SUCHANA SETH
-
కుమారుని మృతదేహం పక్కన లేఖ.. వెలుగులోకి కీలక విషయాలు
భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
భర్త ఆదాయం కోటి.. భార్యకు భరణంగా రూ.2.5 లక్షలు
బళ్లారి: నాలుగేళ్ల కుమారున్ని హత్య చేసిన ఏఐ స్టార్టప్ సీఈఓ సూచన సేథ్.. తన భర్త పీఆర్ వెంకట రామన్‌పై గత ఆగష్టులో గృహ హింస కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కుమారున్ని, తనను భర్త వెంకట రామన్ వేధించాడని ఆరోపించింది. దీంతో సేథ్ ఇంటికి రాకుండా వెంకట రామన్ నిషేధాజ్ఞలు కూడా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తన భర్త ఏడాదికి రూ.కోటి సంపాదిస్తాడని వెల్లడించిన సేథ్.. తనకు నెలకు రూ.2.5 భరణాన్ని ఇవ్వాల్సిందిగా కోరినట్లు పోలీసులకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బహిర్గతపరిచింది. వాట్సాప్ మెసేజ్‌లు, మెడికల్ రిపోర్టులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లను వెల్లడించింది. ఇండోనేషియాలో ఉన్న భర్త వెంకటరామన్.. గృహహింస వేధింపులను ఖండించాడు. నిషేధాజ్ఞల కారణంగా తన భార్య ఇంటికి వెళ్లడం మానేశానని ఆయన తెలిపారు. సోషల్ మీడియా, ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా తన భార్యకు దూరంగా ఉన్నట్లు పేర్కొంది. చివరికి తన కుమారునికి కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే.. చివరికి తన పిల్లాడిని కలుసుకునే హక్కును భర్త వెంకట రామన్ పొందాడు. ఇదే కుమారుని హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: దగ్గు మందుతో చంపేసిందా? -
బిడ్డను కడతేర్చిన తల్లి... వెలుగులోకి మరిన్ని వివరాలు!
బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య జరిగిన గోవాలోని సర్వీస్ అపార్టుమెంట్ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్‌ను అధిక డోస్‌తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు. సుచనా సేథ్ గోవాలో ఉన్న సర్వీస్ అపార్టుమెంట్లో రెండు సిరప్ బాటిల్స్ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్‌తో కూడిన సిరప్‌ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్ కొనుగోలు చేయాలని సర్వీస్ అపార్టుమెంట్ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్ బాటిల్‌ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అన్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు. ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి -
మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి
సాక్షి బళ్లారి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన కన్నతల్లి ఘాతుకం ఇది. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. సోమవారం రాత్రి చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. మంగళవారం గోవాకు తరలించి, న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితురాలు సుచనా సేథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఆరు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె దురాగతానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త నుంచి విడిపోయి.. 39 ఏళ్ల సుచనా సేథ్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. 2021లో ‘టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్’గా గుర్తింపు పొందింది. ఈ నెల 6న తన కుమారుడితో కలిసి ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో సర్విసు అపార్టుమెంట్లో అద్దెకు దిగింది. రెండు రోజులపాటు అక్కడే గడిపింది. ఓ పని కోసం తాను బెంగళూరు వెళ్లాల్సి ఉందని, ట్యాక్సీ ఏర్పాటు చేయాలని ఈ నెల 8న అపార్ట్ట్‌మెంట్ సిబ్బందిని కోరింది. ట్యాక్సీని అద్దెకు తీసుకోవడం కంటే విమానంలో వెళ్లడమే చౌక అని వారు సూచించగా, అందుకు నిరాకరించింది. ట్యాక్సీ కావాలని పట్టుబట్టడంతో వారు ఆ మేరకు వాహనం ఏర్పాటు చేశారు. 8వ తేదీన తెల్లవారు జామునే ట్యాక్సీలో బెంగళూరుకు పెద్ద బ్యాగుతో బయలుదేరింది. అపార్ట్ట్మెంట్లో ఆమె గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బందికి అక్కడ టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. అంతేకాకుండా అపార్ట్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆమె వెంట కొడుకు లేడని గుర్తించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి, సుచనా సేథ్తో ఫోన్లో మాట్లాడారు. ఆ రక్తపు మరకలు తన పీరియడ్స్‌కు సంబంధించినవని, తన బిడ్డ ఉత్తర గోవాలోని మార్గావ్లో తన స్నేహితురాలి వద్ద ఉన్నాడని బదులిచ్చింది. అంతేకాకుండా సదరు మిత్రురాలి చిరునామా కూడా చెప్పింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా, అది నకిలీ చిరునామా అని తేలింది. దాంతో ట్యాక్సీ డ్రైవర్‌ను ఫోన్లో సంప్రదించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్నట్లు అతడు చెప్పగా, స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్దనున్న బ్యాగ్‌ను తెరిచి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. గోవా పోలీసులు చిత్రదుర్గ చేరుకొని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. గోవాకు తరలించి, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 201(సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం)తోపాటు గోవా చిల్డ్రన్స్ చట్టం కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. భర్త నుంచి విడిపోయానని, విడాకుల కోసం ప్రయతి్నస్తున్నానని నిందితురాలు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నాడు. భార్య చేతిలో కుమారుడి మరణం గురించి అతడికి పోలీసులు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్!
బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలందించే ఓ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ దారుణానికి ఒడిగట్టారు. తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలోని ఓ అపార్ట్మెంట్లో దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్ బాడీని సూట్‌కేసులో కుక్కి గోవా నుంచి కర్ణాటకకు తరలించారు. అయితే ఈ దారుణానికి తన భర్తతో తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన సుచనా సేథ్ టెక్నాలజీలో అపరమేధావిగా ప్రశంసలందుకున్నారు. 2021 టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఎథిక్స్‌లో ఒకరుగా నిలిచారు. ఎవరి సుచనా సేథ్ ఎవరు? ►సుచనా సేథ్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. గత 4ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా ఆడ్వాన్స్‌మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తూ వచ్చారు. ►అమెరికాలోని మాసెచూసెట్స్ రాష్ట్రం బోస్టన్ నగరంలో సైబర్‌స్పేస్ అధ్యయనం చేసే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధనా కేంద్రం బెర్క్‌మన్ క్లైన్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రెస్పాన్సిబుల్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో రెండు సంవత్సరాల పాటు పనిచేశారు. ►ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌ని స్థాపించడానికి ముందు సేథ్ బెంగళూరులోని బూమరాంగ్ కామర్స్‌లో సీనియర్ డేటా సైంటిస్ట్. ఆమె కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ఇంటెలిజెన్స్ డేటా ఆధారిత ఉత్పత్తులను డిజైన్ చేసేది. ►సేథ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆస్ట్రోఫిజిక్స్‌తో ప్లాస్మా ఫిజిక్స్‌లో స్పెషలైజింగ్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 2008లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ సాధించారు. ఆమె రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో ఫిజిక్స్ (ఆనర్స్)లో బ్యాచిలర్ డిగ్రీని చదివారు. కసాయిగా మారిన కన్నతల్లి.. నాలుగేళ్ల కొడుకునెందుకు చంపింది?