వార్డెన్ ఎక్కడా.. ?
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఎక్కడ ఉందని తహశీల్దార్ రజిత విద్యార్థులను ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆమె హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.
వార్డెన్ సుమతి అందుబాటులో లేదని తహశీల్దార్ దృష్టికి రావడంతో.. ఆమెపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ తెలిపారు. అలాగే బీసీ బాలుర, ఎస్సీ బాలుర హాస్టల్‌లను కూడా తనిఖీ చేశారు.