పండితవిల్లూరు(పోడూరు) : పండితవిల్లూరులో బుధవారం పురుగులమందు తాగి ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పండితవిల్లూరు హైస్కూలు సమీపంలో నివసించే వట్టికూటి నర్సింహమూర్తి(80) పురుగులమందు తాగి పంటకాలువ సమీపంలో పడిపోయి ఉన్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నర్సింహమూర్తిని పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్‌వో బి.శ్రీనివాసరావు నర్సింహమూర్తి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. స్థానిక ఎస్‌ఐ డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.