లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు | Man enters college hostel, flees with women’s innerwear | Sakshi
Sakshi News home page

లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు

Published Wed, Mar 22 2017 9:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు

లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు

బెంగళూరు: వింతదొంగ చేష్టలతో బెంగళూరు విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి హస్టల్ ప్రాంగణంలోకి నగ్నంగా చొరబడి వింత దొంగ చేస్తున్న వికృత చేష్టలకు బిత్తరపోయిన విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. తాము బయట ఆరేసిన లోదుస్తులు దుండగుడొకడు ఎత్తుకుపోతున్నాడని మహరాణి ఆర్ట్స్, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు.

హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు విద్యార్థినుల లోదుస్తులతో వీడియోలో కనిపించాడు. బయట ఆరేసిన లోదుస్తులను తీసుకుని పారిపోతున్నట్టు వీడియోలో రికార్డైంది. ఒకసారి సెక్యురిటీ గార్డు పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయాడు. దుండగుడు సైకో అని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. ‘కొద్ది నెలల క్రితం గోడ దూకి అతడు హాస్టల్ లోకి చొరబడడం చూసి విద్యార్థినులు కేకలు పెట్టడంతో అతడు పారిపోయాడు. కొన్నాళ్లు పాటు అతడు మాయమయ్యాడు. మళ్లీ ఫిబ్రవరిలో ప్రత్యక్షమయ్యాడ’ని ఆమె వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement