herasment
-
స్టూడెంట్ పోలీస్
దూషణ నుంచి ఈవ్‌టీజింగ్, హెరాస్మెంట్, డొమెస్టిక్ వయొలెన్స్, దాడి, లైంగిక దాడి.. ఎంతటి తీవ్రమైన నేరాన్ని ఎదుర్కొన్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటే భయపడ్తారు మహిళలు. పోలీసులకు చెప్పేకన్నా నేరం తాలూకు బాధను భరించడమే నయమనే భావనలో ఉంటారు. పోలీసుల ప్రవర్తనపట్ల ఉన్న భయమే కారణం. ఇలాంటి భయాన్ని పోగొట్టి.. మహిళలకు, పోలీసులకు మధ్య స్నేహాన్ని పెంపొందించి.. ఏ ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా పోలీసులకు చెప్పే వాతావరణాన్ని కల్పించమని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్.. ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది. ఇది చాలా వైరల్ అయ్యి అక్కడి పోలీసులనూ ఆలోచింపచేసింది. ఓ అడుగు ముందుకేసేలా కదిలించింది కూడా. దాని పర్యవసానమే... ఆ జిల్లాల్లోని విద్యార్థినులను ఒకరోజు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా నియమించాలని ఘజియాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులను మొదలు పెట్టారు కూడా. పోలీసులు నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఘజియాబాద్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థినుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని పర్యవేక్షణ, మహిళల మీద జరుగుతున్న నేరాలు, అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు.. మొదలైన వాటి మీద శిక్షణనిస్తారు. తర్వాత సీనియర్ పోలీస్ అధికారులు వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి స్థానిక పోలీస్స్టేషన్లకు ఒకరోజు ఇన్చార్జిగా నియమిస్తారు. దీనివల్ల పోలీసులంటే భయం పోవడమే కాకుండా.. అనుకూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలస్తుంది, పోలీసులకు, మహిళలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. క్విజ్, వ్యాసరచనతో... స్కూళ్లల్లో క్విజ్, వ్యాసరచన పోటీలు పెట్టి, నెగ్గిన విద్యార్థినులను స్టేషన్ ఇంచార్జీలుగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఘజియాబాద్ అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడొకరు పోలీసులకు సలహా ఇచ్చారు. దీని గురించి పోలీసులూ ఆలోచిస్తున్నారట. ఏమైనా పోలీసులు ఇలాంటి చొరవ తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల జరిపిన పలు సర్వేల్లో మహిళలకు జరిగిన అన్యాయం గురించి మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల సంఖ్య ఇదివరటికంటే 22 శాతం పెరిగిందని తేలింది. దీన్నిబట్టే ఘజియాబాద్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని అనుకుంటున్నారంతే. మన దగ్గర షీటీమ్స్ వగైరా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాలూ చేపడితే మరిన్ని మంచి ఫలితాలు వచ్చి.. మహిళల పట్ల జరిగే నేరాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందేమో! -
‘అమ్మ’కు రాజీనామా!
నటి భావనపై వేధింపుల విషయంలో జైలుకు వెళ్లారు మలయాళ నటుడు దిలీప్. ఆయన బెయిల్ మీద బయటకు రాగానే ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ’ (అమ్మ)లో తిరిగి ఆయన్ను సభ్యుడిగా తీసుకోవడంపై కొందరు మలయాళ నటీమణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అతన్ని అసోసియేషన్లోకి ఎలా తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి తొలగించాలి? అని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇటీవల డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) సభ్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సమాధానంగా దిలీప్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది ‘అమ్మ’. ‘‘దిలీప్‌ను రాజీనామా చేయమని కోరాం. ఇది డిసిప్లినరీ యాక్షన్‌గా చేసింది అనుకోవచ్చు. ఒకవేళ దిలీప్ రాజీనామా చేయకపోతే అసోసియేషన్ నుంచి మేమే తొలగించేవాళ్లం’’ అని ‘అమ్మ’ కమిటీ పేర్కొంది. అవకాశలు తగ్గిపోయాయి ‘‘ఎప్పుడైతే డబ్ల్యూసీసీ ఏర్పాటు చేశానో అప్పటి నుంచి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి’’ అని పేర్కొన్నారు జాతీయ అవార్డు అందుకున్న మలయాళ నటి పార్వతి. మలయాళ అసోసియేషన్ ‘అమ్మ’ వైఖరికి ఎదురుగా నిలబడి మాట్లాడారు ఈ హీరోయిన్. ఇలా ధైర్యంగా నిలబడినందుకే నాకు అవకాశాలు తగ్గాయన్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇలా బాహాటంగా మాట్లాడినందుకు ఇండస్ట్రీలో నన్ను ఒక్కదాన్ని చేసేశారు. వేరేవాళ్లు నాతో మాట్లాడటానికి కూడా సంకోచించేలా చేస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ర క్షణ ఉంటుందో లేదో అని కంగారుగా ఉంది. గత నాలుగేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. కానీ ఇటీవల ఒకే ఒక్క సినిమాకి అవకాశం వచ్చింది. కేవలం పేపర్లోనే కేరళ మోడరన్ సంప్రదాయాలతో ఉండే రాష్ట్రం. కానీ విషాదకర నిజమేంటంటే జనాలు ఇంకా గుడ్డి నమ్మకాలతోనే బ్రతుకుతున్నారు’’ అని పేర్కొన్నారు. -
వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం
విజయనగరం ఫోర్ట్: వార్డెన్ వేధింపులు భరించలేక ఓ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన లెంక అనసూర్య (29) పట్టణంలోని దాసన్నపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తోంది. 2016లో అనసూర్య జాయిన్ అయినప్పటి నుంచి వార్డెన్ రాణి ఆమెను వివిధ రకాలుగా వేధిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా తయారుకావడంతో అనసూర్య బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్లోనే చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
మెట్‌పల్లిరూరల్: వేధింపులు భరించలేక మండలంలోని జగ్గాసాగర్‌కు చెందిన వివాహిత ఒడ్డాటి వెల్మనేరెళ్ల లావణ్య(25) కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శంకర్రావు తెలిపిన వివరాలు. నాలుగేళ్ల క్రితం మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే లావణ్య తల్లిగారింట్లోనే ఉంటుంది. అయితే కొండ్రికర్లలో నివసించే ట్రాక్టర్ డ్రైవర్ రహీం వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి భూమారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థినుల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ప్రాధానోపాధ్యాడితోపాటు పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. 7,9,10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పెట్టే మానసిక, శారీరక వేధింపులు భరించలేక తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, అందువల్ల పోకిరీ టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు
పొన్నూరు : తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే డాక్టర్ టి.రాజారావుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. స్థానిక ప్రజా వైద్యశాలలో ఆదివారం రాజారావును కలిసి అక్రమ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులంటే టీడీపీకి చులకనని, గతంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజారావుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ టి.రాజారావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి డక్కుమళ్ళ రవి తదితరులు ఉన్నారు. -
కాల్‌మనీ వేధింపులపై ఫిర్యాదుల వెల్లువ
గ్రీవెన్స్‌లో అధికారుల ఎదుట బాధితుల గోడు గుంటూరు (ఏటీ అగ్రహారం): జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్, అర్బన్ ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితుల సమస్యల పరిష్కారం కోసం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు సంబంధిత అధికారులకు తగిన అదేశాలు ఇచ్చారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ► ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేటకు చెందిన షేక్ యూసఫ్ అదే పేటకు చెందిన షేక్ మసూద్ వద్ద నాలుగు సంవత్సరాల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి నెలకు రూ.16 వేలు చొప్పున వడ్డీ కడుతున్నాడు. తన తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి సరిగా లేక 6 నెలల నుంచి వడ్డీ కట్టడంలేదు. దీంతో షేక్ మసూద్ డబ్బులు కట్టమని పోలీసులతో బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ► నెహ్రూనగర్ బుచ్చయ్యతోటకి చెందిన టీ.శ్రీనివాస్ 8 సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన సీదా రంగారావు వద్ద రూ. 90 వేలు, పూల నారాయణ వద్ద రూ.1 లక్ష వడ్డీకి తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరికీ నెలనెల వడ్డీ కడుతూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వడ్డీతోపాటు కొంత ఆసలు తిరిగి చెల్లించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో మూడు నెలల నుంచి వారికి వడ్డీ డబ్బులు కట్టలేకపోతున్నానని, దానికి వారు తనను ఇంటిలో నుంచి రోడ్డుపైకి ఇడ్చుకొచ్చి కొడుతున్నారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టమని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తీసుకున్న డబ్బు చెల్లించేందుకు కొంత గడువు ఇప్పించి, వారి బెదిరింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని కోరాడు. ► తాడేపల్లికి చెందిన కొండెపోగు శాంతి తన 2.54 ఎకరాల భూమిని, 5 సెంట్లు ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాడేపల్లికి చెందిన బాలసాని రాజేశ్వరరావు కొంత మంది రౌడీలతో కలసి 1.73 సెంట్లు భూమిని ఆక్రమించున్నాడని, అడిగితే రౌడీలతో కొట్టిస్తున్నాడని, తను నివసించే ఇంటిని కూడా తగులబెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. సముద్రాల శౌరి అనే వ్యక్తి 81 సెంట్లు కబ్జా చేశాడని పేర్కొంది. వారిద్దరూ తన మొత్తం భూమిని ఆక్రమించుకున్నారని 2003 నుంచి ఆధికారుల చూట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం చేయాలని కోరింది. ►పెదకాకాని మండలం, రామచంద్రపాలెం గ్రామానికి చెందిన దొప్పలపూడి చిట్టెమ్మ తన ఫిర్యాదులో.. తన కుమార్తె 15 సంవత్సరాల క్రితం చనిపోయిందని, తరువాత అల్లుడు భవాని అనే ఆమెను మరో పెళ్ళి చేసుకున్నాడని, కూతురు చనిపోయినప్పటి నుంచి మనవరాలు భాగ్యశ్రీ తన వద్దే పెరుగుతోందని పేర్కొంది. అయితే నాలుగు సంవత్సరాల క్రితం అల్లుడు కూడా మరణించాడని, తన అల్లుడి ఆస్తికి మనవరాలు భాగ్యశ్రీ వారసురాలు అని ఫిర్యాదులో తెలిపింది. అయితే భావాని అనే ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని మనవరాలి ఆస్తిని అక్రమించుకుందని ఆరోపించింది. వారి నుంచి∙తన మనమరాలు భాగ్యశ్రీకి, ఆమె ఆస్తికి చట్టరీత్యా రక్షణ కల్పించాలని కోరింది. ► పిడుగురాళ్ళకు చెందిన మహ్మద్ రఫి, మహబూబి తమ ఫిర్యాదులో...తమ కూతురు అప్సర ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడంలేదని రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించడం లేదని, తమ కూతురిని వెతికించాలని విజప్తి చేశారు. ► చిలకలూరిపేటకి చెందిన తిన్నలూరి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన వడ్లమాని లక్ష్మీ ఈ నెల 21న స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నామని, తమ ఇద్దరి తల్లిదండ్రుల వైపు నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని వారు రూరల్ ఎస్పీని ఆశ్రయించారు. -
మూడేళ్ల కొడుకుపై తల్లి పైశాచికం
ఒంగోలు : ప్రత్యూష.. సంధ్య.. నిన్నమొన్న మహబూబ్ నగర్ లో ఐదేళ్ల చిన్నారి.. ఇప్పుడు ఒంగోలులో మూడేళ్ల బాలుడు.. తల్లిదండ్రులు, సవతి తల్లుల చేతిలో హింసకు గురవుతున్న బాలల ఉదంతాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఒంగోలు పట్టణంలోని కొటవీధిలో మూడేళ్ల కొడుకును ఓ తల్లి చిత్రహింసలకు గురిచేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కోటవీధికి చెందిన రిజ్వానాకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. కాగా గర్భిణీగా తల్లివారింటికి వచ్చిన రిజ్వానా తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. ప్రస్తుతం రిజ్వానా కుమారుడు ఫర్హాన్‌కు మూడేళ్లు. రిజ్వానా.. తన కుమారుడు ఫర్హాన్‌ను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండేది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు.. ప్రభుత్వాధికారుల సహాయంతో ఆ బాలుడ్ని కాపాడారు. ఒంటినిండా గాయాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. తల్లి పైశాచికంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా రిజ్వానాకు వేరే వ్యక్తితో సంబంధం ఉండటంతో బాలుడిని చిత్రవధ చేసేదని స్థానికులు చెబుతున్నారు. అలా చేస్తే బాలుడి తండ్రి వచ్చి కొడుకుని తీసుకొని వెళ్తాడని భావించి ఈ పనికి పూనుకొని ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు.