నేడు అన్నే ఫ్రాంక్ జయంతి
‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు...ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది అనీ ఫ్రాంక్. యూదుల మీద హిట్లర్ దమనకాండ సాగిస్తున్నప్పుడు 14 ఏళ్ల యూదు బాలిక అనీ ఫ్రాంక్ రాసిన జగద్విఖ్యాత డైరీనే ‘అనీ ఫ్రాంక్ డైరీ’.ఇవాళ ΄పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడి ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఇవన్నీ పిల్లల్ని ΄ పౌరుల్ని దారుణంగా చంపుతున్నప్పుడు‘మానవత్వం కోసం అనీ చేసిన ప్రార్థన’ గుర్తు చేసుకోక తప్పదు.
అనీ ఫ్రాంక్ పుట్టింది జూన్ 12, 1929లో. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ యూదు కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన పిల్ల అనీ ఫ్రాంక్. ఆమె పదమూడవ జన్మ దినాన– అంటే జూన్ 12, 1942న తండ్రి ఆమెకు ఒక డైరీని కానుకగా ఇచ్చాడు. పుట్టిన రోజుకు ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రితో షాపింగ్‌కి వెళ్లిన అనీకి బౌండ్ చేసిన నోట్‌బుక్ కనిపించింది. ‘అది నాకు అది కావాలి నాన్నా’ అని తండ్రిని అడిగితే బర్త్ డే గిఫ్ట్‌గా కొనిచ్చాడు. ఆ నోట్‌బుక్‌ని ఎంతో ఇష్టపడ్డ అనీ దానినే డైరీగా భావించి రోజూ రాయడం మొదలుపెట్టింది.
రహస్య జీవితం
రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు హిట్లర్ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులను అరెస్ట్ చేస్తున్నారు. అది తెలిసిన వెంటనే– జూలై 5, 1942 రాత్రి అనీ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని అదే ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరారు. దాని యజమాని యూదుల సానుభూతి పరుడు. కొంతమంది మిత్రులు రహస్యంగా అందించే ఆహారాన్ని వాడుకుంటూ అనీ ఫ్రాంక్ కుటుంబం నాజీ ΄ోలీసులకు పట్టుబడే వరకు అంటే ఆగస్టు 4, 1944 వరకు– రెండేళ్ల 35 రోజులు రహస్య గదుల్లోనే గడిపింది. ఆ మొత్తం రోజులూ అనీ ఫ్రాంక్ డైరీ రాసింది. పట్టుబడ్డాక అనీ ఫ్రాంక్‌ను నవంబర్ 1, 1944న కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకు తరలించారు. తీవ్రమైన ఆకలితో, చలికి వణుకుతూ కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి– మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది అనీ ఫ్రాంక్.
ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్
అనీ రాసిన డైరీ తొలిసారి 1946లో మార్కెట్‌లో విడుదలై సంచనలం రేపింది. డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రతి దేశంలో ప్రతి భాషలో అనువాదం అయ్యింది. తాను డైరీ రాస్తున్న కాలంలో నాజీలు యూదులను దారుణంగా హతమారుస్తున్నా, రహస్య స్థలంలో తాము తిండికీ బట్టకూ అల్లాడుతున్నా అనీ ఎవరినీ ద్వేషించలేదు. అడుగడుగునా మనిషి మీద నమ్మకం ఉంచింది. ‘ఇంత చేస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది. ‘నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. ఒకవేళ నాకు వార్తాపత్రికలకు రాసే ప్రావీణ్యం లేకున్నా నా కోసం నేను రాసుకుంటాను. చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేని ఇంటి పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి’ అని రాసుకుంది అనీ.
ద్వేషం వద్దనేదే ఆనా సందేశం
మనిషికి సాటి మనిషి మీద ద్వేషం ఎంతదూరమైనా తీసుకెళుతుందని రెండో ప్రపంచ యుద్ధం నిరూపించింది. హిట్లర్ విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను నిర్మూలించారు. గ్యాస్ చాంబర్స్‌లో వేసి చంపారు. ఏ యూదులైతే నాజీల వల్ల కష్టాలు పడ్డారో అదే యూదులు నేడు పాలస్తీనా బాలల శోకానికి కారణం కావడం విషాదం. అక్కడ వేలాది మంది చిన్నారులు మరణించారు, తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లలు ఎందరు అనీ ఫ్రాంక్‌లా భవిష్యత్తులో తమ డైరీలను ప్రపంచానికి చాటుతారో!ఈ ప్రపంచాన్ని పిల్లలకు యోగ్యమైనదిగా పెద్దలు అనుక్షణం తీర్చిదిద్దుతూ ఉండాలి. పిల్లలు ఇష్టపడేది ప్రేమనే. అంటే ప్రపంచాన్ని ప్రేమతో నిం΄ాలి. ఇక్కడ ద్వేషానికి చోటు లేదని నిరూపించాలి. అది జరిగేంత వరకూ మబ్బుల చాటున దాగి ఆనా తన సందేశం వినిపిస్తూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment