పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి | Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling | Sakshi
Sakshi News home page

పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి

Published Thu, Sep 23 2021 5:06 PM | Last Updated on Thu, Sep 23 2021 5:06 PM

Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling - Sakshi

Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన శరద్‌ కుమార్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్‌ కుమార్‌ స్వయంగా మీడియాకు వెల్లడించాడు.

కాగా, పారాలింపిక్స్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్‌ కుమార్‌ పేరును ఈ ఏడాది మేజర్‌ ధాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్‌ పతక విజేతలు ప్రమోద్‌ భగత్‌(బ్యాడ్మింటన్‌), మనీశ్‌ నర్వాల్‌(షూటింగ్‌), సుందర్‌ సింగ్‌ గుర్జార్‌(జావెలిన్‌ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్‌రత్న అవార్డులకు రెకమెండ్‌ చేసింది.
చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement