ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
Published Fri, Aug 5 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
కోల్‌సిటీ : ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది గోదావరిఖనికి చెందిన కోడూరి రాము(25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన రాయమల్లు కుమారుడు రాము 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కొంతకాలంగా డ్రై వర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం మిత్రులతో కలిసి కాళేశ్వరం వెళ్లిన రాము సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడు గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్థానిక 5ఏ గని సమీపంలోని ఇసుక బంకర్ దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాము తండ్రి రాయమల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స రాజమౌళిగౌడ్ తెలిపారు.
Advertisement
Advertisement