బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య జరిగిన గోవాలోని సర్వీస్ అపార్టుమెంట్ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్‌ను అధిక డోస్‌తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు.
సుచనా సేథ్ గోవాలో ఉన్న సర్వీస్ అపార్టుమెంట్‌లో రెండు సిరప్ బాటిల్స్ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్‌తో కూడిన సిరప్‌ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్ కొనుగోలు చేయాలని సర్వీస్ అపార్టుమెంట్ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్ బాటిల్‌ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అన్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు.
ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment