తల్లి అనారోగ్యం చూసి తట్టుకోలేక.. కుమారుడి ఆత్మహత్యాయత్నం
Published Mon, Aug 8 2016 5:06 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
ఏలూరు (మెట్రో): తల్లికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెను ఐసీయూలో చూసిన కుమారుడు మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన మహ్మద్ బాషా తల్లి మున్నీ కొద్దికాలంగా మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. దీంతో బాషా మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement