innerwear
-
Bengaluru: లోదుస్తుల్లో బంగారం తరలింపు
సాక్షి, బెంగళూరు: లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారం తరలిస్తున్న మహిళను కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసారు. దుబాయి నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో చెక్ చేయగా లోదుస్తుల్లో బంగారం పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న సంగతి తెలిసింది. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు రూ.17 లక్షల విలువైన బంగారు పేస్ట్‌ను సీజ్ చేసారు. -
నీట్ పరీక్షలో విద్యార్థినికి ఘోర అవమానం! ఫిర్యాదు చేసిన తండ్రి
తిరువనంతపురం: నీట్ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే కేరళ కొల్లం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు. రూల్ ఏం లేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మెటల్ హుక్స్ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్ చేసిన తర్వాతైనా హాల్లోకి అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు మార్ థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
విద్యార్థినులు లోదుస్తులు తొలగించాలంటూ..
గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకునేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశించారు. పిరియడ్స్ సమయంలో కొన్నింటిని విద్యార్థినులు తాకకుండా దూరంగా ఉంచేందుకు హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ ఈ చర్యకు పూనుకున్నారు. గుజరాత్‌లోని బుజ్ ప్రాంతంలో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. (క్లాస్‌మేట్‌ను ఫేస్బుక్ ద్వారా..) నెలసరి సమయంలో విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలోని ఆలయంలోకి వెళ్తున్నారని, కిచెన్ లోపలికి కూడా వెళ్తూ..ఎక్కడపడితే అక్కడ,, ఎవరిని పడితే వారిని తాకుతున్నారంటూ గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించింది. అక్కడ నుంచి వారందరినీ వాష్ రూమ్‌కి తీసుకెళ్లి వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరినీ లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో చూపించాలని ప్రిన్సిపాల్ ఆదేశించింది. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు నెలసరిలో ఉన్నామంటూ పక్కకు తప్పుకోగా ప్రిన్సిపాల్ వారిని దుర్భాషలాడింది. (యువతిపై సాముహిక అత్యాచారం.. అరెస్ట్) కాగా స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆచారాలు, నియమాలు, సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి, కిచెన్‌లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను తాకరాదు. అయితే కిచెన్‌లో వాడేసిన శానిటరీ న్యాప్కీన్స్ ఉన్నాయంటూ.. హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు విద్యార్థినులు మాత్రం కాలేజీ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. అదే సమయంలో ఈ ఘటనపై ట్రస్ట్ సభ్యులు హిరానీ .. విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తప్పుబట్టారు. -
రిటైల్ మార్కెట్లోకి కేపీఆర్ గ్రూప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న తమిళనాడుకు చెందిన కేపీఆర్ గ్రూప్ కంపెనీ కేపీఆర్ మిల్.. ఫాసో పేరుతో సొంత బ్రాండ్‌లో లోదుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారిగా నూరు శాతం ఆర్గానిక్ కాటన్‌తో వీటిని తయారు చేశారు. ఇటీవలే తమిళనాడు, కేరళలో ఫాసో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా ఫాసో అడుగు పెడుతుందని కేపీఆర్ మిల్ ఈడీ ఇ.కె.శక్తివేల్ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 2021లో మహిళలు, పిల్లల లోదుస్తుల తయారీలోకి వస్తామన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి సొంత స్టోర్లను ప్రారంభిస్తామన్నారు. ఫాసో ధరల శ్రేణి రూ.139–1,199 మధ్య ఉంది. విస్తరణకు రూ.400 కోట్లు.. కేపీఆర్ మిల్కు భారత్‌తోపాటు ఇథియోపియాలో అంతర్జాతీయ స్థాయిలో 12 ప్లాంట్లున్నాయి. 60 దేశాల్లోని 40 ప్రముఖ కంపెనీలకు వివిధ బ్రాండ్లలో లోదుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఎండీ పి.నటరాజ్ తెలిపారు. ‘రోజుకు 2,75,000 కిలోల యార్న్, 50,000 కిలోల ఫ్యాబ్రిక్, 60,000 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది. రూ.400 కోట్లతో విస్తరణ చేపట్టాం. విస్తరణ పూర్తి అయితే విభాగాన్నిబట్టి తయారీ సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.4,000 కోట్లు. ఇందులో టెక్స్టైల్ విభాగం వాటా రూ.3,016 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం టర్నోవరులో 15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని కంపెనీ ఎండీ పి.నటరాజ్ వివరించారు. పరిశ్రమ రూ.30,000 కోట్లు.. ‘ఇన్నర్ వేర్ మార్కెట్ భారత్‌లో రూ.30,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 40%. ఆసియాలో హొజైరీ తయారీలో అతి పెద్ద కేంద్రంగా తమిళనాడులోని తిరుపూర్ నిలిచింది. ఇక్కడ 3,000లకుపైగా ప్లాంట్లు కొలువుదీరాయి. రూ.50,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ ఏటా తయారవుతున్నాయి. 8 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు’ అని నటరాజ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంటు? ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేపీఆర్ గ్రూప్‌ను ఆహ్వానించాయి. ఇందులో తెలుగురాష్ట్రాలూ ఉన్నాయి. 13వ ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పుతారా అని సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎండీ స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కొత్త యూనిట్ విషయమై బోర్డు అనుమతి పొందాలి. ఎంత కాదన్నా ఫ్యాక్టరీకి రూ.500 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది.’ అని పేర్కొన్నారు. రెండేళ్లలో కొత్త ప్లాంటు సాకా రం అయ్యే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్ టి.ఎన్.అరుణ్ వెల్లడించారు. కేపీఆర్ మిల్ షేరు శుక్రవారం 19 శాతం వృద్ధి చెంది రూ.554.60 వద్ద స్థిరపడింది. -
ఛీ.. ఇదేం స్కూలు!
పుణె: ‘విద్యార్థినులు ఒకే రంగు లోదుస్తులు వేసుకోవాలి. మరుగుదొడ్డికి నిర్ణీత సమయంలో మాత్రమే వెళ్లాలి’ అంటూ ఓ ప్రైవేటు పాఠశాల ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్ ఎమ్ఐటీ స్కూల్ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో కచ్చితంగా పేర్కొనాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది. ‘విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్ కలర్ లోదుస్తులు ధరించాలి. వారు ధరించి స్కర్ట్ పొడవు ఎంతుందో కచ్చితంగా పేర్కొనాలి. ఈ వివరాలు స్కూల్ డైరీలో రాసి మాతో సంతకం పెట్టించుకుని తీసురావాల’ని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు ఓ విద్యార్థి పేరెంట్ తెలిపారు. తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ఆంక్షలంటూ మండిపడుతున్నారు. గతానుభవాలతోనే... అయితే మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధనలు పెట్టామని ఎమ్ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర కరాద్ నగరె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని, వీటి వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదని వివరణయిచ్చారు. -
లోదుస్తులపైనా ఆ స్కూల్ ఆదేశాలు..
సాక్షి, ముంబై : పూణేకు చెందిన విశ్వశాతి గురుకుల్ విద్యా సంస్థ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. బాలికల లోదుస్తుల రంగుపై స్కూల్ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన డైరీల్లో బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని నిర్ధిష్టంగా పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యం తమను బలవంతంగా ఈ ప్రతిపాదనకు ఒప్పించేలా ఇలా వ్యవహరిస్తోందని తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గదర్శకాలపై పలువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వీటిని తోసిపుచ్చుతున్న స్కూల్ యాజమాన్యం బాలికల భద్రత కోసమే ఈ నియమాలను పొందుపరిచామని సమర్ధించుకుంటోంది. వివాదాస్పద మార్గదర్శకాలపై తల్లితండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ నియమాలను వ్యతిరేకిస్తూ ప్రాధమిక విద్య డైరెక్టర్‌ను తల్లితండ్రులు కలిసి స్కూల్ తీరుపై ఫిర్యాదు చేశారు. -
నీట్ రాయాలంటే.. ఇంత దారుణమా..
కన్నూరు: నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) హాజరైన పలువురు అభ్యర్ధులకు దారుణ అనుభవాలు ఎదురయ్యాయి. పరీక్షకు హాజరు కావడానికి డ్రెస్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేరళలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినులను ఇన్నర్‌వేర్ తీసేసి పరీక్షకు హాజరు కావాలని అధికారులు కోరారు. దీంతో కంగుతిన్న విద్యార్థినులు చేసేది లేక ఇన్నర్‌వేర్ తీసేసి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ముగిశాక మీడియాతో మాట్లాడిన విద్యార్థునుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా హాలులోకి వెళ్తున్న తన కూతురిని ఆపిన అధికారులు ఇన్నర్‌వేర్‌ను తీసేసి రావాలని కోరినట్లు ఓ తల్లి తెలిపింది. మరో అమ్మాయి జీన్స్ వేసుకుని పరీక్షకు వెళ్లగా.. ప్యాంట్‌కు ఉన్న జేబులను, మెటల్ బటన్స్‌ను తొలగించుకుని రమ్మన్నారని ఆమె తండ్రి తెలిపారు. ముస్లిం అమ్మాయిలను కూడా ఫుల్ లెంగ్త్ స్లీవ్స్‌ను వేసుకునేందుకు అనుమతించలేదని చెప్పారు. అధికారుల ప్రవర్తన కారణంగా ఎంత మంది అమ్మాయిలు పరీక్షను బాగా రాసి ఉంటారు? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు పిల్లలతో ప్రవర్తించిన తీరు అమానుషమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌కు లేఖ రాస్తానని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బిందు కృష్ణా చెప్పారు. కాగా, ఆదివారం దేశవ్యాప్తంగా 104 కేంద్రాల్లో జరిగిన నీట్ పరీక్షకు 11 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు
-
లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు
బెంగళూరు: వింతదొంగ చేష్టలతో బెంగళూరు విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి హస్టల్ ప్రాంగణంలోకి నగ్నంగా చొరబడి వింత దొంగ చేస్తున్న వికృత చేష్టలకు బిత్తరపోయిన విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. తాము బయట ఆరేసిన లోదుస్తులు దుండగుడొకడు ఎత్తుకుపోతున్నాడని మహరాణి ఆర్ట్స్, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు విద్యార్థినుల లోదుస్తులతో వీడియోలో కనిపించాడు. బయట ఆరేసిన లోదుస్తులను తీసుకుని పారిపోతున్నట్టు వీడియోలో రికార్డైంది. ఒకసారి సెక్యురిటీ గార్డు పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయాడు. దుండగుడు సైకో అని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. ‘కొద్ది నెలల క్రితం గోడ దూకి అతడు హాస్టల్ లోకి చొరబడడం చూసి విద్యార్థినులు కేకలు పెట్టడంతో అతడు పారిపోయాడు. కొన్నాళ్లు పాటు అతడు మాయమయ్యాడు. మళ్లీ ఫిబ్రవరిలో ప్రత్యక్షమయ్యాడ’ని ఆమె వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.