
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు భావితరాల వారికి మార్గదర్శకంగా ఉన్నప్పుడే స్వరాష్ట్ర ఫలాలను రాబోయే తరాలు అనుభవిస్తారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ–2019 ఆవిష్కరణ కార్య క్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణల అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ జరిగింది.
డైరీ ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, అధికారులందరూ తమ విధులు సక్రమం గా నిర్వర్తిస్తూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పనిచేయాలన్నారు. ఉద్యోగులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించ డం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందే లా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు జి.విష్ణువర్ధన్‌రావు, ఎస్.సహదేవ్, రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.