పుణె: ‘విద్యార్థినులు ఒకే రంగు లోదుస్తులు వేసుకోవాలి. మరుగుదొడ్డికి నిర్ణీత సమయంలో మాత్రమే వెళ్లాలి’ అంటూ ఓ ప్రైవేటు పాఠశాల ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్ ఎమ్‌ఐటీ స్కూల్ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో కచ్చితంగా పేర్కొనాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది.
‘విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్ కలర్ లోదుస్తులు ధరించాలి. వారు ధరించి స్కర్ట్ పొడవు ఎంతుందో కచ్చితంగా పేర్కొనాలి. ఈ వివరాలు స్కూల్ డైరీలో రాసి మాతో సంతకం పెట్టించుకుని తీసురావాల’ని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు ఓ విద్యార్థి పేరెంట్ తెలిపారు. తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ఆంక్షలంటూ మండిపడుతున్నారు.
గతానుభవాలతోనే...
అయితే మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధనలు పెట్టామని ఎమ్‌ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర కరాద్ నగరె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని, వీటి వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదని వివరణయిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment