మాట్లాడుతున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు
విద్యానగర్(కరీంనగర్): ఇటీవల కోర్టు ఆవరణలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న నాయిని శ్రీనివాస్ మృతికి కరీంనగర్ కార్పొరేటర్ గుగ్లిళ్ల జయశ్రీ– శ్రీనివాస్ దంపతులే కారణమని ఆయన భార్య నాయిని సరిత ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. తన భర్త నాయిని శ్రీనివాస్ వద్ద నుంచి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్ ఖర్చుల నిమిత్తం రూ.8.50లక్షలు, మూడున్నర తులాల బంగారం తీసుకున్నట్లు తెలిపారు.
తిరిగి ఇమ్మని అడిగితే.. ఇవ్వకపోగా.. తమ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఆ భయంతోనే తన భర్త ఆత్మహత్మ చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు కారణమైన కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌పై కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అరెస్టు చేయడం లేదని, మంత్రి గంగుల కమలాకర్ అండతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ డబ్బు, బంగారం ఇప్పించి, కార్పొరేటర్ జయశ్రీ– శ్రీనివాస్‌ను అరెస్టు చేయాలని కోరారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com.
Comments
Please login to add a commentAdd a comment