college hostel
-
దారుణం.. కాలేజ్ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు
మేడ్చల్‌లోని సీఎమ్ఆర్ఐటీ కాలేజ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు పెట్టి విధ్యార్ధినులను బెదిరించినట్టు సమాచారం. ఈ నేపద్యంలో బాధిత విధ్యార్ధినులు హాస్టల్లో వీడియోలు తీశారని ఆగ్రహం చెందారు. నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు సమాచారం. సదరు వీడియోలతో విధ్యార్ధినులను బ్లాక్మెయిల్ చేస్తునట్టు విధ్యార్ధినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా వంటచేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విధ్యార్ధినులు. విధ్యార్ధినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. విధ్యార్ధినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సీఎమ్ఆర్ఐటీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
హాస్టల్లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం
హయత్‌నగర్ (హైదరాబాద్): కళాశాల హాస్టల్లో ఉండలేక గోడదూకి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి నిదర్శనంగా నిలిచిన ఈ హృదయ విదారకమైన సంఘటన గురువారం హయత్‌నగర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచి్చంది. తెనాలికి చెందిన ఎ.విజయ్‌కుమార్ వ్యాపారం చేసుకుంటూ నగరంలోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసముంటున్నారు.ఆయనకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు గిరీశ్‌కుమార్ (15)ను ఇంటర్ మొదటి సంవత్సరం చదివించేందుకు పది రోజల కిందట హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని కోహెడ వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్పించాడు. ఇక్కడ చదవడం ఇష్టం లేని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో రెండ్రోజుల కిందట వచి్చన తల్లి కొడుకును బుజ్జగించి, మళ్లీ వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి వెళ్లింది. ఈ క్రమంలో హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని భావించిన గిరీశ్‌కుమార్ బుధవారం రాత్రి కళాశాల నుంచి మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాడు. విద్యార్థి కనిపించక పోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహరీ పక్కన గిరీశ్ మృతదేహాన్ని గురించ్తిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒంటరిగా బయటికి వచి్చన విద్యార్థి హాస్టల్ గోడ దూకి పారిపోయేందుకు ప్రహరీ గోడ ఎక్కాడని, గోడ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరీశ్ చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. -
‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
యూజీ విద్యార్థినులకే నిజాం హాస్టల్
గన్‌ఫౌండ్రీ: నిజాం కళాశాల విద్యార్థినులు 15 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఫలితం దక్కింది. విద్యార్థినులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. నిజాం కాలేజీ హాస్టల్‌ను యూజీ విద్యార్థినులకే కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించడంపై పలువురు విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎలాంటి షరతులు లేకుండా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సి పల్ సూచించారు. దీంతో విద్యార్థినులు తమ అందోళనను విరమించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. -
హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..
హయత్‌నగర్(హైదరాబాద్): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్ వార్డెన్‌ను ఆదివారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్లో నెల రోజుల క్రితం వార్డెన్‌గా చేరాడు. చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి.. విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నరకమే ‘నారాయణ’
నెల్లూరు రూరల్: హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. నెల్లూరులోని ధనలక్ష్మీపురం నారాయణ కళాశాల హాస్టల్లో ఈ దారుణం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలేస్తోందని వేడుకున్నా.. నారాయణ హాస్టల్లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నెల్లూరు, కావలి, తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు సోమవారం రాత్రి భోజనం సరిగా లేదని బయట నుంచి ఆహారాన్ని తేవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థుల వద్ద ఆహార పొట్లాలను లాక్కుని పక్కన పడేశారు. ఈ విషయం తెలియడంతో మరికొందరు విద్యార్థులు అక్కడకు చేరుకుని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉన్నందున బయట నుంచి తెప్పించుకున్నామని, పార్శిళ్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న నారాయణ సిబ్బంది బయట నుంచి ఆహారం ఎలా తెప్పించుకుంటారంటూ విద్యార్థులపై రెచ్చిపోయారు. కాళ్లతో తన్ని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను విచక్షణా రహితంగా చావబాదడం ఏమిటని నిలదీశారు. అనంతరం అక్కడకు చేరుకున్న నారాయణ విద్యాసంస్థల ఉన్నత ఉద్యోగులు తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బుజ్జగించారు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని వేడుకున్నారు. పది రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉన్నందున చేసేదేమీ లేక తల్లిదండ్రులు మెత్తబడ్డారు. దీనిపై నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా బయట నుంచి ఆహారం తెస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆహార పొట్లాలను పక్కన పెట్టిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. -
తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..
సాక్షి, ప్రకాశం: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త పట్నం మండలం ఈతముక్కల గ్రామం మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా, ఈపూరు మండలం, ఆర్ ముప్పాళ్ళ గ్రామానికి చెందిన మట్టా రామాంజనేయులు కుమార్తె మట్టా దివ్య (17) పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయత్రం వెలువడిన పాలిటెక్నిక్ మొదటి ఏడాది ఫలితాల్లో ఏడు సబ్జెక్ట్స్గాను అయిదు ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లొచ్చిన దివ్య హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం విద్యార్ధినులు హాస్టల్‌కు వచ్చేసరికి దివ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో కాలేజీ ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ ప్రియకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోలీసులకు, తల్లిదండ్రులకు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చదవండి: (నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..) దివ్య క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ మార్కులతో వచ్చేవని తోటి విద్యార్థులు చెప్పారు. మంగళవారం ఉదయం అందిరతోపాటే సక్లాస్కు హాజరైన దివ్య తాను పరీక్షలు బాగా రాశానని, రీఎరిఫీకేషన్ పెట్టించాలని చెప్పినట్లు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా కాలేజీలో మొదటి ఏడాది విధ్యార్థులు 75 మంది ఉండగా వారిలో 33 మంది విద్యార్థినులు మాత్రమే పాస్ అవ్వడం గమనార్హం. కష్టపడి చదివించుకున్నా నేను ముప్ఫాళ్ల గ్రామంలో కాంట్రాక్ట్ పద్దతిలో స్వీపరగా పనిచేస్తాను. నాకు వచ్చేది రూ.6 వేలు జీతం. ఎల్కేజీ నుంచి పదోవతరగతి వరకు ప్రవేటు స్కూల్లో డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకున్నారు. నేను చేసే పని నా కుమర్తె చేయకూడదని కష్టపడి చదివించుకుంటున్నారు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదని కుమార్తె ముందు కుప్పకూలీ పోయాడు. కేసు నమోదు చేసి పోష్టమార్టన్ నిమెత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. -
కాలేజీ హాస్టళ్లలో కొత్త అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ హాస్టళ్లు మాత్రమే తెరుచుకోగా, వీటిలో కాలేజీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కోర్సు ముగిసిన విద్యార్థులు హాస్టల్ నుంచి రిలీవ్ కాగా.. వారి స్థానంలో ఫ్రెషర్స్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి 550 పోస్టుమెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ హాస్టళ్లలో నూతన అడ్మిషన్లకు ప్రభుత్వం ఆమోదించడంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులకు అవకాశం కలగనుంది. ఏయే హాస్టల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించాలనే దానిపై క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భౌతిక దూరానికి ప్రాధాన్యం..: ఒక్కో కాలేజీ హాస్టల్లో 150 నుంచి 220 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెద్ద భవనం, అధిక సంఖ్యలో గదులున్న చోట ఎక్కువ మంది విద్యార్థులుండగా.. చిన్నపాటి భవనాల్లోని హాస్టళ్లలో 120 నుంచి 150 మంది విద్యార్థులుంటున్నారు. వసతి గృహాల్లో భౌతిక దూరానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గది విస్తీర్ణాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యను ఖరారు చేయాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు పంపారు. ఈ నేపథ్యంలో వసతి గృహ సంక్షేమాధికారులు శనివారం నాటికి ప్రతిపాదనలు రూపొందించి ఆయా జిల్లాల సంక్షేమాధికారులకు పంపినట్లు సమాచారం. వీటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆమోదం లభించిన తర్వాత కొత్త అడ్మిషన్లు ప్రారంభిస్తారు. అలాగే ప్రీ మెట్రిక్ హాస్టళ్ల ప్రారంభంపైనా అధికారులు దృష్టి సారించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. -
కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
ఒంగోలు: ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కొనకనమిట్ల మండలం రేగలగడ్డకు చెందిన దుంపా అంజిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల కుమారుడు దుంపా పవన్‌కల్యాణ్ రెడ్డి (19) ఒంగోలు సమీపంలోని పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి దూరం కావడంతో కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. శనివారం నిద్రలేచిన సహచర విద్యార్థులకు హాస్టల్ కిచెన్ రూంలో పవన్‌కల్యాణ్ రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా అతడు ఇతర సిబ్బందితో కలిసి పవన్‌ను కిందకు దించి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రిమ్స్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, చదవలేకే పవన్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మృతుడి కుటుంబసభ్యులు మాత్రం గతంలో జరిగిన పరీక్షల్లో ఫెయిలయ్యాడని అధ్యాపకులు పవన్‌ను బాగా కొట్టారని, అంతే కాకుండా శుక్రవారం జరిగిన పరీక్షల్లో స్లిప్పులు పెట్టి కాపీ రాస్తూ పట్టుబడటంతో బాగా కొట్టారని చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరో హాస్టల్ నిర్మిస్తాం
సాక్షి, గుంటూరు : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు పూర్తిస్థాయి వసతులతో నూతన హాస్టల్ భవనం నిర్మించేందుకు చర్యలు చేపడతామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ప్రకటించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన విద్యార్థినులను సోమవారం పరామర్శించిన ఎమ్మెల్యే ముస్తఫా మంగళవారం మరోసారి సాంబశివపేటలోని విద్యార్థినుల వసతిగృహానికి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వసతిగృహంలో కల్పిస్తున్న సదుపాయాలు, భోజనం గురించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వబోమని, వారి ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడ్తామని చెప్పారు. పేదలు చదువుకునే కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో రోజుకు రెండు పూటలా భోజనం, అల్పాహారానికి రూ.47 చొప్పున చెల్లించి విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. దాదాపు 700 మంది విద్యార్థినులు ఇక్కడ ఆశ్రయం పొందుతుండగా, వారికి తగిన వసతి, సదుపాయాలు అందుబాటులో లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పట్టించుకోని టీడీపీ గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం హాస్టల్లో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. హాస్టల్‌ను విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవనం నిర్మించేందుదుకు రెండు మూడు కోట్ల రూపాయలు అవసరమని, నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని చెప్పారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, హాస్టల్ మరమ్మతులకు తక్షణ అవసరాల కింద రూ.25 లక్షలు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. విద్యార్థి నులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని చీఫ్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పుల్లారెడ్డితో పాటు వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ముస్తఫా ప్రభుత్వం అండగా ఉందని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. 116 మంది డిశ్చార్జి ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వకు గుంటూరు జీజీహెచ్‌లో 131 మంది విద్యార్థినులు చేరారు. మంగళవారం ఉదయానికి 116 మంది ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి చేశారు. మరో 15 మంది చికిత్సపొందుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్టల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకతో పరిస్థితుల్లో మార్పు రెండు రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాస్టల్‌ను సందర్శించిన నేపధ్యంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు హాస్టల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించారు. నగరపాలక సంస్థ అధికా రుల వచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి దృష్టికి సమస్య ఎమ్మెల్యే ముస్తఫా తన ఫోన్ ద్వారా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు వీడియో కాల్ చేసి వసతిగృహంలో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు విద్యార్థినులతో నేరుగా మంత్రితో మాట్లాడించారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ ఆధునీకరణకు శాశ్వత రీతిలో చర్యలు చేపట్టాలని ఆయన మంత్రిని కోరగా నూతన హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్‌బోర్డు ఆర్ఐఓ జెడ్.ఎస్ రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల సమస్యలు వర్ణనాతీతం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో విద్యార్థుల సమస్యలు వర్ణణాతీతం. అర, కొర వసతులుతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. హాస్టల్ ప్రాంగణంలో పాడుపడిన బోరుబావి నీటిని విద్యార్థినులు తాగేం దుకు ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికా రంలో టీడీపీకి మద్దతుదారుడికి ఫుడ్ కాంట్రాక్ట్ అప్పగించిన కళాశాల కమిటీ పర్యవేక్షణ మరిచింది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు పడిన సందర్భాలు ఉన్నాయని, నాణ్యత లేని బియ్యంతో అన్నం వండుతున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ముస్తఫా ఎదుట వాపోయారు. తమ సమస్యలను డెప్యూటీ వార్డెన్ కమలకరుణ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఆమె ఆమె పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కేర్ టేకర్ సువర్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్జేడీ కార్యాలయంలో మంగళవారం కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ వెలగా జోషిని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్, కిరణ్, కబీర్, వినోద్, మహేష్ కలిసి వినతి పత్రం సమర్పించారు. -
‘సాంఘిక సంక్షేమం’లో పాకెట్ మనీ..
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం పాకెట్ మనీ అందించనుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు వివిధ అవసరాల నిమిత్తం చేతిలో నగదు లేక.. ఇంటి వద్ద నుంచి పాకెట్ మనీ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా రూ.500 అందజేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 11 ఎస్సీ కళాశాల హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో మొత్తం 1864 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ లబ్ధి జరగనుంది. హాస్టళ్ల నిర్వహణ వ్యయం పెంపు.. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్ నిర్వహణ వ్యయం కూడా పెంచాలని నిర్ణయించింది. గతంలో ఒక విద్యార్థికి రూ.4వేలు వెచ్చిస్తుండగా.. ప్రస్తుతం రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న బాలికలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పగలు, రాత్రి వేళల్లో వాచ్మన్లను నియమించనున్నారు. గతంలో ఒక వాచ్‌మన్ మాత్రమే పగటిపూట కాపలా ఉండేవాడని, ప్రసుత్తం 24 గంటలు హాస్టళ్ల వద్ద కాపాలా ఉండేందుకు వాచ్మన్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు సైతం నిధులను ప్రతి సంవత్సరం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కళాశాల హాస్టళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వార్షిక వేడుకలకు నిధులు.. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థులు ప్రతీ సంవత్సరం వార్షిక వేడుకలను నిర్వహించుకునేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇక నుంచి ప్రతి ఏటా రూ.20వేలను మంజూరు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులటు కూడా జారీ చేసి ఆయా జిల్లా అధికారులకు జీవోలను జారీ చేసింది. ఈ నెల నుంచి వ్యక్తిగత ఖర్చుల కింద రూ.500 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుసుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకే.. షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదువుపై ఏకాగ్రత పెంచేందుకు వారి ఖర్చులకు అవసరమైన పాకెట్ మనీ ఏర్పాటు చేసింది. డైరెక్టర్ కరుణాకర్ ఆదేశాల మేరకు వసతిగృహాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. పాకెట్ మనీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తాం. ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున అందిస్తాం. – కస్తాల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి -
వేధింపులకు నేలరాలిన మరో విద్యాకుసుమం
-
కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
-
సెల్‌ఫోన్ దొంగతనం ఆపాదించడంతో..
భార్య మృతిచెందడంతో అతను అన్నీతానై బిడ్డను పెంచాడు. చదువులో చురుగ్గా ఉండడంతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఏమి జరిగిందో కాని ఆ విద్యార్థిని కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మరణం పొందింది. దీంతో తండ్రి ఆవేదన అంతాఇంతా కాదు. ఉన్నత చదువులు చదివి అండగా ఉంటుందనుకున్న కుమార్తె అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం వేలవేడు పంచాయతీ మాధమాల గ్రామానికి చెందిన అక్కుపల్లి బలరామయ్య యాదవ్, భారతి దంపతుల కుమార్తె మాధవి(18). మాధవికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి భారతి మృతి చెందింది. బలరామయ్య మళ్లీ నెల్లూరు జిల్లా వెందోడు గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాలతో సుజాత బలరామయ్యకు దూరమైంది. అప్పటి నుంచి మాధవిని బలరామయ్య గారాబంగా పెంచుకున్నాడు. మాధవి 1 నుంచి 5వ తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివింది. 10వ తరగతి వరకు ఏర్పేడు మండలం పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ శ్రీకాళహస్తిలోని రాయలసీమ జూనియర్ కళాశాలలో పూర్తి చేసింది. కుమార్తె చదువుల్లో రాణిస్తుండడంతో బలరామయ్య ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఆగస్టు 10వ తేదీన సివిల్ ఇంజినీరింగ్‌లో చేర్పించాడు. ఆమె అదే కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటోంది. ఏమి జరిగిందో కాని ఆమె ఇటీవల ఇంటికి వచ్చేసింది. మూడు రోజులు ఇంటి దగ్గరే ఉండి శనివారం తిరిగి కళాశాలకు వెళ్లింది. సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీటెక్‌లో చేరిన ఏడు నెలలకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందనే వార్త వినగానే తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ‘భార్య దూరమైతే కంటికి రెప్పలా కాపాడుకుంటినే.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావా తల్లీ అంటూ ఆయన చేస్తున్న రోదన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. సెల్‌ఫోన్ దొంగతనం ఆపాదించడంతో.. మాధవి ఉంటున్న హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కనిపించకపోయింది. దీంతో తోటి విద్యార్థినులు మాధవిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాధవి తన తండ్రికి తెలియజేయడంతో ఆయన నాలుగు రోజుల క్రితం కళాశాలకు వచ్చి హెచ్‌వోడీతో మాట్లాడారు. దీన్ని మాధవి అవమానంగా భావించింది. ఆదివారం రాత్రి తోటి స్నేహితులతో కలిసి నిద్రపోయిన మాధవి సోమవారం శవమై కనపించడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం వసతి గృహంలోని విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, చిల్లకూరు, మనుబోలు ఎస్ఐలు శ్రీనివాసరావు, జేపీ శ్రీనివాసరావు కళాశాలకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. బాత్రూం తలుపును పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కాలేజీ హాస్టళ్లలో గదికి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్ : జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్య వైఖరికి ఇక చెక్ పడనుంది. ఒక్కో గదిలో పదిమంది వరకు విద్యార్థులను కుక్కిపడేసే కాలేజీ హాస్టళ్ల తీరుపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. రెసిడెన్షియల్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినా తగిన సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులపాలు చేసే యాజమాన్యాలపై కొరడా ఝళిపించనుంది. ఇందుకోసం పక్కా నిబంధనలను సిద్ధం చేసింది ఇంటర్మీడియెట్ బోర్డు. జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఒత్తిడిని దూరం చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. అరకొర వసతులు కలిగిన హాస్టళ్లలో ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు చదువులతో ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు గత నవంబరు, డిసెంబరు నెలల్లో హాస్టళ్లలో పరిస్థితులపై తనిఖీలు నిర్వహించింది. వసతుల లేమితో హాస్టళ్లలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక, సరైన నిద్రలేక, చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితు లున్నాయని తెలుసుకుంది. వాటిని మార్చేందుకు ఇన్నాళ్లు బోర్డు పరిధిలో లేని కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ పరిధిలోకి తెచ్చుకుంది. వాటి ని నియంత్రించేందుకు నిబంధనలను సిద్ధం చేసింది. ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించడంతోపాటు ఒత్తిడిని దూరం చేసే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇవీ ప్రధాన నిబంధనలు.. ♦ హాస్టల్లోని గదిలో ఇద్దరు విద్యార్థులను మాత్రమే ఉంచాలి. ♦ బాలురైతే ప్రతి 8 మందికి ఒక బాత్రూమ్ ఉండాలి. బాలికలైతే ప్రతి ఆరుగురికి ఒక బాత్రూమ్ ఉండాలి. ♦ ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగుల ప్రదేశం ఉండేలా చూడాలి. ♦ 360 మంది విద్యార్థులను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరో యూనిట్ ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి యూనిట్‌కు వంట చేసే సిబ్బంది ఆరుగురు ఉండాలి. పరిశుభ్రత కోసం తగిన సిబ్బందిని నియమించాలి. దానిని స్థానిక మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కమిటీ పర్యవేక్షించాలి. ♦ భోజనం నాణ్యతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కమిటీ నిరంతరం పర్యవేక్షించాలి. ♦ ప్రతి నెలా కచ్చితంగా పేరెంట్, టీచర్ మీటింగ్ ఉండాలి. సెలవు దినాల్లో విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి. ♦ క్వాలిఫైడ్ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాలి. ఒత్తిడితో ఇబ్బంది పడే విద్యార్థులకు తగు సలహాలు అందజేయాలి. ♦ విద్యార్థులను ఉదయం 6 గంటల లోపు నిద్ర లేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ కొనసాగించవద్దు. ♦ ఈ నిబంధనలను అతిక్రమిస్తే యాజమాన్యాల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. ♦ ఈ నిబంధనలు ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలకే కాదు.. ప్రభుత్వ కాలేజీలకు (ఫీజులు మినహా) వర్తిస్తాయి. ముందుగానే దరఖాస్తుల ఆహ్వానం.. జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, హాస్టళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు నిబంధనల జారీ కంటే ముందుగానే ఆయా యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,667 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో 700 వరకు హాస్టళ్లు కలిగిన కాలేజీలు ఉన్నట్లు బోర్డు అంచనా. కానీ ఇంతవరకు 267 కాలేజీలు మాత్రమే హాస్టళ్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు ఇంకా ముందుకు రాలేదు. గత నెల 22 తోనే దరఖాస్తుల గడువు ముగిసినా కాలేజీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. అయినా ఇంతవరకు ఇంకా 400కు పైగా హాస్టళ్లు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి వాటిపై బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలేజీల గుర్తింపు ఫీజును గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఇపుడు హాస్టళ్లు కలిగిన కాలేజీలకు మొత్తంగా రూ.ఆరు లక్షలు గుర్తింపు ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
సూర్యాపేటలో గంజాయి కలకలం..
సాక్షి, సూర్యాపేట: జిల్లాకేంద్రంలో ఓ కాలేజీ హాస్టల్లో గంజాయి దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. పోలీసుల తనిఖీల్లో గాయత్రి కాలేజీ హాస్టల్లో గంజాయి దొరికింది. దీనిపై హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం సహకారంతోనే ఇక్కడ గంజాయి దాచారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. -
లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు
-
లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు
బెంగళూరు: వింతదొంగ చేష్టలతో బెంగళూరు విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి హస్టల్ ప్రాంగణంలోకి నగ్నంగా చొరబడి వింత దొంగ చేస్తున్న వికృత చేష్టలకు బిత్తరపోయిన విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. తాము బయట ఆరేసిన లోదుస్తులు దుండగుడొకడు ఎత్తుకుపోతున్నాడని మహరాణి ఆర్ట్స్, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు విద్యార్థినుల లోదుస్తులతో వీడియోలో కనిపించాడు. బయట ఆరేసిన లోదుస్తులను తీసుకుని పారిపోతున్నట్టు వీడియోలో రికార్డైంది. ఒకసారి సెక్యురిటీ గార్డు పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయాడు. దుండగుడు సైకో అని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. ‘కొద్ది నెలల క్రితం గోడ దూకి అతడు హాస్టల్ లోకి చొరబడడం చూసి విద్యార్థినులు కేకలు పెట్టడంతో అతడు పారిపోయాడు. కొన్నాళ్లు పాటు అతడు మాయమయ్యాడు. మళ్లీ ఫిబ్రవరిలో ప్రత్యక్షమయ్యాడ’ని ఆమె వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరేసుకుని నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
చెన్నై: అనుమానస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్లోని తన రూంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. చదవుల్లో తాను సరిగ్గా రాణించలేక పోతున్నానని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
హాస్టల్ నుంచి మరో హాస్టల్‌పైకి దూకుతూ..
హైదరాబాద్: హైదరాబాద్ మైసమ్మగూడ ప్రాంతంలోని ఓ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి జారి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా జూలురుపాడుకు చెందిన ఎల్లంకి సాయికిరణ్(19) మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ అదే ప్రాంతంలోని సాయి బాలాజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ భవనానికి ఆనుకొని అక్షయ హాస్టల్ కూడా ఉంది. విద్యార్థులు రెండు హాస్టల్ భవనాల నుంచి అటు ఇటూ దూకుతూ ఉంటారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మరో బీటెక్ విద్యార్థి అవినాష్ బాలాజీ హాస్టల్ మూడో అంతస్తు నుంచి అక్షయ హాస్టల్‌కు వెళ్తుండగా సాయికిరణ్ వచ్చాడు. పక్క హాస్టల్లో ఉన్న మణిదీప్ వద్దకు వెళ్లి సెల్ఫోన్లో బుక్ మైషో యాప్‌లో సినిమా టికెట్లు బుక్ చేద్దామన్నాడు. సరేనని చెప్పి అవినాష్ అక్షయ హాస్టల్ భవనంలోకి దూకాడు. అతని వెంటే వస్తున్న సాయికిరణ్ కాలు జారి మూడో అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. దీంతో సాయికిరణ్ తల, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
‘నారాయణ’లో మరో ఇద్దరు బలి
* హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య * కర్నూలు, విజయవాడలో విద్యార్థుల బలవన్మరణం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/విజయవాడ సిటీ: నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు బలిపీఠంపైకి చేరుతూనే ఉన్నారు.అదే యాజమాన్యానికి చెందిన కర్నూలు, విజయవాడ కళాశా లలకు చెందిన ఇద్దరు శుక్రవారం వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫాస్ట్‌ట్రాక్‌కు పంపలేదని: కర్నూలుకు సమీపంలోని నన్నూరు బ్రాంచ్ నారాయణ జూని యర్ కళాశాలలో ఉల్లిందకొండకు చెందిన జీవీ శ్రీకాంత్ ఇంటర్ మొదటి ఏడాది(ఎంపీసీ) చదువుతున్నాడు. శ్రీకాంత్ ఇటీవల నిర్వహిం చిన ఫస్ట్‌టర్మ్ పరీక్షల్లో మ్యాథ్స్-1బీలో ఫెయిలయ్యాడు. మళ్లీ జరిగిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఫస్ట్‌టర్మ్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను జెడ్‌ఎఫ్‌టీబీ(జోనల్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్)కు పంపుతారు. తనను ఆ బ్యాచ్‌కు అప్‌గ్రేడ్ చేయకపోవడంతో శ్రీకాంత్ నిరాశ చెందాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.సురేంద్ర అనే విద్యార్థి గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. శ్రీకాంత్‌ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. విజయవాడలో మరో విద్యార్థి... విజయవాడ రూరల్ మండలం నిడమనూరులోని నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన అఖిల్‌తేజ్ కుమార్‌రెడ్డి(16) నారాయణ ఐఐటీ-జి.సింధూర క్యాంపస్‌లో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తరగతులకు హాజరైన తేజ్‌కుమార్ రెడ్డి మధ్యాహ్నం నుంచి అనుమతి తీసుకొని హాస్టల్ రూమ్ నంబర్ 311లోనే ఉన్నా డు. సాయంత్రం 4.40 గంటల సమయంలో రూమ్‌కి వెళ్లిన సహచర విద్యార్థులకు ఫ్యాన్ హుక్కు ఉరేసుకున్న తేజ్ కనిపిం చాడు. సిబ్బంది కామినేని ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. -
కాలేజిలో ఫుడ్ పాయిజనింగ్.. 200 మందికి అస్వస్థత
-
కాలేజిలో ఫుడ్ పాయిజనింగ్.. 200 మందికి అస్వస్థత
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గూడవల్లిలో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాలేజి హాస్టల్లో రెండు రోజుల క్రితం మాంసాహారం వండారు. అది తిన్నప్పటి నుంచి పిల్లలకు వాంతులు కావడం మొదలైంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వకుండా హాస్టల్లోనే చికిత్స చేయించారు. చాలామంది కోలుకున్నా, సుమారు పది మంది మాత్రం కోలుకోలేకపోవడంతో వాళ్లను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై అటు కాలేజి వర్గాలు గానీ, ఇటు ఆస్పత్రి వర్గాలు గానీ పెదవి విప్పడంలేదు. ఇదేమీ లేదని.. చిన్న విషయమేనని పెద్దగా పట్టించుకోవక్కర్లేదని మాత్రమే చెబుతున్నారు. -
ఉరివేసుకొని విద్యార్ది ఆత్మహత్య
-
తపాలా: చేసింది కొంతే...
సంతోషం ఎంతో... నేను బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజ్ హాస్టల్లో ఉండేదాన్ని. మా వార్డెన్ చాలా మంచావిడ. ఆమె ఎన్నో విషయాలు మాతో పంచుకునేవారు. మేడమ్ పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో అయినా, నిజానికి వాళ్లది ప్రేమ వివాహం. ఒకసారి మాటల్లో ‘ఇంతవరకూ మేము మా కుటుంబం అందరం కలిసి ఫొటోలు తీసుకోలేదు,’ అన్నారు. మేడమ్వాళ్ల భర్త సౌదీకి ఉద్యోగరీత్యా వెళ్లారు. బహుశా అందుకే కుదరకపోయి ఉండొచ్చు. అయితే, అనుకోకుండా మేము అక్కడ ఉన్నప్పుడే ఆయన తిరిగొచ్చారు. ఒకరోజు హాస్టల్‌కి ఫ్యామిలీతో సహా వచ్చారు. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ తన ఆలోచనను నా ముందుంచింది. ఇంకేం, చకచకా ఫొటోలు తీశాం. ఆల్బమ్ అయితే సిద్ధం చేశాంగానీ, ఇవ్వటానికి తగిన సందర్భం కనిపించలేదు. ఒకరోజు మేడమ్ పెళ్లిరోజు అని తెలిసింది. ఇంకేం ఆల్బమ్నే కానుకగా ఇచ్చాం. అప్పుడు ఆమె ముఖంలో చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ కంటతడే చెప్పింది, ఆమె ఎంత సంతోషపడిందో! ఇంకొక విషయం. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా స్నేహితులందరం రెస్టారెంట్‌కు వెళ్లాం. ఒకతను మాకు సర్వ్ చేశాడు. తిన్న తర్వాత టిప్ ఇస్తాం కదా, నేను ఇరవై రూపాయలిచ్చాను. మేం బయలుదేరుతుండగా, ఆ సర్వర్, ‘‘నేను ఈ రోజే పనిలో చేరాను. ఉదయం నుండి నాకు టిప్ ఇచ్చిన తొలి వ్యక్తి మీరే’’ అన్నాడు. నాకు తెలీకుండానే ఒకరి ఆనందానికి కారణం కావడం దాన్ని మరింత పెంచింది. నేను ఏదో చేశానని అనుకోవటం లేదు. వేలు, వందలు కూడా ఖర్చు చేయలేదు. మనం ఇచ్చినది ఏదైనా అది మరొకరికి జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలితే, అంతకన్నా ఆనందం ఉంటుందా? - పి.బి.ఆర్. ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
కాసులిస్తేనే కూడు పెట్టేది!
కాలేజీ హాస్టల్ సిబ్బంది నిర్వాకం ఆకలితో అల్లాడుతున్న విద్యార్థినులు పట్టించుకోని అధికారులు నూజివీడు, న్యూస్‌లైన్ : పేదవర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. సాంఘికసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కాలేజీ హాస్టళ్ల నిర్వహణను ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వార్డెన్లు ఆడిందేఆట, పాడిందేపాటగా తయారైంది. ఒకవైపు ఏప్రిల్ నెలకు కూడా ప్రభుత్వం హాస్టల్ నిర్వహణకు నిధులు చెల్లిస్తుండగా, నూజివీడులోని బాలికల కాలేజీ హాస్టల్లో మాత్రం విద్యార్థినుల వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏప్రిల్‌నెలకు ఒక్కొక్క విద్యార్థిని రూ.1380 చెల్లిస్తేనే భోజనం పెడతామని, లేకపోతే పెట్టమని విద్యార్థినులపై హాస్టల్లోని వర్కర్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించలేని వారు ఇళ్లకు వెళ్లిపోయి స్థానికంగా ఉన్న కళాశాలలకు డైలీసర్వీసు చేస్తుండగా, మరికొంతమంది చేసేది లేక చెల్లిస్తున్నారు. ఇంటర్ నుంచి పీజీకోర్సులతోపాటు ఇంజినీరింగు చదివే ఎస్సీ విద్యార్థినులు ఈ హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.1050 ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే ఒక్కొక్క విద్యార్థినికి రోజుకు రూ.35 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ డబ్బులతో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌తో పాటు రెండుపూటలా భోజనం పెట్టాల్సి ఉంది. వార్డెన్ ఎవరో తెలియదు... కాలేజీ హాస్టల్‌కు వార్డెన్‌గా నిర్మలను 10 నెలల క్రితం నియమించారు. అయినప్పటికీ ఈమె హాస్టల్ నిర్వహణను పట్టించుకోకుండా వేరే హాస్టల్ వార్డెన్‌కు నిర్వహణను అనధికారికంగా అప్పగించేసిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ వార్డెన్ ఇష్టారాజ్యంగా నిర్వహిస్తూ విద్యార్థినుల కడుపుకొడుతోందని చెబుతున్నారు. అసలు వార్డెన్ ఎవరో తమకు ఇంతవరకు తెలియదని, గిరిజ అనే ఆవిడే వార్డెన్ అని అనుకుంటున్నామని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. డబ్బులు వసూలు చేయకూడదు కాలేజీ హాస్టల్ నిర్వహణ నిమిత్తం ఏప్రిల్ నెలకూ ప్రభుత్వం నిధులు చెల్లిస్తున్నందున విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. అలా చేస్తే ఖచ్ఛితంగా చర్యలు తీసుకుంటాం. - డీ మధుసూదనరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ