తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం
లండన్: ప్రసిద్ధ కార్డియాలజిస్టు, తెలుగు వ్యక్తి, పద్మ భూషణ్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డికి బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండవ కుమార్తె ప్రిన్సెస్ ఏన్ చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. ప్రజారోగ్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ‘డాక్టర్ ఆఫ్ సైన్స్(మెడిసిన్)’ గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. యూనివర్సిటీ చాన్స్‌లర్ అయిన ప్రిన్సెస్ ఏన్ బుధవారం ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనాథ్‌రెడ్డికి డిగ్రీని ప్రదానం చేసి సత్కరించారు. శ్రీనాథ్‌రెడ్డి 2006 నుంచి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.