bronze medallist
-
‘ప్రతిసారీ మెడల్స్ అవసరమా?’.. మనూ స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై భారత షూటర్, ఒలింపిక్ పతకాల విజేత మనూ భాకర్ స్పందించింది. తాను హాజరవుతున్న ప్రతీ ఈవెంట్‌కు మెడల్స్ తీసుకువెళ్లడానికి గల కారణాన్ని వెల్లడించింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఈ హర్యానా షూటర్ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో.. అదే విధంగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా ఆధునిక ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ హర్యానా షూటర్‌పై ప్రశంసల వర్షం కురిసింది.ఘన స్వాగతంతో పాటు సత్కారాలుస్వదేశంలో అడుగుపెట్టగానే మనూకు ఘన స్వాగతంతో పాటు సత్కారాలు లభించాయి. ఆ తర్వాత దేశంలోని రాజకీయ, క్రీడా ప్రముఖులను కలిసిన మనూ తన మెడల్స్‌ను వారికి చూపించి మురిసిపోయింది. ఇక దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రమంలో చాలా మంది తమ ఈవెంట్లకు మనూ భాకర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా?ఆ సమయంలోనూ ఈ యువ షూటర్ తన పతకాలను అక్కడ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మనూ భాకర్‌పై ట్రోల్స్ చేశారు. ‘‘కాంస్యం గెలిస్తేనే ఇంతలా హంగామా చేస్తున్నారు. మరి స్వర్ణం గెలిచి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో! అయినా ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా? పారాలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన వాళ్లకు ఏమాత్రం గుర్తింపు లేదు. మనూకు మాత్రం ఫుల్‌క్రేజ్’’ అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయంపై మనూ భాకర్ స్పందించింది. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు‘‘అవును.. నేను ప్రతి చోటకూ మెడల్స్ తీసుకువెళ్తా. అయినా.. తీసుకువెళ్లకూడదని చెప్పేందుకు కారణాలేమైనా ఉన్నాయా?.. నిజానికి నన్ను ఈవెంట్స్‌కు ఆహ్వానించే ప్రతి ఒక్కరు పతకాలు తీసుకురావాలని కోరుతున్నారు.ఒలింపిక్స్ మెడల్స్‌ను ప్రతక్ష్యంగా చూడాలని ఆరాటపడుతున్నారు. ఆర్గనైజర్ల అభ్యర్థన మేరకే నేను మెడల్స్ వెంట తీసుకువెళ్తున్నా. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు’’ అని 22 ఏళ్ల మనూ భాకర్ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.చదవండి: అందరూ మహిళలే... -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కాగా, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్ కుమార్ పేరును ఈ ఏడాది మేజర్ ధాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్(షూటింగ్), సుందర్ సింగ్ గుర్జార్(జావెలిన్ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్‌రత్న అవార్డులకు రెకమెండ్ చేసింది. చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..! -
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !
⇒ ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది. తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది.