Burdwan blast
-
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురి అరెస్ట్
న్యూఢిల్లీ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది. కాగా పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో గత ఏడాది అక్టోబర్ రెండో తేది బాంబు పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్
హైదరాబాద్ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఉగ్రవాది ఖలీద్‌ను ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు ఖలీద్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్ధాలతో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మయన్మార్ కు చెందిన ఖలీద్ హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ అయిన సాజిద్‌పై నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రూ. పది లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో.. అక్టోబర్ రెండో తేదీన పేలుడు సంభవించి షకీల్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి సోవన్ మండల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరికీ జెఎంబి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బురద్వాన్ పేలుడుపై ఎన్ఐఏ చీఫ్ పర్యవేక్షణ
కోల్‌కతా : బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం బురద్వాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శరద్ కుమార్ ... పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకరుగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అక్టోబర్ 13న అరెస్టు చేశారు.