అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు | anne frank poem sold for rs 1.49 crores | Sakshi
Sakshi News home page

అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు

Published Fri, Nov 25 2016 4:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు

అన్నే చిన్ని కవితకు రూ. 1.49 కోట్లు

అన్నే ఫ్రాంక్‌... పేరు వినగానే రెండో ప్రపంచం యుద్ధంలో హిట్లర్‌ సాగించిన దమనకాండ గుర్తొస్తుంది. నాజీ సైన్యం నడిపిన కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని దారుణదృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి. ఆ గతించిన గతంలో ఓ మిగిలిపోయిన జ్ఞాపకం.. ఓ చిన్న కవిత. ఆ కవిత కింద అన్నే ఫ్రాంక్‌ సంతకం. 
 
ఆమె సంతకం చేసిన ఆ కవిత కాగితాన్ని నెదర్లాండ్స్‌లోని హార్లెమ్‌ నగరంలో వేలం వేయగా ఓ ఆసామి 1.49 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా కొనుక్కున్న ఆ ఆసామి వివరాలను వేలంశాల అధికారులు వెల్లడించలేదు. ఆ కవితను అమ్మకానికి పెట్టింది మాత్రం అన్నే ఫ్రాంక్‌ చిన్ననాటి స్కూల్‌ ఫ్రెండ్‌ జాక్వెలిన్‌ వాన్‌ మార్సన్‌. నెదర్లాండ్స్‌ను దురాక్రమించుకున్న నాజీల కంట పడకుండా ఆమ్‌స్టార్‌డామ్‌లోని ఓ కెనాల్‌ హౌజ్‌లో రహస్యంగా తలదాచుకోవడానికి కొన్నిరోజుల ముందు అంటే... 1942, మార్చి 28వ తేదీన అన్నే ఫ్రాంక్, జాక్వెలిన్‌ సోదరి క్రిస్టియానాకు పంపిన కవిత అది.
 
ఉత్తర జర్మనీలోని బెర్జెన్‌-బెల్సెన్‌ కాన్సంట్రేషన్ క్యాంపులో ఆకలితో అలమటించి, అలమటించి యూదు బాలిక అన్నే కన్నుమూసింది. అప్పటికీ ఆమె వయస్సు 15 ఏళ్లు. ఆమె అప్పటికే రాసిన డైరీ ఇప్పటికీ ప్రసిద్ధే. ఆ బాలిక జీవితంపై 1959లో 'డైరీ ఆఫ్‌ అన్నే ఫ్రాంక్‌', 1988లో 'ది ఆటిక్‌: హైడింగ్‌ ఆఫ్‌ అన్నే- 1995లో 'అన్నే ఫ్రాంక్‌ రిమెంబర్డ్‌' అనే హాలివుడ్‌ చిత్రాలు వచ్చాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement