బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కోల్కతా : బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం బురద్వాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శరద్ కుమార్ ... పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకరుగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అక్టోబర్ 13న అరెస్టు చేశారు.