anne frank
-
నీ గొంతు ఇప్పుడూ అవసరమే
‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు...ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది అనీ ఫ్రాంక్. యూదుల మీద హిట్లర్ దమనకాండ సాగిస్తున్నప్పుడు 14 ఏళ్ల యూదు బాలిక అనీ ఫ్రాంక్ రాసిన జగద్విఖ్యాత డైరీనే ‘అనీ ఫ్రాంక్ డైరీ’.ఇవాళ ΄పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడి ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఇవన్నీ పిల్లల్ని ΄ పౌరుల్ని దారుణంగా చంపుతున్నప్పుడు‘మానవత్వం కోసం అనీ చేసిన ప్రార్థన’ గుర్తు చేసుకోక తప్పదు.అనీ ఫ్రాంక్ పుట్టింది జూన్ 12, 1929లో. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ యూదు కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన పిల్ల అనీ ఫ్రాంక్. ఆమె పదమూడవ జన్మ దినాన– అంటే జూన్ 12, 1942న తండ్రి ఆమెకు ఒక డైరీని కానుకగా ఇచ్చాడు. పుట్టిన రోజుకు ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రితో షాపింగ్‌కి వెళ్లిన అనీకి బౌండ్ చేసిన నోట్‌బుక్ కనిపించింది. ‘అది నాకు అది కావాలి నాన్నా’ అని తండ్రిని అడిగితే బర్త్ డే గిఫ్ట్‌గా కొనిచ్చాడు. ఆ నోట్‌బుక్‌ని ఎంతో ఇష్టపడ్డ అనీ దానినే డైరీగా భావించి రోజూ రాయడం మొదలుపెట్టింది.రహస్య జీవితంరెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు హిట్లర్ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులను అరెస్ట్ చేస్తున్నారు. అది తెలిసిన వెంటనే– జూలై 5, 1942 రాత్రి అనీ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరారు. దాని యజమాని యూదుల సానుభూతి పరుడు. కొంతమంది మిత్రులు రహస్యంగా అందించే ఆహారాన్ని వాడుకుంటూ అనీ ఫ్రాంక్ కుటుంబం నాజీ ΄ోలీసులకు పట్టుబడే వరకు అంటే ఆగస్టు 4, 1944 వరకు– రెండేళ్ల 35 రోజులు రహస్య గదుల్లోనే గడిపింది. ఆ మొత్తం రోజులూ అనీ ఫ్రాంక్ డైరీ రాసింది. పట్టుబడ్డాక అనీ ఫ్రాంక్ను నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించారు. తీవ్రమైన ఆకలితో, చలికి వణుకుతూ కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి– మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది అనీ ఫ్రాంక్.ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్అనీ రాసిన డైరీ తొలిసారి 1946లో మార్కెట్లో విడుదలై సంచనలం రేపింది. డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రతి దేశంలో ప్రతి భాషలో అనువాదం అయ్యింది. తాను డైరీ రాస్తున్న కాలంలో నాజీలు యూదులను దారుణంగా హతమారుస్తున్నా, రహస్య స్థలంలో తాము తిండికీ బట్టకూ అల్లాడుతున్నా అనీ ఎవరినీ ద్వేషించలేదు. అడుగడుగునా మనిషి మీద నమ్మకం ఉంచింది. ‘ఇంత చేస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది. ‘నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. ఒకవేళ నాకు వార్తాపత్రికలకు రాసే ప్రావీణ్యం లేకున్నా నా కోసం నేను రాసుకుంటాను. చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేని ఇంటి పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి’ అని రాసుకుంది అనీ.ద్వేషం వద్దనేదే ఆనా సందేశంమనిషికి సాటి మనిషి మీద ద్వేషం ఎంతదూరమైనా తీసుకెళుతుందని రెండో ప్రపంచ యుద్ధం నిరూపించింది. హిట్లర్ విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను నిర్మూలించారు. గ్యాస్ చాంబర్స్‌లో వేసి చంపారు. ఏ యూదులైతే నాజీల వల్ల కష్టాలు పడ్డారో అదే యూదులు నేడు పాలస్తీనా బాలల శోకానికి కారణం కావడం విషాదం. అక్కడ వేలాది మంది చిన్నారులు మరణించారు, తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లలు ఎందరు అనీ ఫ్రాంక్లా భవిష్యత్తులో తమ డైరీలను ప్రపంచానికి చాటుతారో!ఈ ప్రపంచాన్ని పిల్లలకు యోగ్యమైనదిగా పెద్దలు అనుక్షణం తీర్చిదిద్దుతూ ఉండాలి. పిల్లలు ఇష్టపడేది ప్రేమనే. అంటే ప్రపంచాన్ని ప్రేమతో నిం΄ాలి. ఇక్కడ ద్వేషానికి చోటు లేదని నిరూపించాలి. అది జరిగేంత వరకూ మబ్బుల చాటున దాగి ఆనా తన సందేశం వినిపిస్తూనే ఉంటుంది. -
మళ్లీ రాయకూడని డైరీ
ఉదయం ఎనిమిదిన్నర తర్వాత మీరు టాయిలెట్లో ఫ్లష్ చేయకూడదు. తల్లితో ముద్దుగా పోట్లాడకూడదు. నడిచి వెళ్లి తండ్రి ఒళ్లో కూర్చోకూడదు. చిన్న బొమ్మకారు ఉంటే దానిని నేల మీద జూయ్ జూయ్మని వదలకూడదు. మాట పలక్కూడదు. శ్వాస బలంగా తీయకూడదు. మీరు బతికే ఉంటారు. కానీ మీరు బతికి ఉన్నట్టుగా తెలియకూడదు. గాలి, వెలుతురు రాని చిన్న గదుల్లో దాక్కుని ఉంటారు. కిటికీలో నుంచి తొంగి చూసే స్వేచ్ఛను కోల్పోయి ఉంటారు. బయట ఏమి జరుగుతున్నదో మీకు తెలియనే తెలియదు. రాత్రిళ్లు ఉండి ఉండి బాంబులు దద్దరిల్లుతాయి. సైరన్లు వికృతంగా మోగుతాయి. మర ఫిరంగులు విరేచనాలు చేసుకుంటాయి. ఎవరో ఎప్పటికీ కనిపించని కొందరు మనుషులు బాధగా కేకలు వేస్తారు. మీరు అనుక్షణం భయంలో ఉంటారు. తలుపును ఎవరైనా తడితే ఉలిక్కి పడతారు. చావు దాపునే గుసగుసలాడుతూ ఉంటుంది. ఇలాంటి నిర్బంధంలో మీరు ఎన్ని గంటలు ఉండగలరు? ఎన్ని నిమిషాలు ఉండగలరు? ఎన్ని సెకన్లు జీవనకాంక్షతో బతకగలరు? కాని ఒక పద్నాలుగేళ్ల బాలిక ఎన్నాళ్లు అలా ఉందో తెలుసా? 761 రోజులు. మనుషుల మీద ఎంత విశ్వాసం ఉంచుకుందో తెలుసా? 714 పేజీలు. ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’గా జగద్విఖ్యాతమైన ‘ఆనా ఫ్రాంక్ డైరీ’ హిట్లర్ నరమేధకాలంలో రెండేళ్ల పాటు లిఖించబడి నేటికీ ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తూనే ఉంది. కన్నీరు కార్చేలా చేస్తూనే ఉంది. మానవత్వం కోసం ప్రాధేయపడుతూనే ఉంది. ‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు... ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది ఆనా ఫ్రాంక్ తన డైరీలో. జూన్ 12, 1942న ఆనా ఫ్రాంక్ 13వ జన్మదినాన ఆమె తండ్రి ఎర్ర రంగు చెక్స్ ఉన్న డైరీని బహూకరిస్తాడు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ ఆ యూదు కుటుంబంలో ఆనా కుదురులేని పిల్ల. ఆకాశాన్ని గాలిపటంగా ఎగరేద్దామనుకనే గడుగ్గాయి. గెంతులేసే గొర్రెపిల్ల కనిపించినా, కొమ్మలూపే చెట్టు కనిపించినా, హాయిగా నవ్వే మనిషి కనిపించినా పులకించిపోయే అమలిన శిశువు. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు నాజీ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులకు నరకలోక ద్వారాలు తెరిచింది. ఆనా ఫ్రాంక్ అక్క 16 ఏళ్ల మార్గోట్కు జర్మనీలోని నాజీ క్యాంప్‌లో రిపోర్ట్ చేయమని జూలై 5, 1942న తాఖీదు ఇవ్వబడినది. అంటే ఏమిటో ఆ యూదు కుటుంబానికి తెలుసు. ఆ రాత్రే తండ్రి ఆనా ఫ్రాంక్ను పిలిచి ‘మనం ఇల్లు విడుస్తున్నాం. నీ స్కూల్ బ్యాగ్‌లో పట్టేన్ని వస్తువులే పెట్టుకో’ అంటాడు. ఆ మరుసటి తెల్లవారుజామున చినుకులు పడుతూ ఉండగా కట్టుబట్టలతో తల్లిదండ్రులు, అక్క, డైరీని దాచుకున్న స్కూల్ బ్యాగ్‌తో ఆనా బెదురు అడుగులు వేస్తూ అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరుతారు. ఆ భవంతిలో బుక్ర్యాక్లా కనిపించే తలుపు వెనుక రెండు రహస్య గదులు ఉంటాయి. మళ్లీ నాజీ పోలీసులకు పట్టుబడే– ఆగస్టు 4, 1944 వరకూ అంటే రెండేళ్ల 35 రోజులు వాటిలో ఉండిపోతారు. ఆ మొత్తం రోజులకు ఆ బాలిక ఆనా ఫ్రాంక్‌కు తోడుగా నిలిచింది ఆ డైరీ. ఆమె గుర్తుగా ప్రపంచానికి మిగిలింది ఆ డైరీ. ‘ఇంత చేస్తున్నా, ఇంత చూస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది ఆనా తన డైరీలో. అవును. మనిషి మంచివాడే. కానీ ప్రమాదకరమైన ప్రభావాలకు బానిస. మూక మనస్తత్వానికి సాధనం. పాలనాపరమైన సమర్ధింపు ఉందని భావిస్తే చెలరేగే క్రూరమృగం. హిట్లర్, అతని విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను జాతిహననం చేసి ఆ మాటే నిరూపించారు. కోటిన్నర మంది యూదులు తమ కుదుళ్లు, కుటుంబాలు, విశ్వాసాలు, ఆశలు – సమస్తం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారు. ఆ సమయంలోనే ఏనాటికైనా స్వేచ్ఛను పొందుతామేమోనని పిచ్చెక్కకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, లొంగిపోకుండా బతికిన ఆనా ఫ్రాంక్ కుటుంబం చివరకు పోలీసుల కంట పడనే పడింది. పాపం బంగారు తల్లి ఆనా, తన కలలూ ఆకాంక్షలూ మనుషులను చూసి పొందిన అచ్చెరువులూ అరెస్టు వేళ పోలీసులు నేలన పారేసిన డైరీలో నిక్షిప్తం చేసి నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించబడింది. మొదట తల్లి మరణించగా, తర్వాత సోదరి మరణించగా, బురదమయమైన తినడానికి తిండి లేని, చలి నుంచి రక్షించడానికి గుడ్డపేలిక లేని కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి–మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది. ఆ క్షణాన ఆమె తన మనసులో ఏమి రాసుకున్నదో తెలియదు. ఆ రాయని డైరీ చదివితే మనిషి జన్మ ఎత్తినందుకు మనం ఎంత సిగ్గుపడతామో ఏమో! 1947లో ఆనా ఫ్రాంక్ డైరీ మొదటిసారిగా డచ్ భాషలో ప్రచురితమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచమంతా ఆ మనోహరమైన బాలికను తలుచుకుంటూ ఉంది. ఇన్నేళ్లలో 70 భాషల్లో అనువాదమయ్యి లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఆ డైరీ సారమంతా ఒక్కటే – మానవత్వం! ఈ కాలం మళ్లీ రాకూడదు. ఇలాంటిది ఏ నేలనా సంభవించకూడదు. ఇలాంటి బతుకు భయం ఎప్పటికీ కలగకూడదు. మాటిమాటికీ వీధుల్లోకి తొంగి చూసి మనుషులకు స్నేహంగా చేయి ఊపాలనుకునే ఏ చిన్నారీ ఇలాంటి డైరీ రాయకూడదు. ఎప్పటికీ ఇలాంటి డైరీ వద్దే వద్దు! -
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం! వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్‌ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్. అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్‌లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది. Dear Kitty, Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true. Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF — Google India (@GoogleIndia) June 25, 2022 -
అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు
అన్నే ఫ్రాంక్... పేరు వినగానే రెండో ప్రపంచం యుద్ధంలో హిట్లర్ సాగించిన దమనకాండ గుర్తొస్తుంది. నాజీ సైన్యం నడిపిన కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని దారుణదృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఆ గతించిన గతంలో ఓ మిగిలిపోయిన జ్ఞాపకం.. ఓ చిన్న కవిత. ఆ కవిత కింద అన్నే ఫ్రాంక్ సంతకం. ఆమె సంతకం చేసిన ఆ కవిత కాగితాన్ని నెదర్లాండ్స్‌లోని హార్లెమ్ నగరంలో వేలం వేయగా ఓ ఆసామి 1.49 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కొనుక్కున్న ఆ ఆసామి వివరాలను వేలంశాల అధికారులు వెల్లడించలేదు. ఆ కవితను అమ్మకానికి పెట్టింది మాత్రం అన్నే ఫ్రాంక్ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ జాక్వెలిన్ వాన్ మార్సన్. నెదర్లాండ్స్‌ను దురాక్రమించుకున్న నాజీల కంట పడకుండా ఆమ్స్టార్డామ్లోని ఓ కెనాల్ హౌజ్‌లో రహస్యంగా తలదాచుకోవడానికి కొన్నిరోజుల ముందు అంటే... 1942, మార్చి 28వ తేదీన అన్నే ఫ్రాంక్, జాక్వెలిన్ సోదరి క్రిస్టియానాకు పంపిన కవిత అది. ఉత్తర జర్మనీలోని బెర్జెన్-బెల్సెన్ కాన్సంట్రేషన్ క్యాంపులో ఆకలితో అలమటించి, అలమటించి యూదు బాలిక అన్నే కన్నుమూసింది. అప్పటికీ ఆమె వయస్సు 15 ఏళ్లు. ఆమె అప్పటికే రాసిన డైరీ ఇప్పటికీ ప్రసిద్ధే. ఆ బాలిక జీవితంపై 1959లో 'డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్', 1988లో 'ది ఆటిక్: హైడింగ్ ఆఫ్ అన్నే- 1995లో 'అన్నే ఫ్రాంక్ రిమెంబర్డ్' అనే హాలివుడ్ చిత్రాలు వచ్చాయి.