Sharad Kumar
-
BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా NIA మాజీ హెడ్
BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.ఎన్ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవంఉత్తరప్రదేశ్కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.కేకే మిశ్రా ఏడాది పాటేఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
సౌకర్యాలు మెరుగు పరచండి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పరచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) శరద్‌కుమార్ శ్రీవాస్తవకు పలువురు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో డివిజనల్ కమిటీ సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ కమిటీకి చైర్మన్‌గా బ్రహ్మపూర్‌కు చెందిన చంద్రశేఖర్ సాహూ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగు, పలు హాల్ట్‌లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపుదల, గమ్య స్థానాల పొడిగింపు వంటి వాటిపై వినతి పత్రాలు అందజేశారు. డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జీఎం, వాల్తేర్ డీఆర్ఎంలను అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), భీశెట్టి సత్యవతి(అనకాపల్లి), గొడ్డేటి మాధవి(అరకు),బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), కె.రామ్మోహననాయుడు(శ్రీకాకుళం), రమేష్‌చంద్ర(నవరంగ్‌పూర్), సప్తగిరి శంకర్ ఉలకా(కోరాపుట్), దీపక్బాజీ(బస్తర్ ఎంపీ ప్రతినిధి) హాజరయ్యారు. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి, ఏడీఆర్‌ఎంలు సుధీర్కుమార్గుప్తా(ఇన్ఫ్రా), మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్) పాల్గొన్నారు. -
పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కాగా, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్ కుమార్ పేరును ఈ ఏడాది మేజర్ ధాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్(షూటింగ్), సుందర్ సింగ్ గుర్జార్(జావెలిన్ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్‌రత్న అవార్డులకు రెకమెండ్ చేసింది. చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..! -
Tokyo Paralympics: ‘హై’ పైకి...
దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్‌రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్ మనీశ్ నర్వాల్ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచింది. సొంతంగా రేంజ్ ఏర్పాటు చేసుకొని... హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్‌వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్ చేసిన సింగ్‌రాజ్ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్‌గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన సింగ్‌రాజ్ కోవిడ్–19 సమయంలో షూటింగ్ రేంజ్‌లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్‌రాజ్ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మళ్లీ మెరిసిన తంగవేలు... 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాడు. కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు. నాన్న సలహాతో... టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్ ఈవెంట్ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్లో పాల్గొని శరద్ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్లో నాన్నకు వివరించాను. ఈవెంట్లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్ వివరించాడు. -
ఎన్ఐఏ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీకాలాన్ని అనూహ్యంగా వరుసగా రెండోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. హర్యానాకు చెందిన శరద్ కుమార్ 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2013, జూలై 30న ఆయన ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. -
'దక్షిణాది రాష్ట్రాల యువతపై ఐఎస్ ప్రభావం'
లక్నో: ఇస్లామిక్ ఉగ్రవాదుల భావజాల వ్యాప్తి భారత్‌కు ప్రధాన ముప్పుగా పరిణమిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ శరద్ కుమార్ తెలిపారు. ఐఎస్ ప్రభావం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల యువతపై ఎక్కవగా ఉందన్నారు. లక్నోలో ఎన్ఐఏ నూతన భవనం శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలలో ఉగ్రవాద భావజాలం చాలా తక్కువగా ఉందన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం భారత్‌లో ఇంకా వేళ్లూనుకోలేదని తెలిపారు. అయితే ఇంటర్నెట్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని తెలిపారు. దీనికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో నకిలీ కరెన్సీ దేశానికి పెద్ద సమస్యగా మారిందని శరద్ కుమార్ తెలిపారు. దేశంలో సుమారు 25 వేల కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ చెలామణిలో ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా నకిలీ కరెన్సీకి హబ్‌గా మారిందని తెలిపారు. -
బురద్వాన్ పేలుడుపై ఎన్ఐఏ చీఫ్ పర్యవేక్షణ
కోల్‌కతా : బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం బురద్వాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శరద్ కుమార్ ... పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకరుగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అక్టోబర్ 13న అరెస్టు చేశారు. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
ఇంచియాన్: ఆసియా పారా గేమ్స్‌లో రెండో రోజు భారత్ రెండు స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం ఆరు పతకాలను సాధించింది. క్లబ్ త్రోలో అమిత్ కుమార్... హైజంప్‌లో శరద్ కుమార్ పసిడి పతకాలు గెల్చుకున్నారు. 2012 లండన్ పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన హైజంపర్ హెచ్ఎన్ గిరీష ఇంచియాన్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 2013 ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జజారియా ఈ క్రీడల్లో రజతం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో అంకుర్ ధమా, స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో శరత్ మహదేవరావు గైక్వాడ్ కాంస్య పతకాలు నెగ్గారు. ఓవరాల్‌గా భారత్ రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉంది. -
'మహాబోధి' పేలుళ్ల కేసును వేగవంతం చేయండి
బుద్ద గయలోని మహాబోధి దేవాలయంలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై చేపట్టిన విచారణ మరింత వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్ శరత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, బీహార్ రాష్ట్ర పోలీసులతో ఆయన బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై శరత్‌కుమార్ ఆయా అధికారులతో చర్చించారు. అలాగే ఆ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఎన్ఐఏ, బీహార్ పోలీసు ఉన్నతాధికారులు శరత్‌కుమార్‌కు ఈ సందర్బంగా వివరించారు. బీహార్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం బుద్ద గయలోని మహాబోధి దేవాలయం దేవాలయంలో పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన యాసిన్ భత్కల్‌కు ఈ పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని శరత్ కుమార్ అనుమానించారు. అలాగే మావోయిస్టులు చర్య కావచ్చని దీన్ని తోసిపుచ్చుడానికి వీలు లేదన్నారు. జులై 7న మహాబోది దేవాలయంలో వరుసగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బౌద్ధ బిక్షువులు గాయపడిన సంగతి తెలిసిందే.