బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలందించే ఓ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ దారుణానికి ఒడిగట్టారు. తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్ బాడీని సూట్‌కేసులో కుక్కి గోవా నుంచి కర్ణాటకకు తరలించారు. అయితే ఈ దారుణానికి తన భర్తతో తలెత్తిన విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన సుచనా సేథ్ టెక్నాలజీలో అపరమేధావిగా ప్రశంసలందుకున్నారు. 2021 టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఎథిక్స్‌లో ఒకరుగా నిలిచారు.
ఎవరి సుచనా సేథ్ ఎవరు?
►సుచనా సేథ్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. గత 4ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా ఆడ్వాన్స్‌మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తూ వచ్చారు.
►అమెరికాలోని మాసెచూసెట్స్ రాష్ట్రం బోస్టన్ నగరంలో సైబర్‌స్పేస్ అధ్యయనం చేసే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధనా కేంద్రం బెర్క్‌మన్ క్లైన్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రెస్పాన్సిబుల్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో రెండు సంవత్సరాల పాటు పనిచేశారు.
►ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌ని స్థాపించడానికి ముందు సేథ్ బెంగళూరులోని బూమరాంగ్ కామర్స్‌లో సీనియర్ డేటా సైంటిస్ట్. ఆమె కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ఇంటెలిజెన్స్ డేటా ఆధారిత ఉత్పత్తులను డిజైన్ చేసేది.
►సేథ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆస్ట్రోఫిజిక్స్‌తో ప్లాస్మా ఫిజిక్స్‌లో స్పెషలైజింగ్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 2008లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ సాధించారు. ఆమె రామకృష్ణ మిషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో ఫిజిక్స్ (ఆనర్స్)లో బ్యాచిలర్ డిగ్రీని చదివారు.
Comments
Please login to add a commentAdd a comment