ఆర్ధిక ఇబ్బందులతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య | man suside with the financial crises | Sakshi

ఆర్ధిక ఇబ్బందులతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య

Feb 9 2015 1:37 PM | Updated on Oct 2 2018 5:51 PM

నగరంలోని చింతల్ లో ఆర్థిక ఇబ్బందులతో ఓ ఫొటోగ్రాఫర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ : నగరంలోని చింతల్ లో ఆర్థిక ఇబ్బందులతో ఓ ఫొటోగ్రాఫర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... స్తానిక  వెంకట్రామిరెడ్డినగర్‌లో నివాసముంటున్న బిట్ల రామ్‌ప్రసాద్(38) అనే వ్యక్తి గణేశ్ నగర్ సమీపంలో ట్రెండీ ఫొటో స్టూడియోను మరొకరితో కలిసి నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా రామప్రసాద్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement