భర్త ఆదాయం కోటి.. భార్యకు భరణంగా రూ.2.5 లక్షలు | CEO Accused Of Killing Son Wanted 2.5 Lakh As Maintenance | Sakshi
Sakshi News home page

Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు

Jan 10 2024 7:54 PM | Updated on Jan 10 2024 8:13 PM

CEO Accused Of Killing Son Wanted 2.5 Lakh As Maintenance - Sakshi

బళ్లారి: నాలుగేళ్ల కుమారున్ని హత్య చేసిన ఏఐ స్టార్టప్ సీఈఓ సూచన సేథ్‌.. తన భర్త పీఆర్ వెంకట రామన్‌పై గత ఆగష్టులో గృహ హింస కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కుమారున్ని, తనను భర్త వెంకట రామన్ వేధించాడని ఆరోపించింది. దీంతో సేథ్‌ ఇంటికి రాకుండా వెంకట రామన్‌ నిషేధాజ్ఞలు కూడా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తన భర్త ఏడాదికి రూ.కోటి సంపాదిస్తాడని వెల్లడించిన సేథ్.. తనకు నెలకు రూ.2.5 భరణాన్ని ఇవ్వాల్సిందిగా కోరినట్లు పోలీసులకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బహిర్గతపరిచింది. వాట్సాప్ మెసేజ్‌లు, మెడికల్ రిపోర్టులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్‌లను వెల్లడించింది.

ఇండోనేషియాలో ఉన్న భర్త వెంకటరామన్.. గృహహింస వేధింపులను ఖండించాడు. నిషేధాజ్ఞల కారణంగా తన భార్య ఇంటికి వెళ్లడం మానేశానని ఆయన తెలిపారు. సోషల్ మీడియా, ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా తన భార్యకు దూరంగా ఉన్నట్లు పేర్కొంది. చివరికి తన కుమారునికి కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే.. చివరికి తన పిల్లాడిని కలుసుకునే హక్కును భర్త వెంకట రామన్ పొందాడు. ఇదే కుమారుని హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  

కృత్రిమ మేధ స్టార్టప్‌ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్‌ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్‌ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: దగ్గు మందుతో చంపేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement