suside
-
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జీవితంపై విరక్తితో వ్యక్తి బలవన్మరణం
రామన్నపేట: జీవితంపై విరక్తితో రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట శివారులో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటకు చెందిన బొడ్డు శ్రీరాములు(52) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన శ్రీరాములును కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం రామన్నపేట–వలిగొండ రైల్వేస్టేషన్ల మధ్య కీ మ్యాన్ ట్రాక్ చెక్ చేస్తుండగా 48/8–9పోల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని శ్రీరాములు మృతదేహంగా గుర్తించారు. జీవితంపై విరక్తితో గుర్తుతెలియని రైలుకింద పడి శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే అధి కారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ కె. సాలకమ్మ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత బలన్మరణం!
కల్వకుర్తి టౌన్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడిన ఘటన కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్, కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. పట్టణంలోని హనుమాన్ నగర్‌కు వెళ్లే దారిలో నివాసముండే ఫిరోజ్‌కు హైదరాబాద్‌కు చెందిన రజియా (30)తో మూడేళ్ల కిందట వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం రజియాపై అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా వారి తీరు మారలేదు. దీంతో మనస్తాపానికి గురైన రజియా.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకొంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేసి, పోలీసులతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. రజియా ఆత్మహత్యకు భర్త ఫిరోజ్‌తో పాటు అతడి తల్లిదండ్రుల వేధింపులే కారణమని మృతురాలి తల్లి బీబీ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలికి మూడేళ్ల బాబుతో పాటు ఏడాది వయసు గల మరో బాబు ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చికిత్స పొందుతూ యువకుడు.. భూత్పూర్: భూత్పూర్ మండలంలోని కర్వెనకు చెందిన హన్మంత్‌రెడ్డి (20) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. ఇటీవల హన్మంత్‌రెడ్డి బైక్‌పై వెళ్తుండగా.. కర్వెన సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసినట్లు వివరించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ వెల్లడించారు. పురుగు మందు తాగి మహిళ బలవన్మరణం చారకొండ: పురుగు మందు తాగి ఓ మహిళ అత్మహత్యకు పాల్పడిన ఘటన చారకొండ మండలం సారంబండతండాలో చోటుచేసుకుంది.హెడ్‌కానిస్టేబుల్ నాగయ్య వివరాల మేరకు.. సారంబడ తండాకు చెందిన వడ్త్యావత్ బుజ్జి (48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చెరువులో పడి వ్యక్తి మృతి భూత్పూర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని సిద్ధాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. వికారాబాద్ జిల్లా మరుపల్లి మండలం వీర్లపల్లికి చెందిన ఎన్.రాములు (35) తన భార్య లలితతో కలిసి ఎనిమిదేళ్లుగా భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌కు చెందిన రమేష్ వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. పంటల సాగు నిమిత్తం సిద్ధాయిపల్లి రాందాస్ చెరువులో విద్యుత్ మోటార్ బిగించి నీటిని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి నీరు పెట్టడానికి రాములు వెళ్లగా.. మోటార్ పనిచేయలేదు. దీంతో చెరువులో నుంచి మోటార్‌ను బయటికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెక్డ్యాంలోయువకుడి గల్లంతు కోస్గి: చెక్‌డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైన ఘటన కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ముశ్రీఫాకు చెందిన బుడగజంగం వెంకటయ్య (32), శ్రీనివాస్ సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లారు. వాగు లోతు గమనించకుండా నీటిలోకి దిగిన వెంకటయ్యకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అతడి కోసం శ్రీనివాస్ గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయాన్ని గ్రామస్తులతో పాటు పోలీసులకు తెలియజేయడంతో చెక్‌డ్యాం వద్దకు చేరుకొని రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. -
పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళి.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మహబూబ్‌నగర్ క్రైం: పొలానికి నీళ్లు పెట్టడానికి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని జమిస్తాపూర్ చెందిన శరత్‌కుమార్(19) ఆదివారం ఉదయం తండ్రి గోపాల్‌తో కలిసి గ్రామ శివారులో ఉన్న వరి పంట పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటార్ స్విచ్ఛాన్ చేసే క్రమంలో షాక్ తగలడంతో తీవ్ర గాయా లు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ.. చారకొండ: గులికల మందు మింగి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జేపల్లి పంచాయతీ పరిధిలో నెమలిగుట్టతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమలిగుట్టతండాకు చెందిన రాత్లవత్ బుజ్జి (39) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 20వ తేదీన గులికల మందు తిని అపస్మారకస్థితిలో పడిపోయింది. స్థానికులు గమనించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టెబుల్ నాగయ్య తెలిపారు. రైలు కిందపడి యువకుడి బలవన్మరణం జడ్చర్ల: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం మేరకు.. మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గొడుగు మహేశ్(23) జల్సాగా తిరు గుతుండేవాడు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మృతదేహంతో ఆందోళన.. మిడ్జిల్: పోస్టుమార్టం అనంతరం మహేష్ మృతదేహంతో బైరంపల్లి సమీపంలోని క్రషర్ మిషన్ ఎదుట బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా క్రషర్ మిషన్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, శనివారం సాయంత్రం డ్యూటీ ముగిశాక ఇంటికి రాలేదని.. ఆదివారం ఉదయం గొల్లపల్లి సమీపంలో రైలు పట్టాలపై మృతిచెంది కనిపించినట్లు గ్రామస్తులు వివరించారు. యజమానులు అందుబాటులోకి రాకపోవడంతో సాయంత్రం వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. నిప్పంటించుకుని వృద్ధుడు.. ఉండవెల్లి: నిప్పంటించుకుని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాల్‌రాజు వివరాల మేరకు.. తక్కశీలకు చెందిన తెలుగు వెంకట్రాముడు (65), లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట వెంకట్రాముడికి పక్షపాతం రావడంతో ఎడమ కాలు, చెయ్యి పడిపోయింది. నెలరోజుల కిందట ఇంట్లో కాలుజారి పడటంతో వెన్నెముకకు గాయమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు ఉండవెల్లి: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. పోతులపాడుకు చెందిన భానుప్రకాష్, మరో ఇద్దరు టోల్‌ప్లాజా సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కారు నిలుపుకొని మద్యం తాగుతున్నారు. పోలీసులు రమేష్, హుస్సేన్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని.. వెళ్లిపోవాలని కోరగా ఆగ్రహించిన మందుబాబులు దురుసుగా మాట్లాడి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. -
బంధువుల ఇంటికి వెళ్లొద్దనందుకు వ్యక్తి బలవన్మరణం
నవాబుపేట: బంధువుల ఇంట్లో జరిగే పూజకు వెళ్లొద్దని భార్య చెప్పడంపై క్షణికావేశానికి గురైన భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కామారంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కామారం గ్రామానికి చెందిన సూర్యనారాయణ (36) ఈనెల 18న తమ బంధువుల ఇంట్లో పూజకు వెళ్దామని తన భార్య నాగమణికి చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు వెళ్దామని చెప్పడంతో క్షనికావేశానికి గురైన సూర్యనారాయణ.. ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ ఆనంద్ తెలిపారు. వరికోత యంత్రం కింద పడి వ్యక్తి మృతి చిన్నంబావి: వరికోత యంత్రం కింద పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వెలగొండలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరంగాపూర్ మండలంలోని జానంపేటకి చెందిన నరేష్(26) వరి పంటను కోత కోసేందుకు మండలంలోని వెలగొండకి వచ్చాడు. వరి కోత యంత్రం చెడిపోవడంతో దానిని మరమ్మతు చేసేందుకు యంత్రం కిందికి దిగిడు. మరమ్మతు చేస్తున్న క్రమంలో యంత్రం పైభాగం మీద పడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై స్థానిక ఎస్ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తమ దృష్టికి వచ్చిందని, పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. బస్సులో నుంచి కిందపడి వ్యక్తి దుర్మరణం చారకొండ: బస్సులో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మర్రిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం మేరకు.. మర్రిపల్లికి చెందిన గండికోట అంజయ్య (55) గురువారం వ్యక్తిగత పని నిమిత్తం దేవరకొండకు వెళ్లి రాత్రి గ్రామానికి చేరుకొని నడుస్తున్న బస్సులో నుంచి దిగే ప్రయత్నం చేసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శుక్రవారం అంజయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు.. కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని ఎల్లికట్టకు చెందిన గీత కార్మికుడు చంద్రయ్యగౌడ్ (60) శుక్రవారం తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కులవృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్న చంద్రయ్యగౌడ్.. రోజు మాదిరిగానే కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. కల్లు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ యాదవ్ తెలిపారు. అనారోగ్యంతోయువకుడి ఆత్మహత్య మల్దకల్: అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన మల్దకల్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కల్యాణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్‌కి చెందిన వడ్ల మోనాచారి(31) కొంత కాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రాధమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు. -
ఉద్యోగం పోయిందనే బాధతో.. 4 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి!
యశవంతపుర: మిస్సింగ్ అయిన నగర టెక్కీ కథ విషాదంతామైంది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా రాణిజరి జలపాతం వద్ద బెంగళూరు టెక్కీ భరత్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కొండ నుంచి నాలుగు వేల అడుగుల దిగువన మృతదేహాన్ని గుర్తించి అతికష్టంపై తాళ్ల సాయంతో వెలికితీశారు. ఆపై 14 కిలోమీటర్లు దూరం దట్టమైన అడవులు, లోయలను కాలినడకన దాటుకుంటూ తరలించారు. ఉద్యోగం పోయిందనే బాధతో.. ఈ నెల 6న భరత్ చిక్కమగళూరు రాణిజరి జలపాతం వద్దకు వెళ్లి మొబైల్‌ఫోన్, బైక్, ఐడీ కార్డు, బట్టలను గుట్టపై విడిచి కనిపించకుండాపోయాడు. బెంగళూరులో టెక్కీగా పనిచేసే భరత్.. కంపెనీ ఉద్యోగం నుంచి తీసేయడంతో విరక్తి చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజులైనా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకొని బణకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా రాణిజరి వద్ద ఉన్నట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. 25 మంది పోలీసు సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. అంత పై నుంచి భరత్ దూకడంతో మృతదేహం ఛిద్రమై, ఈ వారంరోజుల్లో కుళ్లిపోయింది. కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదిచదవండి:ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం? -
అనారోగ్య సమస్యతో వివాహిత బలవన్మరణం
మిడ్జిల్: మండలంలోని చిల్వేర్‌కు చెందిన వివాహిత నందిని(31) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు శనివారం తెలిపారు. ఈమె రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఎన్ని ఆస్పత్రులకు చూయించుకున్న ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి.. అమరచింత: కుటుంబ కలహాలతో బోయ వెంకటన్న (52) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో చోటుచేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన బోయ వెంకటన్న 15ఏళ్ల కిందట మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. కూలీపనులతో పాటు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడని గ్రామస్తులు తెలిపారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమరచింతకు వచ్చి ఓటేసి వెళ్లిన ఆంజనేయులు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు కుటుంబకలహాలే కారణం కావచ్చని గ్రామస్తులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ధరూరు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎములోనిపల్లికి చెందిన ఆంజనేయులు మద్యానికి బానిసై తిరిగే వాడని పోలీసులు తెలిపారు. గత నెల 23న పురుగుల మందు తాగాడు. ఆయనను అదే రోజు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. బైక్‌ను ఢీకొన్న కారు... ముగ్గురికి తీవ్రగాయాలు భూత్పూర్: మున్సిపాలిటీలోని గోప్లాపూర్ వద్ద శనివారం బైక్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రయ్య తెలిపారు. మండలంలోని మద్దిగట్లకు చెందిన శివకుమార్‌తో పాటు అతని స్నేహితులు జీ.మహేష్, గడ్డమీది మహేష్ బైక్‌పై భూత్పూర్ నుంచి కొత్త మొల్గర వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొటింది. దీంతో శివకుమార్, జి.మహేష్, గడ్డమీది మహేష్‌లకు తీవ్రగాయాలు కాగా అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ రాజు ప్రకాష్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ఇది చదవండి: కొండాపూర్ సర్పంచ్ ఆకస్మిక మృతి -
కుటుంబ పోషణ భారమై యువకుడి అత్మహత్య
రాజాపూర్: మండల కేంద్రంలో శుక్రవారం ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని రాంనగర్‌కు చెందిన శివ (24) రాజాపూర్‌లో ట్రాక్టర్ మెకానిక్ దుకాణం ఏర్పాటు చేసుకొని తల్లి, చెల్లితో కలిసి ఉంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం ఉండవెల్లి: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గోపాల్ (45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఇంటి నిర్మాణం, ఒకే ఏడాదిలో కుమారుడు, కుమార్తె వివాహం చేశాడు. దీంతో అప్పులు అధికమవడంతో ఆర్థికభారంతో మండల కేంద్రం శివారులోని పంట పొలంలో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మరో యువకుడు.. మహమ్మదాబాద్: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూళ్ల అంజి (28) చెరువుల్లో చేపలు పట్టడానికి కూలీ పనికి వెళ్లేవాడు. తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి గురువారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుని మృతిచెందాడు. అంజికి భార్య మేఘన, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి.. భూత్పూర్: మండలంలోని ఎల్కిచర్ల సమీపం భట్టుపల్లితండా (ఏవీఆర్ కాలనీ) వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని 35 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగర్‌కర్నూల్ నుంచి భూత్పూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. నల్లటిరంగు టీషర్డు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి బస్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్.. నలుగురికి గాయాలు పెబ్బేరు రూరల్: ఎడ్లబండిని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, బాలీశ్వరమ్మ, బిచ్చన్న వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన రమేష్ ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వేగంగా వచ్చి ఎడ్లబండిని ఢీకొట్టాడు. ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న వారితో పాటు రమేష్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇది చదవండి: short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్ దగ్ధం -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఉరేసుకున్న కొడుకు.. కొడుకు కోసం తండ్రి!
ధరూరు: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. మండల కేంద్రంలోని కుర్వవీధికి చెందిన గడ్డమీది నర్సింహులు (65), దౌలమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 5న వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు దేవార్జున్ (25).. అదే రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. నెలన్నర రోజులుగా కొడుకు చనిపోయిన బాధలో ఉన్న నర్సింహులు.. గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వ్యక్తి ఆత్మహత్య.. తాగుడు ఇంత పని చేసిందా!
జైనథ్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన భౌనే భూపాల్ (42) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నా భర్త మృతికి ఆ ఇద్దరే కారణం: నాయని సరిత
విద్యానగర్(కరీంనగర్): ఇటీవల కోర్టు ఆవరణలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న నాయిని శ్రీనివాస్ మృతికి కరీంనగర్ కార్పొరేటర్ గుగ్లిళ్ల జయశ్రీ– శ్రీనివాస్ దంపతులే కారణమని ఆయన భార్య నాయిని సరిత ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. తన భర్త నాయిని శ్రీనివాస్ వద్ద నుంచి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్ ఖర్చుల నిమిత్తం రూ.8.50లక్షలు, మూడున్నర తులాల బంగారం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఇమ్మని అడిగితే.. ఇవ్వకపోగా.. తమ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఆ భయంతోనే తన భర్త ఆత్మహత్మ చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు కారణమైన కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌పై కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అరెస్టు చేయడం లేదని, మంత్రి గంగుల కమలాకర్ అండతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ డబ్బు, బంగారం ఇప్పించి, కార్పొరేటర్ జయశ్రీ– శ్రీనివాస్‌ను అరెస్టు చేయాలని కోరారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!
పాన్‌గల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు. అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య అమరచింత: స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.! -
జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
పాన్‌గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది. మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పాము కాటుతో మహిళ మృతి నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..! -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!
గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న విజయ్‌మోహన్‌రెడ్డి(53) మోమిన్మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆనంద్ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్(42) మరికల్లో ఓ హేర్కంటింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్ లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు. ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
వక్తిగత కారణాలతో యువకుడు.. రైలు కింద పడి..!
మిర్యాలగూడ అర్బన్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్(30) అనే అనాథ యువకుడు మిర్యాలగూడ పట్టణంలోని లారీ అసోసియేషన్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు వ్యక్తిగత కారణాలతో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జన్మభూమి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com దొంగతనం కేసులో జైలు శిక్ష రామగిరి(నల్లగొండ): ఆటో దొంగతనం కేసులో ఓ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు జడ్జి కె. శ్రీవాణి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్ రఫీక్ మొయినుద్దీన్ తన ఆటోను మీర్బాగ్కాలనీలో నివాసం ఉంటున్న ఎండీ. హజీకి కిరాయికి ఇచ్చాడు. హజీ 2023 జూన్ 22న రాత్రి తన ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఇంటి ముందు ఆటో కనబడలేదు. ఆటో యజమాని రఫీక్‌కు విషయం తెలియజేయడంతో నల్లగొండ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ సలీం వద్ద ఆటో ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి కె. శ్రీవాణి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
భార్య కాపురానికి రావడం లేదని.. పురుగుల మందు తాగి..
నల్గొండ: భార్య కాపురానికి రావడం లేదని పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటిగానితండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటిగానితండాకు చెందిన సపావత్ చీన్య(35)కు 13ఏళ్ల క్రితం పోల్యనాయక్తండాకు చెందిన సునీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీత తన తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన చీన్య మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా బుధవారం మృతిచెందాడు. జీవితంపై విరక్తితో.. జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బత్తుల భద్రయ్య(75) 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. జీవితం మీద విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బత్తుల సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉరేసుకొని ఆత్మహత్య పెళ్లి కాలేదని జీవితంపై విరక్తితో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన తడకమళ్ల మధుకుమార్(53)కు పెళ్లి కాకపోవడంతో తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేకుకొని వివరాలు సేకరించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి లక్ష్మీనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జాహ్నవి టౌన్షిప్ వద్ద బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు
మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ స్వగ్రామం నారాయణపేట జిల్లా కోస్గి మండలం పీసీతండా ఒక్కసారిగా వార్తాల్లోకి రావడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు. విచారణ నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులు తండాకు వస్తుండటంతో భయంతో తండావాసులు ఉదయం వెళ్లి రాత్రికి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిందితుడి కుటుంబం ఆర్థికంగా బాగా ఉండి పలుకుబడి కలిగినది కావడంతో వివరాలు చెప్పడానికి జనాలు ముందుకు రావడం లేదు. నిందితుడు శివరాం తల్లిదండ్రులు కిషన్ రాథోడ్, సుశీల మహారాష్ట్రలోని ముంబయిలో కాంట్రాక్టర్లుగా అక్కడే స్థిరపడ్డారు. కిషన్ రాథోడ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు కాగా పెద్ద కుమారుడు శివరాం రాథోడ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు మణిరాం రాథోడ్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కూతురు అనురాధ మహబూబ్‌నగర్‌లో బీటెక్ చదువుతుంది. పీసీతండాలో తాత హేమ్లానాయక్, నానమ్మ మోనెమ్మ, మాణిక్యమ్మల దగ్గరకు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుండేవారు. రాజకీయంగా దుమారం.. ప్రవళిక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతోపాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులో నిందితుడిగా శివరాం రాథోడ్‌ను నిర్ధారించడంతో అతని కుటుంబం మొత్తం అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నిందితుడి స్వగ్రామంలోని ఇంటికి సైతం తాళం వేసి కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ఈ విషయమై తండావాసులు ఎవరూ నోరు మెదపకపోవడంతో నిశ్శబ్దం అలుముకుంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్త సంచలన కేసుకు కోస్గి మండలం మరోమారు వేదికై ంది. ప్రవళికతో ప్రేమాయణం.. మరో యువతితో పెళ్లి ఏర్పాట్లు ఆత్మహత్య చేసుకున్న ప్రవళికతో ప్రేమాయణం నడిపిన శివరాం రాథోడ్ వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని ఓ తండాకు చెందిన యువతితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించడంతో 15 రోజుల క్రితం పెళ్లిచూపుల తతంగాన్ని ఇరు కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారు. దసరా తర్వాత ముహూర్తాలు వస్తాయని, అప్పుడే ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన యువకుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!
మంచిర్యాల: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజవర్థన్ వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దామరకొండ శంకరమ్మ (50) భర్త పర్వతాలు సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె నర్సింగాపూర్‌లోని స్వంత ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది. భర్త లేకపోవడంతో పాటు ఉన్న ముగ్గురు కుమారులు దగ్గర లేకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లోని పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాకోడ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రకాడే సందీప్(33) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని మృతుడి తండ్రి రకాడే కారేబా, భార్య ఆశ తరుచుగా చెబుతున్నప్పటికీ మారడం లేదు. బుధవారం సైతం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సందీప్‌ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కోపంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సందీప్ గుర్తు తెలియని పురుగుల మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి...
ఇటీవల కొంతమంది తమను మోసం చేశారనో లేక తమతో ప్రేమగా ఉండటంలేదనో వంటి కారణాలతో దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ సిటీలోని 27 ఏళ్ల యువకుడు తన ప్రియురాలు తనకు తీరని ద్రోహం చేసిందనే కోపంతో ఆమెను పదునైన ఆయుధంతో హత మార్చాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పారు. అతని వద్ద దొరికిన సూసైడ్‌నోట్‌లో ...తాను రాయ్‌పూర్‌లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ డయల్-112లో కాల్ ట్రాకర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐతే తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను మోసం చేస్తూ వేరొకరిని ప్రేమించడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు. ఈ ఇద్దరూ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..) -
ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఓ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన పంతం లచ్చాగౌడ్ (57) మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో మూడేళ్లుగా హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 10 గంటలకు సెక్షన్ ఇన్చార్జిగా విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డ్యూటీ లేకున్నప్పటికీ స్టేషన్‌కు వచ్చి సహచరులతో కొద్దిసేపు మాట్లాడారు. 2.30 గంటల ప్రాంతంలో స్టేషన్ వెనుక భాగంలో ఉన్న బ్యారక్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్పీ శ్వేత ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. లచ్చాగౌడ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పని ఒత్తిడా..?, లేక వ్యక్తిగత సమస్యలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, లచ్చాగౌడ్ 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో చాలాకాలం పనిచేశాడు. ఆ తర్వాత దాదాపు 21 సంవత్సరాలు రైల్వేశాఖలో విధులు నిర్వహించాడు. కొంతకాలం నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసి 2017 ఫిబ్రవరి నుంచి మాచారెడ్డి పీఎస్‌లో పనిచేస్తున్నాడు. 2015లో హెడ్‌కానిస్టేబుల్ ప్రమోషన్ పొందాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల ఆందోళన అందరితో కలివిడిగా ఉంటూ అప్యాయంగా పలకరించే లచ్చగౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. పోలీస్టేషన్‌కు తరలివెళ్లి లచ్చాగౌడ్ మృతదేహాన్ని చూడనివ్వాలని పట్టుబడ్డారు. పోలీసులు అంగీకరించక పోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ స్థానికులను సముదాయించి మృతదేహాన్ని కామారెడ్డికి తరలించారు. -
ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య
శాంతిపురం(చిత్తూరు జిల్లా): కోరుకున్నవాడి నుంచి వేరు చేశారనే మనస్తాపంతో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రెడ్లపల్లికి చెందిన చందన (18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మురళీమోహన్, స్థానికుల కథనం మేరకు.. రెడ్లపల్లికి చెందిన వెంకటేశు రెండో కుమార్తె చందన కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. పొరుగున ఉన్న ఒడ్డుమడికి చెందిన ప్రభుతో ప్రేమలో పడ్డ చందన గత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులు కుప్పంలో ఉన్నట్టు తెలుసుకుని శనివారం మధ్యవర్తుల ద్వారా ఇంటికి తీసుకువచ్చారు. ఆమెను మందలించిన అనంతరం తండ్రి పంటలకు ఎరువుల కోసం శాంతిపురానికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయంలో తల్లి అమరావతి ఇంటి బయట పనిలో ఉండగా చందన ఇంట్లోని దూలానికి ఉరివేసుకుంది. ఇంట్లోకి వచ్చిన తల్లి చూసి కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి కిందికి దింపేలోపే ప్రాణాలు కోల్పోయింది.తండ్రి వెంకటేశు గ్రామస్తులకు విషయం తెలిపి ఈ విషయం బయటకు పొక్కితే మిగతా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో శనివారం రాత్రి తమ వ్యవసాయ పొలం వద్ద గుట్టుగా మృతదేహాన్ని దహనం చేసేశారు. అయితే రెడ్లపల్లిలో పరువు హత్య జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం కావటంతో రాళ్లబూదుగూరు ఎస్ఐ మురళీమోహన్ సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుప్పం సీఐ కృష్ణమోహన్, పలమనేరు డీఎస్పీ ఆరీపుల్లా ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను– మృతురాలి కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించారు. ఘటన జరిగిన సమయంలో మృతురాలి తండ్రి శాంతిపురంలోనే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చందన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యానికి డబ్బులు లేవని మనస్తాపంతో..
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్‌అర్బన్) : మద్యానికి బానిసైన ఓ యువకుడు.. తాగేందుకు ఇంట్లో డబ్బు ఇవ్వలేదనే మనస్తాపంతో ఉరేసుకున్నాడు. వన్ టౌన్ ఎస్సై గౌరేందర్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన మడిగే శివరాం (28) తల్లి, అన్న, చెల్లెలుతో కలిసి రెండేళ్ల క్రితం నిజామాబాద్‌కు వలస వచ్చాడు. స్థానిక కోజాకాలనీలో ఉంటూ శివరాం, అతని అన్న కార్మికులుగా పని చేస్తున్నారు. పని చేయగా వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ శివరాం మద్యానికి బానిసయ్యాడు. మందు తాగేందుకు శుక్రవారం డబ్బులు లేకపోవటంతో చెల్లెలిని అడుగగా, తన వద్ద లేవని ఆమె చెప్పింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శివరాం.. మిర్చి కాంపౌండ్ రైల్వే ట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో గల వేప చెట్టుకు టవల్‌తో శుక్రవారం రాత్రి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త చనిపోయాడనే మనస్తాపంతో..
లంగర్‌హౌస్: భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80) భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జగన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లు భార్యభర్తలు. వారి కుమారుడు రాంచందర్ సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్ బాపూనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదట చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఇక తాను బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది.. పొలం పనులు చూసుకునేందుకు కుమారుడు పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగమం దేవాలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండతస్తుల భవనం పైకి ఎక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు
జిన్నారం(పటాన్చెరు): మార్కులు తక్కువగా వస్తున్నాయని, ఇంటి వద్ద బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఓ విద్యార్థి తల్లికి వివరిస్తున్న క్రమంలోనే సదరు విద్యార్థి ఇంటికి పరుగులు తీసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలం అన్నారంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ప్రసాద్ కుమారుడు జనపాల బాలవసంత్‌రావ్(17) స్థానికంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల అనంతరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే క్రమంలో పాఠశాల యాజమాన్యం మంగళవారం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బాలవసంత్‌రావు తల్లి పాఠశాలకు వెళ్లింది. తరగతిలో అందరికన్నా తక్కువ మార్కులు వస్తున్నాయని ఇంటి దగ్గర బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఆమెకు వివరిస్తున్నారు. అందరికంటే తక్కువ మార్కులు రావడంతో పాటు తన గురించి ఉపాధ్యాయులు తల్లికి వివరిస్తున్నారన్న మనస్తాపానికి గురైన బాలవసంత్‌రావు ఇంటికి పరుగులు తీశాడు. బాత్రూంలో రాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి కుమారుడితో పాటు పరుగులు తీసి ఇంటికి వెళ్లగా అప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా కలిచివేసింది. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. -
‘మళ్లీ ఆడపిల్ల’ భయంతో గర్భిణి ఆత్మహత్య
తూప్రాన్: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తల్లి, మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో మనస్తాపంతో బలవర్మణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ పంచా యతీ పరిధిలోని పాత బాపన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కర్రె శ్రీశైలం యాదవ్, మమత దంపతులకు గతంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. తిరిగి ఆడపిల్లే జన్మిస్తుందన్న అనుమానంతో మనస్తాపం చెందిన మమత(25)ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
మెట్‌పల్లిరూరల్: వేధింపులు భరించలేక మండలంలోని జగ్గాసాగర్‌కు చెందిన వివాహిత ఒడ్డాటి వెల్మనేరెళ్ల లావణ్య(25) కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శంకర్రావు తెలిపిన వివరాలు. నాలుగేళ్ల క్రితం మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే లావణ్య తల్లిగారింట్లోనే ఉంటుంది. అయితే కొండ్రికర్లలో నివసించే ట్రాక్టర్ డ్రైవర్ రహీం వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి భూమారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మహత్యల నగరం ముంబై
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరమైన ముంబైలో ఆత్మహత్మ కేసులు పెరిగినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 17,195 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో ఒక్క ముంబైలోనే 1,205 మంది ఉన్నట్లు రాష్ట్ర నేర అన్వేషణ విభాగంలో నమోదైన గుణంకాలను బట్టి తెలిసింది. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబైలోనే అధికంగా అత్మహత్య కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగిన మొత్తం 17,195 ఆత్మహత్యల్లో 12,877 పురుషులుండగా 4,315 మహిళలు, ముగ్గురు హిజ్రాలున్నారు. అదేవిధంగా ముంబైలో చేసుకున్న మొత్తం 1,205 ఆత్మహత్యల్లో 808 పురుషులుండగా 396 మహిళలు, ఒక హిజ్రా ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న వారిలో ముఖ్యంగా జీవితంపై విరక్తి, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టం, దీర్గకాలిక వ్యాధితో బాధపడడం తదితర కారణాలున్నాయి. నగరంతో పోలిస్తే ఉప నగరాలలోనే ఆత్మహత్య కేసులు ఎక్కువ నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మలాడ్, గోరేగావ్, శివాజీనగర్, గోవండీ, బోరివలి, విక్రోలి తదితరా ఉప నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారిలో పిల్లలు కూడా ఉండడం గమనార్హం. ముంబై తరువాత పుణేలో ఏకంగా 945 మంది ఆత్మహత్య చేసుకున్నారు. -
సిరిసిల్లలో తల్లి,కుమార్తె ఆత్మహత్య
సాక్షి, సిరిసిల్ల: తల్లి, బిడ్డ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన సిరిసిల్లలో గురువారం చోటుచేసుుకంది. సిరిసిల్లలోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న తల్లి గుడ్ల విజయ(60), కూతురు జ్యోతి (35) ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతోనే వీళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్విఘ్నం... ఉద్రిక్తం
రోడ్డు ప్రమాదంపై స్థానికుల ఆందోళన పోలీసుల ఓవరాక్షన్‌కు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మృతుడి బంధువు కొవ్వూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈజీకే (ఏలూరు, గుండుగొలను, కొవ్వూరు) రోడ్డులో కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, సొసైటీ అద్యక్షుడు గారపాటి శ్రీరామకృష్ణల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మృతదేహం వద్దే టెంట్లు వేసి ఉదయం 10.30 గంటల నుంచి అక్కడే భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ పి. ప్రసాదరావు బాధితులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని, రోడ్డు పరిమితికి మించి వాహనాలు వెళుతున్నాయని, కేవలం గామన్‌బ్రిడ్జి టోల్గేట్ ఆదాయం కోసం భారీ వాహనాలను ఇటువైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో బి. శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించాల్సిందిగా తహసిల్దార్ విజయకుమార్‌ను ఆదేశించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించారు. అసలు గామన్ వంతెనపై నుంచి వెళ్లడానికి అనుమతులు లేవని, అనధికారికంగా టోల్గేట్ వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వాహనాల రాకపోకలను అడ్డుకుంటామంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవిలు కొందరు ఆందోళనకారులతో కలిసి గామన్ వంతెన ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఐరన్ పైపులతో వాహనాలు వెళ్లకుండా కాంక్రీట్‌తో బారికేడ్లను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను హెచ్చరించారు. అవసరం అయితే మృతదేహం వద్ద ధర్నా చేసుకోండని, రోడ్డు మార్గాన్ని మూస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అందరిని అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులతో కలిసి జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ముదునూరి నాగరాజులు రోడ్డుపై భైఠాయించారు. పరిస్థితి అందోళనకరంగా మారుతున్న దశలో ఆర్డీవో శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుండుగొలను వద్ద నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా గామన్ వంతెనపైకి భారీ వాహనాలు రాకుండా అక్కడి కలెక్టర్‌తో పశ్చిమ కలెక్టర్ మాట్లాడారని, బుధవారం నుంచి గామ¯Œన్ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆర్డీవో సూచనతో ఆందోళనకారులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే మీకు తెలియజేస్తామని అక్కడి నుంచి గ్రామంలోని మృతదేహం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, రాజమండ్రి నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఐరన్ పైపులను పోలీసులే తొలగించి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో పోలీసుల చర్చలు ఆందోళనకారులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పలు ధపాలుగా చేసిన చర్చలు విఫలం అవడంతో ఆందోళన తీవ్రతరమయ్యింది. డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ విజయకుమార్‌తో ఆర్అండ్బీ ఈఈ ఆందోళనకారులతో చర్చించారు. మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోవాలని, ప్రమాదమానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా, ప్రమాదబీమా ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అయితే గామన్ బ్రిడ్జి పైకి భారీ వాహనాల రాకపోకలే ప్రధాన కారణంగా చెబుతూ మృతుడి కుటుంబానికి టోల్గేట్ నిర్వాహకుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, లేని పక్షంలో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోమని హెచ్చరించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత ఆందోళనకారులతో చర్చలు సఫలం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో మృతుడి బంధువైన ఓ యువకుడు న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సంఘటనా ప్రాంతంలో వేసిన టెంటులను పోలీసులే తొలగించారు. మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా మృతదేహం వద్ద నుంచి బలవంతంగా ఈడ్చుకుపోయారు. పోలీసులను అడ్డుకున్నారంటూ మరో ఇద్దరు యువకులను కొట్టి ఈడ్చుకుంటూ లాక్కుపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అదే సమయంలో పోలీసులు బంధువులను చెదరగొట్టి మృతదేహాన్ని ఆటోలో కొవ్వూరు ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చెయ్యమంటే కొడతారా తమకు న్యాయం చెయ్యమని ఆందోళన చేస్తుంటే పోలీసులు కొడతారా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
విచిత్ర బంధం
ప్రేమను చంపుకోలేక తనువు చాలించిన ప్రేమికులు తిరుపతి హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య వరంగల్ అబ్బాయి.. వల్లూరు అమ్మాయి ఆచంట/సాక్షి ప్రతినిధి, తిరుపతి : వారిది పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు కలిశాయి. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని కలలు కన్నారు. కానీ.. సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఆచంట మండలం వల్లూరు గ్రామ పరిధిలోని బెజవాడ వారిపాలెంకు చెందిన దేవల మౌనిక, వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరస గ్రామానికి చెందిన తేజావత్ రంజిత్‌కుమార్ (31) తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల హోటల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆచంట మండలం బెజవాడవారి పాలెం గ్రామానికి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనిక. మూడునెలల కిందటే ఈమెకు దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందే మౌనికకు రంజిత్‌తో పరిచయం ఉంది. అతడు వరంగల్ జిల్లా అటవీ శాఖలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ఓ కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కాగా, మౌనికకు వరంగల్ ప్రాంతంలో బంధువులు ఉన్నారు. ఆమె తరచూ వారింటికి వెళ్తుండేది. వరంగల్‌కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. అయితే, అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్‌తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. రంజిత్‌ను మాత్రం మర్చిపోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే జనవరి 22న ఇంటినుంచి పారిపోయింది. అదే నెల 29వతేది వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం రంజిత్, మౌనిక ఈనెల 13న తిరుపతి చేరుకుని ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గల ఓ ప్రముఖ హోటల్లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి తిరుమల, తిరుపతిలోని ఆలయాలను సందర్శించారు. ఇదిలావుంటే.. శుక్రవారం మధ్యాహ్నం రూమ్‌ను శుభ్రపరిచేందుకు రూమ్‌బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో హోటల్ మేనేజర్‌కు సమాచారం తెలపగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్సై అక్కడకు చేరుకుని గది తలుపును పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. రంజిత్ ప్లాస్టిక్ వైరుతో, మైనిక చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. క్లాస్‌కు వెళ్లొస్తానని.. మౌనిక పదో తరగది ప్రైవేటుగా చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి చెందిన దేవళ్ల శ్రీకాంత్‌కు ఇచ్చి మూడు నెలల క్రితమే మౌనికకు వివాహం జరిపించారు. శ్రీకాంత్ ఆమెకు వరుసకు బావ అవుతాడు. వివాహమైన నాటినుంచి మౌనిక ఆచంటలోని ఆమె అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ ప్రైవేటుగా పదో తరగతి చదువుకుంటోంది. జనవరి 22వ తేదీన ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తానని చెప్పి బమటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సెల్ఫీ పంపింది ఇంటినుంచి వెళ్లిపోయిన మౌనిక తాను ప్రేమించిన రంజిత్‌తో కలిసి సుఖంగా ఉన్నానంటూ వారిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని ఇటీవల బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించినట్టు సమాచారం. అంతలోనే వారికి ఏ కష్టమొచ్చిందో తిరుపతిలో ప్రేమికునితో కలిసి ఉరేసుకుని చనిపోయింది. కుమార్తె ఏదో రోజు తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, బంధువులు ఆమె మరణించిందన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. శుక్రవారం రాత్రి హుటాహుటిన తిరుపతికి పయనమై వెళ్లారు. -
ప్రేమ వ్యవహారమే కారణం ..
జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం : క్షణికావేశం తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. వారి ఆకాంక్షలకు వెలుగునివ్వాల్సిన విద్యార్థిని తనను తాను అంతం చేసుకుని.. వారి ఆశలను చిదిమేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న.. బుట్టాయగూడెంకు చెందిన విద్యార్థిని స్వప్న నాయక్ (17) శుక్రవారం ఉదయం కళాశాల హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ హఠాత్ పరిణామంతో సహచర విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమతో ఇన్నాళ్లూ కలిసి చదువుకున్న స్నేహితురాలు ఇక లేదని తెలిసి బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో స్వప్న నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులంతా కాలకృత్యాలు తీర్చుకుని స్టడీ అవర్స్‌కు హాజరవుతుండగా.. స్వప్న నాయక్ కూడా వారితో కలిసి హాల్లోకి చేరుకుంది. తాను పుస్తకాలు మరిచిపోయానంటూ హడావుడిగా హాస్టల్ పైభాగంలోకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకేసిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కళాశాల కరస్పాండెంట్ సతీష్‌చంద్, ఉపాధ్యాయులు స్వప్న నాయక్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్వప్ననాయక్ తల్లిదండ్రులు శిశుపాల్ నాయక్, షీబా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కూతురు మృతి చెందిందని తెలుసుకున్న తల్లి ఆసుపత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న తల్లిదండ్రులు కూతరు స్వప్న నాయక్ ఆత్మహత్యపై తండ్రి శిశుపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే తన కుమార్తె మరణానికి కారణమని భావిస్తున్నట్టు ఆయన పోలీసులకు తెలిపారు. 15 రోజుల క్రితం వరకు స్వప్న బుట్టాయగూడెంలోని తమ ఇంటినుంచే కళాశాలకు వెళ్లేదని.. ఈ మధ్యనే ఆమెను కళాశాల హాస్టల్లో చేర్పించామని శిశుపాల్ నాయక్ తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. కాన్వెంట్ నడుపుకుంటున్న తల్లిదండ్రులు విద్యార్థిని తండ్రి శిశుపాల్ నాయక్ ఒడిశాకు చెందిన వారు కాగా, తల్లి షీబా కేరళకు చెందిన వారు. ఈ దంపతులిద్దరూ 25 సంవత్సరాల క్రితం బుట్టాయగూడెం వచ్చిన సెయింట్ థెరిస్సా పేరిట కాన్వెంట్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆత్మహత్యకు పాల్పడిన స్వప్న నాయక్ రెండో కుమార్తె. కుమార్తె మృతితో తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. పదవ తరగతిలో కూడా 9.8 జీపీఏ సాధించిందని, బాగా చదువుతుందని చెప్పారు. చదువు పాడవకూడదనే ఉద్దేశంతో హాస్టల్లో చేర్చానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయారు. -
మోదీకి లేఖరాసి వ్యాపారి ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం రూరల్ : ’నరేంద్ర మోదీ గారూ.. మీరు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కాని ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. మీ నిర్ణయం పుణ్యమా అని ఒక్క రూపాయి కూడా దొరకక, చీటీలు కట్టలేకపోయాను. అప్పు ఇచ్చేవారు లేక ఎవరికీ సమాధానం చెప్పలేక చనిపోతున్నాను’ ఓ చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ. పెద్ద నోట్ల మార్పిడి ఎంత ప్రభావం చూపిందన్నది వ్యాపారి మనోవేదన కళ్లకు కడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నరసింహమూర్తి (నాని) స్థానికంగా తాపీ పని చేసుకుంటూ, తన వద్ద ఉన్న డబ్బులను వడ్డీలకు తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పెద్ద నోట్ల రద్దుతో రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, వేసిన చీటీలకు జనం నుంచి డబ్బులు వసూలు కాకపోవడం, తాను ఇవ్వవలసిన వారికి డబ్బులు ఇవ్వలేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నరసింహమూర్తి శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. హన్మకొండ ఎందుకు వెళ్లాడో కుటుంబ సభ్యులకు సమాచారం లేదు. నోట్ల రద్దు వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, అప్పులు తీర్చగలిగినన్ని తీర్చానని, ఇంకా తీర్చలేకపోవడంతో వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను అనాథ శవంగా కాకుండా తన ఇంటికి శవాన్ని పంపించాలని ఈ లేఖ రాస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, మోదీ నిర్ణయం వల్ల జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు. ఇదిలావుండగా తాపీ పని చేసుకుంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న నరసింహమూర్తి హన్మకొండ ప్రాంతంలో ఎవరికో అప్పు ఇచ్చి ఉంటాడని, అవి వసూలు కోసం వెళ్లి తిరిగిరాక పోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం తెలంగాణ పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. గురువారం స్వగ్రామం కొప్పర్రులో నరసింహమూర్తి మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. లేఖలోని దస్తూరి నరసింహమూర్తిదేనని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఏలూరు అర్బన్ ః స్వల్ప విషయానికే భర్త తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగ ఝాన్సీ (30), తంబిలకు దాదాపు 12 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. నాటి నుంచి దంపతులు లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలోఇద్దరు పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపగ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లింది. ఈ ఉత్సవాలలో పిల్లలు మారాం చేయడంతో రూ. 200లతో ఆట వస్తువులు కొనిచ్చింది. అనంతరం తిరిగి ఇంటికి రాగా అదే రోజు రాత్రి పిల్లలకు ఆటవస్తువులు కొనివ్వడానికి రెండు వందలు ఎందుకు ఖర్చు చేశావంటూ భర్త తంబి భార్యను తీవ్రంగా మందలించాడు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఝాన్సీ రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు తీవ్రగాయాలపాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేక పోవడంతో బాధితురాలు ఝాన్సీ ఆసుపత్రిలోనే మృతి చెందింది. -
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఏలూరు: భార్య కాపురానికి రావడం లలేదని మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుని వాగ్మూలం ఇలా ఉంది. ఎన్వి రత్నం అనే రిజర్వ్ కానిస్టేబుల్ స్థానిక రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో భార్యాబిడ్డలతో నివాసం ఉంటున్నాడు. అయితే చాలా కాలంగా భార్యాభర్తలిద్దరూ కుటుంబకలహాలతో ఘర్షణ పడుతున్నారు. దాంతో అతని భార్య భర్తను విడిచిపెట్టి కూతురుతో సహా వేరుగా ఉంటుంది. దాంతో మనస్తాపం చెందిన రత్నం మంగళవారం తన నివాసంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన సహోద్యోగులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఏఆర్ ఆర్ఐక కె. వెంకటరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షడు నాగరాజు ఆసుపత్రికి వైద్యులతో బాధితుని ఆరోగ్య పరిస్థితిపై విచారిం,ఇ బాధితుని పరామర్శించారు. -
పచ్చటి పొలాల్లో మృత్యు ఘోష
– అన్నదాతల అసువులు తీస్తున్న అప్పులు – కొంపముంచిన రుణమాఫీ – పట్టించుకోని ప్రభుత్వం – ఈ నెలలో ఇద్దరు ఆత్మహత్య – రెండేళ్లలో 8మంది బలవన్మరణం సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రై వేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నిడదవోలులోని లింగంపల్లికి చెందిన రైతు బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) అప్పులు తీర్చే దారిలేక ఈనెల 14న అర్ధరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 18న సాయంత్రం కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. వీరిద్దరికీ కొద్దోగొప్పో భూమి ఉండగా, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించిన వారే. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బయటపడే మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా.. పాలకులు కనికరించడం లేదు. జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, 3.25 లక్షల మందికి రుణార్హత కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటించారు. వారిలో సగం మందికి కూడా కార్డులు అందలేదు. అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 18 వేల మందికి రూ.100 కోట్లలోపే రుణాలిచ్చారు. ఈ ఏడాది జిల్లా రుణ ప్రణాళిక రూ.6,300 కోట్లు కాగా, ఇప్పటికే రూ.3,500 కోట్లను రుణాలుగా మంజూరు చేసినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. అందులో కేవలం రూ.100 కోట్లలోపు మాత్రమే కౌలు రైతులకు దక్కాయి. బ్యాంకుల నుంచి అప్పు పుట్టక, మరోవైపు రుణమాఫీ ఫలాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండేళ్లలో 8మంది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ వంటి జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండేళ్లలో జిల్లాలో 8మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. అప్పుల ఊబినుంచి బయటపడే మార్గంలేక దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన బులుసు కోటేశ్వరరావు, కొవ్వలికి చెందిన గుంజా చిన్న రంగారావు, కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పొగాకు రైతు పందిరిపల్లి సత్యనారాయణ (45), రాజవరం గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40), జంగారెడ్డిగూడెంకు చెందిన పారేపల్లి మంగరాజు, చింతలపూడి మండలం నరసింగపురానికి చెందిన తూము రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా కౌలు రైతులే కాగా.. రెండు కుటుంబాలకు మాత్రమే రూ.3 లక్షల పరిహారం అందింది. మిగిలిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు. -
అసువులు తీసిన అప్పులు
– ఉరి కొయ్యను ఆశ్రయించిన రైతు – వరుస నష్టాలే కారణం – భూమి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో మంజూరు కాని బ్యాంక్ రుణం – ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో ఘటన ద్వారకాతిరుమల : పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఓ రైతు అసువులు తీశాయి. వరుస నష్టాలు అతడిని నిలబడనివ్వలేదు. బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని కాస్త ఉపశమనం పొందుదామంటే.. అతడి భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. కుటుంబ సభ్యులకు గుప్పెడు మెతుకులు పెట్టే దారిలేక.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా చేరినా.. అప్పటికే చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వలేదు. దిక్కులేని స్థితిలో ఆ రైతు ఉరికొయ్యను ఆశ్రయించి అసువులు తీసుకున్నాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది. రూ.లక్షలు పెట్టుబడి పెడితే చిల్లగవ్వ కూడా రాలేదు దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన ఆకుల సత్యనారాయణకు కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన హేమలతతో 15 సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహానంతరం సత్యనారాయణ తూర్పు యడవల్లిలో స్థిరపడ్డాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 75 సెంట్ల వ్యవసాయ భూమి భార్యద్వారా సంక్రమించగా.. ఆ పొలంతోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని సత్యనారాయణ కౌలుకు తీసుకుని మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. మిరప, నిమ్మ, దొండ పంటలను సాగు చేస్తున్నాడు. దొండ సాగు అతడిని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఐదు నెలల క్రితం నాటిన దొండపాదులు ఎండిపోవడంతో వెంటనే అప్పులు చేసి మళ్లీ అదే పంట వేశాడు. ఆ పాదులు కూడా ఎండిపోవడంతో నిరాశకు గురయ్యాడు. దాదాపు రూ.3 లక్షల మేర పెట్టుబడులు పెడితే చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులను పోషించుకోవడం కష్టమైంది. ఆర్థిక ఇబ్బందులను తాళలేక సీహెచ్.పోతేపల్లిలోని గోద్రేజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో గెలల అన్లోడింగ్ చేసే పనిలో కూలీగా చేరాడు. వ్యవసాయంపై మక్కువ చావక తన పొలంలో మరోసిరొ మిరప పంట వేశాడు. భార్యద్వారా సంక్రమించిన భూమిపై బ్యాంకు రుణం తీసుకుని ప్రై వేట్ అప్పుల్లో కొంతైనా తీర్చి ఉపశమనం పొందాలనుకున్నాడు. భూమి రికార్డులు ఆన్లైన్ కాకపోవడంతో రుణం ఇవ్వడం కుదరదని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు. మూడేళ్లపాటు దఫదఫాలు చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు చేరడంతో ఎలా తీర్చాలో తెలియక సత్యనారాయణ సతమతమయ్యేవాడు. ఇదే విషయాన్ని తమ వద్ద పదేపదే అంటుండేవాడని భార్య హేమలత, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం పొందాడు. సత్యనారాయణ, హేమలత దంపతులకు సురేష్‌కుమార్ (15), హరీష్ (13) అనే కుమారులున్నారు. ‘అమ్మను పొలానికి రావద్దను’ రోజులానే మంగళవారం ఉదయం ఇంటినుంచి బయల్దేరిన సత్యనారాయణ పొలానికి చేరుకున్నాడు. మిరప పంటకు తడిపెట్టే సమయంలో అతని చిన్న కుమారుడు హరీష్ టిఫిన్ తీసుకెళ్లాడు. టిఫిన్ చేసిన అనంతరం పొలం నుంచి ఇంటికి వెళుతున్న కుమారుణ్ణి వెనక్కి పిలిచిన సత్యనారాయణ ‘మధ్యాహ్నం మీ అమ్మ పొలానికి వస్తుందేమో.. రావద్దని చెప్పు. సాయంత్రం నేనే ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పి పంపాడు. అతని రాక కోసం రాత్రి వరకు ఎదురు చూసిన భార్య హేమలత ఆ తరువాత భర్తను వెదుక్కుంటూ పొలానికి బయలుదేరింది. సమీపంలోని పొలానికి చెందిన రైతు ఆమెకు ఎదురై నీ భర్త పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. భోరున విలపిస్తూ్త ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పుల బాధలే తన భర్తను పొట్టన పెట్టుకున్నాయని భార్య హేమలత రోదిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మతిచెందాడన్న వార్త తెలుసుకున్న తోటి రైతులు, ఇంటి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక పోలీసులకు సమాచారం అందగా, బుధవారం ఉదయం భీమడోలు ఎసై ్స బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల స్టేషన్ రైటర్ టి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కౌలు రైతును కాటేసిన రుణమాఫీ హామీ
– అప్పులు తీర్చలేక ఆత్మహత్య – రుణం మాఫీకాక పొలం అమ్మేసి కౌలు రైతుగా మారిన వైనం నిడదవోలు : రుణమాఫీ హామీ ఓ రైతును పొట్టనపెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లింగంపల్లికి చెందిన బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విద్యాసాగర్ తన తండ్రికి గల ఎకరం పొలంతోపాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆరేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మిల్లర్లు, తెలిసిన ఆసాముల వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. తన తండ్రి వెంకట్రావు పేరిట ఉన్న ఎకరం పొలంపై 2012లో రూ.90 వేల వరకు పంట రుణం తీసుకున్నాడు. ఆ రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో బ్యాంకుకు వాయిదాలు చెల్లించలేదు. ఆ మొత్తం మాఫీకాకపోగా వడ్డీలతో కలిపి తడిసిమోపెడైంది. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు నెలల క్రితం తన తండ్రి పేరిట ఉన్న ఎకరం పొలాన్ని విక్రయించి బ్యాంకు అప్పుతోపాటు బయటి అప్పులను కూడా కొంతమేర తీర్చాడు. అయినా.. బయట తెచ్చిన అప్పులు తీరలేదు. ఈ నేపథ్యంలో బకాయిలు తీర్చే మార్గం లేక విద్యాసాగర్ వారం రోజులుగా బెంగతో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 1గంట సమయంలో పొలంలోని పాక వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి తండ్రి వెంకట్రావు స్పృహ కోల్పోయాడు. మృతుడు విద్యాసాగర్ అవివాహితుడు. -
మనోవ్యాధితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం రూరల్ : మనోవ్యాధితో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపాల్‌నగర్‌కు చెందిన నాదెండ్ల మనోజ్‌సాయికుమార్ (18) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతోపాటు నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఎంతకీ రాలేదు. మంగళవారం ఉదయం పంపుల చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అతని తల్లిదండ్రులు తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి మంగ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలపై సర్వే
పరకాల/సంగెం/జఫర్‌గఢ్ : అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల స్థితిగతులపై వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం సర్వే చేశారు. ఆయా రైతు కు టుంబాలపై సర్వే చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించింది. డాక్టర్ నాగేశ్వర్రావు, కేవీ గిరిబాబు, కె.రాంబాబు, కె.రాము, బి.కృష్ణతో కూడిన అధికార బృందం మండలంలో పర్యటించింది. వెల్లంపల్లిలో బొజ్జం కొమురయ్య, సీతారాంపురంలో పేరబోయిన సంపత్, వరి కోల్లో కొలిపాక శ్రీహరి, రాసమల్ల అంజయ్య, సంగెం మండలం కాట్రపల్లిలో చోల్లేటి సుద¯ŒSరెడ్డి, పల్లారుగూడ గ్రామంలో పోడేటి ఐలయ్య కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఇంటి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అం దిస్తామని తెలిపారు. వారితో పరకాల ఇ¯ŒSచార్జి జేడీఏ ఎగ్గిడి నాగరాజు, ఏఈవో అనిల్‌కుమార్, విశాఖపట్టణం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ సభ్యులు డాక్టర్ ఎం.నాగేశ్వర్రావు, డాక్టర్ కేవీ.గిరి, డాక్టర్ కె.రాంబాబు, డాక్టర్ పి.రాము, డాక్టర్ బి.క్రిష్ణ, జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీరూనాయక్, ఏఓ ఆర్.వేణుగోపాల్ పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని మేనమామ కథనం ప్రకారం.. నల్లజర్ల మండలం, తెలికిచర్ల గ్రామానికి చెందిన మిద్దే గంగరాజు (25) భార్య దుర్గతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్యా, భర్తలిద్దరూ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగరాజు ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న గంగరాజును కుటుంబసభ్యులు తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూండగా గంగరాజు మరణించాడు. -
కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఏలూరు (మెట్రో) : తాను ఇచ్చిన ఫిర్యాదును ఎసై ్స పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టరేట్ ఆవరణలో పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సోమవారం ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడుకు చెందిన అచ్యుత నాగరాజు అనే వ్యక్తి వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న 68 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.2.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోగా, అతని కుమారులు వచ్చి తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఈ విషయమై న్యాయం చేయాలని సమిశ్రగూడెం ఎసై ్సకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపాడు. కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే తిరిగి ఎసై ్స వద్దకే ఆ ఫిర్యాదు పంపిస్తున్నారని, దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు వాపోయాడు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి వచ్చిన నాగరాజు పురుగుల మందు తాగడంతో పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడు కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
ఐటీఐ నైట్ వాచ్మెన్ ఆత్మహత్య
ఏటూరునాగారం : ఐటీఐలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్న భూక్య సారయ్య (53) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి వివాహాలయ్యాయి. భార్య, కుమారుడితో కలసి సారయ్య క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన సారయ్య ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అయితే అంతకుముందే కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న రెండో కుమార్తె ఇంటికి వెళ్లారు. ఒంటిరిగా ఇంట్లో ఉన్న సారయ్య ఉరి వేసుకుని తనువు చాలించాడు. సారయ్య మృతికి కేవలం వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. సారయ్య మృతి విషయం తెలుసుకున్న ఐటీఐ విద్యార్థులు, లెక్చరర్లు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
యువకుడి ఆత్మహత్య
ఏలూరు అర్బన్: పెదపాడు మండలానికి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ శౌరిపురం గ్రామానికి చెందిన బొబ్బిలి రాయప్ప, చంటి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్‌కుమార్ (25) డిగ్రీ వరకూ చదువుకుని కొంతకాలంగా ఏలూరులోని ఓ వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వినోద్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించి బాధితుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా వినోద్‌కుమార్ మతి చెందాడు. -
మనస్థాపంతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు రైల్వే పట్టాలపై రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. వడలి గ్రామానికి చెందిన కాసాని శ్రీను (44) 18 ఏళ్ల క్రితం పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి రాణిదుర్గ, పుష్పలత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అతను అత్తవారి ఇంటి వద్ద ఉంటు పూలపల్లికి చెందిన ఓ రైసుమిల్లులో జట్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. నాలుగేళ్లనుంచి కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన శ్రీను గురువారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 3గంటలకు స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు భీమవరం రైల్వే ఎస్ఐ జి.ప్రభాకరరావు తెలిపారు. పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
యువకుడి ఆత్మహత్య
తిరుమలగిరి : పురుగులమందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుమలగిలో చోటు చేసుకుంది. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి చెందిన బుర్ర నాగలక్ష్మి, భిక్షంల కుమారుడు బుర్ర మహేష్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇంటి వద్దనే పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తిరుమలగిరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం వరకు చికిత్స నిర్వహించిన వైద్యులు అతడిని సూర్యాపేటకు తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు అక్కడికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సరైన చికిత్స అందించకపోవడం కారణంగానే మహేష్ మతిచెందాడని ఆరోపించారు. అనంతరం ఆస్పత్రిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. యువకుడి ఆత్మహత్య టuటజీఛ్ఛీ జీn p్ఛఛీఛ్చీp్చఛీజీటజ్చిl్చ టuటజీఛ్ఛీ, p్ఛఛీఛ్చీp్చఛీజీటజ్చిl్చ, yuఠ్చిజుuఛీu యువకుడు, ఆత్మహత్య, పెద్దపడిశాల తిరుమలగిరి : పురుగులమందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుమలగిలో చోటు చేసుకుంది. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి చెందిన బుర్ర నాగలక్ష్మి, భిక్షంల కుమారుడు బుర్ర మహేష్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇంటి వద్దనే పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తిరుమలగిరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం వరకు చికిత్స నిర్వహించిన వైద్యులు అతడిని సూర్యాపేటకు తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు అక్కడికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సరైన చికిత్స అందించకపోవడం కారణంగానే మహేష్ మతిచెందాడని ఆరోపించారు. అనంతరం ఆస్పత్రిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
పురుగులమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
పండితవిల్లూరు(పోడూరు) : పండితవిల్లూరులో బుధవారం పురుగులమందు తాగి ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పండితవిల్లూరు హైస్కూలు సమీపంలో నివసించే వట్టికూటి నర్సింహమూర్తి(80) పురుగులమందు తాగి పంటకాలువ సమీపంలో పడిపోయి ఉన్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నర్సింహమూర్తిని పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో బి.శ్రీనివాసరావు నర్సింహమూర్తి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
వివాహిత బలవన్మరణం
పోలవరం : పోలవరం మండలంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అప్పన నాగమణి (40) అనే వివాహిత మంగళవారం వేకువ జామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పి తాళలేక నాగమణి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె సోదరుడు ముక్కు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : ముక్కుపచ్చలారని బాలుడొకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ధర్మాజీగూడెంకు చెందిన ముక్కు రాంబాబు, అరుణ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సాయి గోపాల్ (12) అదే గ్రామంలోని పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నేప£ý ్యంలో ఎవరూ లేని సమయం చూసి సాయి గోపాల్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వీరు హుటాహుటిన బాలుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిగోపాల్ కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ధర్మాజీగూడెం ఎస్సై వి.క్రాంతికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
పరిహారం రాలేదని యువకుడి బలవన్మరణం
మిడ్‌మానేరు ముంపు గ్రామం నీలోజిపల్లిలో ఘటన బోయినపల్లి : మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న నీలోజిపల్లి గ్రామానికి చెందిన అనుముల అనిల్(25) తనకు పరిహారం అందలేదని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనుముల అంజయ్యకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్దకుమారుడు నాగరాజు, చిన్న కుమారుడు అనిల్ పేర్లు పరిహారం గెజిట్‌లో ప్రచురించలేదు. దీంతో వీరికి ఎలాంటి పరిహారం మంజూరు కాలేదు. అనిల్ ఇంటర్ వరకు చదువుకుని తండ్రితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. తన పేరు గెజిట్‌లో ప్రచురించి ప్రభుత్వం ద్వారా నిర్వాసితులకు ఇచ్చే పట్టా, పరిహారం మంజూరు చేయాలని అనేకసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం యువత పరిహారం ఇప్పించాలని గ్రామానికి అధికారులను వేడుకున్నాడు. అయినా ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో మనస్తాపం చెంది తన వ్యవసాయ బావి వద్ద సోమవారం క్రిమిసంహారకమందు తాగి మతిచెందాడు. అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎసై ్స కె.సతీశ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం సత్వరం అందించాలని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు, నీలోజిపల్లి సర్పంచ్ కూస రవీందర్. ఉపసర్పంచ్ ఎర్ర లింగారెడ్డి డిమాండ్ చేశారు. -
ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వ్యవసాయ కూలీ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన చమ్మల కిశోర్ చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం కడుపునొప్పి రావడంతో ఇంటì లో ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
మహిళా రైతు ఆత్మహత్య
కాళేశ్వరం : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకుంది. గత రెండేళ్లగా తమకున్న ఐదెకరాల భూమిలో స్వరూప, శ్రీనివాస్ దంపతులు పత్తిపంటను సాగుచేస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం స్వరూప, శ్రీనివాస్ తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికితోడు కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరూప భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పులబాధతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో భూమి కోల్పోతున్నందున ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గంభీరావుపేట: గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన మందల బాలరాజు(36) అనే వ్యక్తి అప్పుల బాధతో గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ట్రాక్టర్ కొన్న బాలరాజు అప్పులు ఎక్కువ కావడంతో, అవి తీరే మార్గం కనిపించక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గ్రామశివారులో గురువారం విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. -
తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేక.. కుమారుడి ఆత్మహత్యాయత్నం
ఏలూరు (మెట్రో): తల్లికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెను ఐసీయూలో చూసిన కుమారుడు మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన మహ్మద్ బాషా తల్లి మున్నీ కొద్దికాలంగా మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. దీంతో బాషా మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
భార్య ప్రియుడు ఇంటి ముందు భర్త ఆత్మహత్యాయత్నం
నెల్లూరు (క్రైమ్) : తన భార్య ప్రియుడు ఇంటి ముందు భర్త ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన కఠారిపాళెంలో ఆదివారం చోటు చేసుకుంది. కఠారిపాళెంకు చెందిన మణి సండేమార్కెట్‌లో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇది వరకే ఓ మహిళతో వివాహమైంది. ఆమెను వదిలివేశాడు. లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన కిశోర్ అనే వ్యక్తితో చనువుగా ఉం టుంది. ఈ విషయమై పలు దఫాలు దంపతుల నడుమ గొడవలు జరిగాయి. తన భార్యతో సన్నిహితంగా ఉండ టం మానివేయాలని మణి పలుమార్లు కిశోర్‌కు, భార్యకు చెప్పాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మణి మనస్థాపం చెంది కిశోర్ ఇంటి వద్దకు వెళ్లాడు. తన భార్యను వదిలివేయమని ప్రాధేయపడ్డాడు. అయినా అతను పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలపాలైన మణిని చికిత్స నిమిత్తం డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడోనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వికలాంగుడి బలవన్మరణం
తొర్రూరు : ఓ వికలాంగుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎండీ అఫ్జల్(25) అనే వికలాంగుడు సోడా బండి నడిపి జీవనం సాగించేవాడు.మనస్తాపానికి గురైన అతడు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుడి ఆత్మహత్య
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పాత జెండాకు చెందిన కోటగిరి నాగరాజు (28) ఆదివారం మృతి చెందినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం వరంగల్‌కు చెందిన యువకునితో నిశ్చితార్థం ఉండగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖను రాసి మంచం పక్కన పెట్టినట్లు వారు తెలిపారు. నాగరాజు ఐదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువతిని తాను ప్రేమించానని.. మూడేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తుండగా ప్రేమికులిద్దరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయం చెప్పినట్లు లేఖలో పేర్కొన్నాడు. యువతి కుటుంబసభ్యులు తనపై దాడి చేశారని మృతుడు తెలిపాడు. సోదరుడు వినోద్ సైతం పోలీసులకు తన అన్న నాగరాజు చనిపోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కోల్‌సిటీ : ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది గోదావరిఖనికి చెందిన కోడూరి రాము(25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన రాయమల్లు కుమారుడు రాము 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కొంతకాలంగా డ్రై వర్గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం మిత్రులతో కలిసి కాళేశ్వరం వెళ్లిన రాము సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడు గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్థానిక 5ఏ గని సమీపంలోని ఇసుక బంకర్ దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాము తండ్రి రాయమల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స రాజమౌళిగౌడ్ తెలిపారు. -
పరిహారం కోసం ఎదురుచూపులు
రైతు ఆత్మహత్య చేసుకుని మూడేళ్లు.. పరిహారం కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు ధర్మారం : భూమిని నమ్ముకుని లక్షల పెట్టుబడులు పెడుతున్న రైతులకు అప్పులే మిగులుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పైరవీలు లేనిదే పని కావడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన రుద్ర లచ్చయ్య–మమత దంపతులు తమకున్న ఎకరం వ్యవసాయ భూమితో పాటు మరో 9ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగుచేశారు. వ్యవసాయానికి వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల బాధలు అధికం కావడంతో వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో లచ్చయ్య 2013 మార్చి 30న క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతిని అధికారులు రైతు ఆత్మహత్యగా గుర్తించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. నివేదికను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తామని వారు చెప్పారు. పరిహారం అందించగానే అప్పులు చెల్లిస్తానని బాకీదారులతో మమత చెప్పుకొచ్చింది. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో మమత రెవెన్యూ కార్యాలయం బాటపట్టింది. దాదాపు ఆరు నెలలపాటు తిరిగిన మమతకు నివేదికను కలెక్టర్‌కు పంపించామని, అక్కడి నుంచి రావాలనే అధికారులు చెప్పడంతో ఆమె కార్యాలయానికి వెళ్లడం మానేసింది. మరో ఘటనలో చకాచకా.. మండలంలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన నునావత్ రాంజీనాయక్ ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా.. అధికారులు రైతు ఆత్మహత్యగా పరిగణించిన అధికారులు విచారణ జరిపారు. సంబంధిత ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు యుద్ధప్రాతిపదికన పంపించారు. ప్రభుత్వం ద్వారా నెల క్రితం రూ.5లక్షల పరిహారం ప్రభుత్వం బాధిత కుటుంబానికి అందించింది. అయితే రాంజీనాయక్ కుటుంబానికి రాజకీయ నాయకుడి అండ ఉండడంతో అధికారులతో సంప్రదించి నివేదిక ఫైల్‌ను ప్రభుత్వానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సదరు రైతుకు ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించింది. ఈ విషయం తెలుసుకున్న మమత తిరిగి రెవెన్యూ కార్యాలయానికి రావడం ప్రారంభించింది. దీంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఆమెకు సంబంధించిన ఫైల్‌పై ఆరా తీయగా.. అసలు ఆర్డీవో కార్యాలయానికి పంపించలేదని స్పష్టమైంది. దీంతో సదరు ఉద్యోగి చొరవతీసుకుని ఆ ఫైల్‌ను పరిశీలించి పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పంపించినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ అండలేని మమత ఫైల్ ప్రభుత్వానికి ఎప్పుడు చేరుతుందో వేచిచూడాల్సిందే. భర్త ఆత్మహత్యతో మమత కూలీ పనికిపోతూ తన ఇద్దరు కూతుళ్లు, కొడుకును పోషిస్తోంది. ప్రస్తుతం ఉండడానికి కనీసం ఇళ్లుకూడా లేదని మమత ఆవేదన వ్యక్తంచేస్తోం. ప్రభుత్వం పరిహారం అందిస్తే అప్పుల బాధ నుంచి విముక్తిపొంది పిల్లలను బాగా చదివిస్తానని అంటోంది. -
దుబాయిలో వలసజీవి ఆత్మహత్మ
బోయినపల్లి : బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశం వెళ్లిన వలసజీవికి అక్కడా కష్టాలు తప్పలేదు. సరైన పనిలేక, చాలీచాలని జీతంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడపెల్లి అంజయ్య(44)కు ఎకరంన్నర భూమి ఉన్నా, సాగునీటి వసతి లేదు. చాలా సంవత్సరాలుగా భూమి బీడుగా ఉంటోంది. భార్యాభర్తలు ఇద్దరు కూలీకి వెళ్లి తమ కుటుంబాన్ని పోషించేవారు. ఎంతచేసినా ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో అంజయ్య రూ.రెండు లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. అక్కడ చాలీచాలని జీతంతో లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక్కడ అంజయ్య భార్య విజయ కూలీకి వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. గతేడాది డిసెంబర్లో అంజయ్య స్వగ్రామానికి వచ్చి పెద్ద కూతరు జ్యోతి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.రెండు లక్షల వరకు అప్పు చేశాడు. రెండో కూతురు మనీష గంగాధరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు శివాణి తొమ్మిదో తరగతి. ఇద్దరు కూతుళ్లు ఎదుగుతున్నారు... వారి చదువుల ఖర్చు, తదితర అవసరాలు ఎలా తీర్చాలి.. పైగా రూ.4లక్షల దాకా అప్పులున్నాయని మనస్తాపం చెందుతుండేవాడు. అప్పుడప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కూతుళ్లకు పెళ్లి ఎలా చేయాలని భార విజయతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన అంజయ్య ఈనెల 19న దుబాయిలోని తన గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడివారు ఫోన్ ద్వారా తెలియజేశారు. నాలుగు రాళ్లు వెనుకేసుకొస్తాడనుకున్న వ్యక్తి అందరినీ వదిలివెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రాణాల మీదికి తెస్తున్న సెల్ఫీలు
‘సెల్ఫీ’సైడ్స్! అత్యుత్సాహంతోనే ప్రమాదాలు ఇతరులకు ఇబ్బందిగా మారుతున్న వైనం సెల్ఫీ సరదా... సాహసాలకు ఉసిగొల్పుతోంది. అసాధారణ పనుల వైపు నడిపిస్తోంది. ఆ వెనుకే మృత్యువును పంపిస్తోంది. నిండు ప్రాణాలను బలిగొంటోంది. సూసైడ్స్ (ఆత్మహత్యలు)... తరహాలోనే ‘సెల్ఫీసైడ్స్’ పెరుగుతున్నాయి. ఈ ‘సరదా’కు బానిసలైన యువత అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సిటీబ్యూరో: సెల్ఫీ... ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సెల్‌ఫోన్ ఆధారిత ఫొటో. దీని కోసం ప్రత్యేక సెల్ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు. మరోవైపు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సూసైడ్స్ (ఆత్మహత్యలు) తరహాలోనే ఇటీవల ‘సెల్ఫీసైడ్స్’ అధికమయ్యాయి. మంగళవారం జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బండపై నుంచి కాలు జారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు. సెల్ఫీ క్రేజ్‌తో పాటు ఈ తరహా ప్రమాదాలూ పెరిగిపోతున్నాయి. అమెరికాకు చెంది న ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం 2015లో ప్రపంచ వ్యాప్తంగా 27 సెల్ఫీ సంబంధిత దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో సగానికి పైగా భారత్‌లోనే నమోదైనట్లు ఆ పత్రిక స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యువతలోనే అధికం సెల్ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి రావడం... అవీ మంచి రెజుల్యూషన్‌తో కూడినవి కావడంతో సెల్ఫీ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోలకు మీడియా పతాక స్థాయిలో స్థానం కల్పించడం ఈ క్రేజ్‌కు ఆజ్యం పోసింది. సెల్ఫీలపై మోజు చూపిస్తున్న వారిలో అధికశాతం యువతే. తాము ఉన్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీలు దిగడానికి ఆరాట పడుతున్నారు. వాహనాలు నడుపుతూ ఫోజులిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏ మీడియా లో చూసినా అవే.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. వీటిలో కొన్నాళ్ల క్రితం ఎదుటి వారు తీసినవో.. తాము తీసిన ఫొటోలనో అప్లోడ్ చేసుకునే వారు. సెల్ఫీ మూడ్ పెరగడంతో సోషల్ మీడియాలో ఎవరి ప్రొఫైల్ ఫొటోచూసినా... అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం ఇవే కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ బాట పడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. నో పార్కింగ్ తరహాలో... జనాల్లో... ముఖ్యంగా యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తల నొప్పులు తెచ్చి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమలులోకి వచ్చాయి. గత ఏడాది మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాలు బాటిల్నెక్స్గా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆ ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. ‘సెల్ఫీ’సైడ్స్ నిరోధానికి ముంబై పోలీసులు ఆ నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సెల్ఫీ దుర్ఘటనల్లో కొన్ని... మధ్యప్రదేశ్‌లోని ఓ మూసివేసిన బొగ్గు గని సమీపంలో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో 14 ఏళ్ల బాలుడు అందులో పడి మరణించాడు. చెన్నైలో వేగంగా దూసుకు వస్తున్న రైలు ముందు నిల్చుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో 17 ఏళ్ల యువకుడు రైలు ఢీకొని చనిపోయాడు. ఇదే తరహాలో సెల్ఫీకి ప్రయత్నించి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన మధుర సమీపంలోని కోసికలలో చోటుచేసుకుంది.ముంబైలోని బాంద్రా బస్టాండ్‌లో స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న మహిళ కాలుజారి బస్సు కింద పడి కన్ను మూసింది. ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద సెల్ఫీ ప్రయత్నాల్లో ఉన్న జపాన్ దేశ పర్యాటకుడు ఎత్తు నుంచి పడి తలకు గాయమై మరణించాడు. ముంబైలోని బాంద్రా-ఓర్లీ సీ లింక్ వంతెనపై సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు యువకులు సముద్రంలో పడి అశువులు బాశారు. సెల్ఫీకి ముందు ‘సప్త ప్రశ్నలు’ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. అలా చేస్తే ఇది తీపిగుర్తుగా మిగులుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా... ►సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా? ►(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో) ►సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా? ►(జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ) ►సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటి వారు చూస్తున్న వాటి కి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? ►(థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు) ►సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీస్తున్నామా? ►(మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు) ►సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా? ►(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తయిన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు) సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా? ►(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు) ►నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) తాత్కాలిక ఆనందం కోసమే.. సెల్ఫీ క్రేజ్ తాత్కాలిక ఆనందం కోసం ఏర్పడిందే. ప్రధానంగా యువత తాము ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా మారిపోయింది. ఈ ఫొటోల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోసారి ప్రాణాల మీదికీ తెస్తున్నాయి. వీటి కారణంగా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వారికి పట్టట్లేదు. ఇవి ప్రత్యక్షంగా ప్రమాదాలకే కాకుండా పరోక్షంగా సైబర్ క్రైమ్‌కు కారణమవుతున్నాయి. యువతులు పోస్ట్ చేసిన సెల్ఫీలను గమనిస్తున్న సైబర్ పోకిరీలు వాళ్లు వెళ్లిన, వెళ్తున్న ప్రాంతాలను స్పాట్ చేయడం, వేధింపులు, బ్లాక్‌మెయిల్స్‌కు దిగడం జరుగుతున్నాయి. - పి.రాజు, ఇన్స్పెక్టర్, సైబర్‌క్రైమ్ ఠాణా -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికంగా ఉండే వామన్పల్లి ముత్యం(28) అనే వ్యక్తి ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికుల సమాచారం అందించడంతో కుంతాల పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (కుంతాల) -
తిరగలేక.. బతకలేక...
ఆత్మహత్యలకు కలెక్టరేట్‌ను వేదికగా చేసుకుంటున్న బాధితులు ►కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు ►ప్రజా విజ్ఞప్తులపై స్పందన కరువు ►ప్రహసనంగా దరఖాస్తుల స్వీకరణ ►పరిష్కారంపై అధికారుల మొద్దునిద్ర ►మొక్కుబడి సమీక్షలతో ఫలితం శూన్యం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రజావాణి పేరిట ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సామాన్యుల నుంచి నేరుగా స్వీకరించే వినతుల పరిష్కారం ప్రహసనంగా మారింది. సమస్యల పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, శాస్త్రీయంగా సమీక్ష జరగక పోవడం సామాన్యులకు ప్రాణ సంకటంగా మారింది. గ్రామ, మండల స్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేక సామాన్యులు చివరి ప్ర యత్నంగా ‘ప్రజావాణి’ని వేదికగా ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకుని వివిధ అంశాలపై ప్రతి సోమవారం వందలాది మంది కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి జిల్లా అధికారులకు అందజేస్తున్నారు. ప్రజావాణిలోఅందే ప్రతి పిర్యాదునూ క్షుణ్ణంగా పరి శీలించి పరిష్కరించాల్సిన అధికారులు చేతులు దులుపుకుం టున్నారు. తిరిగి మండల స్థాయి అధికారులకే దరఖాస్తులను పంపిస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్లు ప్రయాణించి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి లైన్లో నిలుచున్నా పరిష్కారం దొరకడం లేదు. కొన్నిమార్లు అధికారుల నుంచి తిరస్కారం కూడా ఎదురవుతుండడం దరఖాస్తుదారులను మరింత వేదనకు గురి చేస్తోంది. దీంతో కొందరు దరఖాస్తుదారులు ఏకం గా కలెక్టరేట్ సాక్షిగా ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. అరకొరగా సమీక్షలు ప్రజావాణి దరఖాస్తులపై అధికారులతో ప్రతి సోమవారం సాయంత్రం కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ దర ఖాస్తులు పెండింగులో ఉంచడాన్ని అధికారులు సమర్థించుకుంటున్నారు. కలెక్టర్ గట్టిగా మందలించినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజావాణికి స్వయంగా హాజరు కావాల్సిన అధికారులు దరఖాస్తుల స్వీకరణ, కలెక్టర్ సమీక్షకు కూడా కిందిస్థాయి సిబ్బందిని పంపుతున్నారు. కలెక్టరేట్ భవనంపైకి ఎక్కకుండా ఇటీవల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్లోనే విజ్ఞాపనలు స్వీకరిస్తామని కలెక్టర్ శ్రీదేవి ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆన్లైన్లో కూడా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. వీటి పరిష్కారం దిశగా శాస్త్రీయ కసరత్తు జరగక సామాన్యులు పాలన యంత్రాంగం తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 250 ప్రభుత్వ విభాగాలు, శాఖలకు సంబంధించి 2548 ఫిర్యాదులు అందగా 696 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నాలిలా... 2014 నవంబరు 3వ తేదీన హజీ గయస్ పీరాసాహెబ్ అనే వృద్ధుడు ఇంటిస్థలం కేటాయింపు విషయంలో అధికారులు సహకరించడం లేదంటూ కలెక్టరేట్ భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జిల్లా ఆసుపత్రిలో చేర్చి కలెక్టర్ ప్రియదర్శిని స్వయంగా పరామర్శించారు. నాలుగు రోజుల తర్వాత పీరా సాహెబ్ మృతిచెందాడు. మద్దూరు మండలానికి చెందిన దంపతులు భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ పురుగుల మందు డబ్బాతో వచ్చి కలెక్టర్ సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించారు.సోమవారం వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన శ్రీరాములు, చింత లక్ష్మి దంపతులు ఇంటిస్థలం విషయంలో అధికారులు స్పందించడం లేదంటూ ఆత్మహత్యకు యత్నించారు. -
ఆర్ధిక ఇబ్బందులతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని చింతల్ లో ఆర్థిక ఇబ్బందులతో ఓ ఫొటోగ్రాఫర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... స్తానిక వెంకట్రామిరెడ్డినగర్‌లో నివాసముంటున్న బిట్ల రామ్‌ప్రసాద్(38) అనే వ్యక్తి గణేశ్ నగర్ సమీపంలో ట్రెండీ ఫొటో స్టూడియోను మరొకరితో కలిసి నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా రామప్రసాద్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
ముగ్గురు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు మెదక్, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయగా.. అందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. రెడ్డిమల్లి శ్యామల మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తల్లి రాజమణి (55), పిల్లలు స్పందన(7), నంద కౌశిక్‌రెడ్డి(5)లతో కలిసి పట్టణంలోని వీర హనుమాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 2010లో రాజీవ్ యువశక్తి లోన్లు ఇప్పిస్తామంటూ శ్యామల మరికొంత మందితో కలిసి వివిధ పట్టణాల్లో యువకుల నుంచి రూ.14 లక్షలు లంచాలుగా వసూలు చేసింది. అప్పట్లో ఈ మేరకు కేసు నమోదు కాగా అప్పటి నుంచి శ్యామలకు భర్త ప్రభాకర్‌రెడ్డి దూరంగా ఉంటున్నాడు. భర్త ఎడబాటు, కోర్టు కేసులు, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన శ్యామల మంగళవారం రాత్రి మెదక్‌లో కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్‌డ్రింక్‌లో కలిపిన విషాన్ని తాగి శ్యామల పిల్లలు స్పందన, నందకౌశిక్రెడ్డి అక్కడికక్కడే మరణించారు. కాగా శ్యామల, ఆమె తల్లి రాజమణి ప్రాణాలు పోకపోవడంతో రోడ్డుపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి బుధవారం తెల్లవారుజామున సమీపంలోని మల్లం చెరువులో దూకగా రాజమణి నీట మునిగి మృత్యువాత పడింది. కాగా శ్యామలను కొందరు రక్షించారు. తాను చేసిన తప్పుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు, కుటుంబ సభ్యుల మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తనను క్షమించాలని కోరుతూ శ్యామల ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి నుద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ సీఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పొన్నాల’ నియామకంపై నిరసన
యువకుడి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియామకాన్ని నిరసిస్తూ సంజయ్‌గాంధీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రాఘవగౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జేబులో జాతీయ జెండాను పెట్టుకొని సోమవారం ఉదయం ఆయన గాంధీభవన్‌లోకి ప్రవేశించాడు. భవనం పైకి ఎక్కిన అతను... అవినీతిపరుడైన పొన్నాలను తొలగించాలంటూ నినాదాలు చేశాడు. లేకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. పోలీసులు అతన్ని కిందకి దింపి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బెంగళూరుకు కాపు తరలింపు
బళ్లారి : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని మంగళవారం రాత్రి విమ్స్ వైద్యుల సూచన మేరకు బెంగళూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సలు చేపట్టారు. విమ్స్‌లో రైల్స్ ట్యూబ్ ద్వారా పురుగులు మందును బయటకు తీశారు. పామ్స్, ఆట్రోపిన్ యాంటిబయాటిక్ మందులు ఇస్తూ చికిత్సలు చేపట్టారు. ఐసీయూలోకి తరలించినా జన సందోహాన్ని పోలీసులు నియంత్రించడానికి వీలుకాలేదు. దీంతో మెరుగైన చికిత్స అందించాలంటే ప్రత్యేక వాతావరణం ఉండాలని వైద్యులు నిర్దారణకు వచ్చారు. అంతేకాకుండా 48 గంటల వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో విమ్స్ వైద్యులు, కాపు సతీమణి భారతి, తనయుడు ప్రవీణ్ ఇతర ప్రముఖులు బయలుదేరి వెళ్లారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : భారతి కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి సాక్షితో మాట్లాడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే తమ కుటుంబసభ్యులంతా పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాపును పరామర్శించిన ప్రముఖులు బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, ఆలమూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి, బళ్లారి టచ్ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధినేత నారా భరత్‌రెడ్డి, మాజీ ఉపమేయర్ శశికళ, మాజీ కార్పొరేటర్ కేఎస్. దివాకర్ వీరశంకర్రెడ్డి, మానవహక్కుల సంఘం నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, భోజరాజు నాయక్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మమ్మల్ని అనుమానించారు
మాది అన్నా, చెల్లెలు సంబంధం. మమ్మల్ని అనుమానించారు.. అవమానించారు.. అందుకే ఇద్దరం కలిసి ప్రాణాలు తీసుకుంటున్నాం.. అంటూ సూసైడ్ నోట్‌ను రాసి ఇద్దరు స్నేహితులు సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండలంలోని బుడమగుంట క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ సమాధి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు సీవీఆర్ మధురానగర్‌కు చెందిన సాపర్ల రవి (27), కాటంగారి నాగూరమ్మ (22) ఇద్దరు స్నేహితులు, ఇద్దరు వివాహితులే. రవి పోర్టులో కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన కాటంగారి నాగూరమ్మకు వివాహమైంది. వీరికి వర్షా అనే మూడేళ్ల కుమార్తె ఉంది. నాగూరమ్మ, రవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇది ఇరువురి ఇళ్లలో తెలిసి వివాదం జరిగింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ శనివారం ఇంటి నుంచి మోటారుసైకిల్‌పై కావలికి వచ్చారు. రెండు రోజుల నుంచి కావలి ఏరియా వైద్యశాల పరిస ర ప్రాంతాల్లో తిరుగాడారు. మండలంలోని బుడమగుంట క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ సమాధి వద్దకు ఆదివారం రాత్రి చేరుకున్నారు. మోనోక్రోటోపాస్ పురుగు మందును దమ్స్ప్ బాటిల్లో కలుపుకుని నాగురమ్మ తాగగా, బీరు బాటిల్లో కలుపుకుని రవి తాగాడు. తాము ఎందుకు చనిపోతున్నామో తెలుపుతూ ఓ నోటు పుస్తకంలో సూసైడ్ నోట్‌ను రాశారు. అయితే పురుగుల మందు తాగిన తర్వాత వారికి బతకాలని ఆశ పుట్టింది. దీంతో ఇద్దరు మోటారు సైకిల్‌పై ఆసు పత్రికి పట్టణంలోకి బయలుదేరారు. ఉదయగిరి బ్రిడ్జిపై సరికి వచ్చే తీవ్ర సరికి అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. గమనించిన రెండో పట్టణ పోలీసులు చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ నాగూరమ్మ మృతి చెందింది. రవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని డీఎస్సార్ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. అతను నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానం భరించలేకే.. ముత్తుకూరు : తాను రవితో సన్నిహితంగా ఉంటే తన భర్త వెంకటేశ్వర్లు, అయన చిన్నాన్న, చిన్నమ్మ కాటంగారి వెంకటేశ్వర్లు, పోలమ్మ అనుమానించారు. అందుకే చనిపోతున్నామని సూసైడ్ నోట్లో నాగూరమ్మ రాసింది. ఈ విషయమై నా భర్త నన్ను కొట్టాడు. ఇంటి నుంచి తరిమేశాడు. ఈ విషయాన్ని గ్రామ కాపులకు, పోలీసులకు చెప్పినా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్లో పేర్కొంది. తనకు రవి అన్న వరుస అవుతాడని అందులో పేర్కొంది. తాను ఏ తప్పు చేయలేదని, తనకు నాగూరమ్మ చెల్లెలు అవుతుందని రవి రాశాడు. అవమానాలు పాలైన తాము ఇద్దరం కలిసి ప్రాణాలు వదలాలని నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్య విషయం తెలియడంతో గ్రామానికి చెందిన మత్స్యకారులు కావలికి తరలిపోయారు. -
భార్య కాపురానికి రాలేదని..
నెల్లూరు (క్రైమ్), : భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన ఓ భర్త తన ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగనాయకులపేటలోని పొర్లుకట్ట ఉప్పరపాళెంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు...పొర్లుకట్టకు చెందిన అరవ శ్రీను అలియాస్ శివ (38)కు చింతారెడ్డిపాళెంకు చెందిన ఝా న్సీతో ఏడేళ్ల కిందట వివాహమైంది. శ్రీను సోమిశెట్టి కల్యాణ మంటపం సమీపంలోని టీ దుకాణంలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన శ్రీను తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. దీంతో పలు దఫాలు భర్త ప్రవర్తనపై జాన్సీ మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారం కిందట దంపతుల నడుమ ఘర్షణ జరిగింది. ఇక్కడుంటే మారవని, తనతో పాటు చింతారెడ్డిపాళెంకు రావాలని ఝాన్సీ భర్తను కోరింది. అతను నిరాకరించడంతో ఆదివారం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను పనికి వెళ్లడం లేదు. ఫూటుగా మద్యం సేవిస్తూ తిండి తినడం మానేశాడు. తల్లి, సోదరి విజ్ఞప్తి మేరకు అతను మంగళవారం చింతారెడ్డిపాళెంకు వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెందిన శ్రీను మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఎవరికి కనిపించలేదు. బుధవారం ఉదయం టీ దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి వచ్చి శ్రీను ఇంటికి వెళ్లి తలుపులు తట్టి పిలిచినా ఎలాంటి అలికిడి లేదు. అతను శ్రీను తల్లిని అడిగాడు. ఆమె తనకు తెలియదని చెప్పి ఇంటికి వెనక వైపునున్న కిటికీలో నుంచి చూడగా ఇంటి రేకులకు వేసిన దూలానికి శవమై కనిపించాడు. మూడో నగర ఎస్ఐ నాగభూషణం శ్రీను తల్లి, సోదరి సమక్షంలో తలుపులు పగలగొట్టించి మృతదేహాన్ని కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానం.. క్షణికావేశం!
పద్దకొత్తపల్లి / లింగాల, ఆ జంటకు తొమ్మిది నెలల క్రితమే వి వాహమైంది.. అనుమానం వారి పాలి ట శాపమైంది.. నిండు నూరేళ్లు జీవి తం గడపాల్సిన ఆ దంపతులు తరచూ గొడవ పడేవారు.. ఈ క్రమంలోనే క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములకు చెం దిన గౌరమ్మ (22)కు లింగాల వాసి కృష్ణయ్య (26) తో గతేడాది మే నెలలో వివాహమైంది. ఆ సమయంలో *లక్షతో పా టు నాలుగు తులాల బంగారాన్ని ఇచ్చారు. ఇద్దరూ స్థానికం గా కూలిపని చేస్తూ జీవనం సాగించేవారు.] అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తర చూ గొడవ పడుతుండేవా డు. దీంతో ఈనెల 21న ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అతను స్కూటర్‌పై వచ్చి అదే రాత్రి ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని దేదినేనిపల్లి రోడ్డు పక్క న ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని తమ ప్రాణాలు బలితీసుకున్నా రు. సోమవారం ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సైదులు, తహశీల్దార్ జంగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా కృష్ణయ్యకు తల్లి లక్ష్మమ్మతో పాటు ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. గౌరమ్మకు తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటయ్య తోపాటు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
నిర్లక్ష్యం’ ఖరీదు నిండు ప్రాణం
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కళాశాలలో ఈ-4 చదువుతున్న నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మరికొందరు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు, సిబ్బంది, అంబులెన్సు అందుబాటులో లేక విద్యార్థులు వెనుదిరిగారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు 40 నిమిషాల తర్వాత ఓమిని వ్యానును పంపించారు. వ్యానులో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగరాజును ఆస్పత్రికి తరలించే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తమకు అధికారులు చెప్పలేదని నిలువరించారు. అధికారుల సమాచారం వచ్చాకే బయటకు తీసుకువెళ్లాలని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు అధికారులు స్పందించడంతో విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే నాగరాజు ప్రాణాలు వదిలాడు. అధికారుల నిర్లక్ష్యం తమతోపాటు చదువుకునే విద్యార్థి నాగరాజును రక్షించుకోలేక పోయామని అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ట్రిపుల్ ఐటీలో చదివుతున్న ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, సీఎస్‌వో వజీరోద్ధిన్, సెక్యూరిటీ సూపర్వైజర్ స్వామి, సాయినాథ్, శివప్రసాద్‌లను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థులు పట్టుబట్టారు. భైంసా డీఎస్పీ గిరిధర్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని కళాశాల అధికారులను పిలిపించి విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. కళాశాల అధికారుల దాటవేత ధోరణితో మరోసారి విద్యార్థులు మధ్యాహ్నం రెండోసారి రోడ్డుపై బైఠాయించారు. అధికారులను తొలగించనిది ఆందోళన విరమించమని రాత్రి వరకు కూడా రోడ్డుపైనే బైఠాయించారు. దిగొచ్చిన అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థుల డిమాండ్లపై వారితో చర్చించారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజొద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పది గంటలపాటు ఆందోళన చేసిన విద్యార్థులు రిజిస్ట్రార్ సోమయ్య నచ్చజెప్పడంతో శాంతించారు. గతంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా సస్పెండ్ చేసి మళ్లీ కొనసాగించారని విద్యార్థులు పేర్కొన్నారు. సస్పెండ్ అయిన అధికారులు మళ్లీ కొనసాగితే ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని విద్యార్థులు హెచ్చరించారు. సమస్యలతో సహవాసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. నిద్రలేవగానే నీటి కష్టాలతో వారి అవస్థలు మొదలవుతాయి. స్నానాలు చేయకుండానే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. ఆడ పిల్లలయితే నీటి కోసం వేకువజామునే నిద్రలేచి బారులు తీరాల్సిన పరిస్థితి. ఇక మెస్‌కు వెళ్తె అక్కడ సరైన భోజన సౌకర్యం ఉండదు. ఈ విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ అధికారులు స్పందించరు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. అంతా తామై వ్యవహరిస్తున్న ఇక్కడి అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులకు విద్యార్థులు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లో కరెంటు సరఫరాలోనూ తీవ్ర అంతరాయం తప్పదు. చీకటి గదుల్లో చదవలేక ఆరు బయట మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడి వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా కళాశాలలో చదివే విద్యార్థులు మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కళాశాలను ప్రారంభం నుంచి ఇప్పటివరకు నడిపిస్తున్న అధికారులను తప్పిస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం.. - నాగరాజు పింగళి, బాసర ఎస్సై ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం. ఉద్యోగం రాకపోవడమా, అనారోగ్య కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయో అనే కోణంలోనూ పరిశీలిస్తాం. నాగరాజు ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నాం.