
గుంటూరు: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. నాగరాజు సూచించారు. గుంటూరువారి తోట గౌడీయ మఠం పక్కనున్న అమ్మాజీ– పావని మెమోరియల్ హాస్పిటల్‌లో సోమవారం ఉచిత గుండెజబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గుండెజబ్బులకు కారణమయ్యే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల పెరుగుతున్న గుండెజబ్బులపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాలను తొలగించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment