అవకాశాలు తెలియదు కాబట్టి కొందరిలో గుండెపోటు వచ్చిన విషయమే తెలియదు. ఇక మరికొందరిలో తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చిన ఛాతీలో మంటనూ గుండెనొప్పి కావచ్చని అపోహ పడుతుంటారు. అందుకే గుండెపోటును అనుమానించే సమయంలో మరికొన్ని లక్షణాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ లక్షణాలివే... ఆయాసం చెమటలు పట్టడం కళ్లు తిరగడం నడక తర్వాత లేక వ్యాయామం తర్వాత ఇబ్బంది ఎక్కువ కావడం. వీటితో పాటు పొట్ట ఉబ్బరంగా ఉండటం, తేన్పులు ఎక్కువగా రావడం, వాంతులు కావడం కూడా గుండెజబ్బు లక్షణాలుగా పరిగణించాలి. అప్పుడు మనకు మరో సందేహం వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆరోగ్యవంతుల్లోనూ రోజూ కనిపించేవే. మరి అలాంటిప్పుడు రోగికి ఉన్నది గుండెజబ్బు కావచ్చేమో అని గుర్తించడం ఎలా? అప్పుడు రోగికి ఉన్న హైబీపీ, మధుమేహం, పొగతాగే అలవాటు, కుటుంబంలో ఎవరికైనా చిన్నప్పుడే గుండెజబ్బు రావడం, స్థ్థూలకాయం వంటి రిస్క్ ఫాక్టర్లను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉండి, గుండెపోటు తాలూకు పై లక్షణాలు కూడా కనిపించినప్పుడు ఈసీజీ తీయించుకుంటే వచ్చింది గుండెజబ్బా, కాదా అన్న విషయం చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. అందుకే గుండెజబ్బుల విషయంలో నిర్ధారణకు ముందుగా ఆధారపడేది ఈసీజీ మీదనే. అయితే కేవలం ఈసీజీ వల్లనే గుండెకు సంబంధించిన అన్ని వివరాలూ తెలియవు. అందుకే ఈసీజీతో పాటు ఇతర గుండెపరీక్షలు కూడా ఎందుకు చేస్తారో తెలుసుకుంటే వాటి పట్ల మనకు కాస్త అవగాహన కలుగుతుంది. ఈసీజీ ఎందుకు? : గుండెపోటు వచ్చిన 80, 90 శాతం కేసుల్లో ఈసీజీతో అది నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటునూ గుర్తించవచ్చు. అయితేగుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా ఒక్కోసారి గుండెపోటు వల్ల కలిగే మార్పులన్నీ ఈ పరీక్షలో వెంటనే నమోదు కాకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. ఎకో పరీక్ష : ఎకో పరీక్ష అన్నది గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలుపుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో పరీక్షపైనా ఆధారపడవచ్చు. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా ఎకో పరీక్ష నిర్వహించడంలో తర్ఫీదుపొందిన నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులు మాత్రమే నిర్వహించాలి. యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష వాటిని సమకూరుస్తుంది. దాంతోపాటు గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కూడా ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తాయి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు : గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ల పాళ్లు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే... అది ఎంత చిన్నది అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండెపోటే అన్న విషయం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. - నిర్వహణ: యాసీన్ డాక్టర్ సి.రఘు కార్డియాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్. గుండెపోటును తొలిదశలోనే కనుగొనడం ఎలా..? మనం పైన పేర్కొన్న పరీక్షల్లో యాంజియోగ్రామ్, ఎకో పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాదు... అవి అందరికీ అంత సులువుగా అందుబాటులో లేనివి. అందుకే ఒక వ్యక్తి ఛాతీలో నొప్పి అనో లేదా గుండెనొప్పి వచ్చిందనో నిర్ధారణ చేయాలంటే మొదుగా ట్రోపోనిన్ పరీక్ష చాలా ముఖ్యం. రక్తంలో వాటి మోతాదు పెరగడంతో పాటు ఛాతీనొప్పి ఉండి, ఈసీజీలో మార్పులు ఉంటే అది కచ్చితంగా గుండెపోటే. కాబట్టే గుండెపోటును ప్రాథమికంగా తెలుసుకోవడం కోసం మనం ఎక్కువగా ఈసీజీపై ఆధారపడుతున్నాం. ఆ తర్వాత దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేయడం కోసం ట్రోపోనిన్ పరీక్షలను ఆశ్రయిస్తున్నాం.