భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment