కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న అనసూర్య
విజయనగరం ఫోర్ట్: వార్డెన్ వేధింపులు భరించలేక ఓ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన లెంక అనసూర్య (29) పట్టణంలోని దాసన్నపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో అటెండర్‌గా పనిచేస్తోంది.
2016లో అనసూర్య జాయిన్ అయినప్పటి నుంచి వార్డెన్ రాణి ఆమెను వివిధ రకాలుగా వేధిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా తయారుకావడంతో అనసూర్య బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్‌లోనే చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment