
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment