
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్‌కు పాలు సరఫరా చేసే పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రక టించిన లీటరుకు రూ.4 నగదు ప్రోత్సాహకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రంగా రెడ్డి, నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్, ముల్కనూర్ మహిళా స్వయం సహాయక పాల ఉత్పత్తి సహకార సంఘాలలో పాలు పోసే సభ్యులకు ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ సంఘాలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలు.. ప్రతి సభ్యుడు నెలలో వెయ్యి లీటర్ల వరకు పాలు పోస్తే అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఇంతకు మించి పాలు పోస్తే అధికార బృందం ఆ రైతుకు ఎన్ని పాడి పశువులు ఉన్నాయో పరిశీలిస్తుంది.
►ఆవు పాలలో 3 శాతం, బర్రె పాలలో 5 శాతం వెన్న ఉన్నవాటికే ఇది వర్తిస్తుంది.
►దళారులకు, పాల విక్రయదారులకు ప్రోత్సాహకం వర్తించదు.
ఈ పథకం అమలు పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, పశుసంవర్థక శాఖ సంచాలకులు, రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, ముల్కనూర్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జాయింట్ కలెక్టర్, జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ అధికారి, జిల్లా రిజి స్ట్రార్ కోఆపరేటివ్ అధికారి, జిల్లా వెటర్నరీ అధికారి సభ్యులుగా, జిల్లా పశుసంవర్థక అధి కారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సహకార సంఘాలు సమర్పించిన ప్రోత్సాహక మొత్తం వివరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment