Girls welfare hostel
-
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
-
కీచక టీచర్ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్‌పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): జీలుగుమిల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న బొడ్డు నవ్యశ్రీ (16) సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ ఏఎన్ఎన్ మూర్తి కథనం ప్రకారం నవ్యశ్రీ మధ్యాహ్న భోజనం అనంతరం హాస్టల్లో తోటి విద్యార్థులతోపాటు విశ్రాంతి తీసుకుంది. అయితే మళ్లీ చదువుకునేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న సమయంలో నవ్యశ్రీ కనిపించలేదు. దీంతో ఆమె కోసం వెతకగా పక్కనే ఉన్న 8వ తరగతి గదిలో చున్నీతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. దీంతో హాస్టల్ సిబ్బంది నవ్యశ్రీని హుటాహుటిన జీలుగుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు అచ్యుతరావు, ఝాన్సీల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని సీఐ మూర్తి తెలిపారు. హాస్టల్ మేట్రిన్ రాజ్యలక్ష్మిని వివరాలు అడిగి తెసుకున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పి.వెంకటేశ్వరరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థిని మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన నవ్యశ్రీ మూడేళ్ల క్రితం ఆశ్రమ పాఠశాలలో చేరిందని, చదువులోనూ ముందుండేదని ఉపాధ్యాయులు తెలిపారు. నవ్యశ్రీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు మృతిపై మేట్రిన్ సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులతోపాటు సీపీఎం ఆధ్వర్యంలో బంధువులు ఆందోళన చేశారు. మృతి చెందిన నవ్యశ్రీ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని న్యాయవాది జువ్వల బాజీ డిమాండ్ చేశారు. -
వార్డెన్ ఎక్కడా.. ?
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఎక్కడ ఉందని తహశీల్దార్ రజిత విద్యార్థులను ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆమె హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ సుమతి అందుబాటులో లేదని తహశీల్దార్ దృష్టికి రావడంతో.. ఆమెపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ తెలిపారు. అలాగే బీసీ బాలుర, ఎస్సీ బాలుర హాస్టల్లను కూడా తనిఖీ చేశారు.