warden
-
37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు
ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేశ్‌బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబసభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకు చేరుకున్నారు.వార్డర్లతో, జైలు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి జైల్ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు. -
నారాయణ మనుష్యులు మరీ..!
సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్‌లోని నారాయణ కాలేజీ వార్డెన్‌గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. -
హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..
హయత్‌నగర్(హైదరాబాద్): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్ వార్డెన్‌ను ఆదివారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్లో నెల రోజుల క్రితం వార్డెన్‌గా చేరాడు. చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి.. విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యాయత్నం
-
చందాల కోసం వేధింపులు భరించలేక
విశాఖపట్నం , కశింకోట(అనకాపల్లి): చందాల కోసం కొందరు స్థానికులు పెడుతున్న వేధింపులు భరించలేక మనస్తాపంతో స్థానిక హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సమగ్ర బాలికల వసతి గృహం సంక్షేమ అధికారి(వార్డెన్) లొడగల శ్రీదేవి ప్రధానంగా మూడు అంశాల్లో స్థానికులు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నిం చారు. స్థానిక గ్రామ ఉత్సవాలకు చందాలతోపాటు మరో అంశం ఇందుకు కారణం. నాలుగు నెలల క్రితం ఇక్కడ నిర్వహించిన ఓ ఉత్సవానికి నిర్వాహకులు చందా కోసం వెళ్లి రూ.పది వేలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమనడంతో ససేమిరా అంటూ బెదిరించారు. అలాగే రెండు నెలల క్రితం వసతి గృహం నుంచి చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లిపోయిన పదవ తరగతి విద్యార్థి మూడు రోజుల తర్వాత తల్లితో వస్తే చేర్చుకోవడానికి వార్డెన్ నిరాకరించారు. దీంతో విద్యార్థి తల్లి స్థానికులను తీసుకు వచ్చి వార్డెన్‌పై వత్తిడి చేశారు. దీంతో సంజా యిషి పత్రం రాసి ఇస్తే చేర్చుకుంటాననడంతో అందుకు వారు సమ్మతించడంతో చేర్చుకున్నారు. తాజాగా ఇటీవల జరిగిన ఒక ఉత్సవానికి చందా కోసం ఒకరు వెళితే రూ.2 వేలు ఇచ్చారు. అది సరిపోదని ఎక్కువ ఇవ్వాలని వత్తిడి చేశారు. ఈ సంఘటనలన్నింటినీ మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురై మనస్తాపం చెంది సోమవారం మోతాదుకు మించి 40 వరకు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సంఘటనలకు సంబంధించి స్థానికులతోపాటు విద్యార్థిని తల్లిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. -
టీడీపీ నేతల వేధింపులు: హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యయత్నం
-
ఆ వార్డెన్ మాకొద్దు
సాలూరు రూరల్,విజయనగరం: వార్డెన్ తమకు సక్రమంగా భోజనం పెట్టలేదని, పలు ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే ఆమెను తొలగించాలని మండలంలోని కురుకూటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వి ద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు పాఠశాల ఎదురుగా ఉన్న రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వార్డెన్ సుశీల సక్రమంగా భోజనం పెట్డడంలేదని ఆమెను తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలసి విద్యార్థినులు ధర్నా చేశారు. ఆదివారం వంట చేయలేదు గ్యాస్ లేదన్న కారణంతో ఆదివారం మధ్యాçహ్నం భోజనం వండలేదని, రాత్రి గ్యాస్ తీసుకువస్తే 10 గంటల సమయంలో భోజనం అందించారు. ఆ సమయంలో 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులు భోజనం చేయకుండా నిరసన తెలిపి ఆకలితోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం కూడా అల్పాహారం చేయకుండా ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి వార్డెన్‌ను తొలగించాలంటూ ధర్నా నిర్వహించారు. డీడీని అడ్డుకున్న విద్యార్థినులు విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమాచారం అందుకున్న ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, ఏటీడబ్ల్యూ వరలక్ష్మితో కలిసి మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నారు. సమయంలో పాఠశాల గేటు వేసి డీడీని అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. పలు పరిణామాల అనంతరం విద్యార్థినులు గేటు తెరవగా డీడీ విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడారు. వార్డెన్ సుశీల సక్రమంగా భోజనం పెట్టడం లేదని, ఆదివారం భోజనం వండకపోవడంతో ఆకలితో పడుకున్నామని 8, 9, 10 తరగతులు విద్యార్థినులు తెలిపారు. తమకు ఆ వార్డెన్ వద్దని, ఆమెను తొలగించాలని పట్టుబట్టారు. గ్యాస్ అయిపోవడం వల్ల భోజనం పెట్టలేకపోయామని వార్డెన్ సుశీల డీడీకి వివరించారు. వార్డెన్‌ను సస్పెండ్ చేశాం డీడీ కిరణ్‌కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ వార్డెన్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. వార్డెన్ బాధ్యతలను హెచ్‌ఎమ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. విచారణ అంశాల నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నామని తెలిపారు. -
బాత్రూమ్లో నీళ్లు పోయలేదని..
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్ వార్డెన్ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. కేకే రెడ్డి స్కూల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న రవీందర్.. బాత్రూమ్లో నీళ్లు పోయలేదన్న కోపంతో 130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని నాగర్ కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం వార్డెన్ రవీందర్ పరారీలో ఉన్నారు. -
బాత్రూమ్లో నీళ్లు పోయలేదని..
-
ప్రశ్నిస్తే.. వేధింపులా?
ఆమె చేసిన తప్పల్లా హాస్టళ్లలో పేద బాలలకు సరైన ఆహారం అందుతోందా? లేదా? అని అడగడమే. తమనే ప్రశ్నిస్తావా? అని ఘరానా వార్డెన్లు కన్నెర్ర చేశారు. ఇక జడ్పీ సభ్యురాలికే రౌడీల వేధింపులు తప్పలేదు. మండ్య: హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రశ్నించినందుకు వార్డెన్లు తనమీదకు రౌడీలను ఉసిగొలిపి నడివీధిలో అసభ్యంగా దూషిస్తూ అవమానిస్తున్నారంటూ జడ్పీ సభ్యురాలు కన్నీటి పర్యంతమైన ఘటన గురువారం మండ్య జిల్లా పంచాయితీ సమావేశంలో చోటు చేసుకుంది. జడ్పీ అధ్యక్షురాలు నాగరత్నస్వామి నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యురాలు సునందమ్మ మాట్లాడుతూ నాగమంగల తాలూకా శికారిపుర గ్రామ హాస్టల్ నిర్వహణ అత్యంత నాసిరకంగా ఉంటోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం కాకుండా హాస్టల్ వార్డెన్లు లోకేశ్, పార్వతిలు వారి ఇష్టానుసారం పిల్లలకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ సునందమ్మ ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు హాస్టల్ వార్డెన్లు తనపై రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారని, ప్రతిరోజూ రౌడీలు బహిరంగ ప్రదేశాల్లో తనను నానా మాటలంటూ అవమానిస్తున్నారని విలపించారు. దీనిపై జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. ఈ విషయాన్ని శాఖ ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళతామని జి.పం అధ్యక్షురాలు నాగరత్న స్వామి తెలుపగా, అధ్యక్షురాలిగా మీరెందుకు ఉన్నారని సునందమ్మ గట్టిగా రోదిస్తూ ప్రశ్నించడంతో అందరూ స్తబ్దులయ్యారు. మాటమార్చిన అధికారులు ఈ క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మాలతి,రాజీవ్‌లు తాము జిల్లావ్యాప్తంగా ఉన్న అనేక హాస్టళ్లను పరిశీలించామని ప్రతీ హాస్టల్లోనూ నిర్వహణ తీరు సక్రమంగానే ఉందంటూ బదులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఎన్ని హాస్టళ్లు పరిశీలించారో చెప్పాలంటూ ప్రశ్నించిన సునందమ్మ.. హాస్టళ్ల పరిశీలనకు ఇప్పుడే వెళదామని డిమాండ్ చేశారు. దీంతో కొన్ని హాస్టళ్లలో సీసీటీవీలు, బయోమెట్రిక్ తదితర వాటిలో నిర్వహణ లోపం ఉందంటూ మాట మార్చారు. జి.పం. సభ్యురాలికే భద్రత లేకపోవడం దారుణమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం
విజయనగరం ఫోర్ట్: వార్డెన్ వేధింపులు భరించలేక ఓ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన లెంక అనసూర్య (29) పట్టణంలోని దాసన్నపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తోంది. 2016లో అనసూర్య జాయిన్ అయినప్పటి నుంచి వార్డెన్ రాణి ఆమెను వివిధ రకాలుగా వేధిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా తయారుకావడంతో అనసూర్య బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్లోనే చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోట్లాడుకున్నారని తలకిందులుగా నిలిపి..
-
అసభ్య ప్రవర్తన..వార్డెన్‌కు దేహశుద్ధి
-
పిల్లలతో డ్రైనేజ్ క్లీన్ చేయించిన వార్డెన్
-
మహిళా వార్డెన్‌పై లైంగిక వేధింపులు..
తిరుపతి (చిత్తూరు జిల్లా): తిరుపతి నగరంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో పనిచేస్తున్న మహిళా వార్డెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన అదే వసతి గృహానికి చెందిన పురుష వార్డెన్లను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఎస్సీ, ఎస్టీ బాలబాలికల సంక్షేమ వసతిగృహంను ప్రభుత్వం నిర్వహిస్తుంది. బాలికల వసతి గృహంలో శశికళ అనే మహిళ వార్డెన్‌గా వ్యవహరిస్తోంది. అదేవిధంగా బాలుర వసతి గృహం వార్డెన్లుగా శ్రీనివాసులురెడ్డి , సదాశివ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా మహిళా వార్డెన్ శశికళపై ఇద్దరు పురుష వార్డెన్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితురాలు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అలిపిరి సీఐ శ్రీనివాసులు పై ఇద్దరు నిందితులను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
70 మంది బాలికల బట్టలు విప్పించింది
- రక్తపు మరకలు ఎవరివో గుర్తించేందుకు వార్డెన్ దుశ్చర్య - యూపీలోని కస్తూర్బా పాఠశాలలో దారుణం ముజఫర్‌నగర్: సభ్యసమాజం తలదించుకునే సంఘటన యూపీలోని ఓ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది. అక్కడి హాస్టల్లోని మహిళా వార్డెన్ ఏకంగా 70 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి అనాగరికంగా ప్రవర్తించింది. తరగతి గదిలోనూ నగ్నంగా కూర్చోబెట్టింది. ముజఫర్‌నగర్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాల (కేజీబీవీ)లో గురువారం జరిగిందీ దారుణం. మరుగుదొడ్డిలో రక్తపు మరకలు ఉండటంతో వార్డెన్ కోపోద్రిక్తురాలైంది. ఎవరో ఓ విద్యార్థిని బహిష్టు అవ్వడమే అందుకు కారణమని అనుమానిస్తూ, ఆ బాలిక ఎవరో కనుగొనేందుకు మొత్తం అందరి చేత దుస్తులు విప్పించి పరీక్షించింది. తరగతులకు వెళ్లేటప్పుడూ బట్టలు తొడుక్కునేందుకు అనుమతించలేదు. తాను చెప్పినట్లు వినకపోతే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు సమాచారం. ఘటనపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ ‘ఆ సమయంలో అక్కడ టీచర్లు లేరు. మమ్మల్ని కిందకు రమ్మని పిలిచింది. మమ్మల్ని అందరినీ బట్టలు విప్పేయమని చెప్పింది. లేకపోతే కొడతానంది. మేం పిల్లలం. ఏం చేయగలం? ఆమె మాట వినకపోతే మమ్మల్ని చితకబాదేది’అని వాపోయింది. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వార్డెన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ‘నేను చాలా కఠినంగా ఉంటాను. నన్ను ఇక్కడి నుంచి పంపించివేయడానికి నాపై కుట్రపన్నారు. బట్టలు విప్పేయమని నేను చెప్పలేదు’అని వార్డెన్ తన వాదన వినిపించారు. కాగా, ఇప్పటికే 35 మంది విద్యార్థినులు పాఠశాల వదిలి వెళ్లిపోయారు. -
గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ విందు..చిందులు..!
బాలికల వసతి గృహంలో నిర్వాకం షాద్‌నగర్ క్రైం: అది బాలికల వసతి గృహం.. బయటి వ్యక్తులెవరినీ లోనికి రానివ్వకుండా చూడాల్సిన వార్డెనే తన కూతురు పుట్టిన రోజంటూ అక్కడ విందు ఏర్పాటు చేసింది. డీజేలు పెట్టి చిందులు వేయించింది.. ఈ తతంగాన్ని చూసిన విద్యార్థి సంఘం నాయకులు ఇదేంటని ప్రశ్నిస్తే వారిపైకి నా ఇష్టం అంటూ శివాలెత్తింది. విషయం పెద్దదై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆదివారం రాత్రి వార్డెన్ పద్మ తన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా డీజే మ్యూజిక్, చికెన్ వంటకాలు, మంచి కల్లును ఏర్పాటు చేశారు. ఈ విందుకు బంధుమిత్రులతో పాటు వార్డెన్ స్నేహితులు హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేస్తూ తమను తామే మరచిపోయారు. హాస్టల్లో నుంచి వస్తున్న శబ్దాలను గమనించిన విద్యార్థి సంఘం నాయకులు అక్కడకు చేరుకొని ఇదేంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. దీంతో వార్డెన్ వారిపై శివాలెత్తింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నాయకులకు, వార్డెన్‌కు వాగ్వివాదం జరిగింది. విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులుఅధికారులకు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం తహశీల్దార్ చందర్రావు, ఎంపీడీఓ రాజేశ్వరి హాస్టల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు వార్డెన్‌ను మందలించి సంబంధిత శాఖకు సమాచారమిచ్చారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సురే‹శ్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ గదిలో ఉన్న చికెన్ వంటకాలతో పాటు కల్లు సీసాలను చూసిన ఆయన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు నివేదిక అందించి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయా లంటూ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
వార్డెన్ పనితీరుపై విచారణ
వీరపునాయునిపల్లె: వీరపునాయునిపల్లెలోని బీసీ–2 వసతిగృహం వార్డెన్ దాసిరెడ్డి పనితీరుపై మంగళవారం ఆశాఖకు చెందిన పులివెందుల డివిజన్ ఏబీసీడబ్లు్యవో రోషన్న విచారణ జరిపారు. ‘తన మీద ఫిర్యాదు చేశాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో విచారణ జరిపారు. వార్డెన్ సక్రమంగా విధులకు హాజరవుతున్నారా..లేదా..వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలవుతోందా.. అనే విషయాలను గురించి విద్యార్థులను ప్రశ్నించారు. వసతి గృహంలో తమకు రాగిజావ, సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ప్రతి శనివారం ఇవ్వాల్సిన పాయసాన్ని కూడా తమకు ఇవ్వడం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బీసీ వసతిగృహం–1 వార్డెన్ ఇన్చార్జిగా ఉంటారని, మెనూ సక్రమంగా అమలవుతుందని చక్కగా చదువుకోవాలని ఏబీసీడబ్లు్యఓ విద్యార్థులకు సూచించినట్లు తెలిసింది. కాగా, విచారణకు ముందు మెనూ సక్రమంగా అమలవుతోందని అధికారులకు చెప్పాలని అక్కడి సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. -
ట్రైబల్ వెల్ఫేర్‌లో పోస్టింగ్ వివాదం
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్‌ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్‌లో వార్డెన్‌గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్‌పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్‌పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్‌తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఏటీడబ్ల్యూ నియామకం వివాదాస్పదం
ఇందూరు: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్‌ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్‌లో వార్డెన్‌గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్‌పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్‌పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్‌తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
వార్డెన్లు స్థానికంగా ఉండాలి
మోతె: హాస్టళ్ల వార్డెన్లు స్థానికంగా ఉండాలని సూర్యాపేట ఏఎస్డబ్లూ్యఓ శంకర్‌నాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్హాస్టల్ను ఆయన సందర్శించారు. హాస్టల్లో మౌలికSవసతులను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఎందుకు ఉందని వార్డెన్ చంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్లు స్థానికంగా పిల్లలకు అందుబాటులో ఉన్నప్పుడే విద్యార్థుల సంఖ్యపెరుగుతుందన్నారు.మండలంలో ప్రతి గ్రామానికి వెళ్లి వంద మంది విద్యార్థులను హాస్టల్లో చేరేటట్లుగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట వార్డెన్, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థుల పట్ల శ్రద్ధ అవసరం
దిలావర్పూర్ : వసతి గృహ విద్యార్థుల పట్ల స్థానిక హెచ్‌డబ్లూవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్మల్ ఏఎస్‌డబ్ల్యూ ఎంఏ అలీం అన్నారు. మండల కేంద్రమైన దిలావర్పూర్లోని స్థానిక సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని విద్యార్థుల హాజరు శాతంతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల భోజనం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వసతిగృహం పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యం వక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ విధిగా ప్రతీనెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతీ వార్డెన్ స్థానికంగా ఉండాలని ఆయన ఆదేశించారు. హెచ్‌డబ్ల్యూవో రవీంధర్గౌడ్తోపాటు వసతిగృహ సిబ్బంది ఉన్నారు. -
సినీ ఫక్కీలో ఓ వార్డెన్ క్రైమ్ స్టోరీ..!
గోపాలపట్నం: ఓ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వార్డెన్ సినీ ఫక్కీలో చోరీ కథ నడిపించాడు. అంతేకాదు చోరీ విషయాన్ని బయటపెట్టినందుకు ఓ విద్యార్థిపై దాడి కూడా చేయించాడు. చివరికి బాధితుల బంధువుల చేతిలో తన్నులు తిన్నాడు. పోలీసులు, బాధితుల కథనం మేరకు విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. వార్డెన్ జగన్మోహన్ వద్ద అతడు లోగడ రూ.200లు అప్పు చేసి ఉన్నాడు. తన బ్యాంకు ఖాతాలో తండ్రి రూ.20వేలు జమ చేయడంతో వార్డెన్‌కు ఏటీఎం కార్డు ఇచ్చి బాకీ ఉన్న రూ.200 తీసుకోండి సార్ అన్నాడు. పిన్ నంబర్ తెలుసుకున్న అనంతరం వద్దులే నువ్వే తెచ్చివ్వు అని చెప్పిన వార్డెన్.. జగన్మోహన్ ఏటీఎం కార్డు చోరీకి పథకం వేశాడు. మరో విద్యార్థి సతీష్‌తో ఉదయ్‌కుమార్ ఏటీఎం కార్డును దొంగచాటుగా తెప్పించి, పిన్ నంబర్ చెప్పి అతడితోనే రూ.10వేలు డ్రా చేయించాడు. తన ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో ఉదయ్ తోటి విద్యార్థి అయిన సతీష్‌ని అడగ్గా.. అతడు జరిగిన విషయం చెప్పాడు. ఉదయ్‌కు సతీష్ జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆగ్రహించిన వార్డెన్ కొందరు విద్యార్థులతో గురువారం రాత్రి దాడి చేయించాడు. దీంతో సతీష్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు, కొందరు విద్యార్థులు వార్డెన్‌పై శుక్రవారం దాడి చేయడంతో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య
- ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు - యాజమాన్యం వేధింపులే అంటున్న సహ ఉద్యోగులు హైదరాబాద్: నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమని పోలీసులు అంటుండగా... యాజమాన్యం వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫేస్బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే... దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లనే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే... ఈ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వార్డెన్ ఎక్కడా.. ?
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఎక్కడ ఉందని తహశీల్దార్ రజిత విద్యార్థులను ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆమె హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ సుమతి అందుబాటులో లేదని తహశీల్దార్ దృష్టికి రావడంతో.. ఆమెపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ తెలిపారు. అలాగే బీసీ బాలుర, ఎస్సీ బాలుర హాస్టల్లను కూడా తనిఖీ చేశారు. -
బీసీ హాస్టళ్లలో ఖాళీల మోత..!
మొత్తం 549 పోస్టులు ఖాళీ హైదరాబాద్: రాష్ర్టంలోని చాలామటుకు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్లతో సహా వాచ్మెన్, కామాటీ, వంటవాళ్ల ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికే అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో లోటు లేకుండా చేస్తామన్న మంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే తేడా లేకుండా ఆయా హాస్టళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వపరంగా చర్యలు కరువవుతున్నాయి. స్కూల్, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 239 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ రాష్ర్టంలోని మొత్తం 490 ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్, వంటవాళ్లు, వాచ్మెన్, కామాటీలు కలుపుకుని 549 పోస్టులు ఖాళీగా ఉండటం హాస్టళ్లలో ఉన్న స్థితికి అద్దం పడుతోంది. ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 239 హేచ్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రీమెట్రిక్కు సంబంధించి 177 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 62 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హేచ్డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థికశాఖ వద్ద ఫైల్ వార్డెన్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా హాస్టళ్లకు కామాటీలు, వంటవాళ్లు, వాచ్‌మెన్‌ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతినివ్వాలని ఆర్థికశాఖను బీసీశాఖ కోరింది. వార్డెన్ పోస్టుల భర్తీకి సమయం పట్టినా, వంటవాళ్లు, కామాటీ, వాచ్మెన్ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చునని ఈ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
వార్డెన్‌ను సస్పెండ్ చేయండి: మంత్రి
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మొవ్వలోని ఎస్సీ హాస్టల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరా తీశారు. అందుకు బాధ్యుడైన వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి మొవ్వ ఎస్సీ హాస్టల్లో ఆహారం తిని 13 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో వారిని హుటాహుటిన బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హాస్టళ్లలో అక్రమాలకు చెక్
- ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓలకు ల్యాప్‌టాప్‌లు - బయో మెట్రిక్ విధానంతో హాజరు నమోదు - ఆన్లైన్లో విద్యార్థుల, సామగ్రి వివరాలు - స్థానికంగా ఉండని వార్డెన్లకు తప్పని ఇక్కట్లు కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ల్యాప్‌టాప్, మిషన్లు పంపిణీ చేసింది. ఆయా వసతి గృహాల్లో ఎన్ని కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులు వినియోగించారనే విషయాలను నిత్యం హాస్టల్ వార్డెన్లు ల్యాప్‌టాప్ ద్వారా హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది. అలాగే ఇక నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల, హాస్టల్ వార్డెన్ వేలి ముద్రలతో హాజరును నమోదు చేసి ఆన్లైన్ చేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల జిల్లాలోని 102 ఎస్సీ వసతి గృహాల్లో దాదాపు 10 వేలకు పైగా విద్యార్థుల, వార్డెన్ల సమగ్ర సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నాయి. అన్ని వివరాలు ఆన్లైన్లోనే.. ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుప్పట్లు, కార్పెట్లు, దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సి వుంది. విద్యార్థులకు ఇచ్చిన వస్తువుల ఫొటోలను కూడా ఉన్నతాధికారులకు ఆన్లైన్లో పంపాల్సి వుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారు? ఎంత మంది గైర్హాజరయ్యారు? విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, టిఫెన్ అందిస్తున్నారా? లేదా? వార్డెన్ స్థానికంగా ఉంటున్నారా, లేదా, అనే వివరాలు బయోమెట్రిక్ విధానం ద్వారా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలిసే అవకాశం ఏర్పడింది. స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులే.. బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలోని పలు వసతి గృహాలకు చెందిన వార్డెన్లు స్థానికంగా ఉండకుండా వంట మనుషులు, వాచ్మెన్లకు బాధ్యతలు అప్పగించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం హాస్టల్ వార్డెన్లకు ల్యాప్‌టాప్‌లు, బయో మెట్రిక్ మిషన్లను పంపిణీ చేసిన నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులతో పాటు వార్డెన్లు కూడా వేలి గుర్తులు వేయాల్సి ఉంటుంది. దీంతో వార్డెన్లు స్థానికంగా ఉండక తప్పదు. జిల్లాకు 71 ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు.. జిల్లాలో మొత్తం 102 ప్రీమెట్రిక్ వసతి గృహాలు ఉండగా, ప్రస్తుతం 80 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న 31 వసతి గృహాలను మినహాయించి మిగిలిన 71 వసతి గృహాలకు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేశారు. వీటిని ఆయా సహాయ సంక్షేమాధికారి కార్యాలయాల నుంచి వార్డెన్లు తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసిన కంపెనీకి చెందిన ప్రతినిధులే జిల్లాకు వచ్చి ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మిషన్ల వినియోగానికి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. -
పురుగుల అన్నం మాకొద్దు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తమకు పెట్టాల్సిన సరుకులను వర్కర్లు కాజేస్తూ విద్యార్థినుల సంఖ్యకు సరిపోను వంట చేయకపోవడంతో రోజూ అర్థాకలితో అలమటిస్తున్నామని, పైగా పురుగుల అన్నం పెడుతున్నారని, దీనిపై వార్డెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని..వర్కర్లను నిలదీస్తే తమనే దండిస్తున్నారని.. మీరైనా సమస్యలు పరిష్కరిచాలని స్థానిక బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు ఆదివారం కలెక్టర్ ప్రియదర్శినిని వేడుకున్నారు. దాదాపు గంటపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారితో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఆదివారం తెల్లవారుజామున బీసీ బాలికల హాస్టల్ నుంచి వర్కర్లు యాదమ్మ, జయమ్మ సరుకులు దొంగిలిస్తుండగా హాస్టల్ విద్యార్థిను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై వార్డెన్‌కు సమాచారం అందించినా ఆయన పట్టించుకోవడంతో వారు హాస్టల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కిచిడి చేస్తే చట్నీ చేయలేదని, అర్ధరాత్రి రెండు గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం తినాల్సి వస్తుందన్నారు. అన్నం సరిపోక ప్రతిరోజూ కొందరు విద్యారులు ఉపవాసం ఉండాల్సి వస్తోందన్నారు.అన్నంలో పురుగులు వస్తున్నాయని, భవనానికి కరెంట్ షాక్ వస్తుందని చెప్పినా వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వర్కర్ అలివేలు విద్యార్థినులతో వాగ్వాదానికి దిగడంతో వర్కర్లను తొలగించాలని పట్టుబడుతూ వారు ఆందోళన ఉధృతం చేశారు. 9గంటల వరకు ఆందోళన చేసినా సంబంధిత అధికారులు హాస్టల్ వద్దకు రాక పోవడంతో పీడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా నాయకురాలు గణిత మాట్లాడుతూ విద్యార్థినుల సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యమైన భోజనం పెట్టక పోవడంతో విద్యార్థినులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు రాము, వెంకట్, విద్యార్థినులు మమత, అరుణ, స్వప్న, షభానా, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు విప్లవ తదితరులు పాల్గొన్నారు.