సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై భారత షూటర్, ఒలింపిక్ పతకాల విజేత మనూ భాకర్ స్పందించింది. తాను హాజరవుతున్న ప్రతీ ఈవెంట్‌కు మెడల్స్ తీసుకువెళ్లడానికి గల కారణాన్ని వెల్లడించింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఈ హర్యానా షూటర్ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో.. అదే విధంగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా ఆధునిక ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ హర్యానా షూటర్‌పై ప్రశంసల వర్షం కురిసింది.
ఘన స్వాగతంతో పాటు సత్కారాలు
స్వదేశంలో అడుగుపెట్టగానే మనూకు ఘన స్వాగతంతో పాటు సత్కారాలు లభించాయి. ఆ తర్వాత దేశంలోని రాజకీయ, క్రీడా ప్రముఖులను కలిసిన మనూ తన మెడల్స్‌ను వారికి చూపించి మురిసిపోయింది. ఇక దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రమంలో చాలా మంది తమ ఈవెంట్లకు మనూ భాకర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా?
ఆ సమయంలోనూ ఈ యువ షూటర్ తన పతకాలను అక్కడ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మనూ భాకర్‌పై ట్రోల్స్ చేశారు. ‘‘కాంస్యం గెలిస్తేనే ఇంతలా హంగామా చేస్తున్నారు. మరి స్వర్ణం గెలిచి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో!
అయినా ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా? పారాలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన వాళ్లకు ఏమాత్రం గుర్తింపు లేదు. మనూకు మాత్రం ఫుల్‌క్రేజ్’’ అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయంపై మనూ భాకర్ స్పందించింది.
ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు
‘‘అవును.. నేను ప్రతి చోటకూ మెడల్స్ తీసుకువెళ్తా. అయినా.. తీసుకువెళ్లకూడదని చెప్పేందుకు కారణాలేమైనా ఉన్నాయా?.. నిజానికి నన్ను ఈవెంట్స్‌కు ఆహ్వానించే ప్రతి ఒక్కరు పతకాలు తీసుకురావాలని కోరుతున్నారు.
ఒలింపిక్స్ మెడల్స్‌ను ప్రతక్ష్యంగా చూడాలని ఆరాటపడుతున్నారు. ఆర్గనైజర్ల అభ్యర్థన మేరకే నేను మెడల్స్ వెంట తీసుకువెళ్తున్నా. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు’’ అని 22 ఏళ్ల మనూ భాకర్ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.
చదవండి: అందరూ మహిళలే...
Comments
Please login to add a commentAdd a comment