చందాల కోసం కొందరు స్థానికులు పెడుతున్న వేధింపులు భరించలేక మనస్తాపంతో స్థానిక హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సమగ్ర బాలికల వసతి గృహం సంక్షేమ అధికారి(వార్డెన్) లొడగల శ్రీదేవి ప్రధానంగా మూడు అంశాల్లో స్థానికులు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నిం చారు. స్థానిక గ్రామ ఉత్సవాలకు చందాలతోపాటు మరో అంశం ఇందుకు కారణం. నాలుగు నెలల క్రితం ఇక్కడ నిర్వహించిన ఓ ఉత్సవానికి నిర్వాహకులు చందా కోసం వెళ్లి రూ.పది వేలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమనడంతో ససేమిరా అంటూ బెదిరించారు.