అనంతపల్లి హెచ్‌ఎం సస్పెండ్‌ | anathapalli HM suspend | Sakshi
Sakshi News home page

అనంతపల్లి హెచ్‌ఎం సస్పెండ్‌

Published Wed, Aug 24 2016 12:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

anathapalli HM suspend

ఏలూరు సిటీ/నల్లజర్ల : నల్లజర్ల మండలం అనంతపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.గంగరాజును డీఈవో డి.మధుసూదనరావు సస్పెండ్‌ చేశారు. మంగళవారం పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం గంగరాజు ఎంఈవో అనుమతి లేకుండా అనధికారికంగా సెలవు పెట్టడాన్ని గుర్తించారు. ఖాళీ కాగితంపై సంతకం చేసిన గంగరాజు సెలవుపై వెళ్లారు. అయితే డీఈవో రావటాన్ని గమనించిన ఉపాధ్యాయులు సెలవు దరఖాస్తు చేసినట్టుగా చూపించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం నిల్వలు, రిజిష్టర్‌లో పేర్కొన్న రికార్డులు వేర్వేరుగా ఉండడాన్ని గుర్తించి సస్పెండ్‌ చేశారు. డైరీ రాయడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల నోట్స్‌ను సరిచూడలేదన్న కారణాలతో ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement