diary
-
నీ గొంతు ఇప్పుడూ అవసరమే
‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు...ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది అనీ ఫ్రాంక్. యూదుల మీద హిట్లర్ దమనకాండ సాగిస్తున్నప్పుడు 14 ఏళ్ల యూదు బాలిక అనీ ఫ్రాంక్ రాసిన జగద్విఖ్యాత డైరీనే ‘అనీ ఫ్రాంక్ డైరీ’.ఇవాళ ΄పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడి ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఇవన్నీ పిల్లల్ని ΄ పౌరుల్ని దారుణంగా చంపుతున్నప్పుడు‘మానవత్వం కోసం అనీ చేసిన ప్రార్థన’ గుర్తు చేసుకోక తప్పదు.అనీ ఫ్రాంక్ పుట్టింది జూన్ 12, 1929లో. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ యూదు కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన పిల్ల అనీ ఫ్రాంక్. ఆమె పదమూడవ జన్మ దినాన– అంటే జూన్ 12, 1942న తండ్రి ఆమెకు ఒక డైరీని కానుకగా ఇచ్చాడు. పుట్టిన రోజుకు ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రితో షాపింగ్‌కి వెళ్లిన అనీకి బౌండ్ చేసిన నోట్‌బుక్ కనిపించింది. ‘అది నాకు అది కావాలి నాన్నా’ అని తండ్రిని అడిగితే బర్త్ డే గిఫ్ట్‌గా కొనిచ్చాడు. ఆ నోట్‌బుక్‌ని ఎంతో ఇష్టపడ్డ అనీ దానినే డైరీగా భావించి రోజూ రాయడం మొదలుపెట్టింది.రహస్య జీవితంరెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు హిట్లర్ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులను అరెస్ట్ చేస్తున్నారు. అది తెలిసిన వెంటనే– జూలై 5, 1942 రాత్రి అనీ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరారు. దాని యజమాని యూదుల సానుభూతి పరుడు. కొంతమంది మిత్రులు రహస్యంగా అందించే ఆహారాన్ని వాడుకుంటూ అనీ ఫ్రాంక్ కుటుంబం నాజీ ΄ోలీసులకు పట్టుబడే వరకు అంటే ఆగస్టు 4, 1944 వరకు– రెండేళ్ల 35 రోజులు రహస్య గదుల్లోనే గడిపింది. ఆ మొత్తం రోజులూ అనీ ఫ్రాంక్ డైరీ రాసింది. పట్టుబడ్డాక అనీ ఫ్రాంక్ను నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించారు. తీవ్రమైన ఆకలితో, చలికి వణుకుతూ కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి– మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది అనీ ఫ్రాంక్.ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్అనీ రాసిన డైరీ తొలిసారి 1946లో మార్కెట్లో విడుదలై సంచనలం రేపింది. డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రతి దేశంలో ప్రతి భాషలో అనువాదం అయ్యింది. తాను డైరీ రాస్తున్న కాలంలో నాజీలు యూదులను దారుణంగా హతమారుస్తున్నా, రహస్య స్థలంలో తాము తిండికీ బట్టకూ అల్లాడుతున్నా అనీ ఎవరినీ ద్వేషించలేదు. అడుగడుగునా మనిషి మీద నమ్మకం ఉంచింది. ‘ఇంత చేస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది. ‘నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. ఒకవేళ నాకు వార్తాపత్రికలకు రాసే ప్రావీణ్యం లేకున్నా నా కోసం నేను రాసుకుంటాను. చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేని ఇంటి పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి’ అని రాసుకుంది అనీ.ద్వేషం వద్దనేదే ఆనా సందేశంమనిషికి సాటి మనిషి మీద ద్వేషం ఎంతదూరమైనా తీసుకెళుతుందని రెండో ప్రపంచ యుద్ధం నిరూపించింది. హిట్లర్ విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను నిర్మూలించారు. గ్యాస్ చాంబర్స్‌లో వేసి చంపారు. ఏ యూదులైతే నాజీల వల్ల కష్టాలు పడ్డారో అదే యూదులు నేడు పాలస్తీనా బాలల శోకానికి కారణం కావడం విషాదం. అక్కడ వేలాది మంది చిన్నారులు మరణించారు, తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లలు ఎందరు అనీ ఫ్రాంక్లా భవిష్యత్తులో తమ డైరీలను ప్రపంచానికి చాటుతారో!ఈ ప్రపంచాన్ని పిల్లలకు యోగ్యమైనదిగా పెద్దలు అనుక్షణం తీర్చిదిద్దుతూ ఉండాలి. పిల్లలు ఇష్టపడేది ప్రేమనే. అంటే ప్రపంచాన్ని ప్రేమతో నిం΄ాలి. ఇక్కడ ద్వేషానికి చోటు లేదని నిరూపించాలి. అది జరిగేంత వరకూ మబ్బుల చాటున దాగి ఆనా తన సందేశం వినిపిస్తూనే ఉంటుంది. -
కొంప ముంచే డైరీలు..!
ఆనాడు హవాలా జైన్ డైరీ.. నేడు లోకేష్ రెడ్ డైరీ.. తెలంగాణాలో రేవంత్ రెడ్డి డైరీ.. వీళ్లంతా డైరీల పేరిట జనాన్ని భయపెడుతున్నారో లేక రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారో తెలీదు కానీ వీళ్ళ పుణ్యాన డైరీల్లోని రహస్యాలు.. అందులోని అంశాలు.. వాటి పర్యవసానాలు ఎక్కడికి తీసుకుపోతాయోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు డైరీలు రాయడం.. ఎదుటివాళ్లను బెదిరించడం ఒక ఫ్యాషన్ అయింది. అప్పట్లో స్కూల్లో టీచర్ బయటికి వెళ్తూ.. ఒరేయ్ లీడర్.. క్లాసులో అల్లరిచేసే వాళ్ళ పేర్లు పుస్తకంలో రాయి.. మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి వీపులు వాయగొడతాను అని చెప్పి వెళ్తాడు.. ఆ లీడర్ అలాగే తనకు నచ్చనివాళ్ళ పేర్లు... ఇంటర్వెల్లో జామకాయలు.. రేగ్గాయలు ఇవ్వని వాళ్ళను.. సైకిల్ అడిగితె ఇవ్వని వాళ్ళ పేర్లన్నీ రాసేసి టీచరుకు ఇచ్చి దెబ్బలు కాయిస్తాడు.. అచ్చం ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే నడుస్తోంది.. ఆంధ్రాలో లోకేష్ సైతం తన యువగళం పాదయాత్ర చేస్తున్నానని రోజులూ ఒక ఎర్ర బుక్కు పట్టుకుని ఉండేవారు.. తనకు నచ్చని.. తమ పార్టీని.. తమ క్యాడర్ ను ఇబ్బంది పెట్టినవాళ్లందరినీ మున్ముందు అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాను అని చెబుతూ వాళ్ళ పేర్లు రాసుకునేవారు. పోలీసులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ.. కార్యకర్తలు .. అధికారులు.. ఇలా రకరకాల వాళ్ళను టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్కులో రాస్తున్నాను .. మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళను కట్ డ్రాయర్లతో నడిపిస్తాను అని హెచ్చరించారు. ఇది ఆపూటకు ఆ మీటింగులో లోకేష్‌కు మైలేజి తెచ్చిందో లేదో తెలీదు కానీ.. జనం మాత్రం నవ్వుకున్నారు.. ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదేమైనా రాచరికపు కాలంలో ఉన్నామా అనే కామెంట్లు కూడా వచ్చాయి. గతంలో నిషిద్ధ పీపుల్స్ వార్ నక్సలైట్లు మాత్రమే ఇలా డైరీ రాసేవారు. తమ వర్గశత్రువుల పేర్లు ఆంటే ఎమ్మెల్యేలు ఆ జిల్లాలోని కొందరు పోలీసుల పేర్లు అందులో రాసి వాళ్ళను టార్గెట్ చేసి హత మార్చేవారు. అచ్చం ఆ డైరీని తలపించే లోకేష్ రెడ్ డైరీ మీద ఆంధ్ర సీఐడీ కేసు బుక్ చేసింది. విచారణకు సైతం రమ్మని నోటీసులు పంపింది. సిమ్మాదిరప్పన్న -
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు. -
నిజాయితీయే నిజమైన విలువ
చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే తాజా పుస్తకం ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినది. పుస్తకంలోని రహస్యోద్ఘాటనలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా! ఇందిరా గాంధీలోని ఎవరికీ తెలియని మరికొన్ని కోణాలను కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా దేశాధినేతల గురించి, వారికి సమీపంగా దీర్ఘకాలం ఉన్నత పదవులను నిర్వహించినవారు తమ డైరీలలో నిజాయితీగా రాసి పెట్టుకున్న విశేషాలతో తెచ్చిన పుస్తకాలు ఎంతో విలువను, ప్రతిష్ఠను కలిగి ఉంటాయి. డైరీలు రాసే సంప్రదాయం మన దగ్గర గట్టిగా లేకపోవడం సిగ్గు చేటు. మళ్లీ బ్రిటిష్ వాళ్లకు ఆ భాగ్యం ఉంది. అక్కడి శామ్యూల్ పెపిస్ నుంచి రిచర్డ్ క్రాస్‌మన్ వరకు, ఆపై ఉడ్రో వ్యాట్ దాకా... పఠనాన్ని మంత్రముగ్ధం చేస్తూ డైరీలు రాశారు. మరీ ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న స్త్రీ, పురుషుల గురించి వారు తమ డైరీలలో మొత్తం బహిర్గతం చేశారు. లేకుంటే మనం ఆ విశేషాలను ఎప్పటికీ తెలుసుకోగలిగేవాళ్లం కాదు. వారి నిజాయితీనే ఆ డైరీలకుండే నిజమైన విలువ. ఉడ్రో వ్యాట్ రాసిన మూడు సంపుటాల డైరీల గురించి నాటి ‘సండే టైమ్స్’ ఎడిటర్ ఆండ్రూ నీల్, ‘‘ఈ దేశ పాలకులు, సామాజిక విశిష్టులకు సంబంధించి చేర్పులు లేని వాస్తవాలను ఇవి కలిగి ఉన్నాయి’’ అని కితాబునిచ్చారు. మార్గరెట్ థాచర్ జీవిత చరిత్ర కారుడైన ప్రముఖుడు చార్ల్స్ మోర్, ‘‘ఆమె తన సన్నిహితుల సమక్షంలో ప్రజా కార్యక్రమాలపై వ్యక్తం చేసిన వ్యక్తిగత ప్రతిస్పందనలు తరచు ఆ డైరీలలో కనిపించేవి’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, అమూల్యమైన అంతర్నేత్ర దృష్టికి వారి డైరీలు నెలవుగా ఉండేవి. ఇన్నాళ్లకు, మనకూ అలాంటి ఒక పోల్చుకోదగిన డైరీ లభ్యమైంది! చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే పుస్తకం ఆనాడు ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినదే. పుస్తకంలోని విశేషాంశాలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా. మరోలా చెప్పా లంటే... ప్రధానమంత్రి వెనుక ఉన్న అసలు స్వరూపాన్నీ (కొన్నిసార్లు ఆ స్వరూపం లోపభూయిష్టంగా ఉంటుంది), అదే సమయంలో... అందరిలాంటి ఒక మామూలు మనిషినీ ఈ పుస్తకం దృగ్గోచరం చేస్తుంది. మొదట చిన్న విషయాలు. సమావేశాలలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ తన చేతి గోళ్ల ఎగుడు దిగుడులను అందంగా సమం చేసుకుంటూ కనిపించేవారు. అయినప్పటికీ, ‘‘సమావేశంలోని ఏ మాటా ఆమె చెవులను దాటి వెళ్లేది కాదు’’. ఆమెకు కొన్ని గాఢమైన నమ్మ కాలు ఉండేవి. ‘‘ఇంటి నుండి ఆఫీసుకు బయల్దేరవలసిన ఘడియ లను కూడా ఆమె జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు’’. ఆమెలో హానికరం కాని ‘పట్టిపీడించే ఆలోచనలు’ (అబ్సెషన్స్) కొన్ని ఉండేవి. ‘‘లేఖలు రాయడాన్ని ఇందిరా గాంధీ ఇష్టపడేవారు. అంతకంటే కూడా లేఖల చిత్తుప్రతుల్ని, ప్రసంగ పాఠాలను, సందేశాలను స్వయంగా సవరించడానికి ఆసక్తి కనబరిచేవారు’’. ఇక ఆ పూట భోజనంలోకి ఏయే వంటకాలు ఉండాలన్నది నిర్ణయించడానికి గంటల సమయం వెచ్చించేవారు. కామన్వెల్త్ సదస్సుకు హాజరైన ప్రభుత్వాధినేతల కోసం ఆమె భారత దౌత్యవేత్త శంకర్ బాజ్‌పేయితో కలిసి మెనూ తయారీకి 45 నిముషాల సమయం తీసుకున్నారు. బ్రిటన్ రాణిగారికి ఉదయం పూట అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం విందులోకి ఏమేమి తయారు చేస్తున్నారో ఆ జాబితానూ ప్రతిరోజూ తను చూడాలని కోరుకునేవారు. బ్రిటన్ పట్ల ఇందిరా గాంధీ వైఖరి గురించి ఘరేఖాన్ తన పుస్తకంలో రాసిన విషయాలను చదివి నేను పరవశుడినయ్యాను. ‘‘ప్రధాని ఇందిరా గాంధీ బ్రిటన్ను, ప్రధానంగా బ్రిటన్ రాచకుటుంబీకులను ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా లేరు’’. 1983లో రాణిగారికి లండన్‌లోని ఇండియన్ హై కమిషనర్ నివాస గృహంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు... న్యూయార్క్ నుంచి నేరుగా భారత్‌కు తిరిగి వస్తున్న ఇందిరా గాంధీ అర్ధంతరంగా లండన్‌లో దిగి... భారత హై కమిషనర్, ఆయన భార్య ఆ ప్రత్యేక భోజన సందర్భాన్ని చక్క గానే నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. ‘‘రాణి గారి సమక్షంలో ఎలా ప్రవర్తించవలసిందీ హై కమిషనర్‌కు చెప్పారు’’. (ఎప్పుడూ కూడా రాణిగారి వైపు మీ వీపు భాగం తిరిగి ఉండకూడదని సూచించారు). ఇందిరా గాంధీ తోట పని చేసేవారు. ఇంట్లో ఫర్నిచర్ అమరికల్లో తరచు మార్పులు చేస్తుండేవారు. వాకిళ్లకు, కిటికీలకు వేసే పరదాలలో కొత్త డిజైన్ల ఎంపిక కోసం ఇంటి అలంకరణ నిపుణులకు – ప్రత్యేక అతిథులను తోడుగా ఇచ్చి – విదేశాలకు పంపుతుండేవారు. ఆ ప్రత్యేక అతిథులలో రాజవంశీయుడైన మాధవరావు సింధియా కూడా ఒకరు. 1981లో ప్రిన్స్ చార్ల్స్ వివాహ మహోత్సవానికి హాజరు అయేందుకు అమితమైన అసక్తిని కనబరిచి కూడా చివరికి హాజరు కాలేకపోయినందుకు ఇందిరా గాంధీ ఎంతగానో నిరాశకు లోనయ్యా రని ఘరేఖాన్ రాశారు. ‘‘అప్పుడు ఆమెలో కనిపించిన ఆ స్థాయి నిస్పృహను మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని ఘరేఖాన్ తన డైరీలో పేర్కొన్నారు. చార్ల్స్ పెళ్లి వేడుకకు తను వెళ్లడం లేదని మొదట చెప్పిన రాష్ట్రపతి ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ప్రధాని ఆగిపోవలసి వచ్చింది. ఇందిరా గాంధీ నోబెల్ శాంతి బహుమతిని అమిత ఆపేక్షగా కోరుకున్నారని కూడా పుస్తకంలో ఉంది. బహుమతిని దక్కించే ప్రచారం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీకి ఘరేఖాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి ‘ఘనత’ పట్ల ఆమె భ్రాంతికి ఇదొ క్కటే నిదర్శనం కాదు. ‘‘ఇతర నాయకులను, చివరికి రాష్ట్రపతులను కూడా ఆమె తన దగ్గరికి పిలిపించుకోవడాన్ని గొప్పగా భావించే వారు’’. ఆమె ప్రత్యేక సహాయకుడు ఆర్.కె. ధావన్ ఆమెను కలవ వలసిందిగా రాష్ట్రపతులకు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సమాచారం పంపేవారు. ఇందిరా గాంధీలో ఉన్న ఒక వింతైన కోణాన్ని కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. 1983 ఓస్లో పర్యటన సందర్భంగా సోనియా గాంధీ భారత రాయబారికి దిగువన ఉన్న వరుసలో కూర్చో వలసి వచ్చింది. ‘‘అప్పుడు ప్రధాని ఇందిర... సోనియాను పైవరుసకు చేర్చారు’’. అదేమీ నార్వే దేశ ప్రొటోకాల్‌కు అనుగుణంగా జరిగింది కాదు. సోనియాకు ప్రాముఖ్యం కల్పించడమే ఇందిరా గాంధీకి ప్రధానం అయింది. నిజానికి రాయబారులను తక్కువగా చూడటం అసాధారణ మేమీ కాదన్నట్లుగా కనిపించే అనేక సంఘటనల్ని ఈ పుస్తకం పేర్కొంది. ‘‘ఇందిరా గాంధీ ఎంతో అలవోకగా రాయబారులతో ఉదాసీనంగా, ధిక్కారంగా ప్రవర్తించడాన్ని నేను గ్రహించాను’’ అని రాసుకున్నారు ఘరేఖాన్. ఘరేఖాన్ పేర్కొన్న సందర్భాలు ఎంత ఆసక్తిని రేకెత్తించేవీ,ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేసేవీ అయినప్పటికీ... అవి ఇందిరా గాంధీ మరణించిన నలభై సంవత్సరాల తర్వాత పుస్తకంగా బయటికి వచ్చినవి. అదే మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలోని రాజకీయ ప్రముఖులెవరైనా డైరీలు రాసి ఉంటే అవి ఇప్పుడు ఇంకెంత ఆకట్టుకునేలా ఉంటాయో కదా? రచయితలకు కూడా ఆ డైరీలు ఆకర్షణీయతను తెస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సీపీఎస్ ఉద్యోగుల తొలి డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రూపొందించిన తొలి డైరీని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... సీపీఎస్ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఈ డైరీలో పొందుపరిచామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో విద్యుత్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ‘సాంకేతిక సామర్థ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర డిస్కంల కంటే ముందున్నా...ఆర్థికంగా కొంత వెనుకబడిపోయాయి. నష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా పంపిణీ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు గట్టెక్కాలంటే మీటర్ సేల్స్ పెంచాలి. అంతర్గత వృథా ఖర్చులు తగ్గించుకోవాలి’ అని తెలంగాణ విద్యుత్ (టాన్స్‌కో,జెన్కో) సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డా రు. శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ–2023 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు కొంత మెరుగ్గా ఉన్నా.. పంపిణీ సంస్థలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా సహకరిస్తున్నా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నష్టాల్లో ఉన్న సంస్థలను ఇక లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది. లేదంటే సంస్థల మనుగడే కాదు ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజుకో రకమైన సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. విద్యుత్ సంస్థలకు ఈ క్రైం సవాల్ విసురుతోంది. ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. సైబర్ నేరగాళ్లకు సంస్థలు చిక్కకుండా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆర్థిక వనరులు వారి చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది. అకౌంటెంట్లు కేవలం అకౌంట్స్‌ను నిర్వహించడమే కాదు బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెన్ చేయాలి. సంస్థ ఖాతాలో నిల్వలు ఉన్నప్పుడే అవసరానికి, అభివృద్ధి పనులకు బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. నిల్వలు లేక పోతే అప్పులు కూడా పుట్టవు.’అని సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆ డబ్బులు సొంతానికి వాడుకుంటే ఎలా? సీఎండీ రఘుమారెడ్డి ‘వినియోగదారుల నుంచి వసూలు చేసిన విద్యుత్ బిల్లులను, వెంటనే సంస్థ ఖాతాలో జమ చేయడం లేదు. వీటిని కొంత మంది ఉద్యోగులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. వరుస డోర్‌లాక్‌లు, మీటర్ స్టకప్‌లు వంటి అంశాలను ఈఆర్ఓలు మానిటరింగ్ చేయడం లేదు. పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకుంటే ఎలా? ఈఆర్ఓ కేంద్రాల్లోని అకౌంటెంట్లు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు బిల్లులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా..? ఈఆర్ఓ కో ఆర్డినేషన్ మీటింగ్‌లో ఏం చర్చిస్తున్నారు? అన్‌బిల్డ్ సర్వీసులపై ఎందుకంత నిర్లక్ష్యం? ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సర్వీసులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. సెక్షన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, వృధా ఖర్చులు, విద్యుత్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత అకౌంటెంట్లపైనే ఉంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, జెన్కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నరసింహ్మారావు, టీఆర్కే రావు, తిరుపతిరెడ్డి, వీఏఓఏటీ అధ్యక్షుడు ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. నందూ డైరీలో 50 మంది నేతల పేర్లు!
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీ యాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. టీఆర్ఎస్, బీజేపీల నడుమ రాజకీయ యుద్ధం లాగా సాగుతున్న ఈ ఎపిసోడ్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్న నందకుమార్ డైరీలో సంచలన విషయా లున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయనేతలుగా చెలామణి అవుతున్న నాయకుల పేర్లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నేతల పేర్లు డైరీలో ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో 25 మంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అంగీకరించారని సునీల్ బన్సల్ పేరిట ఉన్న సెల్‌ఫోన్‌కు రామచంద్రభారతి నుంచి మెసేజ్ వెళ్లిందన్న విషయం ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఈ జాబితాలో ఉన్న నాయకులెవరూ? అందరూ ఎమ్మెల్యేలేనా? లేదా మాజీలా? ఎమ్మెల్యే స్థాయి నాయకులు నందకుమార్‌తో టచ్‌లోకి వచ్చారా లేదా వీరితో సంప్రదింపులు జరపాలని టార్గెట్‌గా పెట్టుకుని డైరీలో వీరి పేర్లను రాసుకున్నాడా? అసలెవరెవరు టచ్‌లో ఉన్నారు? నందకుమార్ నీడ పడిన నేతల డీల్స్ ఎంతవరకు వచ్చాయి? ఈ పేర్లుగల నాయకుల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతోంది? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రూపాయి కావాలా.... నాయనా? నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు, పైలట్ రోహిత్‌రెడ్డిల నడుమ ఆడియో సంభాషణలు ఓ ఎత్తయితే, నందకుమార్ డైరీలో ఎవరి పేర్లున్నాయనే అంశం మరోఎత్తుగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న నందకుమార్ (ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే మీడియాలో వచ్చాయి) ఏ పార్టీలోని ఏ నాయకుడితో డీల్ మాట్లాడుకున్నాడనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో కాంట్రాక్టులు చేసిన, చేస్తున్న నాయకులు, ఆర్థిక అవసరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా చేసుకుని నందూ టీం పనిచేయాలని భావించిందని, అందులో భాగంగానే పలువురితో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంకో ఏడాది కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు అవసరమైన ‘రూపాయలు’సమకూర్చుకుంటే చాలనే ఆలోచనతో ఉన్న నేతల కూపీ లాగి వారితో టచ్‌లోకి వెళ్లాడా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికలకు అవసరమయ్యేంత సమకూరిస్తే డీల్ ఓకే చెప్పిన నాయకులెంతమంది? రాష్ట్రంలోని 50 మందినేతలను వడపోసేందుకు నందకుమార్ ఎంచుకున్న ప్రాతిపదిక ఏంటి? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరి నందకుమార్ డైరీనా... మజాకా? చదవండి: తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర -
నల్ల డైరీలో కీలకాంశాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ అక్రమ నియామకాలకు సంబంధించిన స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పురోగతి సాధించింది. సోదాల్లో భాగంగా నాటి విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఇంట్లో నలుపు రంగు డైరీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు అందులో రాసి ఉన్నట్లు ఈడీ చెబుతోంది. దీంతో దర్యాప్తు సరైన మార్గంలో కొనసాగేందుకు వీలవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. బెంగాల్ ఉన్నత విద్య, పాఠశాల విద్యా విభాగానికి సంబంధించిన ఆ డైరీలోని 40 పేజీల్లో చాలా వివరాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పార్థా, అర్పితాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి నేరుగా కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు తీసుకొచ్చి పార్థాను ప్రశ్నించారు. దీంతోపాటు గతంలో పశ్చిమబెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాఛార్యకు ఈడీ సమన్లు జారీచేసింది. బుధవారం కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు వచ్చిన వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. ఈడీ గతంలోనే మాణిక్ ఇంట్లో సోదాలుచేయడం తెల్సిందే. కాగా, పార్థాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. -
మళ్లీ రాయకూడని డైరీ
ఉదయం ఎనిమిదిన్నర తర్వాత మీరు టాయిలెట్లో ఫ్లష్ చేయకూడదు. తల్లితో ముద్దుగా పోట్లాడకూడదు. నడిచి వెళ్లి తండ్రి ఒళ్లో కూర్చోకూడదు. చిన్న బొమ్మకారు ఉంటే దానిని నేల మీద జూయ్ జూయ్మని వదలకూడదు. మాట పలక్కూడదు. శ్వాస బలంగా తీయకూడదు. మీరు బతికే ఉంటారు. కానీ మీరు బతికి ఉన్నట్టుగా తెలియకూడదు. గాలి, వెలుతురు రాని చిన్న గదుల్లో దాక్కుని ఉంటారు. కిటికీలో నుంచి తొంగి చూసే స్వేచ్ఛను కోల్పోయి ఉంటారు. బయట ఏమి జరుగుతున్నదో మీకు తెలియనే తెలియదు. రాత్రిళ్లు ఉండి ఉండి బాంబులు దద్దరిల్లుతాయి. సైరన్లు వికృతంగా మోగుతాయి. మర ఫిరంగులు విరేచనాలు చేసుకుంటాయి. ఎవరో ఎప్పటికీ కనిపించని కొందరు మనుషులు బాధగా కేకలు వేస్తారు. మీరు అనుక్షణం భయంలో ఉంటారు. తలుపును ఎవరైనా తడితే ఉలిక్కి పడతారు. చావు దాపునే గుసగుసలాడుతూ ఉంటుంది. ఇలాంటి నిర్బంధంలో మీరు ఎన్ని గంటలు ఉండగలరు? ఎన్ని నిమిషాలు ఉండగలరు? ఎన్ని సెకన్లు జీవనకాంక్షతో బతకగలరు? కాని ఒక పద్నాలుగేళ్ల బాలిక ఎన్నాళ్లు అలా ఉందో తెలుసా? 761 రోజులు. మనుషుల మీద ఎంత విశ్వాసం ఉంచుకుందో తెలుసా? 714 పేజీలు. ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’గా జగద్విఖ్యాతమైన ‘ఆనా ఫ్రాంక్ డైరీ’ హిట్లర్ నరమేధకాలంలో రెండేళ్ల పాటు లిఖించబడి నేటికీ ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తూనే ఉంది. కన్నీరు కార్చేలా చేస్తూనే ఉంది. మానవత్వం కోసం ప్రాధేయపడుతూనే ఉంది. ‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు... ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది ఆనా ఫ్రాంక్ తన డైరీలో. జూన్ 12, 1942న ఆనా ఫ్రాంక్ 13వ జన్మదినాన ఆమె తండ్రి ఎర్ర రంగు చెక్స్ ఉన్న డైరీని బహూకరిస్తాడు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ ఆ యూదు కుటుంబంలో ఆనా కుదురులేని పిల్ల. ఆకాశాన్ని గాలిపటంగా ఎగరేద్దామనుకనే గడుగ్గాయి. గెంతులేసే గొర్రెపిల్ల కనిపించినా, కొమ్మలూపే చెట్టు కనిపించినా, హాయిగా నవ్వే మనిషి కనిపించినా పులకించిపోయే అమలిన శిశువు. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు నాజీ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులకు నరకలోక ద్వారాలు తెరిచింది. ఆనా ఫ్రాంక్ అక్క 16 ఏళ్ల మార్గోట్కు జర్మనీలోని నాజీ క్యాంప్‌లో రిపోర్ట్ చేయమని జూలై 5, 1942న తాఖీదు ఇవ్వబడినది. అంటే ఏమిటో ఆ యూదు కుటుంబానికి తెలుసు. ఆ రాత్రే తండ్రి ఆనా ఫ్రాంక్ను పిలిచి ‘మనం ఇల్లు విడుస్తున్నాం. నీ స్కూల్ బ్యాగ్‌లో పట్టేన్ని వస్తువులే పెట్టుకో’ అంటాడు. ఆ మరుసటి తెల్లవారుజామున చినుకులు పడుతూ ఉండగా కట్టుబట్టలతో తల్లిదండ్రులు, అక్క, డైరీని దాచుకున్న స్కూల్ బ్యాగ్‌తో ఆనా బెదురు అడుగులు వేస్తూ అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరుతారు. ఆ భవంతిలో బుక్ర్యాక్లా కనిపించే తలుపు వెనుక రెండు రహస్య గదులు ఉంటాయి. మళ్లీ నాజీ పోలీసులకు పట్టుబడే– ఆగస్టు 4, 1944 వరకూ అంటే రెండేళ్ల 35 రోజులు వాటిలో ఉండిపోతారు. ఆ మొత్తం రోజులకు ఆ బాలిక ఆనా ఫ్రాంక్‌కు తోడుగా నిలిచింది ఆ డైరీ. ఆమె గుర్తుగా ప్రపంచానికి మిగిలింది ఆ డైరీ. ‘ఇంత చేస్తున్నా, ఇంత చూస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది ఆనా తన డైరీలో. అవును. మనిషి మంచివాడే. కానీ ప్రమాదకరమైన ప్రభావాలకు బానిస. మూక మనస్తత్వానికి సాధనం. పాలనాపరమైన సమర్ధింపు ఉందని భావిస్తే చెలరేగే క్రూరమృగం. హిట్లర్, అతని విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను జాతిహననం చేసి ఆ మాటే నిరూపించారు. కోటిన్నర మంది యూదులు తమ కుదుళ్లు, కుటుంబాలు, విశ్వాసాలు, ఆశలు – సమస్తం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారు. ఆ సమయంలోనే ఏనాటికైనా స్వేచ్ఛను పొందుతామేమోనని పిచ్చెక్కకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, లొంగిపోకుండా బతికిన ఆనా ఫ్రాంక్ కుటుంబం చివరకు పోలీసుల కంట పడనే పడింది. పాపం బంగారు తల్లి ఆనా, తన కలలూ ఆకాంక్షలూ మనుషులను చూసి పొందిన అచ్చెరువులూ అరెస్టు వేళ పోలీసులు నేలన పారేసిన డైరీలో నిక్షిప్తం చేసి నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించబడింది. మొదట తల్లి మరణించగా, తర్వాత సోదరి మరణించగా, బురదమయమైన తినడానికి తిండి లేని, చలి నుంచి రక్షించడానికి గుడ్డపేలిక లేని కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి–మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది. ఆ క్షణాన ఆమె తన మనసులో ఏమి రాసుకున్నదో తెలియదు. ఆ రాయని డైరీ చదివితే మనిషి జన్మ ఎత్తినందుకు మనం ఎంత సిగ్గుపడతామో ఏమో! 1947లో ఆనా ఫ్రాంక్ డైరీ మొదటిసారిగా డచ్ భాషలో ప్రచురితమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచమంతా ఆ మనోహరమైన బాలికను తలుచుకుంటూ ఉంది. ఇన్నేళ్లలో 70 భాషల్లో అనువాదమయ్యి లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఆ డైరీ సారమంతా ఒక్కటే – మానవత్వం! ఈ కాలం మళ్లీ రాకూడదు. ఇలాంటిది ఏ నేలనా సంభవించకూడదు. ఇలాంటి బతుకు భయం ఎప్పటికీ కలగకూడదు. మాటిమాటికీ వీధుల్లోకి తొంగి చూసి మనుషులకు స్నేహంగా చేయి ఊపాలనుకునే ఏ చిన్నారీ ఇలాంటి డైరీ రాయకూడదు. ఎప్పటికీ ఇలాంటి డైరీ వద్దే వద్దు! -
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా, తలమానికంగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, అధికారులు, ఉద్యోగులు రూపొందించిన ‘పల్లెప్రగతి డైరీ–2022’ని గురువారం శాసనమండలి ఆవరణలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. నేడు పల్లెలు పచ్చగా ఉన్నా యంటే ఈ శాఖల అధికారులు, ఉద్యోగులే కారణమని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వ అవార్డులు, రివార్డులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కూడా వారే కారణమన్నారు. పల్లెప్రగతి పేరుతో డైరీ తేవడం, అందులో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల చిత్రాలు ఏరి కూర్చారని మంత్రులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. -
వైఎస్ విజయమ్మ చేతుల మీదుగా ‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో పాటుగా, ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ విశేషాలతో నవలా రచయిత వేంపల్లి నిరంజన్‌రెడ్డి రూపొందించిన ‘లీడర్ టు లీడర్’డైరీని గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటే తమకు ఎనలేని అభిమానమని, 2010లో తొలి సారిగా వెలువరించిన డైరీకి విశేష స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే 11 ఏళ్లుగా డైరీలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డైరీలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల తో పాటు, జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర, ప్రజా సంకల్పయాత్ర, రైతు భరోసా విశేషాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించామని వెల్లడించారు. -
2021 డిజిటల్ క్యాలెండర్ ను లాంచ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నేడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021కి సంబందించిన డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసింది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బటన్ క్లిక్ ద్వారా 2021డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసారు. గతంలో ముద్రించిన క్యాలెండర్, డైరీలను విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. "ప్రతి సంవత్సరం 11 లక్షల క్యాలెండర్లు, 90,000 డైరీలను ముద్రించడానికి రూ.7కోట్లు ఖర్చు అయ్యేది, ప్రస్తుతం తీసుకొచ్చిన డిజిటల్ క్యాలెండర్, డైరీ యాప్ కోసం రూ.2కోట్లు ఖర్చు అయింది"అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చీఫ్ కె.ఎస్ పేర్కొన్నారు.(చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) 2021డిజిటల్ క్యాలెండర్, డైరీ లాంచ్ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. గతంలో గోడలను అలంకరించిన ప్రభుత్వ క్యాలెండర్ ఇప్పుడు మొబైల్ ఫోన్లను అలంకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 'జీఓఐ క్యాలెండర్' పేరుతో ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్ లలో 11 భాషలలో ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. "ఈ యాప్ కొత్త సంవత్సరం క్యాలెండర్ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ప్రతి నెల కొత్త థీమ్ తో పాటు ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. డైరీ ఫీచర్ కారణంగా ఈ క్యాలెండర్ ఇతర డిజిటల్ క్యాలెండర్ యాప్ లతో పోలిస్తే ఉత్తమమైనది"అని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్ బ్యూరో ఆఫ్ ఔట్ రిచ్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మీనిస్ట్రీచే రూపొందించబడింది. ఇది ప్రస్తుతం హిందీ మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంది. త్వరలో 11 ఇతర భారతీయ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. -
రకరకాల డైరీలు.. జ్ఞాపకాలను దాచేయండి
సాక్షి, కడప కల్చరల్: ప్రతిరోజు ఓ జ్ఞాపకం.. ఏడాది పొడవునా మనసును తాకిన సంఘటనలన్నీ స్మృతి నుంచి జారిపోకుండా జ్ఞాపకాల దొంతరగా పేర్చుకునేందుకు మంచి అవకాశం. ఏరోజుకారోజు మనసును కదిలించిన సంఘటనలు.. కమ్మని జ్ఞాపకాలు.. ఉద్వేగాలు.. విషాదాలు.. ఇలా అన్నింటినీ క్లుప్తంగా, పదిలంగా దాచుకునే చోటు డైరీ. ఆ తర్వాత ఎప్పుడో తీరిక వేళల్లో ఒక్కొ పేజీ తిరిగేస్తుంటే ఆ జ్ఞాపక పుటల్లో సంతోషాలు, భావోద్వేగాలు ఇలా ఎన్నెన్నో తియ్యని గాయాలు, మూడ్ వచ్చినపుడు రాసుకునే చిన్న గేయాలు, మధురమైన జ్ఞాపకాలు అన్నీ మనసుకు ప్రతిబింబాలు. రోజువారి జీవితంలో జరిగే సంఘటనలను వరుసగా క్రమపద్ధతిలో రాసుకునేందుకు డైరీ ఎంతగానో పనికి వస్తుంది. జరిగిన విషయాలేగాక వాటి పట్ల మన ప్రతి స్పందనను కూడా పొందుపరచవచ్చు. వర్తమానం గతమై, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేందుకు డైరీ మంచి మిత్రుడిగా ఉపయోగపడుతుంది. ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలను డైరీ పంచుకోవచ్చు. తీపి జ్ఞాపకం ఓ మోస్తరు డబ్బు ఉన్న వాళ్ల నుంచి అతంత్య ధనికులైన వారికి మాత్రమే పరిమితమై ఉండిన డైరీ ఆ తర్వాత మధ్యతరగతి వరకు వచ్చింది. మొన్నమొన్నటి వరకు ఆధునిక జీవితంలో డైరీలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో ఇటీవల జోరు తగ్గినా నేటికీ వీటిని వాడేవారి సంఖ్య తక్కువేమి కాదు. అందులో బరువు దించుకుంటేగానీ మనసు తేలిక పడదని భావించే వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు గతం పేజీలు తిరిగేస్తే డైరీల్లో మనం రాసుకున్న విషయాలు రాసింది మనమేనా అని ఆశ్చర్యం వేస్తోంది. కావాల్సినపుడు తిరిగేసుకుని ఆ జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు డైరీలను వీలైనంత ఎక్కువకాలం ఓ మధురమైన నిధిలా దాచుకుని ఆనందిస్తుంటారు. ఎన్నో రకాలు డైరీలను పలు రకాలుగా వాడేవారు కూడా ఉన్నారు. తమ అనుభూతులను భావుకంగా కవితల్లా రాసుకునే వారు ...అడ్రసులు, ఫోన్ నంబర్లు రాసుకునే వారు, చివరికి లాండ్రి పద్దు రాసుకునే వారు కూడా లేకపోలేదు. మొత్తంపై డైరీ రాయడం హుందాతనానికి గుర్తుగా భావిస్తారు. కొన్నేళ్ల తర్వాత మనం రాసిన విషయాలు మనకే గమ్మత్తుగా అనిపిస్తాయి. అందుకే పలువురికి నేటికీ డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఎందరో మహానుభావులు అలా రాసిన ఆ డైరీలు తర్వాత కొన్నేళ్లకే మంచి గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక గ్రంథాలుగా మారి చరిత్ర సృష్టించాయి. డైరీ రాసే వారి కోసం సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లలో రకరకాల, రంగురంగుల డైరీలు కళకళలాడుతాయి. ఎన్ని రకాల డైరీలున్నా టీటీడీ డైరీకి మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇటీవల కేవలం టీటీడీ అనుబంధ సంస్థల కౌంటర్లలోనే విక్రయిస్తున్నారు. ఖరీదైన లెదర్, రెగ్జిన్ లెదర్ బైండింగ్ గలవి, పర్సు, పెన్ స్టాండ్, గడియారం, క్యాలికులేటర్లు సౌకర్యం గలవి కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద నగరాలలో 8జీబీ పెన్‌డ్రై వ్, గడియారం, క్యాలిక్యులేటర్, పెన్, కంపాస్ సెట్ తదితరాల కాంబినేషన్లో కూడా లభిస్తున్నాయి. పెట్టెలలాగా తాళం వేసుకునే అవకాశం గల డైరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశదేశాల మ్యాపులు, సమయాలు, రాజధానులు, పిన్‌కోడ్, ఫోన్ కోడ్ నెంబర్లు, పోస్టల్, రైల్వే సమాచారం, ప్రకృతి, ఆధ్యాత్మికం, సామాజిక సేవ, ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ అంశాలను దాదాపు ప్రతి పేజీలో పొందుపరిచిన డైరీలు కూడా లభిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వైద్యులు తదితర ఉద్యోగాల్లో ఉన్న వారికి అసవరమైన సమాచారంతో కూడిన డైరీలు కూడా లభిస్తుండడం విశేషం. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, కంపెనీలు నూతన సంవత్సర కానుకగా డైరీలు అందజేస్తున్నాయి. ఉద్యోగుల్లో సంఘాల ద్వారా కూడా తమకు సంబంధించిన వివరాలు, జీఓలతో ప్రత్యేకంగా డైరీలను రూపొందిస్తున్నారు. మంచి హాబీని మనం కొనసాగిస్తూ పిల్లలకు కూడా అలవాటు చేద్దాం! -
‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ
-
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు భావితరాల వారికి మార్గదర్శకంగా ఉన్నప్పుడే స్వరాష్ట్ర ఫలాలను రాబోయే తరాలు అనుభవిస్తారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ–2019 ఆవిష్కరణ కార్య క్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణల అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ జరిగింది. డైరీ ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, అధికారులందరూ తమ విధులు సక్రమం గా నిర్వర్తిస్తూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పనిచేయాలన్నారు. ఉద్యోగులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించ డం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందే లా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు జి.విష్ణువర్ధన్‌రావు, ఎస్.సహదేవ్, రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఛీ.. ఇదేం స్కూలు!
పుణె: ‘విద్యార్థినులు ఒకే రంగు లోదుస్తులు వేసుకోవాలి. మరుగుదొడ్డికి నిర్ణీత సమయంలో మాత్రమే వెళ్లాలి’ అంటూ ఓ ప్రైవేటు పాఠశాల ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్ ఎమ్ఐటీ స్కూల్ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో కచ్చితంగా పేర్కొనాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది. ‘విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్ కలర్ లోదుస్తులు ధరించాలి. వారు ధరించి స్కర్ట్ పొడవు ఎంతుందో కచ్చితంగా పేర్కొనాలి. ఈ వివరాలు స్కూల్ డైరీలో రాసి మాతో సంతకం పెట్టించుకుని తీసురావాల’ని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు ఓ విద్యార్థి పేరెంట్ తెలిపారు. తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ఆంక్షలంటూ మండిపడుతున్నారు. గతానుభవాలతోనే... అయితే మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధనలు పెట్టామని ఎమ్ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర కరాద్ నగరె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని, వీటి వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదని వివరణయిచ్చారు. -
సెక్స్‌రాకెట్.. సీఎం సన్నిహితుడి విచారణ!
సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్‌బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది. టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర తొలుత ఎఫ్‌బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్‌కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ ఆరా తీసినట్టు సమాచారం. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు... సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్‌బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్‌గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్‌బీఐ దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు. -
పాల ప్రోత్సాహక మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్‌కు పాలు సరఫరా చేసే పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రక టించిన లీటరుకు రూ.4 నగదు ప్రోత్సాహకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రంగా రెడ్డి, నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్, ముల్కనూర్ మహిళా స్వయం సహాయక పాల ఉత్పత్తి సహకార సంఘాలలో పాలు పోసే సభ్యులకు ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ సంఘాలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు.. ప్రతి సభ్యుడు నెలలో వెయ్యి లీటర్ల వరకు పాలు పోస్తే అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఇంతకు మించి పాలు పోస్తే అధికార బృందం ఆ రైతుకు ఎన్ని పాడి పశువులు ఉన్నాయో పరిశీలిస్తుంది. ►ఆవు పాలలో 3 శాతం, బర్రె పాలలో 5 శాతం వెన్న ఉన్నవాటికే ఇది వర్తిస్తుంది. ►దళారులకు, పాల విక్రయదారులకు ప్రోత్సాహకం వర్తించదు. ఈ పథకం అమలు పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, పశుసంవర్థక శాఖ సంచాలకులు, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ముల్కనూర్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జాయింట్ కలెక్టర్, జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అధికారి, జిల్లా రిజి స్ట్రార్ కోఆపరేటివ్ అధికారి, జిల్లా వెటర్నరీ అధికారి సభ్యులుగా, జిల్లా పశుసంవర్థక అధి కారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సహకార సంఘాలు సమర్పించిన ప్రోత్సాహక మొత్తం వివరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. -
అహ్మద్ పటేల్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు దేవుడు ఒకటిచ్చి ఒకటి తీసుకుంటాడు. రాజ్యసభలో నాకు చోటిచ్చి, హమీద్‌జీ సీటు లాగేసుకున్నాడు. దేవుడు ఒకటడిగితే ఇంకోటి ఇస్తాడు. ఉపరాష్ట్రపతిగా గోపాలకృష్ణ గాంధీని ఇమ్మంటే వెంకయ్య నాయుడిని ఇచ్చాడు. హమీద్‌జీ ప్లేస్‌లో వెంకయ్య నాయుడిని ఊహించడం కష్టంగా ఉంది. ఊహేముందీ? వాస్తవమే! వచ్చి సీట్లో కూడా కూర్చున్నాడు. శుక్రవారం అయింది, శనివారం అయింది. ఈ శుక్రవారాలు, శనివారాలు ఇక్కడితో అయిపోయేవి కావు. వర్షాకాలాల్లో వర్షాకాల శుక్రవారాలు, వర్షాకాల శనివారాలు ఉన్నట్లే.. శీతాకాలాల్లో శీతాకాల శుక్రవారాలు, శీతాకాల శనివారాలు ఉంటాయి. ఇవి కాకుండా.. బడ్జెట్ కాల శుక్రవారాలు, బడ్జెట్ కాల శనివారాలు!! వారంలో వట్టి శుక్రవారాలు, శనివారాలు మాత్రమే ఉండవు కదా. ఇరవై నాలుగేళ్లుగా రాజ్యసభకు వచ్చిపోతున్నాను. ఎప్పుడూ నేనిలా రోజుల్ని, వారాల్ని లెక్కేసుకోలేదు! ఇంకో ఐదేళ్లు వెంకయ్య నాయుడిని చూస్తూ గడపాలి. నయం, రాజ్యసభ సభ్యుడికి ఉన్నట్లు, రాజ్యసభ ఛైర్మన్‌కి ఆరేళ్ల టెన్యూర్ లేదు. ఉండుంటే,æఇంకో ఏడాది ఆయన్ని శీతాకాలాల్లో, వర్షాకాలాల్లో, బడ్జెట్ కాలాల్లో చూస్తూ గడపవలసి వచ్చేది. ఇవాళ నేను నిద్ర లేవగానే సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుడిని ఒకటే కోరుకున్నాను. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిశాక, మళ్లీ ఆయన్నే రాష్ట్రపతిని చెయ్యకుండా, ఆ స్థానంలోకి వెంకయ్య నాయుడు వెళ్లేలా చూడు దేవుడా అని వేడుకున్నాను. అలా కాకుండా, హమీద్జీలా మళ్లీ వెంకయ్య నాయుడే రెండోసారి కూడా ఉపరాష్ట్రపతిగా కొనసాగితే రాజ్యసభలో నేను అదనంగా ఇంకో ఏడాది వెంకయ్య నాయుడిని చూస్తూ గడపవలసి వస్తుంది. ఒకవేళ నేను మళ్లీ ఇంకోసారి రాజ్యసభ సభ్యుడిని అయితే ఇంకో నాలుగేళ్లు వెంకయ్య నాయుడికి ఎదురుపడుతూనో, వెంకయ్య నాయుడు ఎదురు పడకూడదని అనుకుంటూనో గడపాలి. నాయుడి మీద నాకేం కోపం లేదు. నాయుడు ముఖంలో నాకు నవ్వు కనిపించదు. నవ్వు కనిపించని ముఖాల్ని నేను అస్సలు చూడలేను. నవ్వు కనిపించని ముఖం నాయుడిదైనా, నాయుడిది కాకపోయినా నాకది మోదీ ముఖంలానో, అమిత్‌షా ముఖంలానో కనిపిస్తుంది. పాపం వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్వు ముఖం పెట్టాలని చాలా ట్రై చేశాడు. మోదీ, అమిత్‌షా నవ్వలేదు. వెంకయ్య నాయుడినీ నవ్వనివ్వలేదు. మోదీ రాజ్యాంగ శక్తి. అమిత్‌షా రాజ్యాంగేతర శక్తి. శక్తులు నవ్వవు. ఒకరితో కలవ్వు. మోదీ, అమిత్ కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కలిసి లేరని నాకు అనిపిస్తుంది. కలిసి లేకున్నా కలిసి ఉన్నట్లు కనిపించే శక్తులు ఎప్పటికైనా డేంజర్. -
కర్ణాటకలో ‘డైరీ’ రాజకీయం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ మంత్రులు హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విడుదల చేసిన డైరీ ప్రకంపనలు ఆగకముందే మరో డైరీ బీజేపీకి చెమటలు పట్టిస్తోంది. బీజేపీ నేతలు ఆ పార్టీ హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో మరో డైరీ దర్శనమిచ్చింది. యడ్యూరప్ప ఆప్తుడు, విధానపరిషత్ సభ్యుడు లేహర్‌సింగ్ ఇంటిపై ఐటీ సోదాల్లో డైరీ లభించినట్లు వార్తలొచ్చాయి. అందులో ‘రిసీవ్డ్’ శీర్షికతో సీఎంఓ, ఆర్ఏ అనే వ్యక్తులు రూ.67కోట్లు, ఎంఐఆర్, ఏఎల్ఈ అనే వ్యక్తులు రూ.128కోట్లు, రేణు పేరుతో రూ.13కోట్లు, జేఎస్ పేరుతో రూ.9 కోట్లు, ఎస్క్యూ పేరుతో రూ.3 కోట్లు, ఎస్ఆర్ పేరుతో రూ.1.80 కోట్లు, ఆర్ఏ, కేఎస్ఈ పేరుతో రూ.31 కోట్లు, డీవీఎస్, పీఎస్ అనే వ్యక్తులు రూ.11 కోట్లు, ఇతర కంపెనీలు, కార్పొరేటర్లు రూ.128 కోట్లు... మొత్తం రూ.391.08 కోట్లు అందించినట్లుగా ఉంది. మొత్తం రూ.391.08 కోట్ల ముడుపులు అందించినట్లు, అందుకు సాక్ష్యంగా లెహర్‌సింగ్ సంతకం కూడా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో డైరీ హల్చల్ చేస్తోంది. -
గాంధీ స్థానంలో మోదీ
ముంబై: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్, డైరీలపై ఖాదీకి మారుపేరైన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేసింది. కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. వీటిని చూసి ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కొందరు నోరెళ్లబెట్టారు. గురువారం ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని మౌన నిరసన తెలిపారు. గాంధీ చిత్రాలతో వీటిని పునర్ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
అనంతపల్లి హెచ్ఎం సస్పెండ్
ఏలూరు సిటీ/నల్లజర్ల : నల్లజర్ల మండలం అనంతపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.గంగరాజును డీఈవో డి.మధుసూదనరావు సస్పెండ్ చేశారు. మంగళవారం పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం గంగరాజు ఎంఈవో అనుమతి లేకుండా అనధికారికంగా సెలవు పెట్టడాన్ని గుర్తించారు. ఖాళీ కాగితంపై సంతకం చేసిన గంగరాజు సెలవుపై వెళ్లారు. అయితే డీఈవో రావటాన్ని గమనించిన ఉపాధ్యాయులు సెలవు దరఖాస్తు చేసినట్టుగా చూపించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం నిల్వలు, రిజిష్టర్‌లో పేర్కొన్న రికార్డులు వేర్వేరుగా ఉండడాన్ని గుర్తించి సస్పెండ్ చేశారు. డైరీ రాయడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల నోట్స్‌ను సరిచూడలేదన్న కారణాలతో ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. -
అంత్యం ఆర్భాటం
29కి ఏర్పాట్లు పూర్తి 30న ట్రయల్ రన్ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు ముగింపు రోజున సీఎం రాక సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 29 నాటికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోంది. 30వ తేదీ ఉదయం 7 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని శాఖల అధికారులు, ఎన్జీవో సంస్థలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు జరుగుతున్న తీరు, ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అంతకు ముందు కలెక్టర్ అధికారలతో కలిసి ఘాట్ల వద్ద జరుతున్న పనులను పరిశీలించారు. ఇతర ప్రాంతాల భక్తులు కోటిలింగాల ఘాట్‌కు.. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కోటిలింగాల ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఎంత మంది భక్తులు వస్తారో తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. 800 మంది ఎన్జీవోల సేవలను ఉపయోగించుకోన్నారు. నిషేధిత ఘాట్లలోకి కూడా భక్తులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీ కెమేరాలతో.. నగరంలోని అన్ని ఘాట్లలో నగరపాలక సంస్థ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తోంది. రూ.2 లక్షలతో 40 సీసీ కెమెరాలు కొనుగోలు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ, పోలీసు అతిథి గృహంలో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్లలోనికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం జల్లు స్నానం ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాల్లో.. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాలనుప్రతి రోజూ పూలు, పచ్చటి తోరణాలతో అలంకరించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనుంది. ఉచిత ప్రసాదాలు అందించనుంది. 12 రోజుల పాటు నిత్య హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పిండ ప్రదానాల సామాగ్రి కోసం అధికారులు ఘాట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేదఘోష నడుమ ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఉన్న వేదపండితులందరినీ పుష్కరఘాట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ముల్తైదువలు అరటి దొప్పలతో దీపాలను వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
ఉందిలే మంచికాలం ముందు ముందునా...
కొత్త సంవత్సరం సరదాతో మొదలవ్వాలి. నవ్వులతో గడవాలి. ఆనందాలు నిండాలి. ఆత్మీయతలు పండాలి. కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్... జీవితంలో భాగం. కానీ మనం నవ్వుతూ ఉండాలి. నవ్విస్తూ ఉండాలి. ఒకసారి మా ఇంటికొచ్చిన గెస్ట్‌లకి మా ఆవిడ స్వయంగా వండిన స్వీట్స్ పెట్టింది. ఆ స్వీట్ మెమరీస్‌తో వాళ్లు మళ్లీ కనిపించలేదు.కొత్త సంవత్సరం రానే వచ్చింది. గుళ్లకు వెళ్లేవారు వెళుతున్నారు. అతి కష్టం మీద మందుబాబులు ఇళ్లకు చేరుకుంటున్నారు. కవులు గొంతు సవరించి దండయాత్రకు బయలుదేరారు. అందరి మొహాల్లో వెలుగు, ఆశ, ఆకాంక్ష. సూర్యుడు కూడా లేతగా కిరణాలు పంపిస్తున్నాడు. ఈ రోజు చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే యాడ్ చూసి చూసి విసుగెత్తినవాళ్లు సిగరెట్లు మానేస్తారు. ఇదే లాస్ట్ పెగ్ అంటూ పది పెగ్గులు తాగేవాళ్లు హ్యాంగోవర్‌ని భరించలేక మందు మానేస్తారు. కొందరు డైరీ రాయడం ప్రారంభిస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కూడా జరగొచ్చు. అయితే ఇవన్నీ జనవరి రెండో తేదీకి మాయమై మళ్లీ మొదటికి రావచ్చు. కొత్త సంవత్సరం రకరకాల పిచ్చోళ్లు తారసపడతారు. కొందరికి క్యాలెండర్ల పిచ్చి. కనిపించిన ప్రతివాణ్ని క్యాలెండర్ అడుగుతారు. రకరకాల క్యాలెండర్లు పోగుచేసి వాటిని ఏం చేసుకోవాలో తెలియక అటకమీద దాస్తారు. గ్రహస్థితి బాగుంటే అవి కిందకి దిగొచ్చు. లేదంటే అటకపైనున్న చెదలకి పంచాంగకర్తలుగా మిగలొచ్చు. ఇంకొందరు డైరీలని కలవరిస్తారు. స్నేహితులందరి లిస్ట్ ముందరేసుకుని ఫోన్లు చేసి విసిగిస్తారు. పాకెట్ డైరీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరీ వరకూ సంపాదించి, వాటిని చూస్తూ ఆనందిస్తూ ఒక నెలంతా గడుపుతారు. ఫిబ్రవరి నెలలో అవి అడుగడుగునా అడ్డమొచ్చి తూకానికి వేసేస్తారు. డైరీ రాయడం కూడా ఒక కళ. ఎంత రాయాలో ఏది రాయాలో తెలియకపోతే వీపు వాస్తుంది. ఉదయాన్నే పళ్లు తోమడం నుంచి రాత్రి టీవీ చూడ్డం వరకు రాసి ఇంకేం రాయాలో తెలియక మానేసిన వాళ్లున్నారు. మనం అడక్కపోయినా డైరీలు ఇచ్చేవాళ్లు కూడా ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇచ్చే డైరీలు డేంజరస్. వాటి వెనుక కొన్ని పాలసీలు ఉంటాయి. కొంతమంది డైరీ ఇచ్చారంటే, దేనికో టెండర్ పెట్టారని అర్థం. ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు ఆడవాళ్లు ఉత్సాహంగా ముగ్గులేసేవాళ్లు. 31 రాత్రి వీధులన్నీ కళకళలాడేవి. కాకపోతే మందుబాబులు ఆ ముగ్గుల షేపుల్ని మార్చేసేవాళ్లు. సెల్ఫోన్లు వచ్చిన తరువాత గ్రీటింగ్‌లు కనుమరుగైపోయాయి. మెసేజ్‌ల్లో కూడా బోలెడు క్రియేటివిటీ వచ్చేసింది. సమ్మేళనంలో జాగా దొరకని కవులు మెసేజ్‌లు, వాట్సప్‌ల్లో విజృంభిస్తున్నారు. ఈ రోజు ఫేస్బుక్కులన్నీ నిండుగా ఉంటాయి. అనేక మంది ప్రొఫైల్ పిక్చర్స్ మార్చి కనువిందు చేస్తారు. కొంతమంది పాతికేళ్ల క్రితం ఫొటో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. జనవరి ఫస్ట్‌న కొత్త కథ రాయాలని గత 20 ఏళ్లుగా అనుకుంటున్నాను. క్యాలెండర్లు మారాయి కానీ కథ రాలేదు. కొత్త తరానికి ఈ బాధ లేదు. వాళ్లు అదో టైప్. ఏదైనా టైప్ చేసేస్తారు. న్యూ ఇయర్ నాడు బంధుమిత్రుల్ని కలవడం అదో సరదా. ఒకసారి మా ఇంటికొచ్చిన గెస్ట్‌లకి మా ఆవిడ స్వయంగా వండిన స్వీట్స్ పెట్టింది. ఆ స్వీట్ మెమరీస్‌తో వాళ్లు మళ్లీ కనిపించలేదు. మన ప్రయోగాలు ఒక్కోసారి ఎదుటివాళ్లకి ప్రాణాంతకమవుతుంటాయి. స్వీట్ స్టాల్స్, కర్రీ సెంటర్ల వల్ల ఉపయోగం ఏమంటే మన మిత్రులు దూరం కాకుండా అవి కాపాడుతాయి.గత సంవత్సరం సినిమావాళ్లు పగబట్టి ప్రేక్షకుల్ని కకావికలు చేశారు. థియేటర్ల నుంచి బయటికి రావడానికి బోలెడంత తొక్కిసలాట జరిగింది. ఈ ఏడాదైనా వాళ్లు గాల్లో ఎగిరి మనల్ని తన్నకుండా ఉంటే మంచిది. టీవీవాళ్లు ఎలాగూ మారరు. ఆ సీరియల్స్ ఎవరు చూస్తున్నారో ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్లు అలాగే తీస్తూవుంటారు. మనం గుర్తించం కానీ వెళ్లిపోతున్న కాలం మన మొహాలపై తన గుర్తుల్ని ముద్రించి వెళుతుంది. చాలా నేర్పించి వెళుతుంది. బాధల్ని, సంతోషాల్ని మిక్సీలో రుబ్బి మరీ బహుమతిగా ఇస్తుంది. నవ్వుతూ జీవించడమే జీవితానికి అర్థం. హ్యాపీ న్యూ ఇయర్. - జి.ఆర్. మహర్షి -
పునర్నిర్మాణంలో.. భాగస్వాములు కావాలి
ఉద్యోగులకు సీఎం చంద్రశేఖరరావు పిలుపు అందుబాటులోకి పార్టీ మొబైల్ యాప్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చా రు. సచివాలయంలో శుక్రవారం ఆయన తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిష్కరణలో అసోసియేషన్ అధ్యక్షుడు యం.నరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పార్టీ మొబైల్ యాప్ ఆవిష్కరణ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యువజన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పార్టీ డైరీని, మొబైల్ యాప్‌ను సీఎం కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. మొబైల్ యాప్‌లో ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వివరాలు, పార్టీ, మీడియా, అత్యవసర విభాగాల ఫోన్ నెంబర్లు, తదితర సమాచారం పొందు పరిచారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, రాష్ట్ర కో ఆర్డినేటర్ ధర్మేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ డైరీని కూడా సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామా రావు, టి. హరీశ్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి వి. సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియు) డైరీని సైతం సీఎం చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యద ర్శి చాడ వెంకటరెడ్డి, ఎస్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భుజంగరావు, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.