
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ అధ్యక్షుడు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డితోపాటు యూనియన్ 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీఏ–2025 డైరీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. – సాక్షి, అమరావతి