లావణ్య(ఫైల్)
మెట్‌పల్లిరూరల్: వేధింపులు భరించలేక మండలంలోని జగ్గాసాగర్‌కు చెందిన వివాహిత ఒడ్డాటి వెల్మనేరెళ్ల లావణ్య(25) కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శంకర్‌రావు తెలిపిన వివరాలు. నాలుగేళ్ల క్రితం మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే లావణ్య తల్లిగారింట్లోనే ఉంటుంది. అయితే కొండ్రికర్లలో నివసించే ట్రాక్టర్ డ్రైవర్ రహీం వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి భూమారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment