భార్య ప్రియుడు ఇంటి ముందు భర్త ఆత్మహత్యాయత్నం
Published Mon, Aug 8 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
నెల్లూరు (క్రైమ్) : తన భార్య ప్రియుడు ఇంటి ముందు భర్త ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన కఠారిపాళెంలో ఆదివారం చోటు చేసుకుంది. కఠారిపాళెంకు చెందిన మణి సండేమార్కెట్‌లో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇది వరకే ఓ మహిళతో వివాహమైంది. ఆమెను వదిలివేశాడు. లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన కిశోర్ అనే వ్యక్తితో చనువుగా ఉం టుంది. ఈ విషయమై పలు దఫాలు దంపతుల నడుమ గొడవలు జరిగాయి. తన భార్యతో సన్నిహితంగా ఉండ టం మానివేయాలని మణి పలుమార్లు కిశోర్‌కు, భార్యకు చెప్పాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మణి మనస్థాపం చెంది కిశోర్ ఇంటి వద్దకు వెళ్లాడు. తన భార్యను వదిలివేయమని ప్రాధేయపడ్డాడు. అయినా అతను పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలపాలైన మణిని చికిత్స నిమిత్తం డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడోనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement