హాస్టల్‌లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి.. | Warden Arrested For Misbehaving With Students In Hyderabad | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..

Published Mon, Sep 12 2022 8:03 PM | Last Updated on Tue, Sep 13 2022 3:33 PM

Warden Arrested For Misbehaving With Students In Hyderabad - Sakshi

నిందితుడు కృష్ణ 

హయత్‌నగర్‌(హైదరాబాద్‌): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్‌ వార్డెన్‌ను ఆదివారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్‌ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్‌లో నెల రోజుల క్రితం వార్డెన్‌గా చేరాడు.
చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి..

విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement