* హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య
* కర్నూలు, విజయవాడలో విద్యార్థుల బలవన్మరణం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/విజయవాడ సిటీ: నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు బలిపీఠంపైకి చేరుతూనే ఉన్నారు.అదే యాజమాన్యానికి చెందిన కర్నూలు, విజయవాడ కళాశా లలకు చెందిన ఇద్దరు శుక్రవారం వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఫాస్ట్‌ట్రాక్‌కు పంపలేదని: కర్నూలుకు సమీపంలోని నన్నూరు బ్రాంచ్ నారాయణ జూని యర్ కళాశాలలో ఉల్లిందకొండకు చెందిన జీవీ శ్రీకాంత్ ఇంటర్ మొదటి ఏడాది(ఎంపీసీ) చదువుతున్నాడు. శ్రీకాంత్ ఇటీవల నిర్వహిం చిన ఫస్ట్‌టర్మ్ పరీక్షల్లో మ్యాథ్స్-1బీలో ఫెయిలయ్యాడు. మళ్లీ జరిగిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఫస్ట్‌టర్మ్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను జెడ్‌ఎఫ్‌టీబీ(జోనల్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్)కు పంపుతారు. తనను ఆ బ్యాచ్‌కు అప్‌గ్రేడ్ చేయకపోవడంతో శ్రీకాంత్ నిరాశ చెందాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.సురేంద్ర అనే విద్యార్థి గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. శ్రీకాంత్‌ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
విజయవాడలో మరో విద్యార్థి...
విజయవాడ రూరల్ మండలం నిడమనూరులోని నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన అఖిల్‌తేజ్ కుమార్‌రెడ్డి(16) నారాయణ ఐఐటీ-జి.సింధూర క్యాంపస్‌లో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తరగతులకు హాజరైన తేజ్‌కుమార్ రెడ్డి మధ్యాహ్నం నుంచి అనుమతి తీసుకొని హాస్టల్ రూమ్ నంబర్ 311లోనే ఉన్నా డు. సాయంత్రం 4.40 గంటల సమయంలో రూమ్‌కి వెళ్లిన సహచర విద్యార్థులకు ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకున్న తేజ్ కనిపిం చాడు. సిబ్బంది కామినేని ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది.
‘నారాయణ’లో మరో ఇద్దరు బలి
Published Sat, Sep 26 2015 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement